తేదీ. 11-06-2008 న రాయగూడ - విజయవాడ పాసింజరు రైల్లొ ఒక హిందూ సన్యాసి ప్రయాణం చేస్తున్నాడు, అదే రైల్లో 4 గురు ఫాస్టర్లు, 38 మంది వైద్య విద్యార్తులు తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. అన్నవరం రాగానే కొంత మంది అటు వైపు తిరిగి సత్యనారాయణ స్వామీ దేవాలయం
వైపు తిరిగి నమస్కారం చేస్తుంటే, ఇంకా విగ్రహాల పట్లా భక్తి పోలేదా,
రాళ్ళకు నమస్కారం చేసే వారు ఇంకేమి మారతారు, బాగు పడతారు అన్నారు ఒక
పాస్టరు. కొద్ది సేపు తరువాత అక్కడ ఉన్న స్వామిని అవహేళన చేస్తూ, ఆయన
చేతికి ఉన్న దీక్షా సూత్రంను కించపరుస్తూ, మెడలో ఉన్న రుద్రాక్షలను అవమాన
పరుస్తూ మాట్లాడారట. ఈ విషయాన్ని పత్రికా కార్యాలయానికి వచ్చి వివరించారు
స్వామీజీ. స్వామీ ఈ విషయం మాకు చెప్పడమెందుకు మీరే అడ్డుకోపోయారా అంటే
నేను ఒక్కడినే ఉన్నందు వల్లా ఏమి అనలేక పోయానన్నారు. మరి తోటి ప్రయానికులను
కలుపుకోలేక పోయారా అంటే గొడవలు అవుతాయని భయపడ్డాను అన్నారు స్వామీజీ. మరి
ఎందుకండీ ఈ గొడవను మాకు చెపుతున్నారు అంటే ఆ స్వామీజీ ఈ సంఘటనను ఎక్కడో ఒక
చోట చెప్పుకొని బాధ తీర్చుకోవాలని మీకు చెప్పుతున్నాను అన్నారు. ఇదీ మన
సమాజం పరిస్థితి. రెండు లెంపలు కొట్టించుకొన్నాక ఇంకెక్కడా కొట్టించుకోవాలో
ఆలోసించండి.
http://janaspandana.blogspot.in/2008/07/blog-post_14.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి