9, ఏప్రిల్ 2014, బుధవారం

మతం మార్చుకుందాం రా...

కొన్నేల్ల క్రితం మాట.. ఒకానొక రోజు, ఇంటర్లో మా క్లాస్మేట్ ఐన ఓ అమ్మాయినుండి ఫోన్ వచ్చింది. తను ఇంటర్ తర్వాత తెనాలిలోని ఓ ప్రముఖ క్రిష్టియన్ కాలేజీలో డిగ్రీ చేసి, ప్రస్తుతం హైదరాబాద్లోనే PG చేస్తున్నట్లు చెప్పి, వీలైతే ఓ వీకెండ్ మీటవుదామని అడిగింది. ఎప్పుడూ లేంది ఇలా అడుగుతుందేమిటా అనుకుంటూ, ఆ నెక్ష్ట్ వీకెండే క్రిష్ణకాంత్ పార్క్ దగ్గర మీటవుదామని ప్లాన్ చేసుకున్నాము. ఇంటర్ తర్వాత అదే మొదటిసారి తనని చూడ్డం. అప్పటికి తను చాలా మారిపోయి ఉంది. ముఖాన బొట్టు,కమ్మలు  లాంటి అలంకరనలేవీ లేకుండా, బాగా ఏడ్చి మొఖం ఉబ్బిపోయినట్లు చాలా డల్ గా ఉండటంతో ఏదో ప్రాబ్లంస్ లో ఉన్నట్లుందనుకుని విషయం ఏంటని అడిగాను.  అలాంటివేమీ లేవనీ, ఒకప్పుడు చాలా బాధల్లో ఉండేదాన్ననీ, కానీ జీసస్ ని నమ్మడం మొదలు పెట్టినప్పట్నుంచి తను చాలా హ్యాపీగా ఉంటున్నట్లు చెప్పింది. తాను బాప్టిజం స్వీకరించాననీ, పెళ్ళి లాంటి ఆలోచనలేవీ తనకు లేవనీ, నన్ గా మారి జనాలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నాననీ,ఈ విషయంపై ఇంట్లో  గొడవపడి బయటికి వచ్చేశాననీ, ప్రస్తుతం మిషనరీ వారే ఆమెను చదివిస్తున్నారనీ  చెప్పింది. పైగా జీసస్ ను నమ్మటం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో వివరిస్తూ అనేక ఉదాహరణలు ఇవ్వడం మొదలుపెట్టింది. తమ హాస్టల్లో ఎవరో అమ్మాయికి ఏదో జబ్బు నయమైనట్లు, ఇంకొకరికి ఎవరికో బాప్టిజం తీసుకున్న మర్నాడే ఉద్యోగం వచ్చినట్లు.. ఇలా అనర్గళంగా చెప్పుకుంటూ పోసాగింది. 
తను ఎందుకు కలుద్దామందో అప్పటికి కాని నాకు అర్థం కాలేదు.
కాసేపటికి తను వెంట తెచ్చుకున్న బట్ట సంచిలో నుండి ఓ  బైబిల్ని తీసి దానిలో ఎన్ని అద్భుత విషయాలున్నాయో చెప్పడం మొదలుపెట్టింది. అసలు బైబిల్లో లేని విషయమంటూ లేదనీ, దావీదు, ఇజ్రాయేలు, బెత్లహాము,రక్తంతో పాపాల్ని కడగడం ఇలా ఏదేదో చెప్పుకుంటూ పోసాగింది. వీకెండు చక్కగా ఏ సినిమాకో వెల్లక ఇలా బుక్కయ్యానేంటా అనుకుంటూ, మధ్యలో అడ్డుపడితే ఫీలవుతుందేమోనని ఆమె చెప్పేవన్నీ సైలెంటుగా, తలాడిస్తూ వింటూ కూర్చున్నా. నా మౌనాన్ని అంగీకారంగా భావించి, ఆమె  ఓ రకమైన ట్రాన్స్ లోకి వెల్లిపోయి ఇతర మతాలనేవి ఎంత బూటకమో వివరిస్తూ, దేవుడు, క్రీస్తు రూపంలో ఎలా మానవుడిగా భూమిమీద నడిచాడో, డాక్టర్ కాకపోయినప్పటికీ రోగులకు ఎలా స్వస్థత చేకూర్చాడో చెప్పుకుంటూ పోయింది.అలా సుమారు ఓ అరగంట ప్రసంగం తర్వాత, 'చెప్పు ఇప్పటికైనా నమ్ముతావా లేదా' అని అడిగింది. పార్కుకు రమ్మనగానే, ఎగేసుకుంటూ వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగిందనుకుంటూ ఇంకేదో ఆలోచిస్తున్న నేను, ఇప్పడుకానీ నోరు తెరవకుంటే ఈవిడ మల్లీ ఇంకో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేస్తుందనుకుని, 
'ఇంత చెప్పింతర్వాత ఇంకా నమ్మకుండా ఎలా ఉంటాను. నేను కూడా మతం మారతాను, పేరు కూడా మార్చుకుంటాను. ఏ పేరైతే బాగుంటుంది.. 'జానీ'(అప్పట్లో మనం పవన్ కల్యాన్ ఫ్యాన్!! )  అనేది క్రిష్టియన్ పేరేనా..? మహ్మద్ జానీ అని ఎవరో ముస్లిం లీడర్ ఉన్నాడుకదా, ఇంకేదైనా పేరు చెప్పు'  అన్నాను. 
అప్పుడు ఆమె మొఖంలో వెయ్యివోల్టుల వెలుగు నాకిప్పటికీ గుర్తే. 
'థ్యాంక్స్, నాకు తెలుసు నువ్వు మారతావని.  'డేవిడ్ జాన్' అని పెట్టుకో చాలా మంచి పేరు' అంది.    'రేపే నిన్ను చర్చి ఫాదర్ దగ్గరికి తీసుకెల్తా'నంది. 
'సరే అలాగే వెల్దాం కానీ, నాదో చిన్న కండీషన్'  అన్నాను. 
'ఏంటో చెప్పు' అంది. 
'ఇప్పుడు నువ్వు PG చేస్తున్నావ్ కదా,  ఆ PG నువ్వు ఫస్టు క్లాసులో పాసవ్వాలి అప్పుడే నేను మతం మారతా'నన్నాను. 
'ఓస్ అంతేనా, సరే నేను తప్పకుండా పాసై రిజల్ట్స్ రాగానే నిన్ను కలుస్తా, సరేనా?, అప్పటిదాకా ఈ బైబిల్ నీదగ్గరే ఉంచుకో, ఇది చదువుతుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.'- అంది. 
'సరే, కాకపోతే బైబిల్ నీ దగ్గరే ఉంచుకో, నీ మిగతా PG బుక్స్ అన్నీ తెచ్చి నాకివ్వు ', అన్నాను.
'అదేంటి, బుక్స్ చదవకుండా పాస్ కావడం ఎలా.?'  అయోమయంగా అడిగింది.
'బైబిల్లో అన్ని విషయాలు ఉన్నాయ్ అన్నావ్ కదా, మరి అది చదివి PG పాస్ కాలేమా?' అన్నాను.
'హ్మ్మ్.. అన్నీ అంటే, సబ్జెక్ట్ విషయాలని కాదు'- అంది.
'మరి ఎలాంటి విషయాలుంటాయ్?' అన్నాను.

అంటే, జీసస్ ఎలా పుట్టాడు, ప్రజల్ని ఎలా సేవ్ చేశాడు, జీసస్ ని ఎలా సిలువ చేశారు లాంటివి..- అంది.
"ఓ అవా.. అవన్నీ నేను ఆల్రెడీ 'కరునామయుడు' సినిమాలోనే చూసేశా ను,ఆ మూవీ చాలా బాగుంటుంది- అన్నాను.
'అవే కాదు, ఇంకా బానిసల్ని ఎలా చూడాలి, వారి రైట్స్ ఏముంటాయి లాంటివన్నీ ఉంటాయి'- అంది.
'నేను ఎవరికీ బానిసను కాదు, నా కిందెవరూ బాసినలు లేరు, మరి నేనవి తెలుసుకోవడం అవసరమా?' -అన్నాను.
హ్హ్మ్మ్.. నువ్వు నన్ను కంఫ్యూజ్ చేస్తున్నావంది '- అమాయకంగా ఫేస్ పెట్టి.
'ఇందులో కంఫ్యూజన్ ఏం లేదు. ఓ హిందువు రామాయన/భారత శ్లోకాలు, గాయత్రీ మంత్రం, హనుమాన్ చాలిసా లాంటివి చదువుతాడు, క్లాసు పుస్తకాలూ చదువుతాడు  పాసవుతాడు. ఓ ముస్లిం ఖురాన్ చదువుతాడు,క్లాసుపుస్తకాలూ చదువుతాడు పాసవుతాడు. మరి ఓ క్రిష్టియన్ కూడా బైబిల్తో పాటు, క్లాసుపుస్తకాలు చదివితేనే పాసయ్యేటట్లైతే ఇంక బైబిల్ స్పెషాలిటీ ఏంటి..? ఆ మాత్రం దానికి మతం మార్చుకోవడం ఎందుకు?  ఓ హిందువూ, ఓ ముస్లిమూ చేయలేనిదీ, కేవలం ఓ క్రిష్టియన్ మాత్రమే చేయగలిగింది ఏదైనా ఉంటే చెప్పు,  ఉదాహరణకి క్రిష్టియన్లందరూ ఎక్కువకాలం బతుకుతారనిగానీ, క్రిష్టియన్లందరూ ఆరోగ్యంగా,సంతోషంగా ఉంటారని గానీ, లేదా క్రిష్టియన్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షాలు చక్కగా పడతాయని గానీ ఇలాంటి ఏవైనా ఉంటే చెప్పు ఈ క్షణమే నేను కూడా మతం మార్చుకుంటా' - నన్నాను.

తను ఏమీ మాట్లాడకుండా బ్లాంక్ ఫేసుతో వింటుంది.
'మతం ఏదైనా అదికేవలం ఓ నమ్మకం మాత్రమే. ఏ మతం కూడా రీజనింగ్ కి నిలవదు. అలాంటప్పుడు ఫలానా మతం మంచిదని, ఫలానా మతం చెడ్డదని చెప్పటం మీనింగ్ లెస్.  ఈ మతం బాగలేదని మరో మతంలోకి జంప్ కావడం,పైగా దీనికోసం ఇన్నాల్లూ పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులతో గొడవపడటం  మూర్ఖత్వం తప్ప మరేం కాదు'

ఇలా నా వీకెండ్ వేస్టైందనే బాధతో, ఆవేదనతో ఏవో నాలుగు భారీ డైలాగులని చెప్పాను.తను మాత్రం కల్లు తెరిచి కోమాలో ఉన్నట్లు సీరియస్ గా వింటుంది. తను నిజంగానే వింటుందో, లేక నాకు నెక్ష్ట్  బ్రైన్వాష్  సెషన్ కి మాటర్ ప్రిపేర్ చేసుకుంటుందేమోననే అనుమానం కూడా కలిగింది. ఇక ఇక్కడ ఎక్కువసేపు ఉండటం అనవసరం అనుకుని, మతం గురించి ఇంకో నాలుగు డైలాగులు వదిలి నాకు అర్జంటు పని ఉంది, వెల్దాం పద అని అక్కడి నుంచి వచ్చేశాము.    
ఆ తర్వాత తననెప్పుడూ కలిసే ప్రయత్నం చేయలేదు. ఏ మిషనరీలోనో చేరిపోయి ఉంటుందనుకుని ఆ విషయం మరిచిపోయాను.
సీన్ కట్ చేస్తే..
సుమారు 3 సంవత్సరాల తర్వాత, మా ఊరికి వెల్లే బస్సులో చంకలో ఓ ఏడాది వయసున్న బుజ్జి బాబుతో ఆమె సడన్ గా తారసపడింది.
'హాయ్, ఎలా ఉన్నావ్, ఎవరీ బాబు?' అన్నాను.
'నా కొడుకే' అంది.
'పెల్లి చేసుకున్నావా.?, ' అప్రయతంగానే అనేశాను.
'ఏం మాట్లాడుతున్నావ్', అంది ఇబ్బందిగా ఫేస్ పెట్టి.
'ఓ..సారీ, అప్పుడేదో నన్, సేవ, పెల్లి చేసుకోను అన్నావ్ కదా అదేమైంది?' అన్నాను.   

'అలా వెల్దామనే అనుకున్నాను, కానీ, ఏదో నీ పుణ్యం వల్ల ఇలా ఉన్నా' నంది.
'అదేంటి నేనేం చేశాను, కాస్త అర్థమయ్యేలా చెప్పు' అన్నాను.
'అదే, అప్పుడు నీతో మాట్లాడానుకదా, పార్కులో..  ఆ తర్వాత బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. దానితో ఇక అవన్నీ వదిలేసి మరుసటి రోజే ఇంటికెల్లి పోయాను. తర్వాత, ఇంట్లోవాల్లు ఓ మంచి సంబంధం ఖాయం చేశారు. పెల్లికి నిన్ను పిలుద్దామనుకున్నాను కానీ, నువ్వు ఎక్కడో ఆన్సైట్లో ఉన్నావని తెలిసింది,దాంతో కుదర్లేదు. -అంది

ఓహ్.. నా వాగుడికి ఇంత పవర్ ఉందా అని.. ఆశ్చర్యంతో కూడిన గర్వం వల్ల వచ్చిన ఆనందం కలిగి,  ఏ..షబాశ్..షబాశ్.. అని నన్ను నేనే భుజం చరుచుకున్నా. 
'సరే, ఇంతకీ బాబు పేరేంటి' అన్నాను, గులాబ్ జాం లాంటి బాబు మెత్తటి బుగ్గలు నిమురుతూ..
''హిమనేష్' -శివుడి పేరు,
బాగుందా?' అంది.

'డేవిడ్ జాన్' అంత పవర్ ఫుల్ గా లేదు గానీ, బాగానే ఉంది' అన్నాను.
'నువ్వు మరీ ఎక్కువ చేయకు' అంది, నవ్వుతూ.. ఇంతలో డ్రైవర్ బస్సు స్టార్ట్ చేయడంతో, బై చెప్పి వెల్లి సీట్లో కూర్చున్నా..బస్సు రివ్వున దూసుకెల్లింది కర్నూల్,కడప వైపుకు..