27, నవంబర్ 2012, మంగళవారం

బ్రాహ్మణులు ఎందుకు ద్వేషింపబడుతున్నారు?


గమనిక: ఈ టపా మురుగు లేదా మురికి మురుగంటే సహజంగానే ఇష్టపడే మహిషిల పిచ్చిమాటలకి ఎదురుసమాధానం కాదు!

చరిత్రపుటలలో ఎవరైతే అమానుష౦గా చంపుట, దోచుకునడం, మానభ౦గ౦ గావి౦చడ౦ మరియు నీచాతినీచకృత్యాలు చేసారో వారు ఈ నవీన భారతదేశంలో క్షమించబడ్డారు, గతాన్ని తవ్వుకోగుడదు అనే పేరుతో. ఇంకా చెప్పాలంటే వారు ఏంతో వైభవముతో లక్ష్మీసరస్వతుల నిలయంగా విలసిల్లిన మన సాంస్కృతిక వారసత్వాన్ని మట్టుపెట్టారు. అయినా వారిని క్షమించేశా౦. అయితే చరిత్రలో ఈ దేశధర్మాన్ని రక్షించడంకోసం మరియు సంఘ౦ యొక్క మంచి కోసం తమ జీవితాలని మనఃపూర్వక౦గా తృణప్రాయంగా త్యజించిన బ్రాహ్మణులుని మాత్ర౦ ఈ నవీన భారతదేశ౦ అసత్యారోపణలతో అడుగడుగునా అవమానాలాకు గురిచేస్తుంది.



గత కొన్ని దశాబ్ధాలుగా ఈ నవీన చరిత్రకారులచే చెప్పబడింది ఏమనగా భారతీయ బ్రాహ్మణులు భారతదేశంలోని తక్కువ కులాలని అణచివేస్తూ ఉన్నారు. ఇంకా బ్రాహ్మణులు అంటే మోసపూరితమైన వాళ్ళు, పరుల మీద ఆధారపడి జీవించేవాళ్ళు మరియు సామాజిక సమతుల్యత లేని కులవ్యవస్థని తయారు చేసిన వాళ్లుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. బ్రాహ్మలు ఇతరులని చదవడం మరియు రాయనిచ్చేవారు కాదనీ చెప్పారు. అలాగే మిగలిన ప్రతి కులాన్ని కట్టుదిట్టమైన reservation కోసం వెనుకబడిన కులాల్లో ఉంచడం కోసం "బ్రాహ్మణులు గావించిన 5000 సంవత్సరాల అణచివేత" అనే అసంబద్దపు వాదాన్ని తమకనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ అసంబద్ధపు వాదాలన్నీటినీ తిరిగితిరిగి తోడుతూ వాటిని నిజం అని అంగీకరింపజేసే స్థితికి తీసుకువచ్చారు.



ఈ విధంగా అబద్దాన్ని నిజం చేసే కుటిలప్రయత్న౦లో ఎందరో మేథావులు, చరిత్రాగ్రగణ్యులు తమ వంతు పాలు పంచుకున్నారు విషం చల్లడానికి. గత రెండు దశాబ్దాలుగా వీరు తమనితాము కాపాడుకునే ప్రయత్నమంటూ కట్టుకున్న అద్దాలమేడ "బ్రాహ్మణ విద్వేషం". ఇలా ఇన్ని అంటున్నా ఏమీ అనలేని బ్రాహ్మని బేలస్థితిని, కర్మ సిద్దాంతాన్ని పావుగా చేసుకుని మరింత బెంబేలెత్తించడానికి అసలు "బ్రాహ్మణుడు" అన్న పద౦ వింటేనే గర్వపరుడు, అగౌరుడు మరియు తక్కువ కులాల్ని లేదా దళితుల్ని చచ్చేవరకు కొట్టేవాడు అన్న ఆర్తనాదకపూర్వకమైన అర్థాన్ని ఇచ్చారు. ఈ మాత్రంచాలదూ!, ఆ పదం వింటే చాలు విన్న వారి మనసులో బ్రాహ్మల గురించి విషభావాలు నాటుకు పోవడానికి.


అదే కుహనా మేథావులు పదేపదే వల్లే వేసి మరీ చెబుతున్నారు, బ్రాహ్మలు మిగిలిన కులాలని తమకోసం ఉపయోగించుకున్నారు మరియు ఇంకా జరుగుతుంది కూడా అదే అని. అంతే కాదు, హిందూ ధర్మ గ్రంధాలు కేవలం వారిని ఈ సామాజిక కులవ్యవస్థలో అగ్రభాగాన నిలపడానికి వారికై వారు రచించుకున్నవి మాత్రమే అని మరియు భారతదేశంలో ఉన్న అన్ని సమస్యలకి వారే బాధ్యత వహించాలని.


కానీ ఈ వాదాలు పూర్తిగా అవగాహనారహిత్య౦తో కూడి అసంబద్దమైనవి మరియు చారిత్రకపూర్వకమైన ఆధారలేమితో కొట్టుమిట్టాడుతున్నవి. సునిశితంగా చెప్పాలంటే ఇది "చెప్పిన అబద్దమే వందసార్లు చెబితే అది నిజం" అయి కూర్చుంటుంది అన్నరీతిలో!


సరే మరి, మన౦ ఇప్పడు ఎలాంటి ఆందోళనలతో కూడిన అభ్యంతరాలు లేకుండా ప్రశాంతచిత్త౦తో కాసేపు నిజాలతో కూడిన వాస్తవాల గురించి చర్చించుకుందా౦. మన ఆలోచనావిధానాన్ని పక్కవాడికి అప్పిద్దామా?


ఒక్కసారి నిస్వార్థ౦గా, స్వచ్చముగా, సతర్కముగా ఆలోచించగలిగితే, బ్రాహ్మ్మల్లో 95% మంది అమాయకులు మరియు సహృదయులు అని తెలుస్తుంది. కానీ కొ౦దరు స్వార్తపూరితముగా అల్లిన కట్టుకథలు కాలానుక్రమంలో వాస్తవాలుగా మారడం ఒక విచిత్రమైన వింత!. ఇక ఈ బ్రాహ్మణ విద్వేషం వెనుకవున్ననిజానిజాలు అర్థం చేసుకోవడానికి పెద్ద పండితుడై ఉండనవసరం లేదు. ఒకసారి చరిత్రపుటల్లోకి తొంగి చూస్తే పరమత విద్వేషం కలిగి దండయాత్రలు చేసినవారు, బలహీనుల మీద పడి దోచుకు తినేవారు మరియు సేవల ముసుగున మతమార్పిడులు చేసేవారు తమ అవసరాలకోసం కనిపెట్టినదే ఈ బ్రాహ్మణ విద్వేషం! నేడు కొందరు "మురికి" పట్టిన రాజకీయనాయకులు, అవకాశవాదులు తమతమ స్వార్థావసారాలకనుగుణంగా బ్రాహ్మణ విద్వేషం అని "మొరుగు"తూ ఆ విద్వేషాన్నిమరింత పెంచి పోషిస్తున్నాయి! ఈ "పెంపు" ప్రజలని అచైతన్యులుగా కట్టిపడేసేందుకు, దేశాన్ని దోచుకునేందుకు మాత్రమే ఉపయోగం!


నిజానికి చరిత్రలో బ్రాహ్మలు ఎప్పుడూ ధనవంతులు లేక అధిపతులుగా కానీ లేరు. అడవిలో ఉన్న జింకని మిగిలిన హానికర జీవులు వెంటాడి వేటాడి తినాలని చూస్తాయి. ప్రస్తుత భారతీయ బ్రాహ్మణుడు ఆ అడవిలోని జింకకు నమూనా. నేటి భారతీయ బ్రాహ్మణ వర్గ౦ పరిస్థితి ఒకప్పుడు నాజీల ఏలుబడిలో ఉన్న జూ'స్(Jews) పరిస్థితికి ఏమాత్రం తీసిపోదు.


- గడచిన అనేక దశాబ్దాల్లో, ఎక్కువగా కిరస్తానీలు(Christians) మరియు ముసల్మాన్లు భారతదేశాన్ని పాలించారు. బ్రాహ్మలు ఎప్పుడూ పాలించలేదు. మరి అలాంటప్పుడు భారతదేశంలో జరిగిన అకృత్యాలకు బ్రాహ్మలు కారణమెలా అవుతారు?


- బ్రాహ్మలు ఈ దేశాన్ని పరిపాలించారని ఒక్క చారిత్రక ఆధార౦ ఎవరైనా చూపించగలరా? చాణక్యుడు అఖండభారతావనిని ఏకం చేయడానికి, దానికోసం చంద్రగుప్తుడిని కార్యోన్ముఖున్ని చేయడానికి ఏంతో కష్టపడ్డాడు. తర్వాత చంద్రగుప్తుడు భారతదేశానికి చక్రవర్తి అయ్యినప్పుడు చాణక్యుడిని తన రాజగురువుగా ఉండి అష్టైశ్వర్యాలు అనుభవించాలని కోరగా, అప్పుడు చాణక్యుడు ఇలా చెప్తాడు "నేను బ్రాహ్మణుడిని. నా కర్మ ప్రకారం నేను నా కడకు విద్యార్దియై వచ్చిన వారికి విద్య బోధించుట మరియు వారు బిచ్చమెత్తి తెచ్చినదాంట్లో పంచుకొని జీవించాలి. కావున, నేను నా స్వగ్రామానికి వెళ్ళాలి" అని.


- పురాణాల ప్రాతిపదికన తీసుకుంటే కూడా శ్రీమంతుడైన బ్రాహ్మణుడు అని ఒక్కడైనా ఉన్నాడా? ఏ పురాణం చెప్పింది ఆగర్భ శ్రీమంత బ్రాహ్మల గురించి? ఆగర్భ దరిద్రుడైన సుధాముడనే(కుచేలుడు) బ్రాహ్మణుడి కథ కృష్ణ పరమాత్ముడి జీవిత౦తో ముడివేసుకున్న వైనం అందరికీ తెలిసినదే. అసంగతమైనదైనా చెప్పవలిసినది, ఇక్కడ శ్రీకృష్ణుడు యాదవ ఉపకులానికి చెందినవాడు. నేటి భారతంలో యాదవులు ఇతర వెనుకబడ్డ తరగతుల్లో(OBCs) ఒకరు.


- ఒకవేళ నవీన చరిత్రకారులు చెప్పినట్లు నిజంగానే బ్రాహ్మలు దురహంకారం, కులజాడ్యం కలవారైతే అదే న.చ.కా లు చెప్పబడే తక్కువ కులాల నుంచి వచ్చిన వారిని దేవుళ్ళుగా ఎందుకు పూజిస్తున్నారు? కొని సోదహారణలుగా యాదవ కుల శ్రీకృష్ణుడు, కొన్ని పురాణాల్లో చెప్పబడినట్లు పరమేశ్వరుడిది కిరాత కులం. కిరాతలు(ఎరుకలు) నేటి నవీన భారతదేశంలో వెనుకబడిన గిరిజిన జాతికి చెందిన వారిగా చెలామణి అవుతున్నారు.


- ఇతరుల అణచివేతకి ఉన్నత పదవి దానికి తగిన అధికారం కావాలి, ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. బ్రాహ్మణులు పర౦పరాగతమైన దేవాలయ అర్చకవృత్తి లేదా దైవీసంబందమైన కర్మలను జరిపించే పురోహితులుగా ఉన్నారు. బ్రాహ్మణేతర ఇంటి యాజమానుల నుంచి వచ్చే భిక్ష మాత్రమే వారి జీవనాధారం. అలాగే వారిలో కొంతమంది జీతం లేకుండా గురువులుగా జీవనాన్ని గడిపేవారు. మరి ఇప్పుడు చెప్పిన బ్రాహ్మణ వృత్తులు ఇతరులని అణచివేసే౦త శక్తివంతమైనవా? దీనికి సమాధానంగా "రాజులచే చెప్పి చేయించారు" అని చెప్పే కొంతమంది మురుగు మూర్ఖ శిఖామణులు ఉండనే ఉన్నారు. ఈ మూర్ఖులు చెప్పింది నిజమే అయితే మహామంత్రి తిమ్మరుసు గుడ్డివాడయ్యేవాడు కాదు, కవి సార్వభౌముడు శ్రీనాధుడు చివరి రోజుల్లో అంతులేని ఆవేదనకు గురయ్యేవాడు కాదు!


- ఇంకా వాస్తవాలని మరింత లోతుగా పరిశీలిస్తే, చాలామంది దళితులని(హిందూ) అణచివేసింది భూస్వాములు అనబడే జమిందారులు, బ్రాహ్మణులు కాదు అన్న కఠినమైన నిజం పైకి వస్తుంది. అలాగే ఇతర వెనుకబడ్డ వర్గాలు కూడా దళితులని అణచివేసారు. కానీ బ్రాహ్మలు మాత్రం బలిపశువలయ్యారు.


- బ్రాహ్మణ వర్గంలో పురోహిత బ్రాహ్మణులు 20%. మిగిలిన అన్ని వర్గాల్లోని/మతాలలోని పూజారుల్లాగా, వారిలో కొందరు కోరిక, కాంక్ష గలవారయి ఉండి ఉండవచ్చు


- బ్రాహ్మణేతరులని చదవవద్దు అని ఎవరూ చెప్పలేదు. బ్రాహ్మణులు చాలావరకు విద్యాభిలాషియై ఉన్నారు. ఈ విద్య వారిని ఆధ్యాత్మికంగా శక్తివంతులుగా ఉంచుటకు తోడ్పడింది. కానీ ఇది కొందరిలో ద్వేషాన్ని రగిల్చింది. ఇది ఎవరి తప్పు? ఒకవేళ కొంతమంది న.చ.కా లు చెప్పినట్లు చదవడం/రాయడం లేదా విద్యనభ్యసిచడం కేవలం బ్రాహ్మలకు మాత్రమే అయితే, వాల్మీకి మహర్షి రామాయణంని, వ్యాసుడు భారతాన్ని, మొల్ల రామాయణాన్ని, తిరువళ్లూర్ తిరుక్కురాల్, అలాగే ఎంతోమంది బ్రాహ్మణేతర మహర్షులు భక్తీ భావాలు ఎలా పలికారు/రాయగలిగారు? దీనికి కప్పదాటు సమాధానం తప్ప అర్థవంతమైన స.ధా ఏవైనా ఉందా? బ్రాహ్మణులు ఎప్పుడు కూడా ఇతరుల విద్యాభిలాషను ఎన్నడూ అడ్డుకో ప్రయత్నించలేదు.


- ఈ న.చ.కా లు పదేపదే వల్లె వేసే మనుస్మృతి ధర్మశాస్త్రాన్ని రాసి౦ది మనువు. ఈ ఒక్క ధర్మ శాస్త్రంలోనే బ్రాహ్మణులుకి ఉన్నతస్థానం కల్పించబడింది. కానీ మనువు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి ప్రస్తావన ఉన్న గీతాశాస్త్రంని రాసిన వ్యాసమహర్షి పుట్టినది వెనుకబడిన కులానికి చెంది చేపలు పట్టుకుని జీవించే ఆడకూతురుకు. అన్ని ధర్మశాస్త్రాల్లో గుణ గణాలు బట్టి బ్రాహ్మణుడి గొప్పతనం చెప్పాయి కానీ పుట్టిన కులాన్ని బట్టి కాదు. ఏ కులంలో పుట్టినా మంచి గుణగణాలు కర్మ రూపేణా కలిగి ఉంటే వారు బ్రాహ్మలు అని కూడా గీత చెప్పింది. వీటికి దృష్టాంతాలే ధర్మవ్యాధుడు, విశ్వామిత్రుడు.. మొ.గు. కానీ రంద్రాన్వేషకులకి ఇది తలకెక్కదు.


- అసహాయులైన పేద బ్రాహ్మలు అరబ్బీ దండయాత్రీకులచే వధి౦పబడ్డారు, పోర్చుగీసువారు క్రూరమైన విచారణల పేరుతొ చేసిన అమానుష చర్యలతో హత్యగావి౦ప బడ్డారు, ఆంగ్లేయ కిరస్తానీ మిషనరీలు స్వార్థపూరిత అసత్యారోపణలతో బాధించారు మరియు ఇప్పుడు వారి సోదర సోదరీమణులచే మానసికంగా హత్య చేయబడుతున్నారు.మరి వీరిలో ఎవరైనా ఎదురుతిరిగి పోరాటం చేశారా?


-నవీన భారతదేశంలో కాశ్మీరీ ఆదివాస్తవ్యులైన పండిట్లు ఇస్లామిక్ తీవ్రవాదుల అమానుష హింసకు బలయ్యి తోబుట్టువుల్ని పోగొట్టుకుని, స్వస్థలాల్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలిసిన అగత్యం ఏర్పడింది. ఒక పథకం ప్రకారం కాశ్మీరి పండిట్ల మీద చేసిన ఈ దారుణ మారణ కాండలో చివరకు తీవ్రవాదం ఒక పురాతన భారతీయ వర్గానికి చెందిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవటంలోనూ, మట్టుపెట్టటంలోనూ సఫలీకృతం అయింది. ఈ మతవిద్వేషాన్నుంచి తప్పించుకోవడం కోసం సుమారు అయిదు లక్షలకు(500000) పైగా కాశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. సుమారు యాభైవేల(50,000) మంది కాశ్మీరీ పండిట్లు పుట్టిన గడ్డ మీద మమకారం చావక ఇప్పటికీ జమ్ము మరియు డిల్హీలలో వలసదారులుగా దైన్యమైన బ్రతుకులో జీవనం గడుపుతున్నారు. ఇది ఏమి ప్రజాస్వామ్యం? మతం పేరుతొ మారణహోమ౦ సృష్టించిన ఈ తీవ్రవాదులు చేతిలో పండిట్లు మన,ధన, ప్రాణాలు కోల్పోయారు.మరి ఎదురుతిరిగి మారణహొమ౦ సృష్టించిన ఒక్క పండిట్ ని చూపించగలరా?


- భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు ముస్లి౦ చరిత్రకారులని ఉదహరిస్తూ ఈ విధంగా చెప్పారు " మొదటి అరబ్బు దండయాత్రీకుడు మొహమ్మద్ బిన్ ఖాసిం మతవిద్వేషంతో రగిలిపోతూ చేసిన మొదటిపని భారతీయ బ్రాహ్మణులకి సున్తీ(circumcision) చేయించడం, అందుకు ఒప్పుకోని వాళ్ళలో పదిహేడేళ్ళ పైబడిన వారిని చంపడం". ఈ మొగలుల దండయాత్రల సమయంలో సాగిన బలవంతపు మతమార్పిడులు, అమానుష దాడులలో వేలమంది బ్రాహ్మల తలలు నరికి వేయబడినవి. బ్రాహ్మణుడు పరమత మనిషిని చంపిన వైనాన్ని ఒక్కటి ఉదహరించగలరా?



- పోర్చుగీసులు భారతదేశానికి వచ్చినపుడు St. Xavier పోర్చుగల్ మహారాజుకి ఈ విధంగా ఉత్తరం రాశాడు "భారతదేశంలో బ్రాహ్మలు లేకపోతే మిగిలిన హిందువులని(pagans) మనం మతానికి తార్పిడి చేయవచ్చు, తద్వారా ఊడిగం చేయించుకోవచ్చు. ఈ ఊడిగానికి మొదలు బ్రాహ్మ్మల్ని ద్వేషించడమే, ఇది మతప్రచాకులు మొదలుపెట్టాలి" అని. ఈ విధమైన దురుద్దేశంతో అడుగుపెట్టిన వారు బ్రాహ్మణుల్ని నరకయాతనలకి గురిచేశారు. గోవాలో వేలమంది కొంకణి బ్రాహ్మణులని చావువరకు తీసుకెళ్ళి వదిలారు. కొంకణి బ్రాహ్మణులు తమ సర్వస్వం కోల్పోయారు. మరి వారిలో ఏ ఒకరైనా తమ కులం కోసం ఎదురుతిరిగి పోరాటం చేశారా?


- నేడు బనారస్ లో చాలామంది రిక్షాకార్మికులు బ్రాహ్మలు. అలాగే డిల్హీ రైల్వేస్టేషన్లో యాబైశాతం పైగా బ్రాహ్మలు కూలీలుగా, రిక్షాకార్మికులుగా జీవనాధారం సాగిస్తున్నారు. ఇంకా అదే డిల్హిలో చాలామంది పారిశుధ్యకార్మికులుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 75 శాతం పైగా బ్రాహ్మలు వంటపని చేస్తూ బతుకు తున్నారు. దారిద్రరేఖ దిగువన బతుకుతున్న బ్రాహ్మలు అరవై శాతం పైనే. ఇవన్నీ వాస్తవ గణా౦కాలు, ఎవరో సృష్టించినవి కావు. వీటిని ఇక్కడ ప్రస్తావించడానికి కారణం అరకొర మేతావుల కోసం. బ్రాహ్మలు ఈ పనులు చేస్తేనే "ఏదో" సామాజిక న్యాయం ఒనగూరుతు౦దని చెప్పే అపరమేతావులూ, మరి సామాజికన్యాయం వచ్చిందా?


- కొంతకాలం కిందట కర్నాటక ప్రభుత్వం వర్గాల వారిగా ఒకరి తలసరి ఆదాయాన్ని(per capita income) లెక్కకట్టి, ఆ రాష్ర ఆర్థికమంత్రి ఇలా చెప్పారు: కిరస్తానీయులు (Rs) 1,562, వోక్కలిగాస్ Rs 914, ముస్లిమ్స్ Rs 794, SC Rs 680, ST Rs 577 మరియు బ్రాహ్మణులు Rs 537.


- తమిళనాట జనాభా లెక్కల ప్రకారం రఘునాథస్వామి గుడిలో పనిచేసే అర్చకుని నెలసరి ఆదాయం Rs 300. అదే దేవళంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చే నెలసరి ఆదాయం Rs 2,500 పైన. ఇంతటి పచ్చినిజాలు ఎగదోసుకువస్తున్నా అవి పురోహిత వర్గం పైన ఉన్న ధనవంతుడు మరియు స్వార్థపరుడు అన్న మాటలని తుడిచిపెట్టలేక పోయాయి. అవహేళనలు/అవమానాలు మాత్రం ఎక్కువ అయ్యాయి!


- పెరియార్ హాయంలో సాగిన హేయమైన భౌతిక దాడులకి తమిళ బ్రాహ్మణులు చాలా వరకు ప్రాణాలు అరచేత బట్టుకొని, ఒంటిబట్టలతో పక్కరాష్ట్రాలకి పారిపోయారు. తమిళనాట ఘోరంగా, అమానుషంగా అణచివేయబడిన బ్రాహ్మణ కులం ఇంకా అగ్రకులమే! మరి వీటికి ఏ కుల౦ బాధ్యత వహించాలి, ఎవరిని శిక్షించాలి?



పోనీ నాడు తమ స్వార్థం కోసం బ్రాహ్మణ విద్వేషం అనే పునాది తవ్విన మిషనరీలు "బ్రాహ్మణుల యొక్క అణచివేత" అని చెప్పింది సందేహాస్పదంగా ఉన్నాకూడా కాసేపు వాస్తవమే అనుకుంటే మరి దాన్ని తమ స్వార్థానికి ఉపయోగించుకు౦టున్న నేటి రాజకీయనాయకులు, స్వయంప్రకటిత మేతావుల మాటేమటి? అట్లే ముందుతరాలు చేసిన తప్పులకి తర్వాతితరాలు శిక్షింపబడాలని అని చెప్పే ఆటవిక న్యాయాన్ని నవనాగారిక సమాజం ఒప్పుకుంటుందా? పైన చెప్పి౦ది నిజమనుకున్నప్పుడు, కొంతమంది బ్రాహ్మణులు కులవ్యవస్థని తమ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అనుకుందాం. అందులో కొంతమంది బయటివారిని తమతో కలవనివ్వలేదని అనుకుందాం. కానీ కొంతమంది చేసిన పనికి మొత్తం బ్రాహ్మణ వర్గాన్ని తూలనాడడం ఎంతవరకు సబబు, అదీ తరతరాలుగా? మరి మనదేశ పురాతన వారసత్వ సంపదని, భారతీయ మాన,ధన ప్రాణాలని హరించిన అరబ్బీ దండయాత్రీకులని క్షమించిన మనం ఆ కొద్దిమంది బ్రాహ్మణులని ఎందుకు క్షమించలేకపోయా౦? తమ స్వలాభాలా కోసమే గదా!


ఈ మూర్ఖత్వం ఎన్నాళ్ళు? పోనీ వారేదో ఘోరాలు చేసారనే నువ్వు ఇప్పుడు ఎం చేస్తున్నావు?


వర్తమానంలో బ్రాహ్మణుడి పరిస్థితి రెండువైపులా పదునున్న కత్తిలా ఉంది. బ్రాహ్మణుడు విజయం సాధిస్తే "ఆ కుల౦ ధనవంతమైనది ఎలాంటి సహాయం అవసరంలేదు" అని అతని కులానికి ఆపాదిస్తారు. అదే విధంగా ఓకే బ్రాహ్మడు తప్పు చేస్తే ఆ తప్పుని మొత్తం కులానికి ఆపాదించి అందరినీ నలుగురిలో అవమానిస్తున్నారు. ఎప్పుడైతే బ్రాహ్మడు ఎదుగుతున్నాడు అని అనిపిస్తుందో అప్పుడు ఈ విద్వేష వర్గం కట్టుగట్టి "గత౦లొ బ్రాహ్మలు మమ్మల్ని అణగదోక్కారు" అని ఒకేఒక్క కుంటిసాకు చెప్పి మరీ వారికి న్యాయంగా అ౦దవలిసినఫలాలని అందనీయకుండా చేస్తున్నారు. ఇదెక్కడి కబోది న్యాయం?


కాలంతో పరిగెడుతున్న ప్రపంచ౦(మన౦) గతాన్ని త్వరగా మరిచిపోతుంది. ప్రపంచం బ్రాహ్మణులు ఈ సమాజానికి చేసిన మేలుని మరిచారు. ఒక్క వేదాలు, లెక్కలు, గ్రహాధ్యయన౦ మరియు రాజనీతి శాస్త్రాలు నేర్పించటమే కాదు, ఆయుర్వేద, ప్రాణాయామ, శ్రుంగార, నాట్య శాస్త్రాలను మరియు యోగాలను తమ జీవితాన్ని ధారపోసి మానవాళి అభ్యున్నతి కోసం అందించారు. ఒకవేళ బ్రాహ్మణులు స్వార్థపరులై ఉండి ఉంటే వారు వీటన్నిటిమీద సర్వహక్కులు తీసుకునేవాళ్ళు. బ్రాహ్మణులు స్వార్థపరులే అయితే వారు రాసిన వేల కొలది పుస్తకాలకి తమ పేరు పెట్టుకునేవారు. బ్రాహ్మలు తమ జీవితాన్ని ఒకే మంత్రం గా "లోకా సమస్తా సుఖినో భవంతు" అని చెప్పి సమస్త మానవాళికి విజ్ఞాన అమృతాన్ని ధారపోసారు.


దీనికి ప్రతిగా, నేటి ప్రపంచం వారిని వెతలకి గురిచేస్తుంది అదీ అకారణంగా!



ఆధునిక బ్రాహ్మణులు వారి సంప్రదాయబద్దమైన జీవితాన్ని కొద్దికొద్దిగా వదిలేస్తున్నారు ఈ వెతలని భరించలేక! దానికి తోడు ఎ౦త మంచి చేసినా వచ్చే "అణచివేసారు" అన్న అసత్యఅపవాదుని అశాస్త్రీయంగా దిగమింగుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. నవీన భారతదేశంలో వారు నేటి స్వార్థపు సమాజ "ఇజాలు",వెన్నెముక లేని రాజకీయన్యాయం మరియు నీచపు కుతంత్రాల మద్య చిక్కుకుని అన్యాయంగా, క్రూరంగా శిక్షింపబడుతున్నారు.


ఎం? బ్రాహ్మణులు మనుషులు కారా? వారు తనవాళ్ళకి, తర్వాతి తరానికి సుఖమైన జీవితాన్ని, భాగ్యాన్ని అందరిలా కోరుకోకుడదా?

 [ఆంగ్ల మూలం: Please stop Brahmin bashing]

 http://saapaatusamagatulu.blogspot.in/2011/01/blog-post_28.html

12 కామెంట్‌లు:

  1. super chepparu mothaniki....ila ayna brahmins lo unity ravataniki avakasam untundi.

    రిప్లయితొలగించండి
  2. మళ్ళా జీవితాల్ని, ప్రభుత్వాలనీ సక్రమ మార్గాలలో నడిపించటానికి బ్రాహ్మలు రావాలి. తప్పకుండా వస్తారు. అంతా నాశనము అయిన తరువాత. అడవి పూర్తిగా దగ్ధ మైన తరువాత నేల నుండి మొలకలు మోలిచినట్లు.

    రిప్లయితొలగించండి
  3. I appreciate if this article is published in all telugu newspapers.

    రిప్లయితొలగించండి
  4. To
    Mohit N Vinjamuri.
    ఈ ఆర్టీకిల్ని ప్రచురించినందుకు మీకు ధన్యవాదములు. ఇది చదువుతున్నంతసేపూ ఉధ్వేగానికి లోనయ్యాను. మీరు ప్రొఫైల్ ఫోటో NTR గారి ఫోటో సెలెక్ట్ చేసుకోవటంలో కారణం ఏదైనా ఇక్కడ మాత్రం దాని ఇంపాక్ట్ ఎలావుందో తెలుసా? నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లుంది.మీ మనసూ, మీ ప్రవర్తన తీరూ మీరు పోస్ట్ చేసిన ఆర్టీకిల్కి సరిపోలేటట్లుగా ఉంటే చాలా బాగుండేది. మొత్తం మీద మీరు బ్రాహ్మిన్ కులం గురుంచి దాని మూలాల్లోకి తొంగి చూసేలా మీరు మాకు ఉత్తేజాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదములు. ఇట్లు,
    డి.రాధా కృష్ణ మూర్తి.

    రిప్లయితొలగించండి
  5. ఈ దేశంలో బ్రిటీష్ వారు వచ్చినాకనే సరైన పాఠశాలలు అందరికి అందుబాటులోకి వచ్చాయని, బహుజనులకు పూలేనే దేశంలో తొలిపాఠశాలను స్థాపించారని ఇలాంటివేవో తిక్క మాటలు చదివాను ఉదయం ఆంధ్రజ్యోతిలో.. దురదృష్టవశాత్తూ అది నూటికి రెండొందలపాళ్లు అబద్ధం.
    మన దేశంలో ఉన్న బళ్లు , సండే స్కూల్స్, రాత్రిబళ్లు వంటీవి కలిపి లెక్కేసినా గ్రేట్ బ్రిటన్ మొత్తమ్మీద చూసుకున్నా లేవని ఈస్టిండియా కంపెనీ పాలనలోనూ, ఆనక బ్రిటీష్ పాలనలోనూ ఎన్నో అధికారిక నివేదికల్లోనూ, గెజిట్లలోనూ పలుమార్లు ప్రస్తావించబడిన అంశం. అందులో మరింత ఆసక్తికరమైన అంశమేంటే అవి బ్రాహ్మణుల చేతుల్లోనే కాక అంతకన్నా ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో లింగాయతులు వంటి వారి చేతుల్లో ఉండేదట. బ్రాహ్మణ బాలకులకన్నా ఇతరులే ఎక్కువ చేరేవారట వాటిల్లో, బ్రాహ్మణులు మాత్రం మధూకరవృత్తి చేసుకుంటూ వేదాధ్యయనం చేసే అలవాటున్నవారు కావడంతో వీటిలో అబ్రాహ్మణులదే ఎక్కువ సంఖ్యట. ఇదంతా నా సోది కాదు బ్రిటీష్ క్రానికల్స్, రిపోర్టుల్లో అంశాలు.

    రిప్లయితొలగించండి
  6. thatha ku daggulu nerpalanukune moorkhulu... Bhaaratam Vishwaguruvu. Bhaaratam Brahmanula Desham. Kalikaalam kabatti dharmaanni nashanam cheyyalante Brahmanulanu lekunda cheyyaali.. andhuke ee kutra.. Brahmanulanu nashanam chesthe Brahmam oorukuntundha? ee chedalu pattina vruksham nashanamayyaaka kotha srushti prarambhamavuthundhi.. adhi Brahmanulathone. Jai Sri Ram!

    రిప్లయితొలగించండి
  7. Brahmanula gurinchi chalabaga chepparu inko vishayam Asprusyathani Antarani thananni Brahmanule Penchi poshincharantaru chalamandi kaani aa moorkulaki ardham kaani vishayam emitante poorvam Brahmanulaki Divaaradhana thappinchi marokati theliyadu daanini kooda trikarana sudhi ga chesevaaru, Snanamtho dehaanni, dhyanam tho manasutho paatu madi tho kattukune battani koodaa pavitram gaa unchukovatam vidhiga patinchevaaru. Anduke asalina Brahmanulu antlu mutlu intlo kalupukoru, bayataki vellivachina snaanam chese brahmanulu chalamande unnaru. Kaani migilina kulalavaaru chalamatuku antu muttu pattimpulekunda untaru (adi thappani kaadu kaan daivaraadhanaki adi panikiraadani sampradaya vaadula nammakam). Evari intlo ye antundo yevariki thelusthundi (thelisina veellu inkevaraina maila intiki velli vache avkasam undikada) anduke Brahmanulu baita vaarini thama vasthuvulu thakanichevaaru kaadu. Kaani ee vinanni choosina ithara agra kulasthulu kooda dalithulni ide paddathilo choodatam modalupettaru daantho asalu abhiyogam motham brahmanula meedaki vachindi. Kaani ila Brahmana Vyathirekam ga vaadinche vaariki theliyanidemitante Daivaaradhana vaddaku vachesariki brahmanulaki thara thama bhedalu levu udaaharanaki chalamandi intlo peddavaallu madi kattukunnappudu vaalla pillalni kooda muttukoru...

    రిప్లయితొలగించండి
  8. e articles chaduvutunte ma naralani nikkaputuchukuntunayi manamandaram aikamatyami poradalema induku nenu ready

    రిప్లయితొలగించండి
  9. I like this post,it reveal many things which i doesn't know yet. Thanks

    రిప్లయితొలగించండి
  10. చాలా అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి