నా దేవుణ్ణి నేను పూజించుకుంటున్నాను. నా మతాచారాలను, అనూచానంగా వస్తూ ఉన్న సంప్రదాయాలను నేను పాటిస్తున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చి, మీ ఆచారాలు తప్పు, మీ దేవుడు మిధ్య, మా దేవుడు గొప్ప, ఈ విగ్రహాలేంటి, ఆ బొట్టేంటి ఇవన్నీ తప్పు అని చెబితే ఎలా ఉంటుంది? 'ఇక ఈ అనాచారాలను ఆపేసి, మా మతంలో చేరిపో, ఇదిగో నీకీ లాభాలు కలుగుతాయి' అని ఊదరగొడితే ఎలా ఉంటుంది. 'పోనీలే, తన మతాన్ని తాను ప్రచారం చేసుకుంటున్నాడు, మనకెందుకులే' అని ఊరుకోగలమా? నా దేవుణ్ణి కించపరచకుండా తమ దేవుడి గురించి చెప్పుకుంటే అలాగే అనుకోవచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నది అది కాదే! నాగప్రసాదు గారి విషయంలో జరిగిందీ అది కాదు.
నేనూ మత మార్పిడి ప్రచారకులను చూసాను, చూసిన వాళ్ళు చెప్పగా విన్నాను.. ఏ ఒక్ఖరు కూడా తన మతంలోని మంచి వరకు చెప్పి ఊరుకోలేదు. ఎవరూ కూడా నా మతాన్ని విమర్శించకుండా తమ ప్రచారాన్ని ముగించలేదు. నా మతంలోని తప్పులను ఎంచకుండా ఎవరూ ఊరుకోలేదు. అసలు అలాంటివాళ్ళు అసలే ఉండరని అనను. ఉంటేగింటే ఖచ్చితంగా వాళ్ళు గంజాయి వనంలో తులసిమొక్కలని మాత్రం చెప్పగలను.
అందరినీ గౌరవించాలి -అది ధర్మం. కానీ నన్ను తక్కువగా చూసేవాణ్ణి, తేలిక చేసేవాణ్ణి నేనెలా గౌరవించను!? నా దగ్గరకొచ్చి తన దేవుడి గురించి చెప్పి, నా దేవుణ్ణి విమర్శించి, నా ఆచారాలను విమర్శించి, 'నువ్వు మతం మార్చుకుని నా మతంలోకి వచ్చేయ్' అని చెప్పేవాడు సరైన వాడెలా అవుతాడసలు ? 'ఇదిగో మీ మతంలో ఇలా ఉంది, కానీ మా మతంలోనైతే ఇది ఇలా భలేగా ఉంటది' అని చెప్పేవాడు మంచిమాటలు చెబుతున్నట్టా ? అలాంటివాళ్ళను ఎదిరించడం తప్పా? నా మతమంటే నా సంస్కృతి, నా వారసత్వం! తన మతం గొప్పదనం చెప్పుకోడం కోసం, నా సంస్కృతిని విమర్శిస్తే నేను ఊరుకోలేను గదా!
~~~~~~~~~~~~~
వాళ్ళు చాపకింద
నీరులాగా మార్పిళ్ళు చేస్తూంటారు. ప్రచారాలు, ప్రలోభాలు, డబ్బులు,... ఇవీ,
ఇలాంటివీ వీళ్ళ ఆయుధాలు. ఈ ఆయుధాలతో కనిపించని హింస సృష్టిస్తున్నారు.
సమాజంలో కొత్త విభజనలు తెస్తున్నారు. రక్తపాత రహిత కుట్ర ఇది (ఇలా
మార్పిళ్ళు చెయ్యకుండా చట్టాలు తేవడం తప్పని పోపు మనకు చెప్పిన నీతుల గురించి
గతంలో రాసాను.). బలవంతపు మార్పిళ్ళకూ, వీటికీ తేడా లేదు. ఈ మార్పిళ్ళు
అనేక అనర్ధాలకు దారితీయడం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నో అనర్ధాలు
జరిగాయి కూడా! ఇవి సమాజంలో ఉద్రిక్తతలకు, హింసకు దారి తీస్తున్నాయి. ఈ
పరిస్థితి మారాలి. మత మార్పిడిని, అందుకోసం చేసే ప్రచారాలను నిషేధించాలి.http://chaduvari.blogspot.in/2008/10/blog-post.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి