2, మార్చి 2012, శుక్రవారం

ఇంట్లో ఈగల మోత - బయట పల్లకీల మోత


కొద్ది సంవత్సరాల క్రితం తిరుపతిలో ISKCON వారి పుస్తకాల కొట్టు దగ్గఱ నిలబడి చూస్తున్నాను. ఈ లోపల ముగ్గుఱు యువబ్రాహ్మణోత్తములు అక్కడికి వచ్చారు. వారు బహుతెల్లగా ఉన్నారు. నున్నని గుండ్లతో, తిన్నని పిలకలతో, తెలతెల్లని యజ్ఞోపవీతాలతో, చక్కని సాంప్రదాయికమైన పంచెకట్టుతో ఉజ్జ్వలమైన ఊర్ధ్వపుండ్రాలు ధరించి పవిత్రమైన "ఓమ్ నమో వేంకటేశాయ" మంత్రాన్ని బృందగానంలా జపిస్తూ కాలినడకన కొండెక్కడం కోసం అలిపిరి వైపు నడుస్తున్నారు. శరీరాల మీద చొక్కాలు లేవు. ఈ పుస్తకాల కొట్టు చూసి నాలాగే కొద్దినిమిషాలు అక్కడ ఆగారు. ఏవో పుస్తకాల గుఱించి కొట్టుఆసామిని ఇంగ్లీషులో అడిగారు. ఆ తరువాత కొట్టుఆసామి వారినడిగాడు "భోం చేశారా ?" అని. "నిన్న ఏకాదశీ ఉపవాసం. ఈరోజు ద్వాదశి ఘడియలొచ్చాకనే తినడం" అని సమాధానం చెప్పి వారు మళ్ళీ మంత్రజపం చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. అప్పుడనుమానం వచ్చింది. వారు వెళ్ళిపోయాక ఆసామి నడిగాను. "ఎవరయ్యా ఈ కుఱ్ఱాళ్ళు ?" అని ! "వారు చెకొస్లొవేకియా వైష్ణవులు. వేదవేత్తలు. ప్రతిసంవత్సరం వస్తూంటారు." అని సమాధానం చెప్పాడతను.

"ఔరా ! పుట్టుకతో హిందువులమైనా మనకు వేదం ముక్క తెలియదు, తెలిసినవాళ్ళని దూషించడం తప్ప ! హిందూమతం పుచ్చుకున్న ఈ చెక్ దేశపు తెల్లవాళ్ళు మనకంటే చాలా నయంలా ఉన్నారే. " అనుకుంటూ నేను మ్రాన్పడిపోయాను చాలాసేపు. కృతయుగంలో మాదిరి మళ్ళీ ప్రపంచమంతా హైందవమైతే ఎలా ఉంటుందో ఈ కుఱ్ఱాళ్ళు మచ్చుకు రుచి చూపిస్తున్నారనిపించింది. ఇక్కడ కంటే చెకొస్లొవేకియాలో హిందువుగా పుడితే మజాగా ఉంటుందనిపించింది.

ఈమధ్య అమెరికన్ చట్టసభల్లో క్రైస్తవప్రార్థనలతో పాటు హిందూప్రార్థనల్ని కూడా అనుమతించారని విన్నప్పుడూ ఇదే అనుభూతి కలిగింది. కానీ హిందూస్తాన్ అని పేరు గల ఈ దేశంలో మటుకు హిందూధర్మం అడుగడుగునా ఎలా అరణ్యవాసాలకీ అజ్ఞాతవాసాలకీ ఘోరావమానాలకీ గుఱవుతున్నదో తల్చుకుంటే ఎంతటి శాంతమూర్తికైనా పట్టరాని ఆగ్రహం కలుగుతుంది. నిన్నటి వినాయక చవితే తీసుకుందాం. భారత నౌకాదళంలో పనిచేస్తున్న కాపుమిత్రుడినుంచి సమాచారం అందింది. ఇండియన్ నేవీలో నిన్న ఏ ఓడలోను వినాయక చవితి జఱుపుకోలేదట. పండుగరోజున మాంసాహారం నిషిద్ధమని హిందూ ఆఫీసర్లు మొత్తుకుంటున్నా వినకుండా బలవంతంగా అదే వండి అందఱికీ తినిపించారట.

ఏమిటీ కుహనా సెక్యులర్ నిరంకుశత్వం మనమీద ? హిందూధర్మం హిందూస్తాన్ లో ఇలా నిషేధానికి గుఱవుతోంది ఎందుచేత ? మన దేవుడి విగ్రహాల్ని మన దేశంలో స్థాపించుకోవడానికి పరాయిమతాలవారి అనుమతి కావాలి. దేవుడి ఊరేగింపులకి మలేషియాలాంటి విదేశీ ప్రభుత్వంలో మాదిరి పోలీసుల అనుమతి తీసుకోవాలి. రంజాన్ ఉపవాసాల కోసం, శుక్రవారం ప్రార్థనల కోసం ఇతరులకి ఉదారంగా అనుమతులిచ్చే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు మన అయ్యప్పల మీద మాత్రం "గెడ్డం పెంచొద్దు, ఆ డ్రెస్ లో రావొద్దు" అంటూ క్రూరంగా జులుమ్ ప్రదర్శిస్తాయి. ఎవరికొచ్చింది స్వాతంత్ర్యం ? మైనారిటీలకి, కుహనా సెక్యులర్ వాదులకి. అంతే ! హిందువులు మాత్రం మఱో స్వాతంత్ర్యపోరాటాన్ని సాగించాల్సిన పరిస్థితిలోనే మిగిలిపోయారు.

 http://dharmasthalam.blogspot.in/2009/09/blog-post_3201.html

హిందూమత వివాదాల పరిష్కారానికి ధార్మిక న్యాయస్థానాలు ప్రత్యేకంగా కావాలి


తమ చిన్ననాడు తమ తల్లిదండ్రులో, ఇతర పెద్దలో జాతక రచన నిమిత్తం నమోదు చేసిన జననతేదీకి విలువ ఇవ్వాలని కోరుతూ గతంలో కొన్ని వ్యాజ్యాలు వివిధ భారతీయ న్యాయస్థానాల్లో నడిచాయి. మన సెక్యులర్ (read anti-Hindu or non-Hindu) న్యాయవ్యవస్థ మనం ఊహించినట్లే ఆ వాదనల్ని కొట్టేసింది. పైపెచ్చు "వట్టి జాతకానికి విలువ లేదనీ, దాన్తో పాటు ఇంకేదైనా సహాయసాక్ష్యంగా ఉంటేనే జాతకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు" ననీ తీర్పులు చెప్పాయి మన న్యాయస్థానాలు.

తాజాగా, ఇటీవల ఇలాంటి ఇంకో వ్యాజ్యంలోనే భారత సర్వోన్నత న్యాయస్థానం "జననతేదీకి జాతకం ఒక బలహీనమైన సాక్ష్యాధారం (weak piece of evidence)" అని వ్యాఖ్యానించి హిందువుల మనోభావాల్ని నిస్సంకోచంగా గాయపఱిచింది. ఈ వ్యాజ్యంలో మద్రాస్ హైకోర్టు మాజీ రిజిస్ట్రార్ జెనరల్ మాణిక్యం అనే ఆయన తన అసలైన జననతేదీ 1950 అనీ, కానీ సర్వీస్ రికార్డులలో 1947 గా నమోదు చేయడం మూలాన తాను మూడేళ్ళ ముందుగా పదవీ విరమణ చెయ్యాల్సి వచ్చిందనీ మొఱపెట్టుకున్నాడు. తన SSLC పత్రాల్ని చూపించినా ఈ అన్యాయం సరిదిద్దబడలేదు. అప్పుడాయన తన జన్మజాతకాన్ని న్యాయస్థానానికిసమర్పించాడు. ఈ తీర్పిచ్చినవాళ్ళు హిందూ న్యాయమూర్తులు జస్టిస్ ముకుందకమ్ శర్మ మఱియు అనిల్ ఆర్. దవే.


హిందూ మతగురువులు తయారుచేసే జాతకాల్ని ఇలా కించపఱుస్తున్నవారు ముస్లిమ్ మతపెద్దలు వివాహసమయంలో జారీ చేస్తున్న నిఖానామాలను సాక్ష్యాధారంగా అంగీకరిస్తున్నారని గమనించాలి. అదే, హిందువుల దగ్గఱికొచ్చేసరికి "ఆ పెళ్ళి ప్రభుత్వ కచేరీలో నమోదైందా ? లేదా ?" అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అడుగడుగడునా మన ఆచారాలకీ, విశ్వసనీయతకీ ఆధికారికంగా దెబ్బకొడుతున్నారు. హిందువుల పేరు చెప్పగానే ఎక్కడ లేని సెక్యులరిజమూ గుర్తొచ్చేస్తుంది మన న్యాయస్థానాలకి !ఈ రకంగా ఏ ఇతర మతస్థుడికీ అవసరం లేని సెక్యులరిజాన్ని మనమీద బలవంతంగా రుద్దుతున్నారు. మన మతవిశ్వాసాల్లో తమ సెక్యులర్ విశ్వాసాల్ని చొప్పించి మన ఆచారాల్ని కలుషితం చేస్తున్నారు. ఉదాహరణకి - మదురైలో ఒక పూజారి చనిపోగా అతని కూతురు పూజారి అవ్వొచ్చునని కోర్టు తీర్పిచ్చింది. కానీ హిందూమతంలో స్త్రీలకు అర్చకత్వం ఎప్పుడూ లేదు.


ఇక్కడ మన శాస్త్రం చెప్పినట్లు హిందువులు వినాలా ? లేక సెక్యులరిస్టులు చెప్పినట్లు దేవాలయాలు నడవాలా ? అనేది ప్రశ్న. లౌకిక విషయాల్లో మతోపదేశాల్ని అంగీకరించని సెక్యులరిస్టు న్యాయస్థానాలు మతవిషయాల్లో మాత్రం తామెందుకు వేలుపెడుతున్నాయి ? అనేది అసలు ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో మన మత వివాదాల పరిష్కారం నిమిత్తం ప్రత్యేకంగా హిందూ ధార్మిక న్యాయస్థానాలూ, వాటికి అధ్యక్షత వహించడానికి మతధర్మశాస్త్రాలలో పాండిత్యం గల ప్రత్యేక ఆస్తిక న్యాయమూర్తులూ అవసరం కాదా ? పిడుక్కీ,బియ్యానికీ ఒకటే మంత్రం లాగా ఎంతకాలం ఇలా మనం (హిందువులం) దేవుణ్ణీ, హిందూమతాన్నీ నమ్మని లౌకిక న్యాయస్థానాల తీర్పులకు బలైపోవాలి ? ఆలోచించండి.


ఏ ఇతర విధాలైన సాక్ష్యాల కంటేనూ జాతకానికే జననతేదీ విషయంలో ప్రామాణికత హెచ్చు అని నా అభిప్రాయం. ఎందుకంటే దాన్ని రచించేవాళ్ళ దృష్టిలో అది ఆ వ్యక్తి జీవితాన్ని శాసించే పత్రం. కనుక వారు దాన్ని రచించేటప్పుడు పొఱపాట్లు దొర్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అయితే ఆ జాతకం ఆ వ్యక్తి పుట్టినప్పుడే వేయబడిందనే పురావస్తు ఆధారం (archaelogical_evidence) లభ్యమవుతున్నప్పుడు దాన్ని ప్రమాణంగా స్వీకరించడానికి ఎవఱికీ అభ్యంతరం ఉండనవసరం లేదు. 


 http://dharmasthalam.blogspot.in/2011/08/blog-post_23.html

హైందవ సాహిత్యాన్ని భండారించాలి (Archiving)


లిఖిత సాహిత్యం లేని సంస్కృతిని జానపదం అంటారు. అందుచేత సంప్రదాయమూ, సంస్కృతీ ఎంత ముఖ్యమో అందుకు సంబంధించిన లిఖిత సాహిత్యమూ అంతే ముఖ్యం. మనకి ఈ రోజున ముద్రితరూపంలో లభిస్తున్న హైందవ సాహిత్యం - ఎంతో ఎంతెంతో ఇంకెంతో నశించిపోగా భగవదనుగ్రహం చేత మిగిలి బతికొచ్చి మనదాకా చేఱినటువంటిది. పండిత కుటుంబాలు నిస్సంతుగా నిర్వంశమై అంతరించడం, కరువుల వల్ల వలసపోవడం, యుద్ధాల్లో కూలిపోయిన, కాలిపోయిన ఇళ్ళతో పాటు తాటాకు గ్రంథాలు కూడా కాలిపోయి పరశురామప్రీతి కావడం మొదలైన అనేక కారణాల మూలంగా ఎంతో హిందూవిజ్ఞానం కాలగర్భంలో కలిసిపోయింది.
మన తెలుగు సాహిత్యమే తీసుకుంటే గత వెయ్యేళ్ళలో వ్రాయబడ్డ అనేక గ్రంథాలు మాయమయ్యాయి. అన్నీ పోగా ఈరోజు మనకి కేవలం 1, 400 (పధ్నాలుగొందలు) ప్రాచీన తెలుగు టైటిల్స్ (కలిశకం 4100 - క.శ. 4900 మధ్యకాలానివి) లభిస్తున్నాయి. అన్నమాచార్యులనే ఒక తెలుగు మహాకవి ఉన్నట్లు గుఱజాడకి గానీ, వీరేశలింగం పంతులుగారికి గానీ తెలియదు. మన తరానికి మాత్రమే తెలిసింది. ఎందుకంటే వారి కాలానికి అన్నమయ్య కీర్తనలు బయట పడలేదు. తొలిసారిగా వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ఆ కీర్తనల్ని కనుగొన్నారు. అయితే అన్నమయ్య కీర్తనలు మొత్తం 30,000 (ముప్ఫైవేలు) అని ఆ కీర్తనలు వ్రాసి ఉన్న రాగిఱేకుల మీద పేర్కొనగా మనకి వాస్తవంగా దొఱికినవి మాత్రం 12,000 (పన్నెండువేలు) మాత్రమే. మిగతావి ఏమయ్యాయో తెలియదు. మహాకవి క్షేత్రయ్య వ్రాసిన కీర్తనలు కొన్ని వేలున్నాయంటారు. మనకి వాస్తవంగా దొఱుకుతున్నవి 300 మాత్రమే. కాలజ్ఞానం మూడులక్షల గ్రంథం వ్రాశామని బ్రహ్మంగారు పేర్కొన్నారు. (గ్రంథం అంటే 32 అక్షరాలు) కానీ లభ్యమవుతున్న కాలజ్ఞానం అంత విస్తారంగా లేదు.



ఇలా మన ప్రాలుమాలిక కారణంగా ఉజ్జ్వలమైన హిందూసాహిత్యం - ప్రపంచదేశాల మధ్య మనల్ని తలెత్తుకు తిరిగేలా చెయ్యగల సాహిత్యం రోజురోజుకీ నశించిపోతున్నది. ఎన్నో వేదసంహితలు నశించిపోయాయి. ఉపవేదాలన్నీ దాదాపుగా నశించినట్లే. మనకి లభిస్తున్న చతుర్వేదాలు పైకి దిండ్ల (pillows - తలగడల్లా) కనిపిస్తున్నప్పటికిన్ని అవి అసలు వేదాల పరిమాణంతో పోలిస్తే బహుచిన్నవి.




అన్నమయ్య కీర్తనలైనా - రాగిఱేకులమీద వ్రాసి తిరుమలకొండపై ఒక గూట్లో భద్రపఱచబట్టి కనీసం 500 ఏళ్ళ తరువాతైనా వాటిని కనుక్కోగలిగాం. మనం ఈరోజు పుస్తకాల్ని ముద్రిస్తున్న కాయితాలనబడే పదార్థం బొత్తిగా ఆధారపడదగనిది. సీడీల్ని, ఇంటర్నెట్ నీ అసలు నమ్మడానికి లేదు. కాయితాలు కాకుండా రాగిఱేకుల్లాంటి ఇంకేదైనా భౌతిక సామగ్రి మీద మన యావత్తు హిందూసాహిత్యాన్ని భద్రపఱచాల్సి ఉంది. అలా భద్రపఱిచేటప్పుడు ఒక చోట కాకుండా దేశంలో అనేక చోట్ల - అంటే కనీసం ఒక రెండొందల ప్రదేశాల్లో భద్రపఱచాలి. అంటే ఒక్కొక్క గ్రంథానికీ 200 ప్రతులు తయారు చేయించాలి. ఇది చాలా బృహత్కార్యం అని, కనీసం రెండు మూడు తరాల చేపట్టు (project) అనీ నాకు తెలుసు. అయితే ఒక ఏకాభిప్రాయమూ, ఒక ముందస్తు ఆలోచనా అవసరమనే ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను.

 http://dharmasthalam.blogspot.in/2009/09/archiving.html

విదేశంలో స్వదేశీ !


విదేశంలో స్వదేశీ !


వింతగా ఉందా? ఇది అచ్చు తప్పు కాదులెండి. మనం స్వదేశీ గురించి మాట్లాడితే చాలామంది హేళన చేస్తారు. స్వదేశీ అన్నమాట చాలా విస్తృతమైంది. భారతీయ ఉత్పత్తులు వాడడమే కాదు, మన ఆలోచనలు ప్రణాలికలూ కూడా స్వదేశీ అనే సిద్ధాంతం మీద ఆధారపడినప్పుడే మనం నిజమైన అభివృద్ధి వైపు పయనించగలం. ఒక్కమాట! జ్ఞాపకం ఉందా? నిన్నగాక మొన్న మన లోక్ సభలో 'వాల్ మార్ట్' (విదేశీ పెట్టుబడులు) మీద రగడ జరిగిన సందర్భంగా కపిల్ సిబాల్ గారు ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్య చేశారు. వాల్ మార్ట్ కి మన వాణిజ్యాన్ని తాకట్టు పెట్టాలని యూపియే ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకి సర్వత్రా వ్యతిరేకత వచ్చేసరికి, తట్టుకోలేక కపిల్ సిబాల్ గారు ఇలా అన్నారు -


"సరే! ఇక మనం కార్లలో తిరగడం మానేసి రిక్షాల్లో తిరుగుదాం!".
ఇదండీ ! మేధావి అయిన సిబాల్ గారి మనసులో మాట. ఇందులో తప్పేముంది అంటారా? ఇక్కడ సమస్య కార్లు, రిక్షాలు కాదు. మన నాయకులలోని బానిస స్వభావం, భావదాస్యం, బౌతిక దారిద్ర్యం. వీరి అభిప్రాయంలో భారతదేశం ఒక పాత చింతకాయ పచ్చడి. భారతీయులు వెనుకపడినవారు, ముందుకు వెళ్లలేనివారు. మన ఆలోచనలు వెయ్యి సంవత్సరాలు వెనుకకు ఉంటాయి. కాబట్టి విజ్ఞులు, ప్రాజ్ఞులు ఐన పాశ్చాత్యుల విధానాలు మనకి కావాలి. అంధ అనుకరణ మాత్రమే మనను "ఉద్ధరిస్తుంది". సరే! ఒప్పుకుందాం. స్వదేశీ కావాలంటున్న భారతీయులు అజ్ఞానులే. ఐతే మనకి స్ఫూర్తినిస్తున్న, మార్గదర్శనం చేస్తున్నారనుకొంటున్న పాశ్చాత్యుల పరిస్థితి చూద్దాం.

ప్రపంచ దేశాల నెత్తిమీద "ఆర్ధిక సరళీకరణ" విధానాలు రుద్దిన అమెరికా సంగతి చూడండి. ఇదే విధానాల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది.

ఒబామా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే సమయానికి పది లక్షల కోట్ల డాలర్ల అప్పు ఉంది. అది ఇప్పుడు పదిహేను కోట్ల డాలర్లకి పెరిగింది. పేదరికంలో జీవించేవారి సంఖ్య 48 శాతానికి పెరిగింది. అమెరికా ఉద్యోగాలు అన్నీ భారతీయులూ, చైనీయులూ ఎగరేసుకుపోతున్నారనీ, ఆ ఉద్యోగాలు అమెరికా వారికే ఇవ్వాలని ఒబామా అంటున్నాడు. అమెరికా వారు అమెరికా వస్తువులనే ఉపయోగించాలని అయన పిలుపునిచ్చాడు. అమెరికా కూడా స్వదేశీ జపం మొదలుపెట్టింది. దీనికి మన నాయకులేమంటారో? ఒబామా కూడా సంఘ పరివార్ వాడేనంటారేమో ! అన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఏతావాతా తేలేదేమంటే భారతీయ సిద్ధాంతమే సరైనదని మరోమారు నిరూపితమైంది. ఎవ్వరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా..!  

- ధర్మపాలుడు

 http://dharmasthalam.blogspot.in/

మహాత్ముడికే మత మార్పిడి ; మరణానంతరం బాపూజీకి బాప్టిజం ; లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?


మహాత్ముడికే మత మార్పిడి ;
మరణానంతరం బాపూజీకి బాప్టిజం ;
లేటర్ డే సెయింట్స్ చర్చ్ నిర్వాకం?


బయటపెట్టిన పరిశోధకురాలు రాడ్ కీ
రికార్డులు మాయమయ్యాయని వెల్లడి
మహాత్ముడి మనవడి విస్మయం
మండిపడ్డ హిందూ అమెరికా ఫౌండేషన్
చర్చి అధ్యక్షుడి క్షమాపణకు డిమాండ్

"ప్రపంచంలో అన్ని మతాలూ నిజమే, అన్నిట్లోనూ ఏవో కొన్ని లోపాలున్నాయి. అయినప్పటికీ నా మతం నాకు గొప్పది. ఒక మతం వ్యక్తి మరొక మతంలోకి మారాల్సిన అవసరం లేదు. అయితే, ఒక హిందువు మరింత ఉత్తమమైన హిందువుగా మారాలి. ఒక క్రైస్తవుడు మరింత ఉత్తమమైన క్రైస్తవుడుగా, ఒక ముసల్మాన్ మరింత ఉత్తమమైన ముసల్మాన్‌గా మారాలి.'' - మహాత్మా గాంధీ (యంగ్ ఇండియా 28.01.1928)

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: వ్యక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రైస్తవ మత సంస్థలు... మరణానంతరం మహాత్ములకూ మతాన్ని అంటగడుతున్నాయా? హిందూమత సిద్ధాంతాల్నీ.. గీతాసారాన్నీ బలంగా విశ్వసించిన మహాత్ముడికి ఒక అమెరికన్ చర్చ్ బలవంతంగా క్రైస్తవం ఇచ్చిందా? మరణానంతరం ఆయన పేరు మీద బాప్టిజం 'ప్రసాదించిందా'? ..ఈ ప్రశ్నలన్నిటికీ హెలెన్ రాడ్ కీ అనే పరిశోధకురాలు అవుననే సమాధానమిస్తున్నారు.

1996 మార్చి 27న అమెరికాలోని ఉటాహ్ రాష్ట్రంలోని సాల్ట్‌లేక్ నగరంలో ఉన్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ (ఎల్డీఎస్) గాంధీజీ పేరిట బాప్టిజం ఇచ్చిందని, సావోపాలో బ్రెజిల్ టెంపుల్‌లో 2007 నవంబరు 17న ఈ ప్రక్రియ పూర్తయిందని చెబుతున్నారు. ఈ ఎల్డీఎస్ చర్చ్ మోర్మన్ చర్చ్‌గా బహుళప్రాచుర్యం పొందింది. గతంలో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్‌కెర్రీ, 2012 అధ్యక్ష పదవి రేసులో ఉన్న మిట్ రోమ్నీ వంటివారు ప్రముఖ మోర్మన్లు. గాంధీజీ పేరు మీదబాప్టిజం ఇచ్చినట్టు వెల్లడించిన హెలెన్ రాడ్‌కీ సైతం ఒకప్పుడు మోర్మనే. అనంతరకాలంలో ఆమె చర్చ్ నుంచి వెలికి గురయ్యారు.

'ది డైరీ ఆఫ్ ఏన్ ప్రాంక్' రాసిన యూదు చిన్నారి ఏన్‌ఫ్రాంక్ కు కూడా ఎల్డీఎస్ ఇలాగే మరణానంతరం బాప్టిజం ఇచ్చినట్టు గతంలో వెల్లడించి సంచలనం సృష్టించిన చరిత్ర రాడ్‌కీకి ఉంది. ఇదే కోవలో.. గాంధీజీకి కూడా లేటర్‌డే సెయింట్స్ చర్చ్ బాప్టిజం ఇచ్చినట్టు నెవడాలోని హిందూ కార్యకర్త రాజన్ జెడ్‌కు ఆమె ఒక ఈమెయిల్ పంపారు. గాంధీజీ పేరు మీద బాప్టిజం ఇచ్చినట్టుగా ఉన్న రికార్డును తాను ఫిబ్రవరి 16న చూసినట్టు అందులో పేర్కొన్నారు. అయితే... తాను చూసిన కొద్దిరోజులకే ఆ రికార్డును మాయం చేశారని, అదిప్పుడు దొరికే అవకాశం లేదని వెల్లడించారు. ఇలా ఒక రికార్డు మాయమవడం అసాధారణమైన విషయమని తన మెయిల్‌లో పేర్కొన్నారు.

ఈ విషయం ఇతరులకు తెలియకూడదన్నది మోర్మన్ల ఉద్దేశంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఈ విషయం తెలిసి మహాత్ముడి మనుమడు అరుణ్‌గాంధీ తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. ఇలా ఒక వ్యక్తి మరణించాక, అతని పేరు మీద ఇష్టం వచ్చినట్టు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. హిందువులుగానీ, ఇతర మతస్థులెవరైనాగానీ... మతమార్పిడికి పాల్పడటాన్ని తన తాతయ్య పూర్తిగా వ్యతిరేకించేవారని అరుణ్ అన్నారు. గాంధీజీ అన్ని మతాలనూ గౌరవించేవారని, ఏ మతాన్ని అనుసరించాలన్నది వ్యక్తులు స్వయంగా నిర్ణయించుకోవాలని, ఇతరులు వారిని బలవంతం చేయకూడదని భావించేవారని అరుణ్‌గాంధీ వివరించారు.

ఇక... హిందూ మతం పట్ల ప్రగాఢ విశ్వాసం గల గాంధీజీ పేరు మీద ఆయన మరణానంతరం బాప్టిజం ఇవ్వడమంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని వాషింగ్టన్‌లోని హిందూ అమెరికా ఫౌండేషన్ (హెచ్ఏఎఫ్)కు చెందిన సుహాగ్ శుక్లా మండిపడ్డారు. ఈ విషయమై రాడ్‌కీ నుంచి లేఖ అందుకున్న రాజన్ జెడ్... దీనిపై తాను ఎల్‌డీఎస్ చర్చ్ అధ్యక్షుడు థామస్ ఎస్ మాన్సన్‌కు ఫిబ్రవరి 24న లేఖ రాశానని తెలిపారు. అయితే ఇప్పటికీ ఆయన వద్ద నుంచి జవాబు రాలేదన్నారు. "మాన్సన్ దీనికి క్షమాపణ చెప్పాలి. ఇదెలా జరిగిందో ఆయన చెప్పాల్సిందే'' అన్నారు. 
andhrajyothy  news 

హిందువులలో అనైక్యం, ఇతరుల సమైక్యం : కారణాలూ, పరిణామాలూను


ఒక గూగుల్ గుంపులో ఇటీవల జఱిగిన చర్చ

ఒక సభ్యుడు : 

మిషనరీలు ఇండియాలో రోజూ హిందూ దేవుళ్ళను/ దేవతలను/ పవిత్ర గ్రంథాలను
బహిరంగంగా దూషిస్తుంటారు. హిందువులనుండి  రియాక్షన్ ఎందుకు రావడం లేదు? చిన్న పామునైనా, పెద్ద కఱ్ఱతో కొట్టటం అబ్రహామిక్ కల్ట్స్ యొక్క విధానం. దీనితో ఎవఱినైనా ఎలా భయభ్రాంతులకు గుఱిచేయాలో వారికి తెలుసు. అబ్రహామిక్ కల్ట్స్ కి చెందిన ఉగ్రవాదులు వెయ్యిమంది హిందువులను చంపినా, కుల హిందువులలో ఎలాంటి రియాక్షనూ రాదు. హిందువులు మనగల్గాలంటే కొన్ని ఉపాయాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఇప్పుడు కిరస్తానీ దళితులు (హిందూ దళితులు కాదు) కూడా ఇలాంటి ఆయుధాలను హిందువుల పై ప్రయోగిస్తున్నారు. ఒక కంటికి పది లేక వంద కళ్ళు అనే విధానంతో అబ్రహామిక్ కల్ట్స్ ఇతరులను (ఉదాహరణకు హిందువులను) బెదిఱిస్తూంటాయి. ఒక పాతకాలం నాటి మసీదును కూలకొడితే, దానికి రియాక్షన్ గా 10,000 - 20,000 గుడులను పగలగొట్టారు పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్ లో, మలేషియాలో, ఇండొనేషియాలో, ఇతర మహ్మదీయ దేశాలలో ! ఇవే కుతంత్రాలను కమ్యునిష్టులు కూడా వాడుతుంటారు. 
రెండో సభ్యుడు :

మన గుళ్ళవద్ద కిరస్తానీ మిషనరీలు కరపత్రాలను పంచుతుంటే ఒక్కఱూ కిమ్మనరు. ఇక దూషిస్తే మటుకు ఏం చేస్తారూ? మనం చర్చిలవద్దకు వెళ్ళి అలాంటి కరపత్రాలిస్తే శవం కూడా దొఱకదు. అదీ మన ఐక్యత. అదీ మన సమాజపు "బలం".
 

మొదటి సభ్యుడు :
 

మాస్టారూ,
(౧) హిందువులు ఐక్యంగా లేకపోవడానికి కారణాలను వెతకవలసి ఉంది. What is preventing Hindus unification ?  

(౨) హిందువులలో ఐక్యత రావడానికి కావలసిన అవకాశాలను (మార్గాలను) వెతకవలసి ఉంది. How can we achieve Hindu unity ?
 

గమనిక (౧) : హిందువులు అందరు కులాల కతీతం ఏకంగా కావాలి, తమ ఆర్థిక, సామాజిక,
మత, సాంస్కృతిక, భాషా ప్రయోజనాలను సాధించడానికి ! ఇది సాధ్యం కాని పక్షంలో గమనిక (౩), మఱియు గమనిక (౨) చూడండి. 

౩) కుల హిందువుల మధ్య ఐక్యత సాధ్యం కాని పక్షంలో (లేక ఎక్కువ కాలం పట్టుతుంది అనిపించినప్పుడు),
*హీన పక్షంగా* (minimum) ఏ కులానికి ఆ కులంలో ఐక్యత తీసుకు రావడానికి కావలసిన అవకాశాలను వెతకవలసి ఉంది. ముందు ఏ కులానికి ఆ కులంలో ఐక్యత వస్తే, ఆ తరువాత ఇతర హిందూ కులాలతో కలసి పరస్పర సహకారం (హిందూ విషయాలమీద) ఎలా చేసుకోవాలో చూడవలసి వుంది. 

గమనిక (౨) : ఏ కులానికి ఆ కులం, "మొత్తము హిందువులకు హానికరమైన పనులు ఎట్టి
పరిస్థితుల్లోనూ చేయము" అని ఒట్టు పెట్టుకోవాలి. ఏ కులానికి ఆ కులం తమ *ఆర్దికప్రయోజనాలను* కాపాడుకోవడంలో తప్పులేదు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం హిందువులకు హానికరమైన పనులు చేయరాదు. నీవు (నీ కులం) మైనారిటీల పార్టీ అయిన కాంగ్రేస్ తో జట్టు కట్టు, లేక కమ్యునిష్టులతో జట్టు కట్టు, కాని కాంగ్రేస్ గాని, కమ్యూనిష్టులు గాని హిందువుల ప్రయోజనాలకు హాని చేస్తుంటే వారికి మద్దతివ్వకు. వారిచేత హిందువులకు అవసరమైన పనులు చేయించు. ఒక ఎడారిమతస్థులు తాము మైనారిటీలుగా ఉన్న దేశాలలో ఈ విధానాన్ని పాటిస్తుంటారు. తాము మెజారిటీలుగా ఉన్న దగ్గఱ, ఆ దేశాన్ని తమ మతదేశంగా ఆధికారికంగా ప్రకటించి, ఇతరులను దోచుకుంటూ ఉంటారు. అందుకే ఆ దేశాలలో 95 - 99.99% ఆ మతస్థులే ఉంటారు. ఆ దేశాల్లో నివసించే ఇతరులు షరియా వ్యవస్థలో నీళ్ళ బైట ఉన్న చేపల్లాగా గిలగిలా కొట్టుకుంటారు. 

గమనిక (౩) : ఇండియాలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న "సామాజిక న్యాయం" అనేదాన్ని, కులకోణంలోంచి నిర్వచించి
హిందువులను ఇంకో పార్శ్వం నుంచి విడగొడుతున్నారు. భవిష్యత్తులో దీని బదులు "సామాజిక న్యాయం" అనేదాన్ని మతస్థాయిలో నిర్వచించాలి. అంటే హిందూ సామాజిక న్యాయం, మహ్మదీయ సామాజిక న్యాయం, కిరస్తానీ సామాజిక న్యాయం మొదలైనవి. అప్పుడు కులాల మధ్య ఉన్న ఈ వీథిపోరాటాలు తగ్గి, వాటి మధ్య ఐక్యత వస్తుంది. 

గమనిక (౪) ఈ రోజున సైంటిఫిక్ గా ఆలోచించగల హిందూ తత్త్వవేత్తలు (community
leaders) ఎవఱూ లేకుండా పోయారు. ఈ శూన్యాన్ని (vaccum) హిందువులు త్వరగా భర్తీ చేసుకోవాలి. 

మూడో సభ్యుడు :

నేనిక్కడ చెబుతున్నది  పైకి చిన్నవిషయంలా కనిపిస్తుంది. కానీ ఇది చాలా పెద్ద విషయం. అబ్రహామిక మతాలవారు ఐక్యంగా ఉండడాని క్కారణాలు కొన్ని ఉన్నాయి. 

౧. ఏ జాతికైనా తన గుఱించి తనకు కొంత సామూహిక స్మృతి (collective memory)
ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రాహామిక మతాలు నిజానికి మతాలు కావు. అవి వాళ్ళ కమ్యూనిటీల యొక్క చరిత్రపుస్తకాలు. వాటిల్లో మతం/ ఉపాసన ఎలిమెంట్ చాలా తక్కువ. వాటినుంచి వారు స్ఫూర్తి పొందుతారు. చరిత్రని మర్చిపోని/ మఱియు దాన్నుంచి గుణపాఠాలు నేర్చుకునే జాతిని ఎవడూ ఓడించలేడు. హిందువుల పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ హిందువుల స్మృతిపథంలో తమందఱి యొక్క సామూహిక చరిత్ర లేకపోవడమే కాక తప్పుడుచరిత్ర ఒకటి, తమది కాని చరిత్ర ఒకటి  వాళ్ళల్లో విద్యావిధానం ద్వారా చొప్పించబడుతున్నది. 

౨. అబ్రహామిక మతాలు గత 1500 సంవత్సరాల్లో ఇతర సంస్కృతులపై ఆధిపత్యం కోసం
ప్రపంచవ్యాప్తమైన యుద్ధాలు చేశాయి భౌతికంగానూ, సాంస్కృతికంగానూ ! ఈ యుద్ధవ్యూహాలన్నీ వాళ్ళకి కొట్టిన పిండి. ఎలా ఆర్గనైజ్ అవ్వాలో వాళ్ళు నేర్చుకున్నారు. దాన్నొక సైన్సుగా రూపొందించారు. అందుచేత (మతపరంగా) లోకజ్ఞానం లేని పసిబిడ్డల్లాంటి హిందువుల్ని చుట్టబెట్టడం వాళ్ళకో లెక్కలోది కాదు. ఇక్కడ కూడా వాళ్ళ సామూహికస్మృతి, ఉమ్మడి అనుభవం వారికి అక్కఱకొస్తోంది. ఈ విషయంలో మన హిందువులు వాళ్ళతో పోలిస్తే నిన్నమొన్న కళ్ళు తెఱిచిన పసిబిడ్డల్లాంటివాళ్ళు. యుద్ధం చేయాల్సివస్తే కంగారుపడిపోవడమే తప్ప మనకి గుఱి చూసి ఎక్కడ బాణం సంధించాలో తెలీదు. ఉదాహరణకి - ఈ మధ్య భగవద్గీత గుఱించి ఒక రష్యన్ కోర్టులో చెలరేగిన రభస. ఒకవేళ నిజంగానే రష్యాలో భగవద్గీతని నిషేధిస్తే మనం కూడా పోటీగా ఎదురుచర్యలకి దిగుతామని హెచ్చఱించే పాటి వృషణాలు లేని జాతి ఇది. ఊరికే ఉచ్చపోసుకుంటూంటారు ప్రతీవాణ్ణీ చూసి ! 

అయితే ఇంత మొనగాళ్ళయిన అబ్రహామిక మతాలు కూడా హిందూమతం దగ్గఱికొచ్చేసరికి
ఘోరపరాభవాన్ని ఎదుర్కుంటున్న మాట వాస్తవం. వేఱే దేశాల్లో సాధించినంత సులభంగా వాళ్ళిక్కడ హిందూమతాన్ని సాధించలేకపోతున్నారు. ఈ అవమానభారం మూలాన్నే యావత్తు క్రైస్తవలోకమూ, మహ్మదీయలోకమూ మనల్ని ద్వేషిస్తుంది. నిజానికి వాళ్ళ దేశాల్లో హిందువులు ఆట్టే లేరు.వాళ్ళ చరిత్రల్లో వాళ్ళకి మనం చేసిన అపకారమూ ఏమీ లేదు. అయినా ఊరికే ద్వేషిస్తారు, వాళ్ళ మతాల్లో ఇండియా చేఱలేదనే అక్కసుతో ! మన మతం ప్రపంచం కంటే వేఱైనది కావడం వల్లనే మనకి నమ్మదగ్గ మిత్రులు గానీ సానుభూతిపరులు గానీ లేరు ప్రపంచ దేశాల మధ్య. మహా అయితే మన సైజు చూసి కాస్త భయపడతారంతే ! సింగపూరు, శ్రీలంకలాంటి చిన్నచిన్న దేశాలక్కూడా ఇండియా అంటే ద్వేషమే. 

౩. హిందువులకి మతం కంటే కులమే పెద్దవిషయం. ఇప్పటికీ హిందువుల్లో ఉన్న
ఇంప్రెషన్ ఏంటంటే మతం తమకి సంబంధం లేదనీ, అది బ్రాహ్మలకి సంబంధించిన టాపిక్ అనీ, దాని బాగోగులు బ్రాహ్మలే చూసుకోవాలనీ ! దానికి తోడు ఈ మతం గుఱించి ఎక్కువగా పట్టించుకునేదీ, ఆందోళన చెందేదీ కూడా బ్రాహ్మణులే కావడం ఈ దురభిప్రాయానికి మఱింత ఆజ్యం పోసింది. 

ఇండియాలో నాన్-హిందూవర్గాలు తమంతట తాము సహజంగా ఆర్గనైజ్ అయిలేవు. వాటిని
మొదట్నుంచీ ప్రభుత్వమే మెజారిటీకి వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేస్తూ వచ్చింది. ఈ పని మొదట బ్రిటీషువారు, తరువాత నెహ్రూ, ఆ తరువాత ఇందిరాగాంధీ etc etc. చేస్తూ వచ్చారు. హిందూ వోట్ ని చీల్చి అందులో తమ కనుకూలమైన వోట్లకి మైనారిటీ వోట్లని కలుపుకుని అధికారంలోకి రావడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తూ వచ్చారు. వీళ్ళ స్కీములో హిందువుల్ని కులాల వారీగా (రిజర్వేషన్ల ద్వారా ) విడగొట్టాలి. కులాభిమానాల్ని పెంపొందించాలి. ఈ రకంగా వ్యవస్థాగతమైన ఏర్పాట్లన్నీ మతపరంగా కాక కులపరంగా ఉండడంతో హిందువులు కూడా మతపరంగా కాక కులపరంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ముందేమో ఇలా ఎస్సీ ఎస్టీల విషయంలో ప్రయోగించారు. ఇహ ఇప్పుడా అవసరం తీఱిపోయింది. కనుక ఆ తరువాత - అంటే ఇప్పుడు బీసీల్నీ, ఓబీసీల్ని రెచ్చగొడుతున్నారు. 

దీనికి పరిష్కారమేంటంటే హిందూ-అనుకూల పార్టీ ఏదైనా అధికారంలోకి
వచ్చినప్పుడు, నేనిదివఱకు మనవి చేసినట్లుగా హిందువులందఱినీ ఒకే ధర్మపీఠం కిందికి తీసుకొచ్చి ఆ పీఠానికి ఆధికారిక, ప్రభుత్వ గుర్తింపునివ్వడం, అలా ఒక హిందూ వోట్‍బ్యాంకుని కృత్రిమంగా సృష్టించడం. కాంగ్రెస్ ఇలాంటిదాన్ని ఇమామ్ బుఖారీ, దేవబంద్ ముస్లిమ్ సెమినరీల ద్వారా ముస్లిముల కోసం చేస్తోంది.

మొదటి సభ్యుడు :

దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుంది. Abrahamic "ideology driven cults" లో *మనుషుల
జీవితాలకు విలువ లేదు* అని. వారికి - మనుషులు పనిముట్టులు (సాధనాలు) మాత్రమే. అబ్రహామిక్ cults లో (కిరస్తానీలు, ఎడారిమతస్థులు, కమ్యునిష్ట్ లు) ఎవఱు ఎక్కువ హింస (యుద్దాలు) చేయగలిగితే వారు విజేతలు. అందుకే వారు హింసను ఒక ఆయుధంగా వాడతారు. ఇండియాలో 1000 సంవత్సరాల ఎడారిమతపు రక్తమయ హింసాచరిత్రను మసిపూసి మన (హిందువుల) పిల్లలచేత చదివిస్తున్నారు. అసలు చరిత్రను రాస్తే/ చదివితే, కుల హిందువులు సిగ్గుతో చచ్చిపోతారు. మన సమాజము గత 1000 సంవత్సరాలుగా ఇంత దయనీయంగా ఉన్నా కూడా, కుల హిందువులు దాన్నుంచి ఏమి పాఠాలేమీ నేర్చుకోవడం లేదు, మనలాంటి చాలా కొద్ది మంది తప్ప ! ఈనాడు మన కళ్ళ ముందు జఱుగుతున్న ఇలాంటి సంఘటనలు చూసిన తరువాత కూడా వారి యొక్క అసలుఉద్దేశాల నగ్నస్వరూపాన్నికుల హిందువులు గ్రహించలేకపోతున్నారు. 

ఉదాహరణకు (ఇది ఒక ఊహ మాత్రమే, నిజంగా జఱుగుతుందని కాదు ), ఎవఱైనా ఒక హైందవేతరుడు ఒక భగవద్గీత గ్రంధాన్ని
  బహిరంగంగా
తగలబెడితే, హిందువుల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు. ఎప్పటిలానే కుల హిందువులు తమ జీవితాలను వెళ్ళదీస్తారు. అదే ఇండియాలో ఒక అబ్రహామిక్ cult యొక్క  పుస్తకాన్ని తగలబెడితే, ఇండియా మొత్తం అల్లకల్లోలం అవుతుంది.
దీని బట్టి అర్దమయ్యేది ఏమంటే, "హింస" మీద కూడా వారికి (అబ్రహామిక్ కల్ట్ లకు) గుత్తాధిపత్యం (monopoly) ఉంది. అది (హింస) వారు మాత్రమే చేయాలి.

వాస్తవం ఇలా ఉన్నప్పటికీ, నా అభిప్రాయంలో We, the Hindus must always follow
the Gandhian method of Ahimsa. We should reach wider audiences and educate other people. ఎంత మంది హిందువులు ఎంత త్వరగా చైతన్యవంతులయితే, అంత త్వరగా హిందువుల ఐక్యత సాధ్యమవుతుంది. చిన్న చిన్న అవరోధాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.

 http://dharmasthalam.blogspot.in/2012/03/blog-post.html

జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా?

వై.ఎస్ ‘మనవాళ్లు’ ఎవరు                - వరవరరావు  .


వైఎస్ ముఖ్యమంత్రిగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవపసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా?

‘తెలంగాణ రాష్ట్ర సమితి బలంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే “మనం'’ హైదరాబాద్‌లో విదేశీయుల వలె జీవించవలసివుంటుంది. జలయజ్ఞం ఆగిపోయి ఒక్క నీటిచుక్క కూడ మనకు దక్క దు. ఎందుకంటె టిఆర్ఎస్ పోతిరెడ్డిపాడు, పులిచింతల ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నది. మనం హైదరాబాద్‌లో వ్యాపారాలు చేసుకోలేము. కార్పొరేటు విద్యా సంస్థలను వెళ్ళ గొడ్తారట’ అని నంద్యాల సభలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మొదటి విడత పోలింగ్ ముగిసే సమయాన చాల విద్వేషపూరితమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం కూడా చాల తీవ్ర స్వరంతో సాగింది. అదే ప్రసంగాన్ని ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు పదే పదే పునరుద్ఘాటించారు. తాను కేవలం టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ వ్యాఖ్యలను ఉటంకిస్తున్నానని, అవన్నీ గతంలో ఆయన చేసిన ప్రసంగాలు, హెచ్చరికలు అని కూడా అన్నారు. వాస్తవానికి కార్పొరేట్ విద్యా వైద్య విధానాలు తెలుగుదేశం పార్టీతోనే మొదలైనవి.

తాను అధికారంలో ఉంటే పోలవరం, పులిచింతల ప్రాజెక్టులు ఈ ఐదేళ్ళలోనే పూర్తయి ఉండేవని చంద్రబాబు మహాకూటమి కట్టిన రోజే చెప్పారు. కెసిఆర్ కూడ అక్రమాలు చేసే విద్యా సంస్థలకు మాత్రమే తాను వ్యతిరేకినన్నా రు. పోలవరం, పులిచింతల ప్రాజెక్టులకు సూత్రప్రాయమైన వ్యతిరేకత ఏ ఎన్నికల పార్టీకి లేదు. అది తెలిసే మహాకూటమిని తనను తాను సమర్థించుకునే స్థితిలో పడేయడానికి వైఎస్ ఇంత ఫ్యాక్షన్ వైఖరి బహిరంగంగా తీసుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయివుండి, ఇంకా నెలరోజులు ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి’గా కూడా కొనసాగవలసి ఉండగా ఏరుదాటినాక తెప్పతగిలేసినట్లు తెలంగాణలో ఎన్నికలు అయిపోగానే నంద్యాలలో ఇట్లా మాట్లాడడం పూర్తిగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుంది.అయితే ఆయన ఆపాదించుకుంటున్న ఈ ‘మనం’ ఎవరు? ఆయన ఉద్దేశిస్తున్నది రాయలసీమ, ఆంధ్ర ప్రాంతపు సాధారణ ప్రజానీకమేనా? ఓటర్లుగా వాళ్లే అయివుండాలి. రాయలసీమ, ఆంధ్రప్రాంత ప్రజలంద రూ హైదరాబాద్‌తో తెలంగాణతో వ్యాపార సంబంధా లే పెట్టుకోవాలనుకుంటున్నారా? హైదరాబాద్‌లో, తెలంగాణలో వివిధ పరిశ్రమల్లో, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కాంట్రాక్టులు చేస్తున్న ఆంధ్ర, రాయలసీమ వాణిజ్య ప్రముఖులేనా ఈ ‘మనం’? వీళ్లు సగటు తెలుగు ప్రజల ప్రతినిధులవుతారా? ఇది లగడపాటి రాజగోపాల్ భాషో, టి.జి.వెంకటేశ్ భాషో అయితే అర్థం చేసుకోవచ్చు గానీ, పొద్దున లేస్తే రైతుబిడ్డనని చెప్పుకునే వైఎస్, రైతు బాంధవుడు గా ముఖ్యమంత్రి అయిన వైఎస్ భాష కావడమే అభ్యంతరకరం. తన భూముల్లో బెరైటిస్ గనులు పడిన దగ్గర్నించీ, ఇవ్వాళ్టి ఊసరవెల్లి విశ్వరూపం దాకా బయట పడుతున్న స్వభావం ఇది.

రాష్ట్రంలో 60 శాతం ఇంటర్మీడియెట్ స్థాయి విద్యపై గుత్తాధిపత్యం ఉన్న నాలుగు కార్పొరేట్ విద్యా సంస్థలలో రాయలసీమ, కోస్తా ప్రాంత సామాన్య ప్రజల భాగస్వామ్యం ఎంత? వాళ్ల సమస్య లు, ఇబ్బందులు రాయలసీమ, ఆంధ్ర ప్రాంత సగటు ప్రజల సమస్యలు ఇబ్బందులు ఒకటేనా? రాయలసీమ, ఆంధ్ర ప్రజలు ముఖ్యంగా రాయలసీ మ ప్రజలు, తెలంగాణ ప్రజలు పంచుకోవాల్సిన నిజమై న సమస్య నీటి సమస్య. రాయలసీమకు ముఖ్యంగా అనంతపురం జిల్లాకు, పాలమూరు జిల్లాకు ఉమ్మడి సమస్య. ఈ రెండు జిల్లాల ప్రజలను నిజంగా ఒకటి చేస్తున్నది కరువు సమస్యే గానీ వ్యాపార సంబంధం కాదు. అయితే ప్రకృతి రీత్యా పాలమూరు, నల్లగొండ జిల్లాలు కృషా ్ణపరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. రాయలసీమ లేదు. అనంతపురం పెన్నా పరీవాహక ప్రాంతం లో ఉన్నది. కర్నూలు, కడపలు తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి.

తెలు గు గంగ, కెసి కెనాల్ నీళ్లు, వాళ్ల తాగునీటి, సాగునీటి సమస్యలు పరిష్కరించకపో తే తప్పకుండా కృష్ణానది వరదనీరును, నీటి మట్టంపై నుంచి దొర్లిపోయే నీరును రాయలసీమకు మళ్లించే విషయం ఆలోచించవలసిం దే. నదీ పరీవాహక ప్రాంతం లో లేనివాళ్ళకు నీటి పంపకాల గురించి జల నిపుణుల సాంకేతిక కారణాలతో ఆలోచించకపోతే ఇరుగు పొరుగు ప్రజలు ఆలోచించవలసిం దే. ప్రజా ప్రతినిధులు, ప్రజా రాజకీయాలు ఆలోచించవలసిందే. అయితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమలోకి తీసుకుపోతున్న నీళ్లన్నీ రాయలసీమ ప్రజల దాహా ర్తి తీర్చడానికి, తరి, ఖుష్కి పంటలు పండించడానికేనా అన్నది సగటు ప్రశ్న. కడపలో యురేనియం ప్రాజెక్టు, కర్నూలు, కడప మొదలు రాయలసీమలో వస్తున్న ప్రత్యేక ఆర్థిక మండలాలు, బ్రహ్మణి వంటి ఉక్కు పరిశ్రమలు-వీటికోసం మళ్లిస్తున్న కృష్ణా జలాలు ఎన్ని? ప్రజ ల మంచి నీటికి, సాగునీటికి కేటాయిస్తున్న నీళ్ళు ఎన్ని? ఈ జల యజ్ఞంలో విధ్వంసమవుతున్న ప్రకృతి వనర్లు, మానవ వనరుల మాటేమిటి? నిర్వాసితుల మాటేమి టి? ప్రత్యేక ఆర్థిక మండలాలు మొదలు, రాయలసీమ లో వస్తున్న పరిశ్రమలన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్ధనరెడ్డి ప్రమేయం లేనివి ఒక్కటీ ఉండవు. బడా పెట్టుబడిదారులవి. బహుళజాతి కంపెనీలకు కమిషన్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న దళారీలవి.

వాళ్లు విదేశీయు లు కాకపోవచ్చు. కాని విదేశీ కంపెనీల ప్రయోజనాల కోసం ఇక్కడ ఏజెంట్లుగా దళారీలుగా పనిచేస్తున్న వాళ్లు. తప్పకుండా వై ఎస్‌కు ‘మన వాళ్లు’. పులిచింతల, పోలవరం అటువంటివే. ఈ రెండు ప్రాంతాల కింద గ్రామాలు ముంపునకు గురవుతాయి. పులిచింతల కింద పలనాడు కరువు ప్రాంతం సస్యశ్యామలం కాదు. మునిగిపోతుంది. కృష్ణా డెల్టాయే లాభపడుతుంది. నల్లగొండలోని కరువు ప్రాంతం మునిగిపోతుంది. ఆల్మట్టి కాలంనుంచి కూడ ప్రజాస్వామ్యవాదు లు, తెలుగు ప్రజలు సమన్యాయం పొందాలని ఆశించేవాళ్ళు ప్రతిపాదిస్తున్నదే మంటే కృష్ణా డెల్టా రైతులు తమకు మూడు కార్లకు నీళ్ళు కావాలని స్వార్థ పట్టుదల చూపడం కన్నా ఎగువు న బీజాపూర్, రాయచూర్, పాలమూరు జిల్లాలకు దాహం తీర్చే త్యాగం అయి నా చేయవచ్చు కదా అని. నల్లగొండ జిల్లాకు, పలనాడుకు కన్నీళ్ళు మాత్రమే మిగిల్చే పులిచింతలను వ్యతిరేకించడం నల్లగొండ, పలనాడు ప్రజలకు సంబంధించినంత వరకు విదేశీ భా వన అవుతుందా? వైఎస్ ‘మనం’లో ఈ రెండు జిల్లా ల వాళ్లు లేరా? పోలవరం ప్రాజెక్టు ఖమ్మం, గోదావరి జిల్లాల్లో 304 ఆదివాసీ గ్రామాలను ముంపునకు గురిచేసి వస్తున్నది.

ఈ ఇందిరా సాగరంలోని నీళ్ళు మళ్లీ గోదావరి, కృష్ణా డెల్టాలలో ఎంత భూమిని అదనంగా సాగులోకి తెస్తుందన్న దానికన్న - ప్రాజెక్టు కాకినాడ నుంచి విశాఖపట్నం దాకా వస్తున్న పారిశ్రామిక కారిడార్ కోసం అన్నది-గోదావరి జలాలను విశాఖపట్నం దాకా తీసుకుపో యే బృహత్‌పథకం అన్నది అసలు రహస్యం. 23 బహుళజాతి కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు కాకినాడ సెజ్-అవి జలయజ్ఞం లక్ష్యాలు. పోలవరం ప్రాజెక్టును ఆదివాసులో, తెలంగాణ వాళ్ళో కాదు, దేశభక్తులు వ్యతిరేకించాల్సివున్నది. మనుషుల పట్ల, ప్రకృతిపట్ల, పర్యావరణం పట్ల ఏ మాత్రం శ్రద్ధ ఉన్న బాధ్యతగల పౌరులైనా వ్యతిరేకించాల్సిందే.

ఇప్పటికయినా ఒక్కటే సూటి ప్రశ్న. వైఎస్ ముఖ్యమంత్రిగా చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు మొత్తం ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి ఉద్దేశించినవేనా? మూడు ప్రాంతాల్లో తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు, ఉపాధిని దృష్టిలో పెట్టుకుని వస్తున్నవేనా? బడా పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు-వీళ్ళందరినుంచి ప్రభుత్వం ద్వారా కమీషన్ల మీద బలిసే బహుళ జాతి కంపెనీల కోసం చేపట్టినవా? ఒక్క అసహనం నుంచే ఇవి ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశించినవో తెలుసుకోవాలంటే ముఖ్యమంత్రిగా వై. ఎస్. కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల చూపిన సేవాభావాన్నే గమనించవచ్చు. ప్రభుత్వాధినేతగా ప్రజలకు ప్రభుత్వ పరంగా ఉచిత విద్య, వైద్యం ఇవ్వవలసిన బాధ్యత గురించి ఐదేళ్ళూ ఆలోచించని వ్యక్తి కార్పొరేట్ విద్యాసంస్థలను రాయలసీమ, ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏర్పడినవి అన్నట్లుగా ‘మనను వెళ్లగొడతారట’ అంటున్నారు.

మనం విదేశీయులుగా బతకాల్సి వస్తుందని అంటున్నా రు. చరిత్ర చదివిన వాళ్ళకు ఇది ఈస్టిండియా కంపెనీ భాషలాగా అనిపించడం లేదా? పాలకుల భాష సరే వలస పాలకుల భాష అనిపించడం లేదా? కనీసం వాళ్లు ఇక్కడ గుమస్తాలను తయారు చేసుకోవడానికి ప్రభుత్వ రంగంలో విద్యా సంస్థలు పెట్టారు. ఈ దళారీలు అది కూడా అనవసరం అనుకుంటున్నారు.



సౌజన్యం: ఆంధ్రజ్యోతి
తేదీ: 24 ఏఫ్రిలు 2009