శాం హారిస్ రాసిన 'A Letter to Christian Nation" అనే పుస్తకాన్ని క్రైస్తవం ఇంత అమానుషమా? అనే పేరుతో తెలుగీకరించారు.
మతం మానవాళికి మత్తుమందన్నాడు కార్ల్ మార్క్స్. ఎవరికి వారు తమ మతం గొప్పదంటే తమ మతం గొప్పదంటూ యుద్ధాలు సృష్టిస్తున్నారు; మూఢనమ్మకాలకు తమ వంతు చేయూతనిస్తున్నారు.
ఈ భూమిపై జరిగే ప్రతి పనీ, దేవుని అనుజ్ఞతోనే జరుగుతుందని క్రిష్టియన్ల విశ్వాసం. 2004 సునామిలో కొన్ని వేల మంది పిల్లలు తల్లి తండ్రులను కోల్పోయి అనాధలయ్యారు. తమిళ్‌నాడు లోని వెళ్లంకన్ని మేరి మాత చర్చ్ కు, క్రిస్ట్మస్ పర్వదినాన వెళ్లిన భక్తులు, ఆ మరుసటి దినం వుదయాన చర్చ్ పక్కనే గల బీచ్ లో వాహ్యాళి కెళ్లిన సందర్భంలో, సునామి వాత పడి సుమారు 2000 మంది చనిపోయారు;120 వ్యాపార అంగళ్లు కొట్టుకు పోయాయి. చర్చ్ కు ఏమి కాలేదు. ఆసియ ఖండంలో సునామి దెబ్బకు ఎంతో మంది అనాధలయ్యారు. దేవుడే వుంటే ఇలాంటి అరాజకపు పని జరగనిస్తాడా?
ఏసు దయామయుడని క్రిస్టియన్ల విశ్వాసం. బైబుల్ లో పరమత సహనం: దేవుని యందు విశ్వాసం లేని వారిని చిత్రహింస చెయ్యాలని (సెయింట్ ఆగస్టీన్), చంపెయ్యాలని(అక్వినాస్) చెప్పారు.బైబుల్ బానిసత్వాన్ని, జంతుబలిని ప్రోత్సహిస్తుంది.ఆఫ్రికా ఖండం ఎయిడ్స్ తో సతమతమౌతుంటే, సహారా ఎడారి ప్రాంతంలో కండోం లు వాడవద్దన్న క్రైస్తవుల ప్రచారంతో, ఎయిడ్స్ అక్కడ ఒక పెద్ద సామాజిక సమస్యై కూర్చుంది. క్రిస్టియానిటి గర్భస్రావాన్ని అనుమతించక పోవటం తో , పెళ్లి కాని తల్లులు, పెక్కు సమస్యలు, కొన్ని దేశాలలో ఎదుర్కోవాల్సి వస్తుంది.బైబుల్ లో పరస్పర విరూద్ధాంశాలు చాల ఉన్నాయి. ఆ వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
బైబుల్ దేవవాక్కయితే, ఇందు లో గణితానికి సంబంధించి తప్పులెలా వుంటాయి? బైబుల్ సర్వస్వం కాదు.వైజ్ఞానిక విషయాలను చెప్పటంలో విఫలమయ్యింది. ఉదాహరణకు విద్యుత్, జీవాణువు (DNA), విశ్వ పరిమాణం, విశ్వ వయస్సు ఇంకా కాన్సర్ చికిత్స గురించి బైబుల్ చెప్పలేదు. ఈ విశాల జగత్తులో బాల్య మరణాలు అధికం. బాప్టిజం పుచ్చుకోకుండా చనిపోతున్న ఈ బాలలంతా, శాశ్వతంగా నరకంలో వుండి పోతారని,సెయింట్ ఆగస్టీన్ బాష్యం చెప్పారు.క్రైస్తవంలో,అనంత విస్ఫోటనాన్ని (Big Bang theory) అంగీకరించక, అంతా దేవుడి తెలివైన నమూనా (Intelligent Design) అని నమ్మి, ఆ సిద్ధాంత ప్రచారానికై, అశాస్త్రీయ పాఠ్య పుస్తకాలను పిల్లలపై రుద్దుతున్నారు.
మత సంఘర్షణలు: కాథొలిక్స్కు, ప్రొటెస్టంట్లకు పడదు.సున్నీ, షియాలకు పడదు.శైవులకూ, వైష్ణవులకూ పడదు. వీరంతా ఒకే మతంలో వుంటూ, ఆ మతానికి పరస్పర విరుద్ధ భాష్యాలు చెపుతూ కలహించు కొంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా భిన్న మతస్తులు పరస్పరం యుద్ధాలు చేసుకొంటున్నారు.
1775 లో అమెరికా లో బానిసత్వాన్ని తొలగించాలని కొందరు వాదిస్తే, అలా వాదించే వారు తమ సమయాన్ని వృధా చేసుకొంటున్నారని తలిచారు. ఈ మతం వలన మానవాళికి ఒరిగిందేమిటి? పరస్పర యుద్ధాలు, మనిషిని అంధ విశ్వాసాల లోకి నెట్టి వేయటం తప్ప. విద్య,శాస్త్రీయ దృక్పధం,హేతువాదం పెంపొందిన నాడు , దేవుడనే ఇప్పటి ప్రజల విశ్వాసం చూసి, భవిష్య మానవుడు నవ్వుకుంటాడు.
ఈ పుస్తకాన్ని e-book గా ఇస్తున్నాము.
http://www.esnips.com/doc/fb11c928-9223-4e15-9b84-80836c12e26e/Christianity-by-Sam
http://naprapamcham.blogspot.in/2008/12/blog-post_26.html

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి