27, నవంబర్ 2012, మంగళవారం

మూఢనమ్మకాలపై స్వారీ చేస్తున్న క్రైస్తవ అధిపతులు


ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో క్రైస్తవ మతస్తులున్నారు. వీరిలో వివిధ శాఖలున్నాయి తమ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తూ పోతున్నారు. ఇందులో కేతలిక్ అధిపతి పోపు నుండి వివిధ శాఖల మఠాధిపతులు, తమ శక్తి యుక్తులను వినియోగించి జనంలోని నమ్మకాలు పోకుండా కాపాడుకుంటున్నారు. నిజం చెప్పటం వారికి హానికరం కనుక అబద్దాలకు తేనే పూసి జాగ్రత్తగా అద్భుతాల పేరిట కట్టుదిట్టంగా మత వ్యాపారం చేస్తున్నారు.

ఇటీవల నేను అమెరికా పర్యటించినప్పుడు శాస్త్రీయ పరిశీలనా కేంద్రానికి సంబంధించిన మజీషియన్ జో నికిల్ తన పరిశోధనలు, పరిశీలనలు నాతో చెప్పాడు. ఎన్నో ఆశక్తికర వాస్తవాలు వెల్లడించాడు. ఆయన రచనలు కంటకీ యూనివర్సిటీవారు ప్రచురించారు కూడా.
 

రెండు వేల సంవత్సరాల క్రితం చనిపోయినట్లు చెప్పబడుతున్న క్రీసు అవశేషాలు దొరికినట్లు వాటిని స్వేకరించి వివిధ ప్రాంతాల్లో వివిధ దేవాలయాల్లో అట్టిపెట్టి భక్తులను ఆకర్షిస్తున్నారు. వీటిని సందేహించి ప్రశ్నించినవారిని దగ్గరకు రానివ్వటం లేదు. అలా రానిచ్చిన చోట అవి బోగస్ అని తేలిపోయింది. అందువల్లన జాగ్రత్త వహిస్తున్నారు. ఇలా స్వేకరించిన వాటిలో క్రీస్తునుండి కారిన రక్తం కూడా పాత్రలో పెట్టి పూజిస్తున్నారు. అది ఇప్పటికీ ఇంకా ఎర్రగానే ఉన్నట్లు ప్రదర్శించటం పరాకాష్ట. రక్తం కాసేపటికే రంగు మారి ఊదాగా ఉండి తరువాత నల్లగా అయిపోతుంది. కానీ వీరి పదర్శనలో మాత్రం అది ఇంకా ఎర్రగానే ఉండటం విశేషం. ఇలాంటి అనేక విచిత్ర పద్ధతులు ఈ క్రైస్తవులు చేపట్టి యాత్రా స్థలాలుగా మార్చి భక్తులను ఆకట్టుకుని విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అవన్నీ వివరంగా స్వేకరించి, వివిధ ప్రాంతాలకు పర్యటించి వాటిని శాస్త్రీయంగా పరిశీలించి జో నికిల్ విషయాలను బయటపెట్టాడు. అవి క్రమంగా వెల్లడిస్తూ పోతాం. క్రీస్తు అవశేషాలే కాక మేరీ మాత, మగ్ధలేనా అవశేషాలు కూడా ఉన్నట్లు చూపుతున్నారు. 

 http://naprapamcham.blogspot.in/2009/07/blog-post_24.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి