20, ఏప్రిల్ 2012, శుక్రవారం

రక్తపాత రహిత కుట్ర !



నా దేవుణ్ణి నేను పూజించుకుంటున్నాను. నా మతాచారాలను, అనూచానంగా వస్తూ ఉన్న సంప్రదాయాలను నేను పాటిస్తున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చి, మీ ఆచారాలు తప్పు, మీ దేవుడు మిధ్య, మా దేవుడు గొప్ప, ఈ విగ్రహాలేంటి, ఆ బొట్టేంటి ఇవన్నీ తప్పు అని చెబితే ఎలా ఉంటుంది? 'ఇక ఈ అనాచారాలను ఆపేసి, మా మతంలో చేరిపో, ఇదిగో నీకీ లాభాలు కలుగుతాయి' అని ఊదరగొడితే ఎలా ఉంటుంది. 'పోనీలే, తన మతాన్ని తాను ప్రచారం చేసుకుంటున్నాడు, మనకెందుకులే' అని ఊరుకోగలమా? నా దేవుణ్ణి కించపరచకుండా తమ దేవుడి గురించి చెప్పుకుంటే అలాగే అనుకోవచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నది అది కాదే! నాగప్రసాదు గారి విషయంలో జరిగిందీ అది కాదు.

నేనూ
మత మార్పిడి ప్రచారకులను చూసాను, చూసిన వాళ్ళు చెప్పగా విన్నాను.. ఏ ఒక్ఖరు కూడా తన మతంలోని మంచి వరకు చెప్పి ఊరుకోలేదు. ఎవరూ కూడా నా మతాన్ని విమర్శించకుండా తమ ప్రచారాన్ని ముగించలేదు. నా మతంలోని తప్పులను ఎంచకుండా ఎవరూ ఊరుకోలేదు. అసలు అలాంటివాళ్ళు అసలే ఉండరని అనను. ఉంటేగింటే ఖచ్చితంగా వాళ్ళు గంజాయి వనంలో తులసిమొక్కలని మాత్రం చెప్పగలను.

అందరినీ గౌరవించాలి -అది ధర్మం. కానీ నన్ను తక్కువగా చూసేవాణ్ణి, తేలిక చేసేవాణ్ణి నేనెలా గౌరవించను!? నా దగ్గరకొచ్చి తన దేవుడి గురించి చెప్పి, నా దేవుణ్ణి విమర్శించి, నా ఆచారాలను విమర్శించి, 'నువ్వు మతం మార్చుకుని నా మతంలోకి వచ్చేయ్' అని చెప్పేవాడు సరైన వాడెలా అవుతాడసలు ? 'ఇదిగో మీ మతంలో ఇలా ఉంది, కానీ మా మతంలోనైతే ఇది ఇలా భలేగా ఉంటది' అని చెప్పేవాడు మంచిమాటలు చెబుతున్నట్టా ? అలాంటివాళ్ళను ఎదిరించడం తప్పా? నా మతమంటే నా సంస్కృతి, నా వారసత్వం! తన మతం గొప్పదనం చెప్పుకోడం కోసం, నా సంస్కృతిని విమర్శిస్తే నేను ఊరుకోలేను గదా!


~~~~~~~~~~~~~
వాళ్ళు చాపకింద నీరులాగా మార్పిళ్ళు చేస్తూంటారు. ప్రచారాలు, ప్రలోభాలు, డబ్బులు,... ఇవీ, ఇలాంటివీ వీళ్ళ ఆయుధాలు. ఈ ఆయుధాలతో కనిపించని హింస సృష్టిస్తున్నారు. సమాజంలో కొత్త విభజనలు తెస్తున్నారు. రక్తపాత రహిత కుట్ర ఇది (ఇలా మార్పిళ్ళు చెయ్యకుండా చట్టాలు తేవడం తప్పని పోపు మనకు చెప్పిన నీతుల గురించి గతంలో రాసాను.). బలవంతపు మార్పిళ్ళకూ, వీటికీ తేడా లేదు. ఈ మార్పిళ్ళు అనేక అనర్ధాలకు దారితీయడం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నో అనర్ధాలు జరిగాయి కూడా! ఇవి సమాజంలో ఉద్రిక్తతలకు, హింసకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. మత మార్పిడిని, అందుకోసం చేసే ప్రచారాలను నిషేధించాలి.

 http://chaduvari.blogspot.in/2008/10/blog-post.html

ఎన్నో శతాబ్దాల తరువాత ఆంధ్రదేశంలో అతిరాత్రం!



 

అశ్వమేధాది యాగాలు చేయటం కలియుగంలో కష్టసాధ్యం. చేయదగినది అతిరాత్రం మాత్రమేనని పెద్దలమాట. కలియుగం ప్రారంభమయిన తర్వాత ఈ యాగాన్ని కేరళలో మాత్రమే నిర్వర్తించినట్టు కనబడుతోంది. తెలుగునాట మహాభారత రచనకు ముందు తిక్కన చేశారని చెబుతారు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రదేశానికి అటువంటి వైభోగం పట్టబోతోంది. తెలుగువారందరికీ… ఎన్నో శతాబ్దాల తరవాత జరుగబోయే అతిరాత్రం చూసే అదృష్టం లభించబోతోంది.

 భారతీయులు చాలా అరుదుగా చేసిన యాగాలలో అతిరాత్రం ఒకటి. దీనికే సర్వస్తోమం, జ్యోతిష్టోమం, అగ్నిచయనం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ అగ్నిచయనాన్ని ఉత్కృష్ట సోమయాగం అంటారు. ప్రతి యజ్ఞంలోనూ ప్రధానంగా వాడే హోమద్రవ్యం సోమరసం. సోమలతలోని అన్ని భాగాలను యజ్ఞంలో ఉపయోగిస్తారు. దాని రసాన్ని హోమద్రవ్యంగా ఉపయోగించటం మాత్రమే కాదు, యజ్ఞప్రసాదంగా కూడా స్వీకరిస్తారు. సోమరసాన్ని తాగినవారిని అంటే యజ్ఞం చేసినవారిని సోమపాయి, సోమపీధి అంటారు. వీరు సోమయాజిగా వ్యవహరింపబడతారు.

 

అన్ని యాగాలలోనూ ప్రధానంగా ఆరాధించబడే ఇంద్రునికి ప్రీతిపాత్రమైనది సోమలత. ఇది హిమాలయాలలో మాత్రమే లభిస్తుంది. అయితే ఇది దక్కను కర్ణాటక, కొంకణ ప్రాంతాల్లోని ఎత్తయిన పర్వతాల మీద ఉంటుందంటారు. ఇది అసలైనది కాదని చాలామంది అభిప్రాయం. సోముడు అంటే చంద్రుడు. సోమలత అంటే చంద్రసంబంధమైన తీగ. చంద్రుని శక్తి గ్రహించి ప్రసాదించగలది. చంద్రుడు పాలసముద్రంలో అమృతంతో ఉద్భవించాడు. అమృతతత్త్వాన్ని తనలో కలిగి ఉన్నవాడు కనుక సోమలత సాక్షాత్తు భూమిపైకి దిగివచ్చిన అమృతమే! సోమలతకు, చంద్రునికి ఉన్న సంబంధం ప్రత్యక్షంగానే కనపడుతుంది. 
ఈ తీగ ఎదుగుదల చంద్రుని కళలను అనుసరించి ఉంటుంది. అమావాస్యనాడు తీగలపై ఒక్క ఆకు కూడా లేకుండా అన్నీ రాలిపోతాయి. మరునాటి నుంచి చిగుళ్లు రావటం మొదలై పూర్ణిమనాటికి తీగంతా ఆకులతో కళకళలాడుతుంది. మరుసటి రోజు నుంచి ఆకులు రాలటం ప్రారంభమై, అమావాస్యనాటికి బోసిపోయి, తీగలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఈ సోమలతను సేకరించడానికి ఎన్నో నియమనిబంధనలు ఉన్నాయి. 
సోమలత ప్రధాన ద్రవ్యంగా ఉన్న యాగం కనుక దీనికి ‘ఉత్కృష్ట సోమయాగం’ అనే పేరు సార్థకం. యజ్ఞమ్ అంటే పరహితార్థం చేసే పని అని అర్థం. అందరికీ మేలు జరిగినప్పుడు, చేసిన వారికి కూడా మేలు జరుగుతుంది కదా! అందుకే పూర్వం రాజులు యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరిగా చేసేవారు. వాటిలో శ్రేష్ఠమైనది అశ్వమేధయాగం. ఈ యాగంలో ప్రధానమైన మూడు రోజులలో మూడవనాడు అతిరాత్రం నిర్వహిస్తారు కనుక ఆ రోజును అతిరాత్రం పేరుతోనే పిలుస్తారు.

 

ప్రతియజ్ఞంలోనూ మొట్టమొదట చేయవలసింది అగ్నిష్టోమమ్. ఇది మొదటిమెట్టు వంటిది. ఇది చేస్తే సోమయాజి అయి, ఇతరయాగాలు చేసే అర్హత లభిస్తుంది. ఆరవస్థాయికి చెందింది అతిరాత్రం. ‘అతిశయతారాత్రిః ఇతి అతిరాత్రం’ అని నిర్వచనం. అంటే రాత్రిని జయించినది అని అర్థం. ఎందుకంటే ఈ అతిరాత్రంలో మాత్రమే అర్ధరాత్రి కొన్ని శస్త్రాలు పఠిస్తారు. 

ఒక మంత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాక భిన్నంగా ప్రయోగించే రీతికి శస్త్రం అని పేరు. ఏ క్రతువైనా ఉదయం, సాయంత్రం మాత్రమే చేస్తారు. మిట్టమధ్యాహ్నం కానీ అర్ధరాత్రి కానీ దైవకార్యాలు చేయరు. చేయరాదు. అలా చేస్తే వైపరీత్యాలు కలుగుతాయి. కాని అతిరాత్రంలో మాత్రం అర్ధరాత్రి చేయటం, శస్త్రప్రయోగం అనే ప్రత్యేకతలు కనపడతాయి. కనుక ఈ యాగానికి రాత్రిని జయించింది అనే పేరు సార్థకం. రాత్రి… చీకటికి, అజ్ఞానానికి, బాధకి, దుఃఖానికి సంకేతం. ఇటువంటి ప్రతికూల భావాలన్నిటినీ జయించిందనే అర్థం కూడా సరిపోతుంది. 
ఈ యాగానికి ఉపయోగించే సంబారాలన్నీ ప్రకృతి సిద్ధమైనవి. ఇవన్నీ పంచభూతాలలో త్వరగా కలిసిపోయేవి, పర్యావరణానికి హాని కలిగించనివి, కాలుష్యాన్ని పోగొట్టగలిగినవి మాత్రమే. వాటిని సేకరించడానికి కూడా తిథివారనక్షత్రాలను, ముహూర్తాన్ని చూడాలి. 

అగ్నిని రాజేయడానికి ఆరణిని మాత్రమే ఉపయోగిస్తారు. యాగశాలను… వాసాలు, తాటాకులతో మాత్రమే నిర్మిస్తారు. పాత్రలు వీలైనంతవరకు మట్టితో చేసినవే వాడతారు. సృక్స్రువాలు కొయ్యతో చేసినవే ఉంటాయి. యాగం పూర్తయ్యాక యాగశాలను అగ్నికి ఆహుతి చేసేటప్పుడు పూర్తిగా ఆహుతి అయిపోవాలి. ఇది శ్రౌతక్రతువు. దీనిని ఆచరణలో పెట్టడానికి అభ్యాసం ఉండాలి. 

 
పునీత స్థలం భద్రగిరి…

భద్రాచలం శ్రీరాముడు పాదచారియై నడయాడి పవిత్రమొనర్చిన దండకారణ్యసీమ. రెండవది పావన గోదావరీ తీరం. మూడవది భద్రుడు తపస్సు చేసి, రాముని మెప్పించి, ప్రసన్నం చేసుకున్న మహిమాన్విత క్షేత్రం. (భద్రాచలం అంటే స్థిరమైన, భద్రతగల కొండ అని అర్థం). నాలుగవది భద్రాచలం పంచారామ క్షేత్రం. (ఐదుచోట్ల ఐదు భిన్న భావాలను వ్యక్తీకరిస్తూ రాముడు వెలసిన పునీత స్థలం). ఇటువంటి ప్రదేశంలో చేసిన ఏ పని అయినా, ఎన్నోరెట్ల ఫలితాలను ఇస్తుంది. 

ఈ యాగంలో మరొక విశిష్టత ఉంది. యాగం చేయబోయే చోటు… జటాయు మంటపానికి వెనుకభాగంలో ఉంది. జటాయువు గ్రద్దజాతికి చెందినది. రామునికి సహాయం చేయటంలో ప్రాణాలను కోల్పోయింది. అదేజాతికి చెందిన గరుత్మంతుడు యజ్ఞపురుషుడైన విష్ణుమూర్తి వాహనం.

 

అంటే విష్ణువు రావాలంటే గరుడుని ఆగమనం తప్పనిసరి. విష్ణువు గరుడారూఢుడు కనుక, ఈ యజ్ఞంలో యజ్ఞకుండానికి గరుత్మంతుని ఆకారం వచ్చే విధంగా ఇటుకలను పేర్చుతారు. దీనిని ‘శ్యేన చితి’ అంటారు. (శ్యేనమంటే గ్రద్ద). యజ్ఞం పూర్తయిన తరువాత యజ్ఞశాలను దగ్ధం చేసే సమయంలో, యజ్ఞం సఫలమయిందనటానికి నిదర్శనంగా ఒక్క గ్రద్ద ఆ మంటల మీద ప్రదక్షిణంగా తిరుగుతుంది. ఇలా జరగటం యజ్ఞం యొక్క ప్రామాణికతకు నిదర్శనం.

కొన్ని నంబూద్రి కుటుంబాల వారు కేరళలో అతిరాత్రానికి సంబంధించిన విజ్ఞానాన్ని తరతరాలుగా రక్షించుకుంటూ వస్తున్నారు. ఎప్పుడో శాలిశకం 1901లో అతిరాత్రం చేశా రట. తరువాత క్రీ.శ.1918లో , 1956లో, 1975లో, 2011 లో అతిరాత్రాన్ని నిర్వహించారు. మొదటిసారిగా తెలుగునేల మీద చెయ్యమని భద్రాద్రిరాముడి ఆజ్ఞ అయ్యింది.

ఏ యజ్ఞానికైనా ఫలం… విశ్వశాంతి, లోకకల్యాణం, వాటికి అద్భుతమైన అనుభూతులు, ఆత్మౌన్నత్యం కూడా చేరుతాయి. ఎన్నో శతాబ్దాల తరువాత ఆంధ్రదేశంలో అతిరాత్రం జరుగబోతోంది. తమ జీవితకాలంలో ఇటువంటి మంచి అవకాశం రావటం ఎన్నోజన్మల పుణ్యఫలం. 

సర్వేజనాః సుఖినోభవంతు

 - డా. పి. అనంతలక్ష్మి

 http://pravasarajyam.com/1/devotional/2012/04/20/athirathram-starts-from-tomorrow/


వేదాంత విప్లవమూర్తి స్వామి వివేకానంద ! 150వ జయంతి ప్రత్యెక వ్యాసం





భారత ఉపఖండం చీకటి ఖండమైన కాలమది. బ్రిటిష్ పాలనలో 
భారతీయులు బానిస మనస్కులై నిర్వీర్యమైపోతున్న యుగమది. 
మూఢాచారాలే మతంగా, తంత్రమూ మంత్రమే మోక్షంగా,
సాటివారిని హీనంగా చూడటమే కులంగా, మెట్టవేదాంతమే
తత్త్వశాస్త్రంగా, పాశ్చాత్యులే గొప్పవారుగా చలామణీ అవుతున్న
శతాబ్దమది. అలాంటి స్తబ్దమైన సంఘాన్ని తట్టిలేపిన వైతాళికుడు
వివేకానందుడు.
భారతదేశాన్ని ప్రేమించడమెలాగో, ఉద్ధరించడమెలాగో నేర్పిన మహనీయుడు. ‘‘ఓ తేజస్వరూపా! జననమరణాలకు అతీతుడా! మేలుకో. బలహీనతల్ని తొలగించుకో. పౌరుషాన్ని ప్రసాదించుకో. మనిషిగా మసలుకో. లే. లెమ్ము’’ అంటూ యువతను జాగృతం చేసిన వేదాంతభేరి స్వామి వివేకానంద!
1863 జనవరి 12, సోమవారం! ఉదయం 6 గంటల 49 నిమిషాలు. కలకత్తాలో భువనేశ్వరీదేవి పండంటి మగబిడ్డను కన్నది. తండ్రి విశ్వనాథ్ దత్తా ఆ పిల్లాడికి నరేంద్రనాథ్ అనే పేరు పెట్టారు. నరేన్ అల్లరి గడుగ్గాయి. గిన్నెలు, చెట్లు, రాళ్లు - అన్నీ ఆ చిచ్చరపిడుగుకి ఆటవస్తువులే!
పిల్లల్లోని అంతర్గత అనంత శక్తే అల్లరిగా ఎగదన్నుకొస్తుంది. ఆ దివ్యశక్తిని వెలికి తీయడమెలాగో భువనేశ్వరికి తెలుసు. రెచ్చిపోయే నరేన్ నెత్తిపై శివ శివ అంటూ బిందెడు నీళ్లు గుమ్మరించేది. బుద్ధిగా ఆ పిల్లాడిని కూచోబెట్టేది. రామాయణ భారత శ్లోకాల్ని వల్లె వేయించేది. అందుకే ‘‘నాలోని మానసిక అభ్యుదయానికి, ధార్మిక శక్తికి, సంస్కారానికి మా అమ్మే కారణం’’ అనేవారు స్వామి వివేకానంద.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్ నెలకొల్పిన బడిలో 1870లో నరేన్ ఒకటో తరగతిలో చేరాడు. చిన్నప్పుడే వేణీగుప్త, ఉస్తాద్ అహ్మద్‌ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. హార్మోనియం, ఫిడేల్‌పై పట్టు సాధించాడు. న్యాయవాది అయిన విశ్వనాథ్ దత్తా తన కొడుక్కి న్యాయశాస్త్రం, సైన్సు పుస్తకాల్ని ఉద్దేశపూర్వకంగా ఇస్తూండేవారు. ఉపనిషత్తుల్ని, పురాణాల్ని చదివిస్తూండేవారు. ఆయా విషయాలపై కావాలని వాదనపెట్టి చర్చిస్తూండేవారు.
ఏ విషయాన్నయినా తర్కంతో హేతుబద్ధంగా పరిశీలించే శక్తి నరేన్‌కి అలవడింది ఈ శిక్షణ వల్లనే!
చిన్నప్పటినుంచీ నరేంద్రుడికి ధ్యానం ఓ నిత్యక్రీడ. పద్మాసనం వేసుకుని కళ్లు మూసుకుని ధ్యానంలోకి వెళ్లిపోతే సమస్త ప్రపంచాన్నీ మరచిపోయేవాడు. అత్యంత తీక్షణమైన ఏకాగ్రత వివేకానందుడికి అబ్బింది ఈ ధ్యానం వల్లనే.
ఏవేవో ప్రశ్నలు...
1879లో 16 యేళ్ల నరేన్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు.
రోజూ వ్యాయామం చేసేవాడు. వస్తాదులా ఉండేవాడు. కర్రసాము, గుర్రపుస్వారీ, కుస్తీ, పడవ నడపడం, పరిగెత్తడం, ఈతకొట్టడం... ఒకటా రెండా అన్నింటిలోనూ ప్రవేశించడం, అంతు చూడటం... ఇదీ వరస! చివరకు పాకశాస్త్రంలో కూడా గరిటె తిప్పిన చెయ్యి నరేన్‌ది!
మరోపక్క హెర్బర్ట్ స్పెన్సర్, జాన్ స్టువర్ట్ మిల్, అగస్టె కామ్టె, అరిస్టాటిల్, డార్విన్ లాంటి పాశ్చాత్యుల గ్రంథాల్ని అధ్యయనం చేశాడు. దేశ చరిత్రల్ని, ప్రాక్పశ్చిమ తత్త్వశాస్త్రాల్ని, తర్కం, క్రైస్తవ మహ్మదీయ బౌద్ధమత గ్రంథాల్ని ఆకళించుకున్నాడు. వివిధ దేశాల్లో వివిధ పరిస్థితుల్లో మానవ సమాజాలు ఎలా పరిణామం చెందాయో అవగతం చేసుకున్నాడు.
అయితే భారతీయ సంస్కృతి, మతం, తత్త్వ చింతనలపై మమకారం ఓ వైపు; ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, హేతువాదం పట్ల మక్కువ మరోవైపు - ఈ రెంటి మధ్య నలిగి మధనపడ్డాడు. భగవంతుడు లేడనీ భౌతిక దృగ్విషయాలే సత్యాలనీ చెప్పే పాశ్చాత్య సైన్సులో లోపం ఉందని హృదయానికి అనిపించేది. సనాతన భారతీయ భావజాలం భౌతిక దృష్టి కొరవడి వక్రీకరణకు గురైందని బుద్ధికి తోచింది.
తత్ఫలితంగా ఏవో ఏవేవో ప్రశ్నలతో వేగిపోయేవాడు. ఏవో ఏవేవో ఘోషలతో ఊగిపోయేవాడు. సమాధానాల కోసం బ్రహ్మ సమాజంలో చేరాడు. అయినా సంతృప్తి లేదు.
నిర్వికల్ప సమాధి...
1881లో స్కాటిష్ చర్చి కాలేజీలో బీఏలో చేరాడు నరేంద్రుడు.
ఓ రోజు క్లాసులో ప్రిన్సిపాల్ విలియం హేస్టీ - వర్డ్స్‌వర్త్ కవిత ‘ది ఎక్స్‌కర్షన్’ గురించి చెబుతున్నారు. ఆ మాటల్లో ‘సమాధి అవస్థ అనే ఆత్మానందాన్ని అనుభవిస్తున్నది తనకు తెలిసి రామకృష్ణ పరమహంస’ అని హేస్టీ అన్నారు. నరేన్‌కి మెరుపులాంటి ఆలోచనొచ్చింది. వెంటనే కలకత్తాకి దగ్గర్లోని దక్షిణేశ్వరం వెళ్లాడు.
ఉసిరిచెట్టు కింద మాసిన గడ్డంతో ఒంటిపై ఒక్క అంగవస్త్రం తప్ప మరే ఆచ్ఛాదనా లేని అలౌకిక ధ్యానముద్రలో పరమహంస... దివ్యోన్మాదంతో కాళికాదేవి సాక్షాత్కారం కోసం నేలపై దొర్లి ఏడ్చి చివరకు భగవద్దర్శనం పొందిన పరమహంస... ప్రతిరోజూ గంగలో వెండి నాణాల్ని విసిరేసి ధనవ్యామోహం వదిలించుకున్న పరమహంస... బ్రాహ్మణుడే అయినా పంచముల ఇళ్లకు వెళ్లి, వారు చూడని సమయాల్లో వారి పాయిఖానాల్ని వొట్టి చేతులతో శుభ్రం చేసిన పరమహంస... సన్నిధిలోకి అడుగుపెట్టాడు నరేన్.
                                              
ఆయన పాడమంటే - కనులు మూసుకుని బాహ్య ప్రపంచాన్ని మరచిపోయి తన్మయీభావంతో గాన ధ్యాన సమాధ్యవస్థలో ‘‘మన్ చలో నిజనికేతన్’’ (మనసా! మన చోటుకి వెళ్లిపోదాం) అన్న కీర్తన పాడాడు. పాట వింటూ పరవశులైపోయారు పరమహంస.
హఠాత్తుగా నరేన్ చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి తలుపులేసేశారు. కళ్లల్లో ఆనంద భాష్పాలతో ‘‘ఇన్నాళ్లకు వచ్చావా?’’ అంటూ నరేన్‌ను స్పృశిస్తూ ఆర్ద్రమైపోయారు. అంతటి తాదాత్మ్యతలోనూ నిశ్శబ్దాన్ని చీలుస్తూ నరేంద్రుడు సూటిగా వదిలిన ప్రశ్నాబాణం - ‘‘మహాశయా! మీరు దేవుణ్ని చూశారా?’’ ఏమాత్రం తడుముకోకుండా ‘‘చూశాను’’ అన్నారు రామకృష్ణులు.
సంభ్రమాశ్చర్యానందాలతో నరేన్...
ఇన్నాళ్లుగా ఎందరెందరినో ఉన్మత్తుడిలా అడిగిన ప్రశ్న అది.
ఎన్నాళ్లుగానో చకోరంలా ఎదురుచూస్తున్న జవాబది.
మళ్లీ రామకృష్ణులు ‘‘నిన్ను చూస్తున్నట్లే భగవంతుణ్ని చూశాను. నేను నిన్ను ఇప్పుడు ఎలా చూస్తున్నానో అలాగే మనమూ భగవంతుణ్ని చూడొచ్చు’’ అన్నారు.
ఈ సంఘటన నరేన్ మనసులో గొప్ప విప్లవాగ్ని రగిలించింది.
గదులు, తలుపులు, కిటికీలు, చెట్లు, సూర్యచంద్రులు, నక్షత్రాలు - అన్నీ ఎగిరిపోతున్నట్లు, తునాతునకలై అణువులు పరమాణువులుగా విడిపోయి ఆకాశంలో లీనమైనట్లు అనిపించింది. నేను అనే మాయ మాయమై విశ్వ చైతన్యమే నేనుగా భాసించింది.
నరేంద్రుడు వివేకానందుడిగా మారడం మొదలైందప్పుడే! అప్పటినుంచి పరమహంస వద్దకు నిత్యం ఏవో ప్రశ్నలతో వెళ్తుండేవాడు. అప్పుడప్పుడు గురువుతో వాదించేవాడు. ఓ దశలో తానూ నిర్వికల్ప సమాధిని పొందాలన్నంత ఆవేశవశుడయ్యాడు.
కష్టాలెన్నో...
అంతలో 1884లో తండ్రి విశ్వనాథ్ దత్తా మరణించారు. అంతవరకు బాగా బతికిన కుటుంబం వీధినపడింది.
పెద్ద కొడుకుగా నరేన్‌పై ఇంటి భారం పడింది. ఆకలితో ఉత్తకాళ్లతో మండుటెండలో కాళ్లు బొబ్బలెక్కినా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దీన స్థితి. ఇంటిలో అన్నం ఉండదని తెలిసి స్నేహితుల ఇళ్లల్లో తినేశానంటూ కన్నతల్లికే అబద్ధం చెప్పాల్సిన హీన స్థితి. డబ్బు సాయం చేస్తామంటూ ఒకరిద్దరు సంపన్న స్త్రీలు అతి జుగుప్సాకర ప్రతిపాదన చేస్తే ఛీకొట్టిన ధీర స్థితి.
చివరకు ఓ న్యాయవాది దగ్గర అనువాదం చేసే ఉద్యోగం దొరికింది - బొటాబొటీ జీతానికి! కానీ తాను జన్మించింది ఇందుకోసం కాదని తెలుసు. అలాగని బాధ్యతల నుంచి తప్పుకోలేననీ తెలుసు. సరిగ్గా అదే సమయంలో 1885లో రామకృష్ణులు గొంతు క్యాన్సర్‌కి గురయ్యారు. ఆయన నిర్యాణం చెందడానికి ముందురోజు నరేన్‌తో, ‘‘నేను ఇచ్చిన శక్తితో ప్రపంచానికి సేవ చెయ్యి’’ అన్నారు.
22 యేళ్ల లేత వయసులో ఉన్న నరేన్‌కి ఆ మాట రామబాణమైంది. తనవారిని విడిచిపెట్టేశాడు. తోటి శిష్యులతో కలిసి బారానగర్‌లో ఓ పాడుబడిన ఇంటిలో ‘రామకృష్ణమఠం’ స్థాపించారు. జపం, ధ్యానం, వేదాంత చర్చ, ఉంటే తిండి, లేకుంటే పస్తులు, చింపిరి దుస్తులు, కటిక నేలపై నిద్ర, యోగసాధన - రెండేళ్ల పాటు ఇదే జీవితం!
ఆపై సన్యాసం స్వీకరించి స్వామీ వివిదిశానందగా పేరు మార్చుకున్నారు. కాషాయవస్త్రాలు, నడుముకు దిట్టచేల, తలకు పాగా, ఓ చేతిలో కమండలం, మరో చేతిలో భగవద్గీత... ఇంతే! 1888 నుంచి 5 ఏళ్లపాటు భిక్షాటనంతో దేశాటనం. ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగారో... పట్టణాల్లోని మురికివాడల్లో, పల్లెల్లోని పేదల గుడిసెల్లో... ఎక్కడెక్కడ సంచరించారో! వాస్తవ విషాద భారతదేశాన్ని కళ్లారా చూశారు.
వివేకవాణి...
చివరకు 1892 డిసెంబరు 25న కన్యాకుమారి చేరారు.
అది మూడు సముద్రాల కూడలి. భారతదేశపు చిట్టచివరి కొన... సముద్రంలో దూరంగా కొండ... సాగరాన్ని ఈది ఆ గుట్టను చేరారు స్వామి. అక్కడ విశాల వినీల ఆకాశం కింద ప్రశాంతంగా మౌనంలో ధ్యానంలో సాగర తరంగాల నిర్ణిద్ర సంగీతం వింటూ మూడు రోజులు గడిపారు.
ఆ కొండపై మాతృభూమికి అభిముఖంగా నిలబడితే ఎదురుగా వేదోపనిషత్తులకు, ధార్మికతకు, నైతికతకు పుట్టినిల్లయిన పునీత భారతదేశం... పారతంత్య్రం, దుర్భర దారిద్య్రం, కులమత విభేదాలు, అంతులేని అజ్ఞానం, నిస్తేజమైన యువత తనకోసం బతకడమే బతుకు అని భ్రమిస్తూ నిర్వీర్యమైపోతున్న భరతజాతి... తలచుకుంటే స్వామికి గుండె తరుక్కుపోయింది. నయనాలు రెండూ అశ్రుసాగరాలయ్యాయి.
తన విధ్యుక్త ధర్మం తెలిసొచ్చింది.
‘‘పేదల్లో పీడితుల్లో అంధుల్లో కుష్టురోగుల్లో ప్లేగు బాధితుల్లో... భగవద్దర్శనం అయ్యింది. ప్రాచీన భారతీయంలో దాగిన పటిష్ఠ నైతిక సూత్రాల్ని, ధార్మికతలోని శీల నిర్మాణాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచ శిఖరాగ్రాన నిలబడి ఎలుగెత్తి చాటాలి. వేదాంత శంఖం పూరించాలి. ఇదే నా జీవిత కార్యం’’ అని అనుకున్నారు స్వామీజీ.
చికాగో (అమెరికా)లో జరగబోయే విశ్వమత సదస్సును ప్రథమ వేదిక చేసుకున్నారు. వివేకానందుడిగా పేరు మార్చుకుని 1893 మే 31న బొంబాయి తీరంలో బయలుదేరారు. ఆగస్టు 20కి చికాగో చేరుకున్నారు.
1893 సెప్టెంబర్ 11. విశ్వమత మహా సభాప్రాంగణం.
వేదికపై స్వామి వివేకానంద.
అయిదడుగుల ఎనిమిదంగుళాల పొడగరి. విశాలమైన నుదురు, వెడల్పయిన నేత్రాలు. తీక్షణమైన చూపులు. బలమైన ఛాతి. నిండైన విగ్రహం. మళ్లీ మళ్లీ చూడాలనిపించే రూపం. రాజఠీవి. దర్పం. సరస్వతీదేవికి నమస్కరించి, ‘‘అమెరికా సోదర సోదరీమణులారా’’ అంటూ ప్రసంగం ప్రారంభం. అంతే. ఆ ఒక్క పిలుపుతోనే 7000 మంది ఒక్కసారిగా లేచి నిలబడి రెండు నిమిషాల పాటు కరతాళ ధ్వనులతో పులకించిపోయారు.
ఆ క్షణం నుంచి ఏడేళ్ల పాటు వివేకానందుడు అమెరికా, ఇంగ్లండ్, భారత్... ఇంకా అనేకానేక ప్రాంతాల్లో వివేకవాణి వినిపించారు. 1902 జూలై 4 శుక్రవారం రాత్రి 39వ యేట తనువు చాలించారు. ‘కాలక్రమంలో ఎందరో వివేకానందులు ఉద్భవిస్తారు’ అన్నది ఆయన ఆఖరిమాట. స్వామీ! ఈ దేశంలోని యువతీ యువకులందరి కండరాల్లోని ప్రతికణంలోనూ నీ దేహపు ప్రత్యణువునీ ప్రవహించనీ. నిప్పు కణికలై ప్రజ్వరిల్లనీ. అపుడే... నీ స్వప్నం నిజమవుతుంది. ఈ స్వర్గం రుజువవుతుంది.
రామకృష్ణ పరమహంస వద్ద నాలుగేళ్ల శుశ్రూషలో నరేంద్రుడు నేర్చుకున్నవి ఎన్నో! ప్రాచీన కాలపు గ్రీసులో సోక్రటీసు గొప్ప గురువు. ప్లేటో గొప్ప శిష్యుడు. మళ్లీ మానవ చరిత్ర పరిణాహంలో గురువంటే రామకృష్ణుడు. శిష్యుడంటే వివేకానందుడు. భారతదేశాన్ని చదవాలంటే వివేకానందుణ్ని చదివితే చాలు. శ్రద్ధ, నిస్వార్ధమే శిష్యరికానికి గీటురాళ్లని, దరిద్ర నారాయణసేవే పరమధర్మమని ఆయన అన్నారు.
కర్మ, భక్తి, రాజ, జ్ఞాన యోగాలపై ఆయన చేసిన రచనలు ఆత్మశక్తిని వెలికితీసే ఆయుధాలు. గాంధీ లాంటి అహింసామూర్తులకూ, సుభాష్ చంద్రబోస్, అరవింద్ ఘోష్, జతిన్‌దాస్‌లాంటి అతివాదులకూ వివేకానందుడి మాటలే బాటలయ్యాయి.
జనవిజయం  సౌజన్యంతో

హిందువుల హక్కులను కాలరాస్తే సహించం :శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర లో ప్రవీణ్ భాయి తొగాడియ



భాగ్యనగరం , ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జరిగే " శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర " అంగరంగ వైభవంగా జరిగింది , గౌలిగూడ శ్రీ రామ ఆలయం నుండి ప్రారంభమైన యాత్రకి ప్రజలనుండి అనూహ్య స్వాగతం లభించింది దాదాపు అరవై వేల ద్విచక్ర వాహనాలో లక్షకి పైగా భజరంగీలు ఈ యాత్రలో పాలోనడం జరిగింది 
హిందువుల హక్కులను కాలరాస్తే సహించం : ప్రవీణ్ భాయి తొగాడియ 
యాత్ర ముగింపు సమావేశం లో మాననీయ ప్రవీణ్ భాయి తొగాడియ ప్రసంగిస్తూ ఈ దేశం హిందు వ్యతిరేక దేశం గా మారబోతుందని అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు రక్షణ లేకుండా పోతుంది , మన రాజకీయ నాయకులు తమ స్వార్ధానికి హిందు సమాజాన్ని పణంగా పెడుతున్నారు అలాంటి వారికి సామాజిక , ఆర్ధిక భాహిష్కరణ చేయాలి , వారిని హిందు ఉత్సవాలకు ఆహ్వానించొద్దు అప్పుడు వారికి హిందు సమాజ విలువ తెలుస్తుంది , అలాగే మనం మన ఓటును హిందుత్వం కోసం పనిచేసే నాయకులకే వేయాలని " మన ఓట్లు ప్రాంతం పేరుతొ , కులం పేరుతొ " విడిపోయినంత కాలం మన రాజకీయ నాయకులు ముస్లింల గడ్డం దువ్వుతారని , ఈలాంటి పరిణామాల నుండి హిందు దేశాన్ని రక్షించడానికి హిందు ఓటు బ్యాంకు నిర్మాణం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
 
మత ప్రాతిపతిక రిజర్వేషన్లకు ఈ దేశంలోని హిందులకు ప్రాణ సంకటం గా మారాయని , ఇవి దేశ సమైక్యతకు భంగం కలిగిస్తాయి ఈ దేశం హిందువులది కాబట్టి హిందువులే ఈ దేశ సమైక్యతను కాపాడుకోవాలి , ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విశ్వ హిందు పరిషద్ దేశవ్యాపితంగా ఒక ఉప్పెన లాంటి మహోద్యమాన్ని నిర్మాణం చేయబోతుందని ఆ ధాటికి హిందు వ్యతిరేక శక్తులు నశించిపోవడం తధ్యమని ఆయన అన్నారు .
 
  http://www.vhpap.org/2012/04/blog-post_07.html

15, ఏప్రిల్ 2012, ఆదివారం

కులవ్యవస్థపై పోరాడిన ధీశాలి

  • -త్రిపురనేని హనుమాన్ చౌదరి
భారతదేశ స్వాతంత్య్ర సమరయోధులందరూ బ్రిటిష్ పాలననుండి బయటపడి, స్వరాజ్యం కావాలనే ఏకైక లక్ష్యాన్ని ప్రజలముందుంచారు. స్వరాజ్యం కోసం పోరాటాలు నడిపారు. కేవలం చక్రవర్తిరాజగోపాలాచారి, డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్‌లు మాత్రమే స్వరాజ్యం ద్వారా ఎటువంటి ప్రయోజనాలుంటాయనే విషయాలపై బాగా ఆలోచించి వాటిని ప్రజలకు విడమ రచి చెప్పడం ద్వారా చైతన్యవంతులను చేయడానికి యత్నించారు. స్వాతంత్య్రం..స్వరాజ్యం, సుపరిపాలన కోసం మనకు స్వాతంత్య్రం రావాలని చక్రవర్తి రాజగోపాలాచారి పేర్కొనగా, డాక్టర్ అంబేద్కర్ ఆయ నతో విభేదించారు. రాజకీయ సమానత్వంతోపాటు, సాంఘిక, ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే స్వాతంత్య్ర సాధనలో మన ధ్యేయం కావాలన్నారు. ఇవి సాధించలేని సుపరిపాలన, స్వపరిపాలన వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని ఆయన ఘంటాపథంగా చెప్పారు. హిందూ సమాజంలో జన్మతః సంక్రమించే కులాలను బట్టి అసమానత, అనివార్య అంగమైంది. విశేషించి అస్పృశ్యత, ఆజన్మ దారిద్య్రం, అన్యాయం, దాస్యం, విద్యారాహిత్యం వంటి అవలక్షణాలను దళిత కులాలకే ఆపాదించారు. హిందూ సమాజం పరిఢవిల్లాలన్నా, ప్రపంచానికి మరిం త ఆదర్శవంతంగా నిలవాలన్నా ఈ అసమానతలు, వివక్ష పూర్తిగా తొలగిపోవాలి. లేనిపక్షంలో హిందూ సమాజం విచ్ఛిన్నవౌతుందని అంబేద్కర్ వాదించారు. ఈ అమానుషానికి కులవ్యవస్థ కారణం కాబట్టి కుల నిర్మూలన, మన ఉద్యమానికి మహద్ధ్యేయం కావాలి: స్వరాజ్యం యొక్క ప్రథమ ప్రయోజనం కులాధారిత అసమానతా నిర్మూలనం అన్నారు అంబేద్కర్!

కులవ్యవస్థ నశించాలంటే అందరికీ (సు)విద్య అవసరం. కేవలం విద్య ద్వారానే అంతరాలు తొలగుతాయ. అందుకే స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగం రచించే బాధ్యత ఆయనపై పెట్టినప్పుడు, ఆరు-పధ్నాలుగు సంవత్సరాల మధ్య వయస్కులైన ప్రతి భారతీయ బాల బాలికలకూ ప్రభుత్వం నిర్బంధంగా, ఉచితంగా విద్య గరపాలనే అధికరణాన్ని అంబేద్కర్ వ్రాశారు. అసలీవిధమైన అధికరణం మరే ఇతర దేశపు రాజ్యాంగంలో కానరాదు. ఈ అధికరణాన్ని గణతంత్ర వ్యవస్థ అమల్లోకి వచ్చిన పదేళ్ళ వ్యవధిలో అమల్లోకి తీసుకొని రావాలని రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ.. తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడం విచాకరం. అందుకే భారతదేశం, ప్రపంచంలోనే ఎక్కువమంది-35కోట్లు- నిరక్షరాస్యులున్న దేశంగా కుఖ్యాతిని పొందుతోంది. విద్య ఉంటే కులవృత్తి మార్చుకోవచ్చు. డిగ్రీ పూర్తి చేసిన బిసి/ఎస్‌సి/ఎస్‌టి విద్యార్థులెవరూ కులవృత్తులు చేపట్టడానికి ఇష్టపడరు. వారు ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో లేదా మరే ఇతర రంగాల్లోనో రాణిస్తారు.
విద్యావంతులైన యువకులు ఏ కులానికి చెందినవారైనా, ఉపాధికోసం ఊరు విడిచి పట్నానికి వెళ్ళడం తథ్యం. దేశ ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య ప్రగతి అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పారంపరిక కులవృత్తులను విసర్జించి పట్నాలకు చేరుకున్న వారికి ఉద్యోగ ఉపాధి లభించగానే వారి జీవన ప్రమాణాల్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయ. ఆవిధంగా వృత్తి, ఊరు మారితే, కులం అప్రస్తుతం, అర్థరాహిత్యవౌతుంది. కులనిర్మూలనం, చట్టాలవల్ల గాక, విద్య-వికాసాల వల్లమాత్రమే సాధ్యం. అందుకే అంబేద్యర్ విద్యకంత ప్రాధాన్యతనిచ్చారు. వారి బోధను మన్నించకుండా రాజకీయ నేతలూ, పార్టీలు, కులాలను శాశ్వతీకరణం చేసే యత్నాలను తీవ్రతరం చేస్తున్నారు.
 

అంబేద్కర్ హైందవాన్ని సంస్కరించడంకోసం, స్వాతంత్య్రానంతరం కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖమంత్రిగా హిందూకోడ్ బిల్లులను రూపొందించి చట్టం చేయించారు. వివాహం, వారసత్వాల్లో వాంఛనీయమైన మార్పులు తెచ్చారు. కుల నిర్మూలనకు, దళితుల ఆత్మగౌరవోద్ధరణకూ ఎంత ప్రయత్నించినా వాంఛిత మార్పులు తీసుకురాలేకపోయినందుకు బాధపడి, ‘నేను హిందువుగా పుట్టాను. కానీ హిందువుగా మరణించదలచుకోలా,’ అంటే మతం మార్చుకుంటానన్నారు. అయతే సామాజికంగా ఉన్నత స్థితి పొందడానికి క్రైస్తవ, ముస్లిం మతాలు అనుకూలమైనా ఆయన వాటివైపు ఆకర్షితులు కాలేదు. భరత భూమిపై ఉద్భవించిన బౌద్ధం, జైనం, సిక్కు, వైష్ణవం ఇలా ఎన్నో మతాలున్నాయి. అన్నింటికన్నా సముచితమైంది బౌద్ధం. కులాలు లేవు. హేతుబద్ధమైనది. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని, జాతి విచక్షణ లేకుండా అంగీకరించేది కనుక భారతీయునిగా దేశోద్భవమైన బౌద్ధాన్ని స్వీకరిస్తా: తన అనుయాయులందర్నీ బౌద్ధులవమని కోరుతున్నా’నని ప్రకటించి 1956లో నాగపూర్‌లో కొన్ని లక్షల మంది దళితులను సమీకరించి బౌద్ధాన్ని స్వీకరించారు. ఆవిధంగా ధర్మ పునరుద్ధరణకు నాంది పలికారు. స్వదేశీ మత స్వీకారం, అంబేద్కర్ అకుంఠిత దేశభక్తికి తార్కాణం. ఈ విషయంలో ఆనాటి శంకరాచార్యులు అంబేద్కర్‌ను శ్లాఘించారు. బౌద్ధం కూడా హైందవ ధర్మ పరివారంలో భాగమే. హిందువులు బుద్ధుణ్ణి అవతారంగా గౌరవిస్తారు. కానీ అంబేద్కర్‌పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు కొందరు యత్నించారు. కానీ అటువంటి యత్నాలు సఫలీకృతం కాలేదు. రాజ్యాంగ రచన సందర్భలో అప్పటి కాశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా తన రాష్ట్రానికి విశేష ప్రతిపత్తి కల్పించాలని ప్రాధేయపడితే, ‘నేను భారతీయుణ్ణి: భారత ప్రభుత్వ న్యాయశాఖ మంత్రిని. నాదేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కల్పించే ఏ అధికరణనూ, రాజ్యాంగంలో ఉండనీయన’ని అబ్దుల్లాకు నిర్ద్వంద్వంగా చెప్పి పంపిన ధీశాలి, దేశభక్తుడూ అంబేద్కర్.
 

మరో విషయంలోనూ ఎంతో దూరదృష్టిని చూపిన మేధావి అంబేద్కర్. తమ విశ్వాసాల దృష్ట్యా, చారిత్రక వాస్తవాల దృష్ట్యా, ముస్లింలు భారత జాతీయతను, అంగీకరించరని, భరతఖండంలో ముస్లిం సమస్యకు శాశ్వత సుస్థిర పరిష్కారం, ముస్లింలు కోరుతున్నట్టుగా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్‌ను ఏర్పరచడం, ఆ పరిష్కారంలో భాగంగా, ముస్లింలీగ్ కోరినట్లు, ఉభయ దేశాల్లోని మైనారిటీలను, తమ మెజారిటీ దేశాల్లోకి తరలించాలనీ, అంబేద్కర్ తాను రచించిన ‘పాకిస్తాన్ ఆర్ ఇండియా డివైడెడ్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. అంబేద్కర్ వాదనలోని సహేతుకతనూ, ఆయన ఇచ్చిన సలహాను, గాంధీ, మిగిలిన కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకించారు.
ప్రథమ ప్రపంచ సంగ్రామానంతరం, టర్కీ సామ్రాజ్యం అంతమయినప్పుడు, అప్పటి అంతర్జాతీయ సంస్థ లీగ్ ఆఫ్ నేషన్స్ పర్యవేక్షణలో, టర్కీలోని క్రిస్టియన్ అల్ప సంఖ్యాకులందరూ తమ మెజారిటీ దేశాలయిన గ్రీస్, బల్గేరియా, రుమేనియాలకూ: ఆ దేశాల్లోని ముస్లింలందరూ టర్కీకి శాంతియుతంగా తరలి వెళ్ళారన్న చారిత్రక వాస్తవాన్ని, అంబేద్కర్..గాంధీ, నెహ్రూ, మిగిలిన కాంగ్రెస్ పెద్దలు, భారతీయుల దృష్టికి తెచ్చి, విభజనతోపాటు శాంతియుతంగా మైనారిటీల తరలింపులు జరగటమే శాశ్వత పరిష్కారమని బోధించారు. హింసాయుత మత కల్లోలాల నేపథ్యంలో దేశ విభజనకు కాంగ్రెస్ ఒప్పుకుంది. పాకిస్తాన్ తన ప్రకటిత నీతి ప్రకారం, హిందువులను, సిక్కులను తన దేశంనుంచి గెంటివేసింది. మన దేశం సర్వమత సమభావ వ్యవస్థను అనుసరించడం వల్ల, గాంధీ, నెహ్రూల నేతృత్వంలోని కాంగ్రెస్.. ముస్లిం లను పాకిస్తాన్‌కు తరలి వెళ్ళమని చెప్పలేదు. సర్వ మతస్థులు భారత్‌లో శాంతి సౌఖ్యాలతో, పరమత సహనంతో సహజీవనం నెరపాలని వాంఛించారు. కానీ నేటి కాలంలో కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీలు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం కుల, మత, భాష ప్రాంత రాజకీయాలను నెరపుతు న్నాయ. అంబేద్కర్ దీన్ని అప్పట్లోనే ఊహించారు. ఆయన రాజ్యాంగ సభ యొక్క అంతిమ సమావేశంలో ప్రసంగిస్తూ, కుల,మత రాజకీయాలు దేశాన్ని ముక్కలు చేయడానికి, ప్రాంతీయ తత్వాన్ని ప్రేరేపించడానికి మాత్రమే దోహద పడతాయని బాధతో హెచ్చరించారు. నేటి రాజకీయ పార్టీలు అంబేద్కర్ ఆశించిన విధంగా కుల నిర్మూలనకు కృషి చేయకపోగా, ఓట్ల కోసం కుల రాజకీయాలను నెరపుతుండటం దేశ సమాజంలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నాయ. ఫలితంగా భాష, ప్రాంతీయ, కుల పరమైన దురభిమానాలు తీవ్రస్థాయకి చేరడం నడుస్తున్న చరిత్ర. కులం వల్ల కలిగే అనర్థాలను ఆనాడే పసిగట్టి, సార్వజనీన సమాజాన్ని ఆకాంక్షించిన మేధావి అంబేద్కర్. ఆయన ఆశయ సాధనతోనే దేశ ప్రగతి సాధ్యం.


 http://www.andhrabhoomi.net/content/kula

4, ఏప్రిల్ 2012, బుధవారం

ఆరని రుధిరజ్వాల భగత్‌సింగ్‌....

 

ఒక వీరుడి మరణం.. శత యోధుల జననం..వీరుడి మరణంతోనే అతడి చరిత్ర అంతం కాబోదు... అతడి శరీరం నుంచి చిందిన వెచ్చని నెత్తుటి చుక్క ఒక్కొక్కటి ఒక్కో వీరుడికి ఊపిరి పోస్తుంది... ఆ రక్తపు చుక్కల్లోని వేడి ఎన్నటికీ చల్లారదు.. ఆ మృత వీరుడి శరీరంలోని సత్తువ ఎప్పటికీ వ్యర్థం కాదు.. అతడిలో ఉన్న కసి వెయ్యింతలై శత్రువుపై పోరాడుతుంది. ఆ వీరుడు భగత్‌ సింగ్‌... ఆ రక్తం రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష... ఆ సత్తువ ఉవ్వెత్తున ఎగిసిపడే యువకెరటం... 


భారత స్వాతంత్య్ర సంగ్రామంలో లక్షలాది మంది పాల్గొన్నారు... ఆఖరి శ్వాస ఉన్నంత వరకు పోరాడారు.. బ్రిటిష్‌ వారి దురాగతాలకు బలైపోయారు... ఉరికొయ్యలను సంతోషంగా ముద్దాడారు... కానీ వారందరిలో ఓ చిన్న కుర్రాడు... నూనూగు మీసాలైనా రాని 22 ఏళ్ల యువకుడు యావత్‌ జాతి దృష్టిని ఎలా మళ్లించాడు..? కనుమరుగై ఎనభై సంవత్సరాల తరువాత ఈరోజుకు కూడా జాతికి ఎలా ప్రేరణ అవుతున్నాడు?


దాదాపు వందేళ్ల స్వాతంత్య్ర సంగ్రామంలో అతనిది చాలా చిన్న పాత్ర... పట్టుమని పది సంవత్సరాలైనా లేని పోరాట చరిత్ర అతనిది... ఆ స్వల్పకాలమే అతనికి సరిపోయింది. దొంగల్లా వచ్చిన తెల్ల దొరలను నిలువెల్లా వణికించటానికి... దేశంలోని విప్లవకారులందరికీ మకుటాయమానంగా నిలవటానికి అతనికి ఆ కొద్ది సమయమే సరిపోయింది. అతణ్ణి ఒక్క క్షణం బతకనిస్తే... తమ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించివేస్తారన్న భయాన్ని బ్రిటిష్‌ పాలకుల్లో కలిగేలా చేసిన విప్లవ జ్యోతి అతడు.. 22 సంవత్సరాల చిన్న జీవితంలో యావజ్జాతిలో స్వాతంత్య్ర జ్వాలను రగిలించిన వీరుడు... భగత్‌ సింగ్‌.....
 

===============================
 

మనల్ని చీల్చుకుని వెళ్లిపోయిన ఇవాళ్టి పాకిస్తాన్‌లో ఓ రాష్ట్రం పంజాబ్‌.... ఇందులోని లాయల్‌పూర్‌ జిల్లా ఖట్‌కర్‌ కలాన్‌ గ్రామంలో సాధారణ సంధూ జాట్‌ కుటుంబంలో 1907 సెప్టెంబర్‌ 27న భగత్‌సింగ్‌ అనే వెలుగు మొలక మొగ్గ తొడిగింది. ఈ మొలకే అనతికాలంలో మహా విప్లవ జ్వాలగా పరిణమిస్తుందని తండ్రి కిషన్‌సింగ్‌ సంధూ కానీ, తల్లి విద్యావతి కానీ ఎంతవరకు ఊహించారో తెలియదు.. కానీ, స్వాతంత్య్ర పోరాటంలో వారి వారసత్వాన్ని అంత త్వరగా అందిపుచ్చుకుంటాడని మాత్రం ఊహించి ఉండరు...
 

కానీ అదే జరిగింది. భగత్‌సింగ్‌ తాతగారు అర్జున్‌సింగ్‌, ఆర్యసంస్కర్త స్వామి దయానంద సరస్వతి అనుయాయి. ఆర్యసమాజం ద్వారా జాతీయోద్యమంలో పాల్గొన్న వ్యక్తి.. ఇక కిషన్‌సింగ్‌, అతని ఇద్దరు బావలు అజిత్‌సింగ్‌, స్వరణ్‌జిత్‌ సింగ్‌లు అంతా గధర్‌ పార్టీ సభ్యులే... భారత దేశాన్ని బ్రిటిష్‌ వారి నుంచి విముక్తం చేయటం కోసం అమెరికా, కెనడాల్లోని భారతీయులు స్థాపించిన విప్లవ సంస్థ ఇది. ఇది స్వాతంత్య్రోద్యమంలో రహస్య కార్యకలాపాలను కూడా నిర్వహించింది. ఈ సంస్థలో భగత్‌ సింగ్‌ కుటుంబ పెద్దలు సభ్యులు కావటం విశేషం... 1925లో కాకోరీ రైలు దోపిడీ కేసులో స్వరణ్‌జిత్‌సింగ్‌ను దోషిగా నిర్ధారించి 1927లో ఉరితీశారు...
 

తన మామను ఉరి తీసిన తరువాతి క్షణం నుంచీ భగత్‌సింగ్‌లో విప్లవ భావాలు మరింత వేగంగా పెరిగాయి. అంతకు ముందు సింగ్‌ తోటి విద్యార్థుల్లా ఖల్సా హైస్కూల్‌లో చేరలేదు.. బ్రిటిష్‌ పాలకులకు విధేయులుగా ఉండేందుకు సింగ్‌ తాత ఒప్పుకోకపోవటంతో భగత్‌ ఆర్యసమాజ్‌ వేద విద్యాలయంలో చేరాడు.. అక్కడే చదువుకున్నారు...13వ ఏట భగత్‌ సింగ్‌ తొలిసారి మహాత్మాగాంధీ గురించి విన్నాడు.. ఆయన్ను అనుసరించటం ప్రారంభించాడు...బ్రిటిష్‌ పుస్తకాలను తగులబెట్టడం, బట్టలను తగులబెట్టడం, సహాయ నిరాకరణోద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొనటం అన్నీ చేశాడు...స్వాతంత్య్రోద్యమంలో భగత్‌ సింగ్‌ వేసిన తొలి అడుగులు అవి.....
 

======================
 

1922లో సహాయ నిరాకరణోద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులు.. ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్‌లోని చౌరీచౌరాలో రెండువేల మంది ఉద్యమకారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన ప్రారంభించారు...పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.. నిరసనకారులు భయపడకపోగా తిరగబడ్డారు.. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.. పోలీసులు నేరుగా కాల్పులు ప్రారంభించటంతో ఉద్యమకారులు స్టేషన్‌పై దాడి చేసారు.. దాదాపు 22 మంది పోలీసులను స్టేషన్‌లో బంధించి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు..
ఈ ఘటనకు చలించిపోయిన మహాత్మాగాంధీ, సహాయ నిరాకరణోద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు.. ఇది భగత్‌ సింగ్‌ను కలచివేసింది. వేలాది భారతీయులను పొట్టన పెట్టుకున్న బ్రిటిష్‌ తొత్తులకు చౌరీచౌరాలో వేసిన శిక్ష చాలదని ఆయన భావించాడు.. అతని మార్గం అప్పటి నుంచి మారింది....
 

==================================
 

మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతంతో విభేదించిన తరువాత భగత్‌ సింగ్‌ పూర్తిగా మార్కి్సస్‌‌ట భావజాలం వైపు మళ్లాడు.. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మాదిరిగా, హింసామార్గంలోనే స్వాతంత్య్రం సిద్ధిస్తుందన్న విశ్వాసం ఆయనలో క్రమంగా బలపడుతూ వచ్చింది. .
 

గాంధేయ వాదం నుంచి పక్కకు మళ్లిన భగత్‌ సింగ్‌ పూర్తిగా మారిపోయాడు...దీనికి తోడు మామ స్వరణ్‌జిత్‌ సింగ్‌ ఉరితీత ఆయన్ను కదిలించింది. అంతే... వెనక్కి తిరిగి చూడలేదు.. హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక సభ్యుడయ్యాడు.. శివరామ్‌ రాజ్‌గురు, సుఖదేవ్‌ థాపర్‌లు భగత్‌ సింగ్‌కు అక్కడే కలిసారు... ముగ్గురూ కలిసి విప్లవ కార్యక్రమాలను అమలు పరిచేవారు...

1928లో భారత్‌లో అప్పటి రాజకీయ వాతావరణాన్ని అంచనా వేసేందుకు సర్‌ జాన్‌ సైమన్‌తో బ్రిటిష్‌ సర్కారు ఓ కమిషన్‌ను వేసింది. ఈ కమిషన్‌ రాకను వ్యతిరేకిస్తూ దేశమంతటా నిరసనలు మిన్నుముట్టాయి. సైమన్‌ గోబ్యాక్‌ అంటూ సమర యోధులు నినదించారు...మన రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు వంటివారు పోలీసు తుపాకీ గుండుకు ఎదురుగా గుండె నిలిపారు..లాహోర్‌లో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు లాలా లజపతిరాయ్‌ నిరసనకు నాయకత్వం వహించారు.. ఆయనపై పోలీసులు లాఠీ ఝళిపించారు.. తీవ్ర గాయాలతో లాలా కన్నుమూశారు.. ఈ ఘటనకు భగత్‌ సింగ్‌ ప్రత్యక్ష సాక్షి...
 

ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని భగత్‌ సింగ్‌ నిశ్చయించుకున్నాడు.. లాలాను చిత్రహింసల పాల్జేసిన పోలీస్‌ ఛీఫ్‌ స్కాట్‌ను కాల్చి చంపాలని ప్లాన్‌ వేశారు.. సుఖ్‌దేవ్‌, రాజ్‌గురులు ఆయనకు సహకరించారు.. కానీ, అనుకున్నదొకటి అయింది ఇంకొకటి...స్కాట్‌ను కాల్చాలని అనుకున్న వీరులు గుర్తించటంలో పొరపాటు పడి డిఎస్‌పి జెపి సాండర్‌‌సను కాల్చారు.. వెంటనే పోలీసులకు చిక్కకుండా పారిపోయి, సిక్కు మతానికి వ్యతిరేకమే అయినా, గడ్డం తీసివేసి, పాగా తీసి, టోపీ పెట్టుకుని కొత్త వేషం ధరించాడు భగత్‌సింగ్‌....
 

1929లో బ్రిటిష్‌ ప్రభుత్వం పోలీసులకు అపరిమిత అధికారాలను కట్టబెడుతూ డిఫెన్‌‌స ఆఫ్‌ ఇండియా యాక్‌‌టను తీసుకురావటం భగత్‌సింగ్‌ సహించలేకపోయాడు... ఇలాంటి చట్టాలు ఎన్ని తీసుకువచ్చినా విప్లవకారులను అణచివేయటం సాధ్యం కాదని తెల్లదొరలకు తెలిసేలా చేయాలనుకున్నాడు..అంతే సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలో బాంబు వేయాలని నిర్ణయించుకున్నాడు.. తన మిత్రుడు భుక్తేశ్వర్‌ దత్‌తో కలిసి బాంబు వేసే పథకం రచించాడు.. మరో విప్లవ వీరుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ పోలీసులకు పట్టుబడరాదని వారించాడు.. .. కానీ, భగత్‌ సింగ్‌ కావాలనే పట్టుబడాలని నిర్ణయించుకున్నాడు...... తక్కువ తీవ్రత ఉన్న బాంబును 1929 ఏప్రిల్‌ 29న అసెంబ్లీలో విసిరాడు భగత్‌... జిన్నాలాంటి ప్రముఖులంతా ఉన్న సమయంలోనే భగత్‌ బాంబు విసిరాడు.. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అన్న నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. బాంబును కావాలనే జనానికి దూరంగా విసిరాడు భగత్‌... తాను కావాలనే ఈ పని చేసినట్లు నిర్భయంగా ఒప్పుకున్నాడు... పోలీసులకు దొరికిపోయాడు...

అరెస్టయిన వెంటనే విచారణ ప్రారంభమైంది. దీనికి లాహోర్‌ కుట్ర కేసుగా పేరు పెట్టారు.. నేరం రుజువైనట్లు అనతికాలంలోనే న్యాయమూర్తులు నిర్ణయించారు.. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు ఉరిశిక్షనూ విధించారు... వారిని విడుదల చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు నినదించారు.. కాంగ్రెస్‌ పైనా, మహాత్మాగాంధీ పైనా భగత్‌సింగ్‌ను విడుదల చేయించాలని ఒత్తిడి పెరిగింది. కానీ, నాడు కాంగ్రెస్‌ కానీ, గాంధీజీ కానీ భగత్‌సింగ్‌ను కాపాడే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించదు.. ఆ రోజుల్లో గాంధీజీ లేఖ రాస్తే రాజకీయ ఖైదీలను బ్రిటిష్‌ సర్కారు విడిచిపెట్టేది.. దాదాపు 90 వేల మందిని ఆయన విడిపించారు కూడా.. కానీ భగత్‌ సింగ్‌ ఉరిశిక్షను తీవ్రంగా వ్యతిరేకించలేదన్న అపవాదు గాంధీపై ఉంది. పైగా ఎవరినైనా కాపాడటానికి నాకెలాంటి అధికారం లేదు.. దేవుడే అన్నీ నిర్ణయిస్తాడంటూ నిర్లిప్తంగా గాంధీ ఆ తరువాత మాట్లాడినట్లు రికార్డు ఉంది. 1931 మార్చి 20న అంటే ఉరిశిక్ష అమలు చేసేందుకు మూడు రోజుల ముందు భగత్‌ సింగ్‌ మిత్రుడు ప్రాణనాథ్‌ మెహతా క్షమాభిక్ష దరఖాస్తు తీసుకెళ్తే.. విప్లవ జ్యోతి నిర్ద్వంద్వంగా ఖండించాడు... ఎవరినీ ప్రాణాలకోసం వేడుకునేది లేదని తేల్చి చెప్పాడు.. ఆ తరువాత మార్చి 23న ప్రజలంతా గుమికూడకుండానే ఉదయం ఏడు గంటలకు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్‌ ముష్కరులు ఉరితీశారు..ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదాలతోనే ముగ్గురు వీరులూ అమరులయ్యారు...
 

నిజానికి లాహోర్‌ జైలు నుంచి తప్పించుకుని వెళ్లేందుకు భగత్‌సింగ్‌కు అవకాశం ఉండింది... కొందరు దేశభక్త పోలీసులు అందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు కూడా.. కానీ, భగత్‌ సింగ్‌ ఆ పని చేయలేదు.. దేశంలోని మిగతా యువతకు ఆదర్శంగా నిలవాలనుకున్నాడు.. ధృవతారలా నిలిచాడు.. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారినందరినీ మరచిపోతామేమో కానీ, భగత్‌సింగ్‌ను మరవటం భారతీయుడైన ఏ ఒక్కరికీ సాధ్యం అయ్యే పని కాదు...
 http://kovela.blogspot.in/2009/09/blog-post_27.html

తరతరాల బూజు... నిజాం నవాబు


దురంతాల నిజాం పిశాచపు దుర్మార్గాలు...
రజాకార్ల అరాచకం...అత్యాచారాలు..
అల్లాడిపోయిన హైదరాబాద్‌ సంస్థానం
విముక్తి కోసం విప్లవోద్యమం...
ఓ పక్క ఆర్యసమాజం, మరో పక్క వామపక్షాలు
సత్యాగ్రహం... సాయుధ పోరాటం...
నిజాంపై సమాంతరంగా సాగిన మహాయుద్ధం...
పోలీస్‌ యాక్షన్‌తో పిశాచం పరారీ..
 

జనారణ్యాన్ని వదిలి దెయ్యాల దేశానికి పరారైన శుభదినం...
రాజు ముసుగులో రాక్షసుడు నిజాం నుంచి విముక్తి పొందిన శుభదినం..సెప్టెంబర్‌ 17... హైదరాబాద్‌కు ముక్తి లభించిన సమయం... నిజాం నేలలో ఆలస్యంగా ఉదయించిన స్వతంత్ర సూర్యుడు...
 

....

భారత దేశ చరిత్రలో అదొక రక్తసిక్తమైన అధ్యాయం.... దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే హైదరాబాద్‌ సంస్థానంలో రక్తపుటేర్లు పారాయి. దక్షిణ పాకిస్తాన్‌గా తన్ను తాను ప్రకటించుకోజూసిన నిజాం రక్కసిమూకలు రజాకార్ల పేరుతో మానవ మహా మారణకాండను యథేచ్చగా నిర్వహించాయి. నిజాం నుంచి విముక్తి కోసం వామపక్షాలు సాయుధ పోరాటం ఉద్దృతంగా చేశాయి... దీనికి సమాంతరంగా ఆర్యసమాజం నిజాం పై యుద్ధాన్ని చేసింది. భారత దేశం పదమూడు మాసాల పాటు స్వతంత్ర ఫలాలను అనుభవించిన తరువాత కానీ, నిజాం చెర నుంచి హైదరాబాద్‌ ముక్తి పొందలేదు.. పోలీసు చర్య ఒక పైశాచిక పాలనకు చరమగీతం పాడింది...
 

దేశం ముక్కలైనా స్వాతంత్య్రం వచ్చిందే పదివేలంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా అంతా సంబరాలు జరుపుకుంటున్నారు... పండిట్‌ నెహ్రూ జెండా ఎగరేసి భావి భారతం గురించి ఉపన్యసిస్తున్నారు.. కానీ, స్వాతంత్య్రం వెంటే దక్కను పీఠభూమిలో రక్తతర్పణమూ జరిగింది. నిజాం సంస్థానం రక్తసిక్తమైపోయింది. మతోన్మాద నియంత నిజాం దురంతాలు సంస్థానాన్ని ఎరుపుమయం చేసింది. మధ్యయుగపు ఆటవిక మూక... మహా మారణకాండకు ఒడిగట్టింది...
 

``బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్ల పోతవు కొడుకో... నైజాము సర్కరోడా...'' ఇది అందరికీ సుపరిచితమైన పాటే...
నాజీలను మించిన నిజాం కిరాతకం హైదరాబాద్‌ సంస్థానాన్ని అతలాకుతలం చేసిన తీరుకు విప్లవ వీరుడు బండి యాదగిరి రాసిన ఈ గీతం నిలువుటద్దం... ఓ పక్క భారత దేశం అంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగితేలుతుంటే... నిజాం పాలనలో ఉన్న దాదాపు కోటిన్నర మంది ప్రజానీకం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.. ఏ క్షణంలో రజాకార్ల రక్షస మూక విరుచుకుపడుతుందో తెలియక భయంతో అల్లాడుతున్నారు.. ఎక్కడ చూసినా వేడిగా పారుతున్న రక్తపు మరకలే కనిపిస్తున్నాయి... సంస్థానంలోని పది జిల్లాల్లో రజాకార్లు విశృంఖలంగా వీర విహారం చేస్తున్నారు.. కనపడ్డ వాళ్లను కనపడ్డట్లు నరికి పారేశారు... కాల్చిపారేశారు.. చెట్లకు కట్టి చిత్రహింసలు చేశారు.. ఆడవాళ్లనైతే అమానుషంగా మానభంగం చేశారు.. సామూహికంగా చెరిచారు.. ముక్కలు ముక్కలు చేసి విసిరేశారు.. ఒక నరహంతక భూతం జడలు విప్పి నాట్యం చేసిన కాలం అది..
 

ప్రపంచ చరిత్రను రక్తసిక్తం చేసిన సందర్భాలు అనేకం ఉండవచ్చు.. వేలాది మందిని ఊచకోసిన నియంతలనూ మనం చూశాం... కానీ, వారందరినీ తలదన్నేలా అరాచకాన్ని సృష్టించిన నవాబు.. ఏడవ నిజాం... సంస్థానంలో 99శాతం ఉన్న హిందువులను మైనార్టీలోకి మార్చటానికి నిజాం చేయని అకృత్యమంటూ లేదు.. మతోన్మాదం ముదిరిన తీవ్రవాది నిజాం...రజాకార్ల పేరుతో ఓ ప్రైవేటు సైన్యాన్ని రూపొందించిన కాశిం రజ్వీకి తనతో సమానమైన అధికారాలు దఖలుపరచిన పాపం.. నిజాం సంస్థానంలోని సమస్త ప్రజానీకాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రజల్లో ఆత్మాభిమానం చచ్చిపోయి జీవచ్ఛవాల్లా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ పడితే అక్కడ రజాకార్ల అరాచకం అడ్డూ ఆపూ లేకుండా సాగిపోయింది. పూలదుకాణాల చాటున, గాజుల దుకాణాల చాటున సాగిన దారుణాలు అన్నీ ఇన్నీ కావు... 

బతుకుమీద ఆశ ఉన్నవాడెవ్వడూ ఆ దారుణాల గురించి గుసగుసలుగా కూడా మాట్లాడుకునే సాహసం చేయలేదు.. బలవంతపు మతమార్పిళు్ల జరిగాయి. పండిన పంటను ఊడ్చిపెట్టుకెళ్లారు... జనానికి తిండి లేదు.. నీళు్ల లేవు.. బట్ట లేదు.. బతుకే హేయమైపోయిన దుస్థితి... 

పారిపోదామన్నా ఎక్కడ పట్టుకుని చంపేస్తారేమోనన్న భయం.. కాశింరజ్వీ నాయకత్వంలో ఊళ్లకు ఊళు్ల దోచుకున్నా అడిగే నాథుడు లేడు.. అడ్డు చెప్తే... సామూహిక మారణకాండే...పదుల సంఖ్యలో చంపేసి బావుల్లో పూడ్డిపెట్టిన దుర్మార్గులు రజాకార్లు...
1

947లోనైతే... వాడీ నుంచి బయలుదేరిన ఓ రైలును గాండ్లాపూర్‌ స్టేషన్‌ వద్ద ఆపేసి అందులోనుంచి మహిళలను దింపి వివస్త్రలను చేసి నగ్నంగా బతుకమ్మను ఆడించిన క్రూరత్వం రజాకార్లది... వందలాది మందిని జైళ్లలో నిర్బంధించి ఏమయ్యారో కూడా తెలియకుండా చంపేసింది నిజాం ప్రభుత్వం... దీనికి మించి భూస్వామ్య వ్యవస్థ పల్లె జీవనాన్ని చిన్నాభిన్నం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిజాం సంస్థానంలో ప్రజల జీవితం జంతువుల కంటే హీనంగా మారింది..
 

...............2...............
 

నాజీని మించిన నిజాం పరిపాలనపై నెమ్మదిగా ప్రారంభమైన ప్రతికూలత క్రమంగా ఉవ్వెత్తున ఎగసింది. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముసల్మీన్‌ పేరుతో కాశింరజ్వీ తొత్తులు రజాకార్ల దురంతాలను గ్రామాల్లో క్రమంగా ప్రజానీకం ఎదిరించటం ప్రారంభించారు... శాంతియుతంగా మొదలైన నిరసన క్రమంగా సాయుధ పోరాటంగా మారింది... ఓ పక్క కమూ్యనిస్టుల సాయుధ పోరాటం... మరో పక్క ఆర్యసమాజం సత్యాగ్రహోద్యమం, ఇంకో పక్క కాంగ్రెస్‌ పోరాటం... నిజాంకు వ్యతిరేకంగా ముప్పేట దాడిగా మారిపోయింది. గ్రామాల్లో యువకులతో బృందాలు ఏర్పడ్డాయి. నిజాంకు వ్యతిరేకంగాఆర్యసమాజం తీవ్రస్థాయిలో ఉద్యమం నిర్వహించింది. పండిత నరేంద్ర, విద్యాలంకార్‌ చంద్రపాల్‌, శ్యామలరావు, బన్సీలాల్‌ వంటి వారు తీవ్ర స్థాయిలో ప్రజలను చైతన్యవంతులను చేశారు.. ఆర్యసమాజ్‌ కార్యకలాపాలను నిజాం నిషేదించాడు.. కార్యకర్తలను అరెస్టు చేశాడు... నిజాం సంస్థానం అంతటా పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు చేశారు... ఇంకోవైపు వామపక్షాలు సాయుధ పోరాటం వైపు మళ్లాయి. నిజాం నిరంకుశ పాలనకు మూలస్తంభాలైన భూస్వాములను తరిమి కొట్టడం కోసం గ్రామాల్లో యువకులు ఆయుధాలు చేపట్టారు.. జైళ్లపాలయ్యారు..
 

ఇక నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో కాశిం రజ్వీ మూక మరింత ఘోరానికి ఒడిగట్టింది. నిజాంకు వ్యతిరేకంగా సమావేశమయ్యారని రెండు వందల మందిని ఊచకోత కోసింది. ఒక్కొక్కరికి ఒక్కో తూటా వేస్‌‌ట చేయటమెందుకని, పదిమందిని వరుసగా నిలబెట్టి గుండెల్లో తూటా పేల్చింది. రెండువందల శవాలను గుండ్రాంపల్లి బావిలో వేసి గ్రామస్థుల చేతితోనే పూడ్చిపెట్టింది...
 

పులిగిల్ల, కొలనుపాక, ఆలేరుల్లో కూడా నిజాం దాష్టీకానికి బలైన వాళ్ళెందరో... ఇక వరంగల్‌ జిల్లా పరకాల నిజాం దాష్టీకానికి మరో జలియన్‌ వాలాబాగ్‌గా మారిపోయింది. 1947 సెప్టెంబర్‌లో పట్టపగలు ఒకే చోట 23మందిని ఊచకోత కోసారు...
 

వరంగల్‌ జిల్లా బైరాన్‌పల్లిలో రజాకార్లపై తిరుగుబాటు చేసిన ఫలితం 86మంది యువకుల బలి... బైరాన్‌పల్లిలో సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన దొడ్డి కొమరయ్య అమరవీరుడు... ఇక తెలంగాణలో భూపోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ.... పాలకుర్తిలో నిజాం తొత్తుగా ఉన్న భూస్వామి రామచంద్రారెడ్డి అనుచరులను తరిమికొట్టింది..
నిజాంకు వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రజా ఉద్యమం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మారింది. వామపక్షాలు దానికి నాయకత్వం వహించాయి. నిజాం పాలనలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది సాయుధ పోరాటం...
 

రజాకార్లతో పాటు, జమీన్‌ దార్ల ప్రైవేటు సైన్యాలతో కూడా పోరాటం జరపాల్సి వచ్చింది. 1947 నాటికి పూర్తిస్థాయి యుద్ధంగా మారింది. గెరిల్లా యోధులు తయారయ్యారు... ఫలితం,. పది లక్షల ఎకరాలను పంచిపెట్టారు..
నిజాం దురంతానికి చెరమగీతం పాడుతూనే వ్యవసాయ విప్లవ సమస్యను తెరమీదకు తీసుకువచ్చిన ఘనత ప్రతిఘటనోద్యమానికే దక్కుతుంది....నిజాం తరువాత కూడా ప్రభుత్వాలు భూసంస్కరణలు చేపట్టాయంటే, తెలంగాణ సాయుధ పోరాటం ఫలితమే...
 

3
 

వీరోచిత రైతాంగ పోరాటంలో దాదాపు నాలుగువేల మంది అమరులయ్యారు... పది వేల మంది జైళ్లలో మగ్గారు.. వామపక్ష యోధులు ఒకవైపు.. ఆర్యసమాజ వీరులు మరోవైపు తీవ్రంగా అణచివేతకు గురైనా యుద్దం ఆగలేదు. దాదాపు సంవత్సరం పాటు భారత ప్రభుత్వం పట్టించుకోలేదు... కానీ, ఉద్యమం తీవ్రమైన కొద్దీ భారత యూనియన్‌ కదలక తప్పలేదు.. సర్దార్‌ పటేల్‌ పూనికతో ప్రారంభమైన సైనిక చర్య అయిదు రోజుల్లోనే నిజాంను కరాచీ దాకా తరిమికొట్టింది...
 

``భారత స్వాతంత్య్రం వల్ల ఏర్పడే సమస్యల గురించి, పేదల గురించి నేను 1947 జూన్‌ 12తేదీన్నే చెప్పాను... మళ్లీ 1947 జూలై 14న పబ్లిగ్గా ఉపన్యసించాను.. ఇప్పుడు మళ్లీ అదే చెప్తున్నా.. ఈ నా సంస్థానానికి సంబందించినంత వరకు నేను స్వతంత్ర ప్రభువును.. బ్రిటిష్‌ వారు ఇంటిదారి పట్టడంతో నేను సంపూర్ణంగా స్వతంత్రుడనైనట్లు ప్రకటిస్తున్నా..'' ఇది నిజాం నవాబు పలికిన బీరాలు.. ఓవైపు తనకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధాన్ని తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేస్తూనే దక్షిణ పాకిస్తాన్‌గా హైదరాబాద్‌ను మార్చే దుష్ట పన్నాగం పన్నిన వాడు నిజాం... అతడి ఆగడాలను నిరోధించాలన్న ఆలోచన చేయటానికి భారత ప్రభుత్వానికి స్వతంత్రం వచ్చిన తరువాత 13 మాసాలు పట్టింది. వేలమంది అమరులైన సమాచారం అందినా మొదట్లో మీనమేషాలు లెక్కించిన నెహ్రూ సర్కారు.. చివరకు సర్దార్‌ పటేల్‌ చొరవతో సైనిక చర్యకు పూనుకుంది. 1948 సెప్టెంబర్‌ 13న నిజాంపై సైనిక చర్య ప్రారంభమైంది. మొదట్లో బీరాలు పలికిన నిజాం అయిదు రోజుల్లోనే తోకముడిచాడు...సెప్టెంబర్‌ 17న పటేల్‌ ముందు మోకరిల్లి, పాకిస్తాన్‌కు పారిపోయాడు..
 

హైదరాబాద్‌కు విమోచనం అలా లభించింది. భారత యూనియన్‌లో కలిసింది. జీవచ్ఛవాలుగా మారిన ప్రజల కళ్లల్లో మళ్లీ జీవం తొణికిసలాడింది. కానీ, ఇక్కడే తెలంగాణ సాయుధ పోరాటం కొత్త మలుపులు తిరిగింది. ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఉద్యమం ఆర్జించిన లాభం ఎంతో నష్టమూ అంతే...వామపక్ష విప్లవయోధులు నిజాం తొత్తులపై ఎక్కుపెట్టిన తుపాకులను భారత సైన్యం వైపు తిప్పారు... హైదరాబాద్‌ను స్వతంత్రం చేయాలన్న నాటి కమూ్యనిస్టు నాయకుల తలంపు తెలంగాణ యోధులకు నేటికీ గుర్తింపు లేకుండా చేసింది. మిగతా స్వాతంత్య్ర యోధులకు ప్రభుత్వం వల్ల లభించిన ప్రయోజనాలు వీరికి దక్కకుండా పోయాయి. నిజాం పాలిత ప్రాంతాల్లో తాము సాధించిన విజయాలు, తెలంగాణాను భారతావనిలో భాగంగా కాకుండా, ప్రత్యేక విముక్తి ప్రాంతంగా ప్రకటించేలా చేయాలన్న తలంపు వివాదాస్పదమైంది.
 

కమూ్యనిస్టు నేత నిర్ణయంతో దాదాపు రెండు వేల మంది గెరిల్లా యోధులు 50వేల మంది భారత సైనికులతో పోరాడాల్సి వచ్చింది. వేల మంది డిటెన్షన్‌ సెంటర్లలో, జైళ్లల్లో భారత సైన్యంపై పోరాటం చేయాల్సి రావటం ఎంతవరకు సమంజసమనే మీమాంస కమూ్యనిస్టుల్లోనే మొదలైంది. ఒక వర్గం పోరాటాన్ని కొనసాగించాలంటే, మరో వర్గం వద్దని వారించటం.. మొత్తం మీద ఉద్యమం నీరుగారిపోయింది.
 

ఈ కారణంగానే భారత స్వాతంత్య్ర సంగ్రామంతో పాటు, నిజాం నియంతకు వ్యతిరేకంగా చేసిన పోరాట యోధులు మాత్రం చీకటిమాటునే కనుమరుగు కావలసి వచ్చింది. కమూ్యనిస్టులు చీలిపోవటానికి కారణం ఏదైనప్పటికీ, సామూహిక జనహననానికి కారణమైన నిజాంను ఎదిరించిన వీరులు అన్యాయమైపోయారు.. 

http://kovela.blogspot.in/2009/09/blog-post_16.html

తెలంగాణ విమోచనోద్యమం


నిజాం సంస్థానం

హైదరాబాద్ సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్ ఆలీ ఖాన్ నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాద్ సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్ (కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్ర్యోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం[1] నానా అరాచకాలు సృష్టించారు.[2] హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది. రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాపరెడ్డి తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు వారికి స్పూర్తినిచ్చే కవులు, రచయితలు మూలంగా 1948లో ఉధృతరూపం దాల్చి చివరికి భారత ప్రభుత్వం సైనిక చర్యతో నైజాం సంస్థానాన్ని సెప్టెంబర్ 18, 1948న భారత్ యూనియన్‌లో విలీనం చేసుకుంది.

నిజాం పాలనలో దురాగతాలు

నీ బాంచన్ కాల్మొక్త అంటూ బతుకులీడ్చిన ప్రజలు నిజాం పాలనపై ఎదురు తిరగడానికి అంతులేని దురాగతాలే కారణం. నిజాం పాలన చివరి దశలో మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకారు దళాల దురాగతాలకు అంతు ఉండేదికాదు. రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. నాడు వేలమంది మహిళలు మానభంగాలకు గురయ్యారు. హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు. నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. గోళ్ళ కింద గుండుసూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు. సిగరెట్లతో కాల్చేవారు. బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసేవారు.[3] ప్రజల వద్ద నుంచి ముక్కుపిండి పన్నులు వసూలుచేసేవారు. ధాన్యాలను బలవంతంగా లాక్కొనేవారు. ప్రజలు తిండిలేక అలమటిస్తే పట్టించుకొనేవారు కాదు. నిజాంచే ఉసిగొల్పిన రజాకార్లు విచ్చలవిడిగా గ్రామాలపై పడి ఇండ్లు తగలబెట్టి, అందినకాడికి దోచుకొనేవారు. ఈ భయంకర పరిస్థితిని చూసి వందేమాతరం రామచంద్రరావు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నిజాం దుర్మార్గాలపై లేఖ అందించాడు.
తమ జల్సాలకు విలాస జీవితానికి సరిపోయే విధంగా 90 రకాల పన్నులు విధించారు. ప్రజల బతుకు అధ్వాన్నమైంది. పన్నుల కట్టలేని పరిస్థితిలో గోళ్ళూడగొట్టారు. లెవీ కొలువకపోతే ఊరి మీద పడి రైతులు తినడానికి ఉంచుకున్న ధాన్యాన్ని దోచుకెళ్ళిన సంఘటనలనేకం. ఎదిరించినందుకు బైరాన్‌పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్‌లో వెయ్యిమందిని ఉరితీశారు, గాలిపెల్లిని తగులబెట్టారు. ఇలాంటి సంఘటనలు లెక్కలేనివి. నిజాం రాజుల దృష్టిలో ప్రజలంతా ‘బాంచె’లు(బానిసలు). సామాజికంగా 'వెట్టి' అనే బానిసత్వ పద్ధతి అమల్లో ఉండింది. యార్‌జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇత్తెహాదుల్ బైనుల్ముస్లమీన్ సంస్థ బలవంతంగా హిందువులను ముస్లింమతంలోకి మార్పిడి చేసేది. ఎదురు తిరిగిన వారిపై అరాచకంగా ప్రవర్తించేవారు. రజాకార్ మూఠాలు స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్రలను చేసి ఎత్తుకుపోయేవారు.[4]
దోపిడీ దృష్టి తప్ప స్థానిక ప్రజల పట్ల గౌరవం ఏమాత్రంలేదు. సంస్థాన ఉద్యోగాల్లో స్థానిక ప్రజల్ని పెట్టుకోకుండా ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించారు. స్థానిక భాషల్ని, సంస్కృతులను అన్ని దశల్లోనూ నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ‘అరబ్బీ-అమృతం, పారశీ-తేనె ఉర్దూ-కండశర్కర, తక్కిన భాషలన్నీ ఒంటికాలికింది దుమ్ము’ అని ఈసడించుకున్నారు. స్థానిక ఉర్దూను సైతం హీనంగా చూశారంటే తెలుగు పరిస్థితికి దిక్కులేదు. తుర్రేబాజ్‌ ఖాన్ ‌, బందగి , షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు. 1942లో షేక్ బందగీ ని విసునూరు రామచంద్రారెడ్డి అనే భూస్వామికి చెందిన గూండాలు హత్యచేశారు.

సర్దార్ పటేల్ పాత్ర,

సైనిక చర్య విజయవంతం కావడానికి అప్పటి బారత హోంశాఖా మంత్రి సర్దార్ పటేల్ కృషి ఎంతో ఉంది. సర్దార్ వల్లభ్ భాయిపటేల్ రాజకీయ చతురతతో పోలీసు చర్య జరిపి నిజాం పాలనకు చరమగీతం పలికాడు. హైదరాబాదును ప్రత్యేక దేశంగా ఉంచాలని కనీసం పాకిస్తాన్‌లోనైన విలీనం చేయాలని విశ్వప్రయత్నం చేసిన నిజాం పన్నాగాలను పటేల్ బద్దలు కొట్టాడు. నిజాం ఐక్యరాజ్యసమితికి భారతదేశంపై ఫిర్యాదు చేయడానికి దూతలను కూడా పంపాడు. భారతదేశంపై పోరాటానికి విదేశాల నుంచి ఆయుధ దిగుమతికి ప్రయత్నాలు చేశాడు. అయినా అతని ఆటలు, నిజాం ప్రధాని లాయక్‌అలీ నాటకాలు పటేల్ ఎదుట పనిచేయలేవు. పోలీసు చర్యలో భాగంగా నలువైపులా నుంచి వస్తున్న భారత బలగాలను చూసి నిజాం కింగ్‌కోఠి నుంచి బయటకు వచ్చి భారత ప్రతినిధి కె.ఎం.మున్షీని కలిశాడు. అప్పటికే సమాచారసాధనాలు తెగిపోవడంతో ఎటూ అర్థంకాక కాళ్ళబేరానికి దిగాడు.[5] లొంగుబాటుకు మించిన తరుణోపాయం లేదను మున్షీ చెప్పడంతో నిజాం ఒప్పుకోకతప్పలేదు. బొల్లారం వద్ద నిజాం నవాబు సర్దార్ పటేల్ ఎదుట తలవంచి లొంగిపోవడంతో సెప్టెంబరు 17, 1948న హైదరాబాదు రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది. అప్పుడు ఇక్కడి ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం లభించింది. నిజాం ప్రధాని లాయక్‌అలీని తొలిగించడమే కాకుండా ప్రజలకు నరకయాతన చూపించిన ఖాసింరజ్వీని అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాదు అసెంబ్లీని రద్దుచేయబడింది. హైదరాబాదు రోడ్లమీద ఇక తలెత్తుకుతిరగలేమని భావించిన లాయక్‌అలీ, ఖాసింరజ్వీలు మూటాముల్లెలు సర్దుకొని పాకిస్తాన్ పారిపోయారు.

ఆపరేషన్ పోలో

నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు. జనరల్ జె.ఎన్.చౌదరి నేతృత్వంలో సెప్టెంబర్ 13, 1948న సైనిక చర్య మొదలైంది. సైన్యం రెండు భాగాలుగా విడిపోయి విజయవాడ నుంచి ఒకటి, బీదర్ దిశగా రెండోది కలిసింది. మొదటి రెండు రోజులు నిజాం సైన్యం తిరగబడినా ఆ తర్వాత క్షీణించింది. తాను ఓటమి అంచుల్లో ఉన్నట్లు గమనించి నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో లేక్‌వ్యూ అతిథి గృహంలో బంధించిన భారత ఏజెంట్ మున్షీని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దీనితో ఆపరేషన్ పోలో విజయవంతమైంది.సెప్టెంబర్ 13న జె.ఎన్.చౌదరి నాయకత్వాన ప్రారంభమైన దాడి సెప్టెంబర్ 17న నిజాం నవాబు లొంగిపోవడంతో ఆపరేషన్ పోలో పేరుతో చేపట్టిన చర్య పూర్తయింది.సెప్టెంబర్ 18న సైనిక చర్యకు నేతృత్వం వహించిన జె.ఎన్.చౌదరి సైనిక గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేశాడు. ఎం.కె.వెల్లోడి ప్రధానిగా నియమించబడ్డాడు.

ఉద్యమ స్పూర్తి ప్రధాతలు

తెలంగాణ సాయుధ పోరాటంలో పురుషులు, స్త్రీలు, పిల్లలు అనే తేడాలు లేకుండా తుపాకులు, బడిసెలు పట్టి రజాకార్ల మూకలను తరిమికొట్టారు. మహబూబ్ నగర్ జిల్లాలో అప్పంపల్లి, ఆదిలాబాదు జిల్లాలో నిర్మల్, సిర్పూర్, కరీంనగర్ జిల్లాలో మంథని, మహమ్మదాపూర్, నల్గొండ జిల్లాలో మల్లారెడ్డిగూడెం, నిజామాబాదు జిల్లా ఇందూరు, తదితర ప్రాంతాలలో పోరాటం పెద్దఎత్తున సాగింది. జమలాపురం కేశవరావు, లక్ష్మీనరసయ్య, ఆరుట్ల కమలాదేవి, రావి నారాయణరెడ్డి, ధర్మబిక్షం, చండ్ర రాజేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొహియుద్దీన్ , షోయబ్ ఉల్లాఖాన్ , మల్లు స్వరాజ్యం, రాంజీగోండ్, విశ్వనాథ్ సూరి, దొడ్డి కొమరయ్య, బెల్లం నాగయ్య, చండ్ర రాజేశ్వరరావు, కిషన్ మోదాని తదితరులు తెలంగాణ విమోచనానికి కృషిచేశారు. వీరందరి స్పూర్తితో సామాన్య ప్రజలు సైతం ఊరుఊరున, వాడవాడన నిజాం పాలనపై తిరగబడ్డారు. కర్రలు, బరిసెలు, గుత్పలు, కారం ముంతలు, వడిసెలను ఆయుధాలుగా మలుచుకొని పోరాడారు. బర్మార్లు, తుపాకులను సంపాదించుకొని యుద్ధరంగంలోకి దిగారు.

వివిధ జిల్లాలలో తెలంగాణ సాయుధపోరాటాలు

ఆదిలాబాదు జిల్లా

ఆదిలాబాదు జిల్లాలో తెలంగాణా సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన వ్యక్తులుగా రాంజీ గోండు, కొమరంభీం ప్రసిద్ధిచెందినారు.[6] నిర్మల్ కేంద్రంగా చేసుకొని ఎందరో పోరాటయోధులు రజాకార్లను ఎదిరించారు. బ్రిటీష్ వారికి తొత్తులుగా ఉంటూ నైజాం సంస్థానాన్ని నడిపించిన వారిపై తిరగబడ్డారు. జల్-జమీన్-జంగల్ కోసం గిరిజనుల తరఫున పోరాడిన కొమరంభీం, రాంజీగోండుల పోరాటాలు, త్యాగాలు గుర్తుచేసుకోవడానికి సెప్టెంబర్ 17న పలు రాజకీయపార్టీలు పోటాపోటీ ఏర్పాట్లుచేసుకుంటాయి. రాంజీగోండుతో పాటు అతని వెయ్యిమంది అనుచరులను మర్రిచెట్టుకు సామూహికంగా ఉరితీశారు. ఆ మర్రి "గోండ్ మర్రి", "ఉరులమర్రి"గా ప్రసిద్దిచెందింది.[7] ఇదే వెయ్యి ఉరులమర్రి సంఘటనగా ప్రసిద్ధిచెందింది. ప్రస్తుతం ఆ చెట్టు లేదు.[8] ఆ ప్రాంతంలో అమరవీరుల స్తూపం ఉంది. గోపిడి గంగారెడ్డి, గంగిశెట్టి విఠల్‌రావు, రాంపోశెట్టి, భీంరెడ్డి తదితరులు తెలంగాణ విమోచనోద్యమ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారు. నిజాం సంస్థానంపై పోలీసుచర్య ప్రారంభమై విమోచన పూర్తయ్యే వరకు 5 రోజులపాటు ఆసిఫాబాదు వాసులు ప్రాణాలకు పణంగా పెట్టి అలుపెరుగని పోరాటం చేసి రజాకార్లను ముప్పుతిప్పలు పెట్టారు.

కరీంనగర్ జిల్లా

కరీంనగర్ జిల్లాలో తెలంగాణా సాయుధ పోరాటానికి హుస్నాబాదు మండలం మహ్మదాపూర్ గ్రామానికి ప్రత్యేకస్థానం ఉంది. నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలు సాయుధపోరాటం బాటపట్టారు. నిజాం అరాచకాలు భరించలేక వారికి తరిమికొట్టేందుకు సిద్ధమయ్యారు. తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన అనభేరి ప్రభాకరరావు, సింగిరెడ్డి భూపతిరెడ్డిల నాయకత్వంలో ప్రజాసైన్యం మార్చి 14, 1946న మహ్మదాపూర్ చేరగా నిజాం సైనికులు అత్యంత పాశవికంగా గుండ్ల వర్షం కురిపించారు.[9] మంథనికి చెందిన రఘునాథరావు కాచే జిల్లాలో మొట్టమొదటి సత్యాగ్రహిగా నిజాం పాలనను వ్యతిరేకించి చరిత్ర సృష్టించాడు. దేశమంతటా ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ పొందగా నిజాం సంస్థానం ప్రజలకు స్వాతంత్ర్యం లేకపోవడంతో నిజాం పాలనకు చరమగీతం పాడేందుకు మంథని సమరయోధులు ప్రాణాలు కూడా లెక్కచేయక ఉద్యమానికి ముందు ఉండి పోరాటాన్ని కొనసాగించారు. రావి నారాయణరెడ్డి పిలుపుతో పనకంటి కిషన్ రావు, సువర్ణ ప్రభాకర్, చొప్పకంట్ల చంటయ్య, డి.రాజన్న, రాంపెల్లి కిష్టయ్య, ఎలిశెట్టి సీతారాం తదితరులు సాయుధ సంగ్రామంలో దూకి బెబ్బులి వలె గర్జించారు. శ్రీరాములు నేతృత్వంలోని బృందం స్పూర్తితో మహదేవ్ పూర్ తాలుకాలోని ప్రజలు ఉద్యమంలోకి దూకారు. వేధింపులు అధికం కావడంతో శ్రీరాములు అజ్ఞాతంలోకి వెళ్ళి సెప్టెంబర్ 17, 1948న బయటకు వచ్చాడు. 1952 శాసనసభ ఎన్నికలలో శ్రీరాములు శాసనసభ్యుడిగా విజయం సాధించాడు.

ఖమ్మం జిల్లా

తెలంగాణా ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పిచేస్తూ భోగలాలసమైన, విలాసవంతమైన జీవితాలు గడిపే నిజాం నిరంకుశ పాలన రోజుల్లో ఖమ్మం జిల్లాలో సాయుధ పోరాటం ఉధృతంగా సాగించి. ఇల్లెందు, బూర్గంపాడు, భద్రాచలం పరిధిలో రజాకార్లతో సాగించిన పోరాటం చారిత్రాత్మకం. అనేక ప్రజాఉద్యమ దళాలకు తుమ్మ శేషయ్య, పాటి జగ్గయ్య, సుంకరి మల్లయ్య, దామినేని వేంకటేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు.[10] జమలాపురం కేశవరావు కలెక్టరేట్ కార్యాలయంలోని ఉద్యోగాన్ని వదిలి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. బొమ్మకంటి సత్యనారాయణరావు స్వచ్ఛందదళాన్ని ఏర్పాటుచేసి మతదురహంకారులైన రజాకార్లపై దాడులు నిర్వహించి ప్రజల పక్షాన నిలిచాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు జాయిన్ ఇండియా ఉద్యమానికి ఖమ్మంలో నాయకత్వం వహించి రజాకార్లను ఎదుర్కొన్నాడు. మాజీ ఎమ్మెల్సీ కవి, నవలాకారుడైన హీరాలాల్ మోరియా జాయిన్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజలకు అండగా నిలబడ్డాడు.

మెదక్ జిల్లా

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, విముక్తి కోసం జరిగిన పోరాటంలో మెదక్ జిల్లాకు చెందిన పలువులు యోధులు పాలుపంచుకున్నారు. నైజామ్ పోలీసుల చిత్రహింసలు, నిర్భంధాలు, జైలుశిక్షలకు కూడా లెక్కచేయకుండా పోరాటం కొనసాగించారు. ఆయుధాలను చేతపట్టి మిలటరీలా దాడులు చేస్తూ రజాకార్లను గడగడలాడించారు. నిజాం నవాబు హిందూ దేవాలయాలలో భజనలు చేయవద్దని హుకుం జారీచేస్తే దాన్ని ధిక్కరించి భజనలు చేశారు. నైజాం సర్కారు ఆజ్ఞలను ధిక్కరించి ఆగస్టు 15న జాతీత జెండాలను రెపరెపలాడించారు. మెదక్ పట్టణానికి చెందిన చోళ లింగయ్య ఇండీయన్ నేషనల్ ఆర్మీలోని ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకున్న మిలటరీ పరిజ్ఞానంతో రజాకార్ల దాడులను తిప్పికొట్టడం కోసం రక్షణ దళాన్ని ఏర్పాటుచేశాడు.[11] వెల్దుర్తి మాణిక్యరావు తన రచనల ద్వారా అక్షరాయుధాలను సంధించి నిజాంపై గళమెత్తాడు. అనేక పత్రికలలో వ్యాసాలు, కవితలు రాసి ప్రజలలో చైతన్యం నింపినాడు. మాణిక్యరావు రాసిన "రైతు పుస్తకం" ను నిజామ్ సర్కారు నిషేధించింది. తొలి ఆంధ్రమహాసభలు జిల్లాలోని జోగిపేటలోనే నిర్వహించారు. 1946లో జిల్లాలోని కందిలో ఈ సభలు జరిగాయి.

నల్గొండ జిల్లా

తెలంగాణ విమోచనోద్యమానికి బీజాలు పడింది నల్గొండ జిల్లాలోనే. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్యల స్పూర్తితో ఎందరో పోరాటయోధులు తయారై నిరంకుశ నిజాంకు, అతడి తొత్తులైన రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమించారు. సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా నిజాం తూటాలకు అమరుడైన వ్యక్తిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో నిలిచాడు. [12] విసునూరు ప్రాంతంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధీరత్వం పలువురికి మార్గదర్శకం చేసింది. నల్గొండ జిల్లాలో తెలంగాణా సాయుధ పోరాటానికి కేంద్రబిందువు మల్లారెడ్డి గూడెం. ఖాసింరజ్వీ నిరంకుశ విధానాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర మల్లారెడ్డి గూడెం పోరుబిడ్డలది. చిన్నపిల్లలు సైతం వరిసెలతో రాళ్ళు రువ్వి నైజాం నిరంకుశత్వాన్ని పారదోలేందుకు నడుం బిగించారు.[13] 1946 డిసెంబరు 1న నిజాం మిలటరీ అకస్మాత్తుగా గ్రామంపై దాడిచేయగా రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన అప్పిరెడ్డి, ముంగి వీరయ్య, నందిరెడ్డి నర్సిరెడ్డి, అలుగుల వీరమ్మలు కాల్పులకు గురయ్యారు.[14]. వీరి మరణానంతరం నిజాం ప్రభుత్వం 400మందిని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసింది. ఈ సంఘటన జిల్లా పోరాట చరిత్రలోనే ప్రధాన భూమిక వహించింది. ఆరుట్ల రాంచంద్రారెడ్డి, కమలాదేవి, రేణికుంట రామిరెడ్డి కదలనుపాక ప్రాంతములో ఉద్యమానికి ఊపిరిపోశారు. కరీంనగర్ నుంచి వచ్చిన రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డిలు ఉద్యమానికి దోహదపడ్డారు. కొండవీటి రాధాకృష్ణ, కొండవీటి సత్తిరెడ్డి, రామలింగారెడ్డి, మల్లుస్వరాజ్యం, కోదాటి నారాయణరావు తదితరులు నిరంకుశ నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడినారు.

మహబూబ్ నగర్ జిల్లా

నిరంకుశ నిజాం పాలనకు, దాష్టీక రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ పట్టణ ఉద్యమకారులకు వేదికగా నిలిచిన తూర్పుకమాన్

మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి సంఘటన. 1947 అక్టోబర్ 7న ఆత్మకూరు, అమరచింత సంస్థాన పరిధిలోని అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ భారతదేశంలో విలీనం చేయాలని బెల్లం నాగన్న నాయకత్వంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. అప్పంపల్లి పరిసర గ్రామాలైన నెల్లికొండ, వడ్డేమాన్, దాసరపల్లి, లంకాల, అమరచింత తదితర గ్రామాలకు చెందిన రెండువేల ఉద్యమకారులు తెలంగాణ విమోచన కొరకు సత్యాగ్రహం చేశారు. ఈ సత్యాగ్రహాన్ని అణచివేయడానికి నిజామ్ సైనికులకు చేతకాలేదు. మహబూబ్ నగర్ నుంచి రిజర్వ్‌డ్ దళాలను రప్పించి సైనిక చర్య జరిపారు. బెల్లం నాగన్నతో పాటు పలు ప్రముఖులను అరెస్టు చేయాలని నిజాం సైనికులు నిర్ణయించిననూ ప్రజలు ప్రతిఘటించడంతో తోకముడిచారు. ఆ సాయంత్రం ఉద్యమకారులపై కాల్పులు జరిపడంతో 11 మంది ఉద్యమకారులు మరణించగా, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.[15] అదే సమయంలో నెల్లికొండికి చెందిన కుక్కుల కిష్టన్న తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన ఘనకార్యాన్ని చాటి చెప్పాడు. అప్పటి తాలుకా గిర్దావర్ మరియు పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఇతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్తుండగా ప్రజల ప్రతిఘటనకు భయపడి కిష్టన్నను వదిలి పారిపోయారు. మహబూబ్ నగర్ పట్టణంలో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా తూర్పుకమాన్‌పై జాతీయజెండాను ఎగురవేయాలని స్వాతంత్ర్యసమరయోధులు సంకల్పించారు. నిజాంపోలీసుల కళ్ళుగప్పి ఉద్యమకారులు తూర్పుకమాన్‌పై జెండాను ఎగురవేసి తమపంతం నెగ్గించుకున్నారు. తూర్పుకమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్యసమాజ్ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలయోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కోడంగల్‌లో గుండుమల్ గోపాలరావు. కల్వకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, అయిజలో దేశాయి నర్సింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు.

[మార్చు] నిజామాబాదు జిల్లా

జిల్లాలోని నీలకంఠేశ్వర ఆలయం ప్రాంగణంలో జరిగిన ఆంధ్రమహాసభ తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిపలికింది. నిజాం వ్యతిరేక పోరాటంలో జిల్లాలో ఇందూరు మొదట నిలిచింది.[16] ఆర్యసమాజం స్పూర్తినిచ్చింది. ఇందూరులో రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన కిషన్ మోదానిని ముష్కరులు కాల్చిచంపారు. ఆయన మరణంతో ఉద్యమం తీవ్రమైంది. వందలాది తెలంగాణ విమోచన యోధులను నిజామాబాదు ఖిల్లా జైలులో బంధించి నిజాం అకృత్యాలకు పాల్బడ్డాడు. ఈ ఖిల్లా వందలాది యోధుల మరణానికి మూగసాక్షిగా నిలిచింది. ఇది రాజకీయ ఖైదీలకు బొందలగడ్డ అని నిజాం ప్రకటించాడు. ఈ అణచివేటలను నిరసిస్తూ అక్కడే ఉన్న ప్రముఖ కవి దాశరథి ఓ నిజాము పిశాచమా అని గద్దించాడు. నిజామాబాదు జైలులో ఉన్నప్పుడే ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే గేయాన్ని ఖిల్లా జైలు గోడలపై రాశాడు. కామారెడ్డి ప్రాంతంలో రైతుల వద్ద నుంచి బలవంతంగా సేకరించిన ధాన్యాన్ని భిక్నూరు రైల్వేస్టేషన్ సమీపంలోని గిర్నీలో దాచేవారు. 1947లో సాయుధ యోధులు ధాన్యాగారంపై దాడిచేశారు. ఈ సంఘటనలో కీలకపాత్ర వహించిన కుర్రిబాల్ లింగం, వెంకటబాలయ్య తదితర ఐదుగురిని నిజామాబాదు ఖిల్లాజైలుకు పంపింవారు. తాడ్వాయి మండలానికి చెందిన రాఘవరెడ్డి ఆర్యసత్యాగ్రహంలోపాల్గొని 6 నెలలు జైలుకు వెళ్ళాడు. కామారెడ్డికి చెందిన ప్రముఖ చిత్రకారుడు ఫణిహారం రంగాచారి నిజామ్ దురాగతాలపై చిత్రాలు గీసి, ప్రదర్శించి ప్రజలలో చైతన్యం తెచ్చాడు. ఇతని చిత్రాలు ఇప్పటికీ హైదరాబాదులోని ముక్దుం భవన్‌లో ఉన్నాయి. బాన్సువాడకు చెందిన లక్క కిష్టయ్య 100 మంది యువకులతో ఆయుధాలు చేపట్టి నిరంకుశ నిజాంకు, దాష్టీక రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించాడు. రజాకర్ ఖాసింరజ్వీ తమ్ముడు అబ్బాస్ రజ్వీ కామారెడ్డి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన కాలంలో అతను పెట్టిన బాధలను అనుభవించిన వారిలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బి.బాలయ్య ఒకరు.[17] దేశభక్తి గీతాలు పాడినందుకు చావుదెబ్బలు తినవలసి వచ్చింది. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామంలో సుంకి కిష్టయ్య నిజామ్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు.[18] 1947 గాంధీజయంతి రోజున కళ్యాణిలో జరిగిన పోరాటంలో ఏడుగురిని అరెస్టు చేసి బీదర్ జైల్లో ఉంచారు. మారుమూల పల్లె మానాల రజాకార్ల గుండెల్లో రైళ్ళు నడిపించింది. తెలంగాణ విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా తుపాకులు, మందుగుండులు స్వతంగా తయారుచేసుకున్నారు. ఆర్మూర్, కామారెడ్డి, సిర్పూర్ ప్రాంతాలకు మానాల కేంద్రంగా పనిచేసింది. బద్దం ఎల్లారెడ్డి తదుతరులు ఇక్కడే పోరాటయోధులకు గెరిల్లా శిక్షణ ఇచ్చేవారు.

వరంగల్ జిల్లా

కాకతీయులు ఏలిన గడ్డపై రజాకార్లను ఎదిరించిన వ్యక్తిగా బత్తిన మొగలయ్య గౌడ్ చరిత్రలో నిలిచిపోయారు.[19] స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు ప్రాణాలకు తెగించి ఊరూరా త్రివర్ణ పతాకాలు ఎగురవేస్తూ దేశభక్తిని చాటుతున్న సమయంలో వరంగల్ తూర్పు కోటలో బత్తిన మొగులయ్య గౌడ్ ఆగస్టు 11, 1946న రజాకార్ల దాష్టీకాలకు గురై బలయ్యాడు. దీనితో వరంగల్లులో రజాకార్ల ఉద్యమం ఊపందుకుంది. బైరాన్‌పల్లి గ్రామంపై పడి ఊరును వల్లకాడు చేసి దొరికినవన్నీ నేలరాల్చి కౄరత్వాన్ని ప్రదర్శించిన రజాకార్లు కూటిగల్లు మీద అదే ప్రతాపాన్ని చూపారు. 18మందిని నిలబెట్టి రాక్షసంగా కాల్చిచంపారు. ఆ తర్వాత విమోచనకారులు నిజాంపై, రజాకార్లపై ఎదురుదాడులకు తిరిగారు. చాకలి ఐలమ్మ ధీరత్వం పలువురికి మార్గదర్శకం చేసింది. పోరాటయోధులు తొర్రూరులో పోలీసు క్యాంపుపై దాడిచేసి దాన్ని లేవనెత్తించారు. అమ్మాపురంకు చెందిన అనేకమంది పోరులో పాల్గొన్నారు.

హైదరాబాదు

హైదరాబాదులో మరియు ఇప్పటి రంగారెడ్డి జిల్లా ప్రాంతాలలో కూడా నిజాం మరియు రజాకార్ల బాధలను పడలేక ప్రజలు ఎదురు తిరిగారు. నారాయణరావు పవార్, గంగారాం ఆర్య, జగదీష్ ఆర్య, కొక్కుడాల జంగారెడ్డి, వెదిరె రమణారెడ్డి, ఆర్.కేశవులు, తొండుపల్లి వెంకటరావు, మందుముల నర్సింగరావు, షోయబుల్లాఖాన్, కాటం లక్ష్మీనారాయణ తదితరులు నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేశారు. నారాయణరావు పవార్ ఏకంగా నిజాంపై బాంబులు విసిరి సంచలనం సృష్టించాడు. షోయబుల్లాఖాన్ తన ఇమ్రోజ్ పత్రికలో నిజాంకు వ్యతిరేకంగా వ్యాసాలు రచించినందుకు నడిరోడ్డుపైనే గుండాల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. రజాకారుల నిరంకుశత్వానికి విసిగిపోయి శంషాబాద్ ప్రాంతానికి చెందిన గంగారం నారాయణరావు పవార్‌తో కలిసి నిజాంపై బాంబుదాడిలో పాల్గొన్నాడు. శంషాబాదుకే చెందిన గండయ్య హిందువులను నీచంగా చూడడం భరించలేక పోరాటాన్ని ఉధృతం చేశాడు. అతన్ని అరెస్టు చేసి జైల్లోవేసిన పిదప క్షమాపణలు చెబితే వదిలివేస్తామని నచ్చజెప్పిననూ ఆయన అందుకు నిరాకరించాడు.[20] ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు పోరాటయోధులకు పెట్టనికోటలాంటివి. ఇప్పటి రంగారెడ్డి-నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న రాచకొండ గుట్టలను పోరాటయోధులు సమర్థంగా వినియోగించుకున్నారు. వీరిలో మద్దికాయల ఓంకార్ ప్రముఖుడు. యాచారం ప్రాంతంలో బర్ల శివయ్య విమోచనఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. పరిగి మండలానికి చెందిన అల్కిచర్ల అంతయ్య, ధరూరు మండలమునకు చెందిన రుమ్మ కిష్టప్పలు కూడా పోరాటంలో పాల్గొన్నారు. రాజాకార్ సైన్యంలోని ఒక శాఖ ఉన్న షాబాద్‌లో రజాకార్లను ఒంటిచేతితో ఎదుర్కొన్న ఘనత కిష్టయ్య జోషికి దక్కుతుంది. రజాకార్లు తుపాకులు, బల్లేలు పట్టుకొని గ్రామంలో తిరుగుతూ బలవంతపు వసూళ్ళూ, అరాచకాలతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న సమయంలో కిష్టయ్య జోషి ఇంటిలో మర్రిచెన్నారెడ్డి (మాజీ ముఖ్యమంత్రి), సత్యనారాయణ రెడ్డి (మాజీ గవర్నరు) తదితరులు సమావేశమై పోరాటమార్గం చేశారు.

విమోచనోద్యమ కాలంలో స్పూర్తినిచ్చిన గేయాలు

నిజామనగ ఎంతరా ... వాని తహతెంతరా...
అంతగలసి తంతె మల్ల వాని అంతులేదురా.......
నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......
హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు. (కాళోజి)
మన కొంపలార్చిన , మన స్త్రీల చెరిచిన ........
కండకండలుగా కోసి కాకులకు వేయాలె, కాలంబు రాగానె కాటేసి తీరాలె (కాళోజి)
నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా (దాశరథి)
ఓ నిజాము పిశాచమా కానరాడు నినుబోలిన రాజు మాకెన్నెడేని .......
నా తెలంగాణ కోటి రతనాల వీణ (దాశరథి)
నిన్ను గెలవాలేక రైతన్నా......
నిజాం కూలింది కూలన్న (దాశరథి)

కాలరేఖ

  • 1930: మెదక్ జిల్లా జోగిపేటలో మొదటి నిజాం రాష్ట్ర ఆంధ్రమహాసభ జరిగింది.
  • 1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావం. (జూలై)
  • 1938: హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ పై నిషేధం (సెప్టెంబర్).
  • 1938: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం గీతాలాపన.
  • 1944: దొడ్డి కొమరయ్య హత్యతో సాయుధ పోరాటం ప్రారంభం.
  • 1946: నల్గొండ జిల్లాలో నిజాం మిలటరీ దాడి ప్రారంభం.
  • 1946 ఆగష్టు 11: వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో బత్తిని మొగులయ్య గౌడ్ హత్య.
  • 1948 ఆగష్టు 21: పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు దారుణంగా కాల్చిచంపారు.
  • 1948 సెప్టెంబర్ 13 భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలో ప్రవేశించింది.
  • 1948 సెప్టెంబర్ 17: నిజాం లొంగుబాటు.
  • 1948 సెప్టెంబర్ 18: నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్‌లో విలీనం.


సంగిశెట్టి శ్రీనివాస్ చెప్పిన కొన్ని విశేషాలు

  • 1950 ఏప్రిల్ 1న నిజాంకు, భారత ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం ప్రకారం నిజాంకు ఏడాదికి (ఎలాంటి పన్నులు లేకుండా) యాభై లక్షల రూపాయల భరణం చెల్లించడానికి నిర్ణయం జరిగింది. అలాగే నిజాం ప్రపంచంలో ఎక్కడ పర్యటించినా ఆయనకు హైదరాబాద్ రాజుగా పూర్వపు బిరుదులు యథాతథంగా కొనసాగించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. 1950 జనవరి 26వరకు ప్రభుత్వాధినేతగా,1956 అక్టోబర్ 31 వరకు రాజ్ ప్రముఖ్‌గా నిజాం ఉన్నారు.
  • ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా భారత ప్రభుత్వానికి సహకరించాడు. రజాకార్లు తీవ్రం గా వ్యతిరేకించినా హైదరాబాద్ న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంక్‌టన్‌ని కొనసాగించడం ఇందుకు నిదర్శనం.
 http://te.wikipedia.org/wiki/