16, సెప్టెంబర్ 2013, సోమవారం

చైనా ప్రచ్ఛన్న దళాలు... మావోయిస్టులు - హెబ్బార్ నాగేశ్వరరావు


భారతదేశంలో అనాదిగా కొనసాగిన ఆర్థిక వ్యవస్థను అమలు జరపడం ద్వారా చైనా ప్రగతి సాధించింది. చైనా వదలిపెట్టిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంకోసం చైనా ప్రేరితులైన మావోయిస్టు బీభత్సకారులు మన దేశంలో హత్యలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా ‘దర్భ’ ప్రాంతంలో ఈనెల ఇరవై ఐదవ తేదీన జరిగిన మారణకాండ మావోయిస్టుల ప్రస్థానంలో మరో బీభత్స పదం... దాదాపు ఏభయి ఏళ్లపాటు ‘కమ్యూనిజమ్’ పేరుతో కేంద్రీకృత ప్రభుత్వ ఆర్థిక స్వామ్య వ్యవస్థను అమలుజరిపిన చైనా 1990వ దశకం నుండి వ్యవసాయాన్ని వాణిజ్యాన్ని ఉత్పాదక వ్యవస్థను వికేంద్రీకృతం చేసింది. ఈ వికేంద్రీకృత అర్థిక వ్యవస్థ భారతదేశంలో లక్షల ఏళ్లు అమలు జరిగింది. విదేశీయులు ఈ వ్యవస్థను చెరిచారు. బ్రిటిష్‌వారు పూర్తిగా ధ్వంసం చేశారు! చైనా ప్రభుత్వం ‘కమ్యూనిజమ్’ అన్న మాటను వదలిపెట్టకుండానే ‘కమ్యూనిజమ్’ ప్రతిపాదించిన వౌలిక తత్వాన్ని వదిలివేసింది. చైనా వదలివేసిన దానిని చైనా ప్రేరిత మావోయిస్టులు మన దేశంలో ఇంకా ప్రచా రం చేస్తున్నారు. చైనా వదలి పెట్టినదానిని మన దేశంలో ప్రతిష్టాపించడానికి సంఘటిత బీభత్స వ్యవస్థను నెలకొల్పారు, విస్తరింపచేస్తున్నారు! ఈ విస్తరణకు అడ్డుతగిలే వారందరినీ నిర్దాక్షిణ్యంగా హత్యచేయడం మావోయిస్టుల కార్యాచరణ పద్ధతి! ఈ ‘విస్తరణ’ను అడ్డుకొనడానికై ఛత్తీస్‌గఢ్‌లో ‘సాల్వాజుడుమ్’అన్న ఉద్యమం మొదలైంది! అందువల్లనే ‘సాల్వాజుడుమ్’ సంస్థాపకుడు మహేంద్రకర్మను ఈనెల ఇరవై ఐదున మావోయిస్టులు మట్టుపెట్టారు!

మావోయిస్టు బీభత్సకాండను ప్రతిఘటించేందుకు సంఘటిత ప్రజాఉద్యమం ఆరంభంకావడం అద్భుత పరిణామం. ఈ ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమం ‘సాల్వాజుడుమ్’ రూపమెత్తింది! మావోయిస్టుల తుపాకీ గొట్టాల నుండి దూసుకువచ్చిన తూటాలకు ప్రభుత్వ దళాలు- పోలీసులు అనుబంధ సైనికులు- వందలువేలుగా బలైపోతుండిన తరుణంలో బస్తర్ ప్రాంతంలోని వనవాసీ ప్రజలు మావోయిస్టులను ప్రతిఘటించడానికి సమీకృతమయ్యారు. సంఘటితమయ్యారు. అలా సంఘటితం చేసినవాడు మహేంద్రకర్మ. బీభత్సం ముందు ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మోకరిల్లిన తరుణంలో, ప్రభుత్వ సహాయంకోసం ఎదురుచూడకుండా సామాన్య ప్రజలు నిరుపేద వనజనులు ప్రతిఘటించారు. ఇది మావోయిస్టులు ఊహించని పరిణామం. దేశంలో ఎక్కడా ఇలాంటి ప్రతిఘటన ఉద్యమం ఆరంభంకాలేదు. 2005లో మహేంద్రకర్మ ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు! మావోయిస్టులంటే నక్సలైట్లంటే భయవిభ్రాంతికి గురికావడం మాత్రమే దేశవ్యాప్తంగా అంతవరకు ప్రజల ప్రతిస్పందన! బెదిరిపారిపోవడం మాని ప్రజలు మావోయిస్టులకు ఎదురునిలవడం పేరు ‘సాల్వాజుడుమ్’. అందుకే ఎనిమిదేళ్లుగా పొంచి ఉన్న మావోయిస్టులు మహేంద్రకర్మను హత్యచేశారు. ఆయనతోపాటు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందకుమార్ పటేల్‌ను ఆయన కుమారుడు దినేశ్‌పటేల్‌ను చంపేశారు. మొత్తం ఇరవై నాలుగు మంది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇలా ఒకేసారి మావోయిస్టుల మారణాగ్నికి ఆహుతి కావడం మావోయిస్టుల వికృత విస్తరణకు నిదర్శనం. ఇలా మావోయిస్టులు బలపడడానికి ప్రధాన కారణం ‘సాల్వాజుడుమ్’ను సుప్రీంకోర్టు చట్టవ్యతిరేకమైన సంస్థగా ప్రకటించడం కారణం కావచ్చు!!

చైనాలో విఫలమైన ‘కమ్యూనిజమ్’ వౌలిక సిద్ధాంతం 1991 నాటికి తూర్పు ఐరోపాలోను, సోవియట్ యూనియన్‌లోను విఫలమైపోయింది! ‘కమ్యూనిజమ్’ ప్రభుత్వపు పెట్టుబడిదారీ విధానంగా అవతరించడం ఇందుకు కారణం!! పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రధాన ప్రేరకం సంపద, వనరులు, ఉత్పాదక వ్యవస్థ! యాజమాన్యం ఒకేచోట భారీగా కేంద్రీకృతం కావడం! ప్రాచీన భారతీయ సమాజంలో ఈ కేంద్రీకరణ లేదు. అట్టడుగు స్థాయివరకు సంపద వనరులు ఉత్పాదక వ్యవస్థ యాజమాన్యం అత్యంత సహజంగా వికేంద్రీకృతమైనాయి. ఐరోపా నుండి బయలుదేరిన దోపిడీదారులు వ్యాపారుల రూపమెత్తి ఆ తరువాత పాలకుల రూపమెత్తి భారతీయ వ్యవస్థను భగ్నంచేశారు. భారతీయ వ్యవస్థ మన దేశానికి మాత్రమే పరిమితంకాలేదు. వికేంద్రీకరణకు ప్రతీక! వికేంద్రీకృత ఆర్థిక సమాజం అతి ప్రాచీన కాలంలో అన్ని దేశాలలో ఉండడానికి భారతీయ సంస్కారం కారణం! ఈ సంస్కారాన్ని ఐరోపా దోపిడీదారులు అంతంచేశారు. వాణిజ్య సంస్థలు పారిశ్రామిక సంస్థలు వందలువేలుగా పుట్టుకొచ్చి సంపదను వనరులను ఉత్పాదక వ్యవస్థను యాజమాన్యాన్ని కేంద్రీకృతం చేశారు. ఇదే పెట్టుబడిదారీ విధానమైంది. ఆంగ్లంలో కాపిటలిజమైంది!! ‘కమ్యూనిజమ్’ ‘కాపిటలిస్ట్’ వ్యవస్థకు మరో రూపం మాత్రమే! ఒక్కటే తేడా! ‘కాపిటలిస్ట్’ వ్యవస్థలో వందలాది లేదా వేలాది పెట్టుబడిదారులు ఉన్నారు. ‘కమ్యూనిస్టు వ్యవస్థ’లో ఒకే ఒక్క పెట్టుదారుడు ఉన్నాడు! ఆ పెట్టుదారుడు ప్రభుత్వం! అంటే ప్రభుత్వపు పెట్టుబడిదారీ వ్యవస్థ పేరు ‘కమ్యూనిజమ్’!

కమ్యూనిజమ్ అన్ని దేశాలలోను విఫలంకావడానికి కారణం పెట్టుబడిదారుడు- ప్రభుత్వం- ప్రభుత్వ నిర్వాహకులు- ప్రజలను పాశవికంగా రాక్షసంగా దోచుకొనడమేనన్న సత్యం 1989లో ఐరోపాలోను 1991లో సోవియట్ రష్యాలోను ధ్రువపడిన చారిత్రక వాస్తవం! కానీ మళ్లీ పెట్టుబడిదారీ వ్యవస్థ మరింత భయంకరంగా ప్రపంచమంతా విస్తరించిపోతుండడం ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్-వల్ల సంభవించిన వైపరీత్యం. పెట్టుబడిదారీ వ్యవస్థ- కాపిటలిజమ్- ఒక దోపిడీ వ్యవస్థ. కథాకథిత సామ్యవాదం - కమ్యూనిజమ్- రెండవ దోపిడీ వ్యవస్థ! ఈ రెండు మాత్రమే ప్రత్యామ్నాయాలనేది ప్రపంచ ప్రజలను ఆవహించి ఉన్న మాయ. మూడవ ప్రత్యామ్నాయం ఉంది. నిజానికి ఇది మొదటి ప్రత్యామ్నాయం, అనాదిగా భారతదేశంలో సహజంగా వికసించిన సనాతన- శాశ్వత- వ్యవస్థ ఆ ప్రత్యామ్నాయం!! వికేంద్రీకరణ దీని స్వరూపం, ఒకరు మరొకరిని దోపిడీ చేయడానికి అవకాశం లేకపోవడం దీని స్వభావం. చిన్న కమతాల రైతులు, చిన్న వ్యాపారులు, స్వతంత్ర వృత్తులను అవలంభించిన చిన్న యజమానులు ఈ సనాతన వ్యవస్థను పరిపుష్టం చేశారు!

క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలోకి చొరబడడానికి విఫలయత్నం చేసి చంద్రగుప్త, సముద్రగుప్తుల ప్రతిఘటనకు భయపడి పారిపోయిన గ్రీకు బీభత్సకారుడు అలెగ్జాండరు. అతని కాలంనాటికి ‘డమాస్కస్’ ఉక్కును ప్రసిద్ధం! ఈ ‘డమాస్కస్’ వ్యాపార కేంద్రం మాత్రమే! అక్కడికి సరఫరా అయిన ‘ఉక్కు’ భారతదేశంలో తయారయినది. వేలాది పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలలో ఈ ఉక్కును తయారుచేశారు. ఈ పారిశ్రామికవేత్తలు యజమానులైన కమ్మరులు. వారి పరిశ్రమలు కొలిమిబట్టీలు! ఉక్కు ఉత్పత్తి ఒకే బృహత్ ప్రాంగణంలో కేంద్రీకృతం కాలేదు. పల్లెపల్లెలో ‘ఉక్కు’ను తయారుచేసిన కమ్మరులు యజమానులు, పారిశ్రామికవేత్తలు! దోపిడీదారులు కాదు. ఇలా తయారయిన ఉక్కును బండ్లకెత్తుకొని వెళ్లి పంపిణీచేసిన చిట్టి వ్యాపారి కూడ దోపిడీ చేయలేదు! వ్యవసాయం చేసినవారు భూమికి యజమానులు, చేయించినవారు కాదు... ఈ వి‘కేంద్రీకరణ’ దోపిడీకి అవకాశం ఇవ్వలేదు. ఇది మొదటి కారణం, రెండవది ఈ భూమి పట్ల భూమినుండి వచ్చిన ప్రజలకు కల మమకారం. ఈ మాతృభూమి పట్ల మమకారమే జీవన విధానమైంది, ధర్మమైంది, భక్తి అయింది, జాతీయతగా మారింది!! పాశ్చాత్య దేశాలనుండి వచ్చి పడిన ‘కాపిటలిజమ్’ వీటిని వికృత పరిచింది. తోడేళ్లవలె దూకిన ‘కమ్యూనిజమ్’ వీటిని భగ్నం చేసింది!!

విచిత్రమైన పరిణామం చైనాలో జరిగింది. 1989లో పడమట ‘కమ్యూనిజమ్’ అంతరించిన తరువాత చైనా ప్రభుత్వం సంపదపై, వనరులపై, ఉత్పాదక వ్యవస్థపై, యాజమాన్యంపై తన భల్లూకపు పట్టు సడలించింది. కట్టుబానిసలుగా పడి ఉండిన కోట్లాది ‘ఉద్యోగుల’ను యజమానులుగా మార్చింది. ఒక ఎకరం, ఇంకా తక్కువ విస్తీర్ణంకల పొలానికి యజమానులు వెలిశారు. చిన్న వ్యాపారులు, ఉత్పత్తిదారులు తయారయ్యారు. వీరందరూ పదేళ్లలో చైనా ప్రగతి గతిని మార్చేశారు. భారతీయమైన వికేంద్రీకృత వ్యవసాయ పారిశ్రామిక వాణిజ్య పద్ధతులు చైనాలో వ్యవస్థీకృతం కావడం ప్రచారానికి నోచుకోని బృహత్ పరిణామం!! అందువల్ల కమ్యూనిజమ్ పేరుతో చెలామణి అయిన ప్రభుత్వపు పెట్టుబడిదారీ విధానాన్ని చైనా వదలి వేసింది. చైనా వదలివేసిన కమ్యూనిస్టు ఆర్థిక సిద్ధాంతాన్ని మన దేశంలో నెలకొల్పే నెపంతో మావో సేటుంగ్ స్ఫూర్తిని పొందిన మావోయిస్టులు మనదేశంలో ఎందుకని హత్యలు చేస్తున్నట్టు??

కారల్ మార్క్స్ ప్రపంచ ప్రజలందరూ సమాన ఆర్థిక ప్రగతి సాధించాలని కలలుకన్నాడు! కానీ ఆయనకంటె పూర్వం లక్షలాది ఏళ్లుగా భారతీయ ఋషులు ఈ సమాన ఆర్థిక ప్రగతి సాధించే పద్ధతిని సహజ జీవనంగా వ్యవస్థీకరించారు!! ‘‘యావత్ భ్రియేత జఠరం తావత్ స్వత్వం షిదేహినామ్, అధికం యోభిమనే్యత సస్తేనోదండమర్హతి’’ అని మనువు చెప్పిన ఆర్థిక నీతి ఒక అంశం మాత్రమే!! ‘‘ఆకలిని తీర్చుకొనడానికి అవసరమైన దానిని సంపాదించాలి. అధికంగా కూడబెట్టినవాడు దొంగ, వాడు శిక్షార్హుడు...’’ - ఇదంతా ఈ ‘ప్రగతి’అంతా సగం మాత్రమే. మరో సగం సుగతి. ఈ ‘సుగతి’ని నేర్పించినది భారతీయ సంస్కారం! ఈ ‘సుగతి’ ధ్యాసతో కూడిన ‘ప్రగతి’ దోపిడీ చేయాలన్న భావాన్ని అంకురింపచేయదు, అంకురింపనీయదు! ‘కాపిటలిజమ్’ ‘సుగతి’ని వికృతపరచింది, కమ్యూనిజమ్ ‘సుగతి’ని పరిమార్చింది...

మావోయిస్టులు ఈ చారిత్రక వాస్తవాన్ని గ్రహించినట్టయితే తుంచడంమాని సంస్కారాన్ని పెంచడం నేర్చుకుంటారు! అలా నేర్చుకోనట్టయితే వారిని ప్రతిఘటించడానికి ఏకైక మార్గం భారత ప్రభుత్వం సైనిక దళాలను వినియోగించడం! మావోయిస్టుల లక్ష్యం నిజానికి ఆర్థిక సమానత్వం కాదు! చైనా ప్రభుత్వం ప్రాబల్యాన్ని విస్తరింపచేయడమే మావోయిస్టుల ఏకైక లక్ష్యం. చైనా దురాక్రమణ వ్యూహంలో రెండు భంగిమలున్నాయి. భారత సరిహద్దులకు ఆవల చైనా సైనికులు పొంచి ఉన్నారు. ఇది మొదటిది. మన సరిహద్దుల లోపల మావోయిస్టులు విస్తరిస్తున్నారు. ఇది రెండవ భంగిమ. మావోయిస్టులు చైనా ప్రభుత్వం ప్రచ్ఛన్న దళాలు...
source: http://andhrabhoomi.net/content/c-261

తిరుపతిలో ఇస్లామిక్ విశ్వ విద్యాలయం - దేవాదాయ స్థలంలోనే ఏర్పాటు

 
  • చంద్ర గిరి సమీపంలో నిర్మాణ పనులు
  • దేవాదాయ స్థలంలోనే ఏర్పాటు
  • హిందూ ధార్మిక ప్రాంతంలో అన్యమతానికి చోటా?
  • నిధుల సేకరణకు విదేశాల్లో ప్రచారం
  • ఇది అంతర్జాతీయ కుట్ర,ప్రభుత్వ పాత్రా ఉంది
  • మరెందుకు అడ్డుకోవడం లేదు : బీజేపీ
 
 
హైదరాబాద్, తిరుపతి, సెప్టెంబర్ 13 : ఏడుకొండల వాడి నిలయమైన తిరుపతి కొండల్లో అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నారని, ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ కుట్రేనని బీజేపీ ఆరోపించింది. నౌహెరా షేక్ అనే మహిళ పేరిట గుట్టు చప్పుడు కాకుండా విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు సాగుతున్నాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్థలంలోనే దీన్ని నిర్మిస్తున్నారని, ప్రభుత్వానికి ఇదంతా తెలియకుండా జరుగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. "తిరుమల కొండకు కాలి నడకన వెళ్లే చంద్రగిరి శ్రీవారి మెట్టు సమీపంలో "హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజీ'' పేరుతో అంతర్జాతీయ ఇస్లామిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

ఉర్దూ అరబిక్ పాఠశాల, మదర్సా అని ప్రచారం చేస్తూ దీని నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. నౌహెరా షేక్ చైర్మన్‌గా గల హీరా ఉర్దూ అరబిక్ డెవలప్‌మెంట్ సొసైటీ పేరిట దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేవాదాయ శాఖ స్థలంలో 2011 నుంచి దీని పనులు సాగుతున్నాయి. అంతేకాదు.. ఇదే సొసైటీ పేరిట విశ్వ విద్యాలయ స్థలంలో కాలేజీని, మదర్సాను, అరబిక్ ఉర్దూ పాఠశాలను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటినీ వెబ్‌సైట్‌లో ఘనా, చైనా, కెనడా వంటి దేశాల్లో ప్రచారం సాగిస్తున్నారు. తిరుపతిలో పెట్టామని చెబుతూ విదేశాల నుంచి నిధులు, వనరులు రాబడుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా తిరుపతిలో పుట్టిన నౌహెరా షేక్ పేరును ఈ కార్యకలాపాలకు పూర్తిగా వినియోగించుకుంటున్నట్లు అవగతమవుతుంది'' అని ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. మరోవైపు దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్‌రెడ్డి, నేతలు సామంచి శ్రీనివాస్, మధుసూదన్, నాగేశ్వర్‌రావు తిరుపతిలో డిమాండ్ చేశారు. విద్యార్థినుల ముసుగులో తిరుమల-తిరుపతిలోకి అసాంఘిక శక్తులు ప్రవేశించి విధ్వంసం చేసే అవకాశం ఉందన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు.


ఇంతకీ ఏం జరుగుతోంది?
తిరుపతికి పది కిలోమీటర్ల సమీపంలో చంద్రగిరి మండలం, తొండవాడ వద్ద హీరా అంతర్జాతీయ ఇస్లామిక్ కాలేజీ పేరుతో 1.09 ఎకరాల విస్తీర్ణంలో ఆరు అంతస్థుల భారీ భవనాన్ని నిర్మించారు. చుట్టూ 12 అడుగలు ఎతైన ప్రహరీ గోడ నిర్మించారు. భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. భవన నిర్మాణానికి తుడ అనుమతి కూడా తీసుకున్నారు. ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి కోర్సులతో పాటు, ఇస్లాం మత బోధనల కోసమే ఈ కళాశాలను స్థాపిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

దీని వ్యవస్థాపకురాలు నౌహీర్ చాలా ఏళ్లుగా రేణిగుంట సమీపంలో మదర్సాను నడుపుతున్నారు. గతంలో ఆమె ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారు. అక్కడి పరిచయాలతోనే ఇస్లామిక్ విద్యా సంస్థను ప్రారంభిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, ఈ సంస్థ పేరుతో ఉన్న హీరాఐబీజీ.కామ్‌లోని వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చైనా సహా ఐదు దేశాల్లో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. వీటి వార్షికోత్సవాలు, షేర్ హోల్డర్ల సమావేశాలన్నీ ముంబై కేంద్రంగా జరుగుతున్నట్లు వైబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
Heera Business Gruops : http://heeraibg.com/heeraibg/
Heera International Islamic School : http://heeraiisg.com/index.php
Heera International islamic Collage : http://heerauniversity.com/

ఇది పాకిస్తాన్ సాగిస్తున్న ప్రచ్ఛన్న బీభత్సం ! - ముజఫర్ నగర్ ఘటనల పై హెబ్బార్ కలం

By : హెబ్బార్ నాగేశ్వర్ రావు
 
 
 
అన్యాయం చేసిన వారు, అన్యాయానికి బలైనవారు విభిన్నమతస్థులైన ప్రతి సందర్భంలోను, అన్యాయానికి ప్రతిక్రియాగా చెలరేగే హింసాకాండకు మతకల్లోలాలని పేరుపెట్టడం మనదేశంలో మామూలైపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ ప్రాంతంలో జరుగుతున్న హింసాకాండకు నిజానికి మతపరమైన అంశాలతో కాని, వివాదాలతో కాని సంబంధం లేదు. అయినప్పటికీ రెండు మతాల వారికి కల్లోలాలతో సంబంధం ఉంది కాబట్టి వీటిని మతకల్లోలాలంటున్నారు. ఒక మతంవారు నిష్కారణంగా దాడి చేసినప్పటికీ మరో మతంవారు దాడులకు గురయినప్పటికీ మతకల్లోలాలు అనే పదజాలం ప్రచారం అవుతోంది. ముజఫర్ నగర్‌లో ఘోర హింసాకాండకు దారితీసిన ఘటనకు కారణం లైంగిక బీభత్స స్వభావం కలిగి ఓ దుండగుడు! దుండగుడి దుశ్చర్యను నిరోధించిన వారు మరో మతానికి చెందినవారు. ఒక అమ్మాయిని లైంగికంగా వేధించడం తప్పని ఇరుమతాల వారు అంగీకరించి ఉంటే సమస్య లేదు. అంగీకరించని వారి వికృత మనఃప్రవృత్తి ఈ కల్లోలాలకు ప్రధాన కారణం. ఏది ఏమైనా ఒక మతంవారిని మాత్రమే తప్పు పట్టడం మరో మతం వారిని నిర్దోషులుగా నిలబెట్టడానికి యత్నించడం ఉత్తరప్రదేశ్‌ను పరిపాలిస్తున్న సమాజ్ పార్టీ విధానమైపోయింది. ఈ విధానం కారణంగా ఈ పార్టీ గుడ్డిగా సమర్థిస్తున్న మతం వారిని మరోమతం వారిపై దాడి చేయడానికి స్ఫూర్తినిస్తోంది. ఎందుకంటే అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే ప్రవృత్తి మనదేశంలోని అన్ని రాష్ట్రాలలో అధికార యంత్రాంగాన్ని, పోలీసులను ఆవహించి ఉంది. అందువల్ల లైంగికంగా వేధించిన దుండగుని తప్పు పట్టి దండించవలసిన అతని మతవర్గంవారు మతం పేరుతో అతగాడిని సమర్ధించే దుస్థితి దాపురించింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలకు ఇదీ కారణం. అమ్మాయిని వేధించిన దుండగుని దుశ్చర్యతో సంబంధం లేని అనేకమంది అమాయకులు, అతని మతవర్గీయులు, భిన్న మతస్థులు కూడ కల్లోలాలకు ఆహుతైపోయారు. పోలీసులు తక్షణం రంగప్రవేశం చేసి ఆడపిల్లను వేధించిన లైంగిక బీభత్సకారుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టినట్టయితే, కల్లోలాలకు ఆహుతైపోయిన ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు నిలబడి ఉండేవి. అలా జరగకపోవడానికి కారణం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, అతగాడి ప్రభుత్వం, ఆయన నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ విధానాలు కారణం.
 
దేశమంతటా హిందువులు, ముస్లింలు కలిసిమెలసి ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. పరస్పర సహజీవన జాతీయ తత్వానికి మన దేశంలోని భిన్న మతాలవారు వారసులు! ఈ వారసత్వ స్పృహ ఉన్న ప్రతి పౌరుడూ మతంతో నిమిత్తం లేకుండా సర్వమత సహిష్ణుతా భావాన్ని కలిగి ఉన్నాడు. కానీ జిహాదీ బీభత్సకారులను ఇస్లాం మతానికి చెందిన సామాన్య ప్రజలతో ముడి పెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నం విషపరిణామాలకు దారి తీస్తోంది. అలాంటి విష పరిణామం, ముజఫర్ నగర్ ప్రాంతంలో అల్లర్లు. ఇటీవల భారత-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో యాసిన్ భత్కల్ అనే జిహాదీ బీభత్సకారుడు పట్టుబడ్డాడు. వందలాది మంది ప్రాణాలను తీసిన ఈ పాకిస్తానీ తొత్తును ఇస్లాం మతంతో ముడిపెట్టడానికి యత్నించడం ద్వారా ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాది పార్టీ నేత ఒకరు ముస్లింలలో అసంతృప్తిని రెచ్చగొట్టడానికి యత్నించాడు. అతగాడిని ఆ తరువాత పార్టీ పదవులనుండి తొలగించడం వేరే సంగతి. కానీ రాజకీయవేత్తలు ఇలా దేశద్రోహి, జిహాదీ బీభత్సకారుల అరెస్టును కూడా ముస్లింల సానుభూతిని సంపాదించుకొనడానికి ఉపయోగించడం ప్రమాదకరమైన పరిణామం...గతంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్, స్వయంగా ‘సిమి’కి మద్దతు పలికిన సందర్భాలున్నాయి. ‘సిమి’ పాకిస్తాన్ ప్రభుత్వపు మద్దతుతో పనిచేసిన జిహాదీ, బీభత్స సంస్థ, ఇండియన్ ముజాహిద్దీన్ వంటిది. ఇలాంటి తమ దుశ్చర్యలను భారతదేశ భక్తులైన సామాన్య ముస్లింలు సమర్ధిస్థారని భావించడం..ఈ రాజకీయ నాయకుల వికృత చిత్తవృత్తికి నిదర్శం. ఈ చిత్తవృత్తి జిహాదీ బీభత్సకారులకు, వారి మద్దతుదారులకు బలం కలిగిస్తోంది. ముజఫర్ నగర్ కల్లోలాకు ఇలాంటి అనైతిక బలం ప్రధాన కారణం. జరిగినవి మతకల్లోలాలు కాదు. ‘లవ్ జిహాద్’ పేరుతో హిందూ యువతులపై లైంగిక బీభత్సం సాగించ యత్నిస్తున్న పాకిస్తాన్ సమర్ధకుల పన్నాగంలో ఈ కల్లోలాలు భాగం.
 
‘ఇండియన్ ముజాహిదీన్’ బీభత్సకారులు దేశమంతటా విస్తరించి ఉన్నారు. సామాన్య ముస్లింలతో కలిసిపోయి చట్టబద్ధులైన పౌరుల వలె అభినయం సాగిస్తున్నారు. అమాయకులైన ముస్లింలు, ఈ జిహాదీ దుండగులు తమ వలెనే, సాధారణ పౌరులని విశ్వసిస్తూ ఉండవచ్చు. కానీ ఈ జిహాదీలు ఆన్యమతస్థులపై దాడులు జరపడం ద్వారా ప్రచ్ఛన్న బీభత్సకాండను కొనసాగిస్తున్నారు. ఈ ప్రచ్ఛన్న బీభత్సకాండకు మతాల రంగు పులమడం, మతకల్లోలాల ముసుగు తొడగడం తగని పని. జమ్మూ లో ఇటీవల జరిగిన అల్లర్లు కాని, ముజాఫర్ నగర్‌లో ఇప్పుడు జరిగిన కల్లోలాలు కాని, పాకిస్తాన్ ప్రేరిత ఈ ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకాండలో భాగం. ఇస్లాం మతనిష్ఠాపరులైన భారత రాజ్యాంగ బద్ధులైన సామాన్య ముస్లింలకు ఈ పాకిస్తానీ ప్రచ్ఛ న్న బీభత్సంతో సంబం ధం లేదు. అందువల్ల ముజఫర్ నగర్ కల్లోలాలు పాకిస్తానీ ప్రచ్ఛన్న బీభత్సకాండ మాత్రమేనన్న వాస్తవాన్ని మన ప్రభుత్వం గుర్తించాలి. ముజఫర్ నగర్ జిల్లా కవాల్ గ్రామంలో జరిగింది లైంగిక బీభత్సకారుని విఫలయత్నం. ఇలాంటి లైంగిక బీభత్సం ‘లవ్ జిహాద్’ అన్న కుట్రలో భాగం. అంగీకరించిన హిందూ బాలికలను జిహాదీలు మతం మారుస్తున్నారు. అంగీకరించని వారిని, ప్రతిఘటించిన వారిని లైంగికంగా వేధించడానికి యత్నిస్తున్నారు. ఒక హిందూ బాలికను ఇలాంటి జిహాదీ వేధించడాన్ని ఆమె అన్నలిద్దరు ప్రతిఘటించారు. ఈ ప్రతిఘటన సంఘర్షణగా మారి దుండగునితోపాటు అన్నలిద్దరూ కూడ హతులయ్యారు. ఈ దశలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం పరిస్థితిని అదుపు చేయలేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. బాధితురాలి అన్నలిద్దరూ హతులు కాగా, ఆమె తండ్రిని కూడ అరెస్టు చేసి ఆయనపై కేసు పెట్టారట...
 
ఇలా పరోక్ష బీభత్సకాండ ఫలితంగా, పాకిస్తాన్, ప్రభుత్వపు పంచమాంగదళమైన జిహాదీల కారణంగా భిన్న మతాల మధ్య విద్వేషాలు రాజుకుంటుండటం మిక్కిలి దురదృష్టకరం. రాజకీయ పార్టీలు మత వర్గాల మూక ఉమ్మడి వోట్లకోసం విద్వేషాలను మరింతగా రాజేస్తుండడం జాతీయ వైపరీత్యం. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు పదమూడు సార్లు ఇలా కథాకథిత మతఘర్షణలు చెలరేగాయి. దాదాపు ఇవన్నీ కూడ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ప్రచ్ఛన్న జిహాదీ బీభత్స ఘటనలే! మతనిష్ఠకు, మతాలకు ఈ కల్లోలాలతో నిజానికి సంబంధం లేదు. అన్నలు అడ్డుపడకపోయి ఉంటే ఆ బాలిక ఆ దుండగుని లైంగిక బీభత్సానికి బలయి ఉండేది. మతంతో ఏమి సంబంధం!?

12, సెప్టెంబర్ 2013, గురువారం

' ముజఫర్ నగర్ అల్లర్ల వెనుక వరుస హత్యాచారాలు ' : ఇండియా వైర్ విశ్లేషనాత్మక కథనం

ముజఫర్ నగర్ , ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన మత ఘర్షణల నేపథ్యాన్ని చూస్తే గత కొన్ని రోజులగా పట్టణం లో జరిగిన సంఘటనలు , ఒక ఈవ్ టీసింగ్ ఘటన మరియు ఒక యుటుబ్ వీడియో మాత్రమే కారణం కాగలవ ? అన్న సంశయం అందరికి వస్తుంది , దానికి సమాధానం కోసం  గత సంవత్సర కాలంగా ముజఫర్ నగర్ పట్టణం లో జరిగిన వరుస అత్యాచారాలు వాటిని సమర్థిస్తూ చేసిన రాజకీయం లాంటి అంశాలను చూడాల్సిఉంది .   

 
 
వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనల క్రమం   : 
  • 21-Dec-2012 : ఒక హత్యాచార బాదితురాలికి ఈ విషయాన్ని దాచడం కోసం రూ 1.5 లక్షలు ఆశచూపింది ముజఫర్ నగర్ పంచాయితీ ( పూర్తీ వివరాలకు )
  • 24-Dec-2012 : ముజఫర్ నగర్ లో  ఒక మైనరు బాలిక ముగ్గురు యువకుల చేతిలో సాముహిక హత్యాచారానికి గురైంది  పూర్తీ వివరాలకు )
  • 26-Dec-2012 : పాఠశాలలో చదివే అమ్మాయి పై ఒక ఉపాధ్యాయుడు లైంగిక దాడి చేసాడు . ( పూర్తీ వివరాలకు
  • 30-Dec-2012 : ముజఫర్ నగర్ లో  ఆగంతకులు చేసిన యాసిడ్ దాడిలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు ( పూర్తీ వివరాలకు
  • 18-Feb-2013 : ముజఫర్ నగర్ లో ఒక మహిళ నలుగురు వ్యక్తుల చేటిలో సాముహిక అత్యాచారానికి గురైంది , ఆ అత్యాచారాన్ని విడియో తీసారు ( పూర్తీ వివరాలకు )
  • 03-Apr-2013 : ముజఫర్ నగర్ లో ముగ్గురు ఉపాధ్యాయినిలు , ఒక విద్యార్తి పై యాసిడ్ దాడి జరిగింది ( పూర్తీ వివరాలకు )
  • 03-Jun-2013 : ఒక మైనరు బాలిక హత్యాచారానికి గురైంది ( పూర్తీ వివరాలకు )
  • 05-Jul-2013 : సాముహిక అత్యాచార నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక వ్యక్తీ ఆత్మాహుతికి పాల్పడ్డారు ( పూర్తీ వివరాలకు  )
  • 29-Jul-2013 : మహిళ బలవంతంగా పెళ్లిచేసుకోబడి తర్వాత సాముహిక అత్యాచారానికి గురైంది ( పూర్తీ వివరాలకు
  • 23-Aug-2013 : ఒక పాఠశాల విద్యార్థిని 5 గురు యువకుల చేతిలో సాముహిక హత్యాచారానికి గురైంది ( పూర్తీ వివరాలకు
  • 24-Aug-2013 : 9 వ తరగతి చదివే అమ్మాయి యువకుని చేతిలో హత్యాచారం చేయబడింది ( పూర్తీ వివరాలకు
  • 27-Aug-2013 : కావాల్ గ్రామంలో జరిగిన ఒక ఈవ్ టీసింగ్ ఘటన మూడు బైక్ ల దగ్దానికి , ఘర్షణకు దారి తీసింది . 
  • 30-Aug-2013 : 11 సంవత్సరాల అమ్మాయి పై లైంగిక దాడి చేసిన ఘటనలో ఒక ముస్లీం మత పెద్ద అరెస్టు అయ్యారు ( పూర్తీ వివరాలకు )
  • 30-Aug-2013 : శుక్రవార ప్రార్థన ల అనతరం అల్లరిముక ల భారి సమూహం షహీద్ చౌక్ లో సమావేశమయి అటుగా వెళ్తున్న మహిళా భక్తుల పై దాడి చేయడం జరిగింది .
  • 31-Aug-2013 : నంగల మందౌద్ పంచాయితీలో దాదాపు 40,000 మంది సమావేశమయ్యారు , ఖతిమ రోడు లో కారులో వెళ్తున్న ఒక కుటుంబం పై దాడి జరిగింది , కారు దగ్దం చేయబడింది .
  • 01-Sep-2013 : దాడికి గురైన కుటుంబం ఆత్మాహుతి హెచ్చరికలతో , షహీద్ చౌక్ సమావేశంలో రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చిన ఇద్దరు నాయకులో FIR నమోదు చేయడం జరిగింది .
  • 02-Sep-2013 : సంఝాక్ మరియు తివ్తి లలో దేవాలయాల గోడలు ద్వంసం చేయబడ్డాయి , BJP ముజఫర్ నగర్ బందు కు పిలుపునిచ్చింది .
  • 03-Sep-2013 : కావాల్ లో జరిగింది అంటూ చేసిన అసత్యపు విడియో ప్రచారామ్ పై పొలిసు కేసు నమోదు చేయబడింది , శామ్లి నగరం లో హింస చేల రేగింది .
  • 04-Sep-2013 : ముజఫర్ నగర్ లో చెదురు-మదురు హింసాత్మక సంఘటనలు జరిగాయి .
  • 05-Sep-2013 : ముజఫర్ నగర్ జిల్లా మహా బందుకు ఖప్ పంచాయితీ (అక్కడి జాట్ తెగకు సంబందిచి అత్యన్నత నిర్ణాయక మండలి ) పిలుపు నివ్వడం జరిగింది , తేది 07-Sep-2013 న నగ్నల మండుర్ లో " భాహు బేటి సమాన్ బచాయో మహా పంచాయితీ " నిర్వహించ నోతున్నట్లు ప్రకటించడం జరిగింది .
  • 07-Sep-2013 : ముందుగా ప్రకటించిన విధంగానే నగ్నల మండుర్ లో " భాహు బేటి సమాన్ బచాయో మహా పంచాయితీ " నిర్వహించబడినది , దాదాపు లక్షా ఇరవై వేల మంది దీనిలో పాల్గొన్నారు , పాల్గొని తిరిగి వెళ్తున్న వారి పై దాడులు జరిగాయి .
  • ముజఫర్ నగర్ లో కాల్పులు జరిగాయి , హింసాయుత వాతావరణం నెలకొని ఉండటంతో సైన్యం కర్ప్యు విధించింది , ఇప్పటి వరకు జరిగిన ఘటనలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు . 
http://www.rastrachethana.net/2013/09/blog-post_1645.html