(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్):క్రైస్తవ మతస్థుల ఓట్లు, వారిపెై పట్టు కోసం కాంగ్రెస్, వెైఎస్సార్ కాంగ్రెస్ మధ్య పెనగులాట మొదలయింది. దీనికోసం ఆ మత పెద్దలను మచ్చిక చేసుకునేందుకు రెండు పార్టీలకు చెందిన మత ప్రముఖులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియానే నిజమైన క్రైస్తవురాలని కాంగ్రెస్‌ను సమర్ధిస్తున్న ఒక వర్గం, వెైఎస్ కుటుంబం కోసం ప్రార్ధనలు చేయాలని మరో వర్గం ఎవరి వ్యూహాలలో వారు మునిగిపోయారు. దీనితో క్రైస్తవుల ఓట్లు ఎవరికి దక్కుతాయి? వారిపెై ఏ పార్టీ పట్టు సాధిస్తుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత రాజకీయ పరిణామాల నేపథ్యంలో కుల రాజకీయాలకు ప్రాధాన్యం పెరిగింది. దానికి మతం కూడా తోడవడంతో ఆయా వర్గాలు మద్దతు రాజకీయ పార్టీలకు కీలకం, అనివార్యంగా మారింది. 2009 ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీకి రెడ్డి కులం, క్రైస్తవ, ముస్లిం మతాలు దన్నుగా నిలిచాయి.
దానితో మహాకూటమి ఏర్పడినా కాంగ్రెస్‌ను ఓడించలేకపోయింది. దివంగత వెైఎస్ కుమారుడు జగన్ కాంగ్రెస్‌ను వీడి, వెైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో.. రాష్ట్రంలో కుల, మత రాజకీయ సమీకరణలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రెడ్డి, క్రైస్తవ దన్నుతో పాటు మీడియా అండ కూడా తోడవటంతో రాష్ట్రంలో వెైఎస్సార్ కాంగ్రెస్ హవా ఉంటుందని, ఆ పార్టీనే అధికారంలోకి వస్తుందన్న ప్రచారం విస్తృతమవుతోంది. గత ఉప ఎన్నికల్లో కూడా ఆ పార్టీ హవా కొనసాగడం ఆ ప్రచార భావనకు బలం చేకూరింది. దీనితో రంగంలోకి దిగిన కాంగ్రెస్ నాయకత్వం ఆ పార్టీ బలంపెై విశ్లేషణ ప్రారంభించింది. క్రైస్తవులు, ముస్లింలు వెైకాపా వెైపు మొగ్గు చూపితే జరగబోయే నష్టాన్ని గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం.. తొలి దశ ప్రత్యామ్నాయంగా క్రైస్తవులపెై దృష్టి సారించింది. జగన్ కుటుంబం క్రైస్తవాన్ని విశ్వసించడం, వెైఎస్‌ను క్రైస్తవులంతా సొంతం చేసుకోవడంతో నష్టనివారణకు దిద్దుబాటు చ ర్యలు ప్రారంభించింది. ఆ మేరకు జగన్‌కు దన్నుగా నిలుస్తున్న క్రైస్తవులను, తిరిగి తన వెైపు మళ్లించుకునేందుకు ఆ మత పెద్దలను రంగంలోకి దించింది.
ఇటీవల నగరానికి వచ్చిన జాతీయ మైనారిటీ కమిషన్ వెైస్ చెైర్మన్ సాంగ్లియానా క్రైస్తవులకు దిశానిర్దేశం చేసేందుకు ప్రయత్నించారు. క్రైస్తవులంతా కాంగ్రెస్‌కే ఓటు వేయాలని, బీజేపీని అధికారంలోకి రానీయకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుల మీద ఉందని పిలుపునిచ్చారు. అదేవిధంగా త్వరలో భారీ స్థాయిలో క్రైస్తవప్రార్ధన సభ నిర్వహించి అదే వేదికపెై క్రైస్తవులంతా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని పిలుపు ఇవ్వనుంది. నరేంద్ర మోడీ ప్రధాని మంత్రి అభ్యర్ధి అవుతే దేశంలోని క్రైస్తవులకు రక్షణ ఉండదన్న ప్రచారం కిందిస్థాయి నుంచీ మొదలుపెట్టాలని యోచిస్తున్నారు. అప్పుడు క్రైస్తవులు జగన్ కోణంలో కూడా మోడీ కోణంలోనే ఆలోచిస్తారని భావిస్తోంది. దానితోపాటు క్రిస్మస్ సందర్భంగా భారీగా విందు సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. వీటికంటే... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీనే అసలు సిసలు క్రైస్తవురాలని, జగన్ నిజమైన క్రైస్తవుడు కాదన్న మరో ప్రచారానికీ తెరలేపనుంది. జగన్ బావ , క్రైస్తవ మత ప్రచారకుడయిన బ్రదర్ అనిల్ ఇప్పటికే ఫాస్టర్లు, ఫాదర్లతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తూ, వారిని ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నందున దానికి ప్రత్యామ్నాయ చర్యలు ప్రారంభించనుంది.
ప్రధానంగా ఇప్పుడు ఉన్న క్రైస్తవ చానళ్లను వినియోగించుకోవాలని నిర్ణయించింది.
అటు వెైఎస్సార్ కాంగ్రెస్ క్రైస్తవులను ఆకర్షించే కార్యక్రమాన్ని వేగిరం చేస్తోంది. మూడురోజుల క్రితం సైదాబాద్, వారం క్రితం ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, 15 రోజుల క్రితం ఉప్పల్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఆలిండియా క్రిస్టియన్ కౌన్సిల్ స్థానిక శాఖలు మానవ హక్కుల అంశంపెై కార్యక్రమం నిర్వహించారు. అందులో క్రైస్తవులంతా వెైఎస్ కుటుంబం కోసం ప్రార్ధనలు చేయాలని, ఆయన కుటుంబానికి అండగా నిలవాలని అభ్యర్ధించారు. ఇలాంటి సమావేశాలనే ప్రతి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు.జగన్ బావ బ్రదర్ అనిల్‌కుమార్ ఈ వ్యవహారంలో సీరియస్‌గా అడుగులు వేస్తున్నారు. ఆయన క్రిస్మస్ సమావేశాల పేరిట ఇటీవల సికింద్రాబాద్‌లో ఒక భారీ సమావేశం నిర్వహించారు.
దానికి హారజయిన ఫాస్టర్లు, ఫాదర్లకు వెైఎస్ కుటుంబానికి అండగా నిలవాలని, ఆ మేరకు ప్రార్ధన చేయాలని, ఈ విషయాన్ని ప్రతి క్రైస్తవ కుటుంబానికి తెలియచేసేలా చూడాలని. ఆ మేరకు కావలసిన అన్ని వనరులను సమకూరుస్తానని హామీ ఇచ్చినట్లు క్రైస్తవ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా వివిధ మతాల నుంచి చేరిన వారిని ఆకర్షించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు.నిజానికి క్రైస్తవ మతంలో ఇప్పడు ఒక ఆసక్తికరమైన అంశం కనిపిస్తోంది. పాత తరానికి చెందిన ఫాస్టర్లు, ఫాదర్లు కాంగ్రెస్‌కు దన్నుగా నిలుస్తున్నారు. వీరంతా.. నరేంద్రమోడీ బీజేపీ ప్రధాని అభ్యర్థి అయితే క్రైస్తవులకు రక్షణ ఉండదని, కాంగ్రెస్ మాత్రమే క్రైస్తవులను రక్షిస్తుందని, సోనియాగాంధీ మాత్రమే నిజమైన క్రైస్తవురాలని, జగన్ మతం మార్చుకున్న కుటుంబం అనే భావనతో ఉన్నారు.
పెద్ద చర్చిలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న వీరి ఉపదేశాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మెజారిటీ శాతం క్రైస్తవులు వీరిని అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, కొత్తగా ఫాస్టర్లు, ఫాదర్లు అవుతున్న వారు మాత్రం జగన్ వెైపు చూస్తున్నారు. వీరిపెై వెైఎస్ ప్రభావం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. బ్రదర్ అనిల్‌కు ఉన్న పాపులారిటీ కూడా దీనికి అదనపు బలంగా మారింది. కొత్త తరం క్రైస్తవ పెద్దలు మాత్రం జగన్‌నే సమర్ధిస్తున్నారంటున్నారు.
http://news.suryaa.com/state/article-110382
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి