శ్రీ అరవిందులు |
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన రోజున, శ్రీ అరవిందుల సందేశం నుంచి... (ఆగష్టు 15 వారి జన్మదినం కూడా)
"భారతదేశం స్వతంత్రమయింది, కాని సమగ్రతను పోగొట్టుకున్నది. బీటువారిన, వికలమైన స్వాతంత్ర్యం మాత్రమే సిద్ధించింది. 'హిందువులూ, ముస్లిములూ' అంటూ రగిలిన పాతకాలపు మత విభేదాలు కరుడుగట్టి దేశాన్ని విభజింపచేసి, శాశ్వత రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ పరిణామం శాశ్వతం కాదనీ, ఇదొక తాత్కాలిక పరిష్కారం మాత్రమేననీ కాంగ్రేసూ, జాతీ గ్రహిస్తాయని ఆశించాలి. ఇదే శాశ్వతమైతే భారతదేశం బలహీనమవుతుంది. అంతఃకలహాలు సంభవించవచ్చు, ఏదో కొత్త దాడి, విదేశీ దురాక్రమణ కూడా సంభవించవచ్చు. ఈ ఉద్రిక్తత క్రమంగా తగ్గటం వల్ల శాంతి, సుహృద్భావము అవసరమన్న అవగాహన పెరగటం వల్ల, అవసరమైతే ఒక ఒడంబడిక ద్వారానైనా సరే, కలిసి పనిచేయవలసిన నిత్యావసరం రావటం వల్ల, దేశ విభజన అంతమవాలి. ఈ కారణాల వల్ల సమైక్యత ఏదో ఒక రూపంలో రావచ్చు. ఆ రూపానికి ఆచరణ యోగ్యతే ఉంటుంది. కాని అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యముండదు. ఏమయినా, ఎట్లాగైనా దేశవిభజన పోతుంది, పోవాలి. పోకపోతే భారతదేశ భవిష్యత్తు బాగా దెబ్బతింటుంది. విఫలం కూడా కావచ్చు. అది జరగకూడదు".
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి