27, నవంబర్ 2012, మంగళవారం

లండనీయం - సంస్కృతి - అవసరం-ఆధిపత్య౦!


రాజు చేసిన తప్పులకి బ్రిటన్ ఇప్పుడు ఇస్లామిక్ చాందసవాద రూపంలో పీడింపబడుతున్నది. 


బలహీనదేశాలను ఆక్రమించి వారి సంస్కృతిని నాశనం చేయడమే కాక వారి వనరులను నిలువుదోపిడీ చేసి మరీ తమ దేశాన్ని అభివృద్ధి చేసుకునే పశ్చిమదేశాల తల్లిగా భావిస్తున్న అఖండ బ్రిటన్ ఇప్పడు సరికొత్త ఆలోచనలకి నాంది పలుకుంతు౦ది.


సోదర(ఇతర) మతస్తులు తమ మతాన్ని పాటిస్తూ ఆంగ్లేయు క్రైస్తవ సంస్కృతి ఆధిపత్యాన్ని అంగీకరించినప్పుడే  తాము ఆ మతాలకి అవసరమైన సహాయసహకారాలు అందిస్తామని బ్రిటన్ నిర్ద్వందంగా తేల్చిచెప్పింది. మరో రకంగా చెప్పాలంటే తమ జాతి గుర్తింపు కేవలం ఇప్పటికీ పట్టులో ఉన్న ఆంగ్లేయు క్రైస్తవ సంస్కృతి నిర్దేశించిన ప్రాధమిక విలువలు మరియు రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడిఉంటుందని గట్టిగా చెప్పింది. ఇస్లామిక్ ప్రపంచం నుంచి వస్తున్నవారు తమ క్రైస్తవ సంస్కృతిని  సవాలు చేయడం లేదా వ్యతిరేకించడాన్ని ఎట్టి పరిస్థితులలోను ఒప్పుకోమని తేల్చిచెప్పింది.



బ్రిటన్ ప్రధానమంత్రి విభిన్నసంస్కృతీ(multiculturalism) సమ్మేళనం ఇస్లాం చాందస భావాలను రూపుమాపడంలో విఫలమయిందని ఒప్పుకోవడం "భారతదేశ౦లొ పుట్టి  పురాతనసంస్కృతిగా పేరొంది సజీవమైన సమాజ౦గా నేడు పిలువబడుతున్న హైందవ సంస్కృతి దానికి మూలమైన హిందూత్వమే భారతదేశజాతి గుర్తింపు" అవసరం అన్న భావనని సూచిస్తుంది. భారతదేశం చాలాకాలం ఇస్లామిక్ మరియు ఆంగ్లేయ క్రైస్తవ దోపీడీదారుల వల్ల బాధలు పడింది. నేడు నాస్తిక-కమ్మూనిస్ట్, తీవ్రవాదభావజాలం ఉన్న  మైనారిటీలు మరియు ఇతరదేశ యాత్రికులు ఆ బాధలని కొనసాగిస్తున్నారు.

ఏంతోకాలంగా ఉన్న ఇతరజాతులకి వ్యతిరేకంగా పోరాడడానికి భిన్నజాతులను ఆహ్వానించి వాడుకునే ప్రయత్నంలో బ్రిటన్ అత్యంత తీవ్రభావజాలం ఉన్న ఇస్లామిక్ మేధావులకి తమ దేశపు మసీదులలో ఆతిధ్యమిచ్చింది. అదిప్పుడు వికటిస్తుంది. ఇతర పశ్చిమదేశాలైన జెర్మనీ, నెదర్లాండ్స్ మరియు ఫ్రాన్సులు కూడా తమదేశాల్లో పెరుగుతున్న ముస్లిం జనాభాని చూసి ఆందోళన చెందుతున్నారు. 

మొదటి రెండు ప్రపంచ యుద్దాల ముందు, తర్వాత కొనసాగిన ఈ పశ్చిమదేశాల ఆర్థికఉన్నతి మరియు రాజకీయ ఆధిపత్య౦ ఇతరదేశాల భూమి మరియు వనరులని ఆక్రమించుకోవడం ద్వారా వచ్చింది. అందులోనూ వీరు ఇస్లామిక్ ప్రపంచాన్ని ఆయిల్ మరియు గాస్ కొరకు చాలావరకు ఆక్రమించారు. ఆ దొంగదోచుళ్ళు కప్పిపెట్టి మాయచేయడానికి మరో జిత్తులమారి పథకాన్ని ఉపయోగించారు. ఆ పథకంలో భాగంగా తెలివిగా తీవ్రచాందస భావాలని కలిగినవారిని ఇదే పశ్చిమదేశాల్లో పురుడుపోసుకున్న నియంతలను ఎదిరించడానికి ప్రోత్సహిస్తున్నట్లు నటించారు. మరో పక్క అదే నియంతలు తమ నియంత్రత్వాన్ని నిలుపుకోవడానికి మరియు తమ శత్రువులని చంపడానికి ఇవే పశ్చిమదేశాలు సహకారం అందించేవి లోపాయకారిగా!  

అవమానాలు, బాధలు పడుతున్న ముస్లిములని, హిందూ నాస్తికులని పైకి చెప్పి వారిని రెచ్చగొట్టి భారత విభజన అనే సిద్దాంతాన్ని ఎగదోయడంలో కూడా ఇదే కుటిలత్వం. అలా విభాజానంతరం ఏర్పడిన పాకిస్తాను తన కాళ్ళ మీద తను నిలబడే సత్తా ఎప్పటికీ సాధించుకోలేకపోయింది సరికదా నేటికీ అమెరికా దయదాక్షిణ్యాల మీద ఆధారపడిఉంది. నిజానికి గడచిన రెండు శతాబ్దాల్లో దేశాన్ని లేదా రాజకీయ ఆధిపత్యాన్ని కానీ "తిరిగికోలుకున్న ఇస్లాం" గెలవలేదు. బహుశా అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరించి, పశ్చిమదేశాలకి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచి షియా విప్లవపు ఇరాన్ మాత్రమే ఇస్లామిక్ విజయపు నమూనా! 

ఒక పక్క రాజకీయ విభాగంలో పెరుగుతున్న ఇస్లాం పాత్ర మాత్రమే కాకుండా, పెరిగిపోతున్న ఇస్లాం జనాభా మరియి పశ్చిమసంస్కృతిని ధిక్కరించడం లాంటివి పశ్చిమదేశాలకి కంటిమీదకునుకు లేకుండా చేస్తున్నవి. వీటిని ఒకదారిలో పెట్టి పశ్చిమరాజకీయంలో అందరూ, అన్ని సంస్కృతులూ కలిసిపోయి, ప్రశాంత జీవనం సాగించేందుకు చేసిన ప్రయత్నమే ఈ "విభిన్నసంస్కృతి సమ్మేళనం". కానీ ఈ ప్రయత్నం విఫలమవడానికి కారణం "ముస్లింలు వారికున్న జాతి హక్కులని విభిన్నసంస్కృతులని మరియు రాజకీయ విభాగాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించడమే". ఈ "ఇస్లాం ప్రభావితాన్ని" అటు క్రైస్తవ మతం కానీ వారి రాజకీయం యంత్రాంగం గానీ ఒప్పుకోవడంలేదు. ఈ పరిస్థితులు ఇస్లా౦, క్రైస్తవుల మద్య అనుమానాలు పెంపో౦దడానికి, ఒకరి మీద ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడానికి దోహదపడుతున్నాయి.       

సర్వకోటి(మానవాళి మరియు పశుపక్ష్యాదులు) అభ్యున్నతి కోరుకునే పురాతన సమాజం నమూనాగా పేరొంది౦ది భారతీయ సనాతన ధర్మ౦. ఈ ధర్మ౦ ఒకరు చెప్పినది లేక ఒక కాలానికి సంభందించిన కాదు, ఎప్పటికప్పుడు కాలానికి తగ్గట్టుగా మారుతూ నిత్యయవ్వనంతో తులతూగుతున్నది. ఈ ధర్మం ఎల్లపుడూ సమకాలీనమైనది.  ఈ ధర్మ౦ అన్ని జాతులని, మతాలని గౌరవిస్తుంది. ఎవరో ఒకరు మానవాళికి దేవుడికి మద్యలో ఉండి "దేవుడు చెప్పిన నిజం" అని ప్రచారం చేసే హక్కు ఇవ్వలేదు. వేదఋషుల(శ్రుతి) చేత చెప్పబడి, ప్రపంచ మానవాళి శ్రేయస్సు కొరకు అందజేయబడిన అమూల్యాలు "వేదాలు" అని హిందువులు నమ్ముతారు. అందుకనే వీటిని ప్రపంచ౦మీద బలవంతంగా రుద్డలేదు. పరబ్రహ్మ ఒక్కడే దేవుడు అని నమ్మిన ఈ ధర్మ౦  దేవుడిని నమ్మనీ నాస్తికులకీ తన సంప్రదాయాల్లో ఏంతో ప్రాముఖ్యతనిచ్చింది. మన రాజకీయవ్యవస్థ మరియు స్వతహాగా ఉండే అందరి(విభిన్న జాతుల) బాగు కోరుకునే మనస్తత్వం(secularism) వీటిని అర్థంచేసుకోవడం నుంచే వచ్చింది. కొన్ని దశాబ్దాల కిందట హిందువులు ఒక్కరే తమ జీవినవిధానాన్ని ఆధారం చేసుకుని ధర్మాన్ని నిర్మించుకుని సఫలమయ్యారు అని అరిస్టాటిల్ చెప్పాడు.

అతిధిదేవోభవ అన్న సాంప్రదాయం తనలో ఇముడ్చుకున్న భారతదేశం ఏంతోమంది నిరాశ్రయులకి ఆశ్రయమిచ్చింది. పర్షియా నుంచి పారిపోయి వచ్చిన పార్సీలు, దలైలామా అతని వారసులు, కర్మపా, బహాయ్ జాతి, క్రైస్తవులు మరియు ముస్లిమ్స్ ఇక్కడ వందలాది సంవత్సరాలుగా నివసిస్తున్నారు. ఇంకా  యూదులు తాము భారతదేశానికి AD 70 లో రెండవ సోలోమన్ గుడి పడగొట్టిన తర్వాత వచ్చినట్లు చెప్పుకుంటారు, నమ్ముతారు. మన రాజకీయ సంస్కృతి అందరిని సమభావంతో చూస్తుంది అనే దానికి ఉదాహరణ - స్వంతంత్ర భారతదేశపు మొట్టమొదటి మంత్రి వర్గంలో ఉన్న మౌలాన ఆజాద్ మరియు   బి.ర్. అంబేద్కర్.     

మాతృభరతభూమి అల్పసంఖ్యాక వర్గాలని మిగలిన వర్గంతో సమానంగా  విభిన్నసంస్కృతుల నిలయంగా ఆదరించింది, తనకు నచ్చినవిధంగా ఉండే భరోసా ఇచ్చింది. వాస్తవానికి, వారు తగిన స్థానం పొందే౦దుకు ఆధారపడతగిన సంస్కృతిని తన పురాతన సంప్రాదాయాల ద్వారా ఇచ్చింది. వీరు అల్పసంఖ్యాకుల౦ అన్నదాన్ని మనసులోంచి వదిలేయలేదు, అలానే వారు దేశంయొక్క గుర్తింపుని, సంస్కృతిని దాని విలువలని కొత్తగా నిర్దేశి౦చలేదు.          

అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత  మిగిలిన దేశాల ఇస్లాం మరియు క్రైస్తవ బలవంతపు పునరీకరణ మొదలయింది. క్రైస్థవపు అంతులేని నిధులు, సేవ మాటున చేసే మతమార్పిడులు, హిందూ సంస్కృతీ ధ్వంసరచనలు మరియు తమకంటూ ప్రత్యేక గుర్తిపుకోసం చేసే రాజకీయ అరాచకాలు. మరీ ముఖ్యంగా ఇదే క్రైస్థవులు భారతదేశపు సంస్కృతిని, నమ్మకాన్ని నిలబెట్టడానికి చేసే ప్రతీ ప్రయత్నాన్ని తమ కుటిలతత్వంతో నియంత్రిస్తున్నారు, అందులో గిరిజనులని మతస్వేఛ్చ పేరుతొ మోసం చేయడం. భారత ప్రధానన్యాయస్టాన౦ ఎన్నోసార్లు "ఈ పద్దతి" ని బహిరంగంగా తప్పు పట్టినా, వీరు మటుకు మత స్వేఛ్చ అంటె "ఇతరులని క్రైస్తవంలోకి మార్చడమే" అన్న వితండవాదాన్ని వల్లె వేస్తున్నారు.        

ఈ మద్య జరిగిన "నర్మదాతల్లి కుంభ్ మేళా" మీద క్రైస్తవ ప్రతినిధులు పెద్దఎత్తున చెలరేగి ఈ మేళా ఉద్దేశ్యం మతమార్పిడుల ద్వారా హిందూధర్మ౦లోనికి తీసుకురావడానికి అని గగ్గోలెట్టారు. బిషప్ గెరాల్డ్ అల్మీడియా దీని మీద ప్రధానన్యాయస్తానానికి వెళ్లగా, ఫాధర్ ఆనంద్ ముత్తు౦గల్ ముఖ్యమంత్రి శివరాజసింగ్చౌహాన్ ను రక్షణ అడిగాడు.  ఫలితం అక్కడ గిరిజనులకి సేవ చేస్తున్న హిందూ సాధువుల మీద తూటాలు, ఆయుధాలు చూపించబడ్డాయి, రాష్ట౦లో కూడా అంత రక్షణ లేదు. ఇది అత్యంత హాస్యాస్పదం!.      

ఇప్పుడిక పశ్చిమ దేశాల వంతు. ముస్లింలు తమ(పశ్చిమ) సంస్కృతిని, దాని విలువలను వ్యతిరేకించటమే కాక సహృదయంతో మిగిలిన సంస్కృతులతో కలిసిపోవడానికి చేసే ప్రయత్నాలకి గండికొట్టడం పశ్చిమదేశాలకి మింగుడు పడటంలేదు. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ రెండు విషయాలని(ఇవి భారతదేశ సమాజాన్ని, రాజకీయ వ్యవస్తని కూడా ఎప్పటినుంచో పీడిస్తున్నవి) గట్టిగా ఉద్ఘాటించాడు. 1) ఒకే న్యాయం మీద ఒకటే జాతి (ఇది భారత ప్రధానన్యాయస్థాన౦లో ప్రస్తుతం ఉత్సుకత రేపుతుంది!) 2) మతాధిపతుల అత్యున్నత అధికారాలను కత్తిరించడం. 

బ్రిటన్ మీద తీవ్రవాద దాడులు జరగొచ్చన్న గూడచారవర్గపు నివేదికల నేపధ్య౦లొ (బయట జరిగిన దాడులను లండన్ ఎప్పుడు పట్టిచ్చుకోలేదు!), కామెరూన్ తమ దేశం ఇకనుంచి  తీవ్రవాద భావజాలాలు ఉన్నవారిని కటినంగా శిక్షిస్తూ అలానే అలాంటి భావాలున్న సంస్థలకి నిధులు అందిస్తూ బ్రిటీష్ విలువలని కాలరాసే వాళ్ళని వదిలేదిలేదనీ తెగేసి మరీ చెప్పాడు. అలాగే విభిన్నమతాలూ తమతమ మతపద్దతులు మరియు సాంప్రదాయాల ప్రకారం ఉంటామంటే ఒప్పుకునేదిలేదని ఇకనుంచి వలసవచ్చినవారు/వచ్చేవారు ఇక్కడ ఉన్దేవారందరితో కలిసిపోవడం, ఇంగ్లీష్ మాట్లాడ్డం మరియు సమ సంస్కృతిని, దానికి తగ్గ విద్య పాటశాలల్లో నేర్చుకోవాలని కూడా చెప్పాడు.         

తమ రాజులు పెంచిపోషించిన పావురాలే ఇప్పడు బ్రిటన్ కి తిరిగివస్తున్నాయని కామెరూన్ ఇప్పటికైనా గుర్తించాలి. అతను మానవహక్కుల, మతమార్పిడుల సంఘాలకి వెళ్ళే నిధులని ఆపాలి లేకపోతే వారి తీవ్రవాదానికి బలయ్యే బ్రిటన్ని చూడాల్సివస్తుంది.

 http://saapaatusamagatulu.blogspot.in/2011_02_01_archive.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి