27, నవంబర్ 2012, మంగళవారం

కాంగ్రెస్‌ వెైపే క్రైస్తవులు


Posted Image


(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌):దేశంలోని క్రైస్తవులంతా కాంగ్రెస్‌ వెైపే ఉండేలా చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కూడా క్రైస్తవులు కాంగ్రెస్‌ వెైపు కొనసాగేలా ప్రణాళిక మొదలయింది. ప్రతి ఒక్క క్రైస్తవుడు కాంగ్రెస్‌ వెైపే ఉంటారని చాటేందుకు త్వరలో భారీ ప్రార్ధన సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరు గుతున్నాయి. ఆ మేరకు శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ సుదీ ర్ఘంగా జరిగిన కైస్తవుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ సందర్భంగా కొందరు జగన్‌ అనుకూల నినాదాలు చేయగా, మిగిలిన వారు వారిపెై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం... రాష్ట్రం, దేశంలోని ప్రతి ఒక్క క్రైస్తవుడు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలపాలని, బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ప్రతి ఒక్క క్రైస్త వుడి బాధ్యత అని తీర్మానం చేశారు.


శనివారం సాయంత్రం హైదరాబాద్‌ ఇందిరాపార్కు సమీపంలోని ఆంధ్ర క్రిస్టియన్‌ జుయలాజికల్‌ కాలేజీలో శిక్షణ పొందిన కొందరు పాస్టర్లకు సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ కార్య క్రమా నికి జాతీయ మైనారిటీ కమిషన్‌ వెైస్‌ చెైర్మన్‌ సాంగ్లియానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, దానికోసం ప్రతి ఒక్క క్రైస్తవుడు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించుకోవడం క్రైస్తవుల బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవలసిన అవసరం ఉందని, అందుకు కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలని కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే క్రైస్తవులకు రక్షణ ఉండదని, క్రైస్తవులకు రక్షణ కల్పించే శక్తి, క్రైస్తవుల సంక్షేమం గురించి ఆలోచించేది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు.ఈ క్రమంలో కొందరు క్రైస్తవ మత పెద్దలు రాష్ట్రంలో జగన్‌ పార్టీకి క్రైస్తవులు మద్దతు తెలపవలసిన అవసరం ఉందని వాదించడంతో గందరగోళం మొదలయింది. దానిని మెజారిటీ క్రైస్తవ మత పెద్దలు వ్యతిరేకించారు.


ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న సభ అయినందున, జగన్‌ గురించి మాట్లాడవద్దని నచ్చచెప్పారు. దీనితో జోక్యం చేసుకున్న సింగియానా రాష్ట్రంలో ఒక్క జగన్‌ ఏమీ చేయలేడని, ఇది దేశం మొత్తానికి సంబంధించిన వ్యవహారమని, జగన్‌కు ఓటు వేసినా క్రైస్తవులకు రక్షణ ఉండదని, అది కాంగ్రెస్‌కే సాధ్యమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్క క్రైస్తవులకూ నచ్చచెప్పాలని సూచించారు. ‘మీరెవరూ జగన్‌ వెైపు ఆలోచించవద్దు. మనకు రక్షణ కల్పించేది కాంగ్రెస్‌. మనకు రాష్ట్రం ముఖ్యం కాదు. దేశం ముఖ్యం. బీజేపీ అధికారంలోకి రాకుండా చూడటం మన కర్తవ్యం. క్రైస్తవులు రక్షణ, హక్కుల గురించి ఆలోచించాలి. దానికి కాంగ్రెస్‌ ఒక్కటే పరిష్కారం’ అని స్పష్టం చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ఆరాధన టీవీ అధినేత పాల్‌ పుల్ల దేవప్రియం ఇది రాజకీయాలకు సంబంధం లేని సభ అన్నారు.


జగన్‌ గురించి మాట్లాడటం సరెైంది కాదని చెప్పారు. మళ్లీ జోక్యం చేసుకున్న సింగియానా ‘పాల్‌.. మీరు ఈ విషయంలో క్రైస్తవ లోకానికి కాంగ్రెస్‌ అవసరాన్ని స్పష్టం చేయండి. క్రైస్తవుల హక్కుల పరిరక్షణ మన బాధ్యత’ అని సూచించారు. అయితే జగన్‌ మద్దతుదారులు కొందరు ‘సింగియానా మైనారిటీ కమిషన్‌ వెైస్‌ చెైర్మన్‌ హోదాలో వచ్చారా? లేక కాంగ్రెస్‌ పార్టీ నేతగా వచ్చారా? ’ ప్రశ్నించడంతో మిగిలిన క్రైస్తవ మత పెద్దలు వారితో వాగ్వాదానికి దిగారు. తమకు జగన్‌ కంటే కాంగ్రెస్‌ ముఖ్యమని, కాంగ్రెస్‌కు దశాబ్దాల నుంచి మద్దతునిస్తున్నామని, ఇప్పుడు జగన్‌ పార్టీ పెట్టినంతమాత్రాన క్రైస్తవులంతా ఆ పార్టీకి ఓటు వేయాలంటే ఎవరూ అంగీకరించరని, అయినా వెైఎస్‌ క్రైస్తవులకు ఏమి చేశారని వాదించారు.


విజయమ్మ పరమ పవిత్రమైన బెైబిల్‌ను ప్రతిచోటా తీసుకువెళుతున్నారని, చివరకు దేవాలయాల్లో తీర్ధప్రసాదాలు తీసుకునే సమయాల్లో కూడా బెైబిల్‌ను తీసుకువెళుతూ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో క్రైస్తవమత నేత మత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైస్తవులపెై దాడులు, వేధింపులు పెరిగిపోతున్నాయని, వాటి నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలని, కమిషన్‌ నిధులు విడుదల చేయాలని సూచించారు. ఇటీవల కరీంనగర్‌లో మత ప్రచారం చేస్తున్నారంటూ 9 మంది ఫాస్టర్లపెై అత్యాచారయత్నం కేసులు పెట్టారని ప్రస్తావించారు. వీటిపెై చట్టప్రకారం పోరాడేందుకు తగిన అధికారాలు ఇవ్వాలని కోరగా, దానికి స్పందించిన సింగియానా ఆ వినతిపత్రాన్ని పాల్‌కు ఇవ్వాలని ఆదేశించారు.


కాగా, కాంగ్రెస్‌ పార్టీ అవసరాన్ని క్రైస్తవులకు వివరించేందుకు త్వరలో రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రార్ధన సభ నిర్వహించాలని నిర్ణయించారుఆ సభ ద్వారా రాష్ట్రంలోని యావత్‌ క్రైస్తవ సమాజం కాంగ్రెస్‌కు మద్దతునిస్తుందని ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జగన్‌ను పట్టించుకోవద్దని, కాంగ్రెస్‌ ఒక్కటే క్రైస్తవులకు అండగా నిలుస్తుందని పిలుపునివ్వనున్నారు. అదేవిధంగా వచ్చే ఏడాది నవంబర్‌లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రార్ధన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదన్నదే ఏకైక అజెండాగా అడుగులు వేస్తున్నారు. 


 http://www.nandamurifans.com/forum/index.php?/topic/199966-cong-matha-rajakeeyam/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి