25, ఫిబ్రవరి 2013, సోమవారం

అక్బర్ ఆశించాడు మఖ్బూల్ నెరవేర్చాడు : దిల్ సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ ల లో అనుమానితుడు మజ్లిస్ నాయకుడు

 అక్బర్ ఆశించాడా? లేక శాశించాడా? 
ఇది తప్పకుండా మజ్లిస్ యొక్క మంత్రాంగమేనా? దీరి వెనుక వారి యంత్రాంగమూ ఉందా?

మఖ్బూల్..
మజ్లీస్ నాయకుడు..

ఇప్పుడేమంటావు self-styled secular వాదీ..?
...
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన మఖ్బూల్ ఆంధ్రప్రదేశ్‌లో పలు నేరాలకు పాల్పడ్డాడు. వరంగల్ జిల్లాకు చెందిన అజామ్ గౌరి..ఇతడు 2000లో పోలీసు ఎన్‌కౌంటర్లో మరణించాడు. అతనితో కలిసి నేర చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మఖ్బూల్, అజామ్ గౌరి, రోషన్ బేగ్‌లు కలిసి 1999లో మంచిర్యాలలో ఐఎంఎంఎం (ఇండియన్ ముస్లిమ్ మహమ్మదీన్ ముజాహిదీన్) అనే ఉగ్రవాద సంస్థను నెలకొల్పారు. అత్యాధునిక పేలుడు పదార్థాలు ఎలా తయారు చేయాలో అజామ్ గౌరీనే మఖ్బూల్‌కు నేర్పించాడు. అజామ్ గౌరీ నివాసంలో 1998లో బాంబులు తయారు చేస్తుండగా ఒకటి ఇంట్లోనే పేలిపోయింది. అప్పట్లోనే వీరిపై కేసు నమోదైంది. 1999 బోధన్ లో కృష్ణమూర్తి హత్య కేసు..ఆ తరువాత ఉప్పల్ లో మసీదు స్థలం ఆక్రమించుకున్నాడని ; దేవెంద్ర అనే వ్యక్తిని కాల్చి చంపడం..అఫ్జల్ గంజ్ నగల దుకాణంలో మహావీర్ ప్రసాద్ ని హత్య చేయడం..అట్లాగే లాల్ దర్వాజా కాకతీయ హోటల్, నాంధేడ్ శారదా థియేటర్, సికింద్రబాద్ లాంభా థియేటర్ ల పేలుళ్ళ కేసుల్లో నింధితుడు.
...
ఢిల్లీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కలిసి గత ఏడాది అక్టోబర్ 23న మఖ్బూల్ ని హైదరాబాద్‌లోనే అరెస్టు చేశారు. అనంతరం ఢిల్లీకి తీసుకెళ్లారు. అతడిని విచారించినప్పుడు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అందులే వెల్లడించిన సమాచారం ప్రకారం..'' బోధన్ 1999 హత్య కేసులో జీవిత ఖైదు పడడమే కాకుండా పలు ఉగ్రవాద దాడుల కేసుల్లోనూ నిందితుడుగా ఉన్న మఖ్బూల్... అసలు శిక్ష తగ్గించుకుని 2009 లో బయటకు రావడం ఆ వెంటనే అతడు మజ్లిస్/MIM పార్టీలో చేరాడు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ జిల్లా మజ్లీస్/MIM పార్టీ అధ్యక్షుడిగా నియమితుడం, వెనక రాజకీయ కారణాలున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం హైద్రాబాద్ మజ్లిస్ పార్టీకి చెందిన అబ్దుల్ రావూఫ్ కీ సన్నిహితుడు. ఈ అబ్దుల్ రావూఫ్, నసీరుద్దిన్ లు, గుజరాత్ హోం మంత్రి హిరేన్ పాండ్య హత్యకేసులో నింధితులు. మఖ్బూల్ మహారాష్ట్రలోని ధర్మాబాద్ జిల్లా మజ్లీస్/MIM పార్టీ అధ్యక్షుడిగా రావూఫ్ నీయమించాడు...''
...
అయ్యా..అసదుద్దీన్...దిల్సుఖ్ నగర్ లో జరిగిన పేలుళ్ళు దేశం పై జరిగిన పేలుళ్ళుగా ప్రకటించి, జాతీయ భావాలున్న వాడిగా నటించావు. కాని లభించిన వివరాల ప్రకారం నీ పార్టీ/MIM ధర్మాబాద్ జిల్లా అధ్యక్షుడు..పేరు మోసిన ఇస్లామిక్ ఉగ్రవాది అయిన మఖ్బూల్ కారకుడు. ఇప్పుడేమంటావు self-styled secular వాదీ..?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి