25, జూన్ 2012, సోమవారం

భారతదేశం నిజంగా సెక్యూలరిస్టు దేశమా?

భారత రాజ్యాంగంలో మన దేశం సెక్యూలరిస్టు అని ఉంటుంది. సెక్యూలరిస్టు అంటే అర్థం ఏమిటి? సెక్యూలరిస్టు అంటే ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడడం మరియు ఏ ఒక్క మతానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకపోవడం. మరి మన దేశం నిజంగా సెక్యూలరిస్టు దేశమా అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి.


మనం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలించి నిజంగా భారతదేశంలో సెక్యూలరిజం ఉన్నదో లేదో తేల్చుకుందాం. మొదట ఈ మధ్య మంగుళూరులో జరిగిన ఘటన. ఇది పబ్బు సంస్కృతికి వ్యతిరేఖంగా శ్రీరామ సేనవారు చేసిన ఘనకార్యం. ఈ సంఘటన తరువాత అన్ని పత్రికలు బిజేపీని, RSSను వాటి పద్దతులను విమర్శించాయి. దీని గురించి తరువాత వివరిస్తాను. ఇది జరిగిన కొన్ని రోజులకే బహిరంగంగా ముద్దు పెట్టుకుంటున్నందుకు ఒక జంటపై పోలీసులు కేసు నమోదు చేసారు. అది బహిరంగంగా జరిగినందువల్ల అసభ్యంగా భావించి కేసు పెట్టారు. నిజంగా ముద్దు పెట్టుకోవడం అసభ్యమా? అది పశ్చిమదేశాలలో కాదే? మరి మన దేశంలో మాత్రం ఎందుకు అసభ్యమైంది? ఎందుకంటే అది మన సంప్రదాయం కాదు కాబట్టి మరియు అలాంటి శృంగార కార్యాలు కేవలం ఇంటిలో జరిగితేనే బాగుంటాయి కాబట్టి. అది చూసిన జడ్జిగారు వారిద్దరూ వివాహితులైన జంట కారణంగా ఆ కేసును కొట్టివేసారు. ఇక్కడ పోలీసులు ఎందుకు కేసు పెట్టారు? అది ప్రజలకు ఇబ్బందికరమైనది కాబట్టి. ఇలా ఒక జంట ముద్దులు పెట్టుకున్నందువల్ల మరికొన్ని జంటలు కూడా ఆ బాటలోనే పయనిస్తారు. ఇప్పుడు వీరిరువురికీ వివాహం జరిగింది. రేపు వివాహం జరగనివారు అదే పని చేస్తే? అప్పుడు ఆ జడ్జిగారు ఏమని తీర్పు ఇస్తారు? మన సంప్రదాయం ప్రకారం శృంగారకర్యాలు కాస్త నాలుగు గోడల మధ్య జరిగితే అందం చందం. సరే వివాహితులు కాబట్టి ఏ పనైనా బహిరంగంగా చేయవచ్చా? ఇప్పుడు ముద్దులతో మొదలయ్యింది, రేపు మిగిలిన శృంగార కార్యాలు అ తరువాత కాలకృత్యాలు, ఇక ఇవేగా మిగిలినది. ఇప్పుడు ముద్దులు వివాహితులు పెట్టుకున్నారు, రేపు అవివాహితులు పెట్టుకుంటారు. వారిపై కేసులు నమోదు చేయలేరు పోలీసులు. రేపు మరోసారి ఇలా ముద్దులు బహిరంగంగా పెట్టుకుంటున్న జంటను చూచి పోలీసులు వారు వివాహితులు అని వదిలేస్తారు. ఎందుకంటే ముద్దు పెట్టుకుంటున్న వారందరినీ ఆపి మీకు వివాహం అయ్యిందా అని పోలీసులు వారిని అడిగి, ఓహో అయ్యిందా సరే మీరు కానివ్వండి అని అనాలేమో. అలా అలా అందరూ మొదలుపెడతారు. ఇలాంటి చిన్న చిన్న తీర్పులే సమాజానికి ఎంతో హానికరం. ఒక గౌరవప్రదమైన జడ్జిగారు ఇవ్వవలసిన తీర్పు కాదిది. కానీ ఏమి చేస్తాం, ఇలాంటి వాటిపై మనం హైకోర్టులో పిటీషను వేయలేం కదా. నా ఉద్దేశంలో పై రెండు సంఘటనలకు పెద్ద తేడాలేదు శిక్ష అమలు చేసిన వారిలో తప్ప. ఒకరు (పోలీసులు) చట్టపరంగా అందుకు అర్హులు రెండోవారు (శ్రీరామ సేన) అనర్హులు. పై రెండు ఘటనలవల్ల సమాజానికి చివరికి జరిగేది నష్టమే.


ఇప్పుడు మంగుళూరు సంఘటన కాకుండా డావిన్సీ కోడు సినిమా, దాని మీద జరిగిన వివాదం గురించి మనం మాట్లాడుకుందాం. ఆ చిత్రం విడుదలకు అన్ని క్రైస్తవసంఘాలు కాదన్నాయి. విడుదలైన చోట్ల బాగా గొడవలు చేసారు. మంగుళూరు ఘటనకు ఈ గొడవలకు ఏమైనా తేడా ఉన్నదా? ఆ చిత్రం ఏసు గురించి మనకు తెలిసిన నిజాలను కాక మరికొన్ని నిజాలను మనకు చెబుతుంది. ఆ చిత్రం తీసిన నిర్మాతలు (నవల రచయిత) ఆ నిజాల గురించి ఎంతో శోధించి శాస్త్రోక్తంగా ఎన్నో తెలియని విషయాలను నిరూపించి అప్పుడు ఆ చిత్రాన్ని విడుదల చేసారు. ఆ చిత్రాన్ని ఎన్నో క్రైస్తవ దేశాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా విడుదలకు అంగీకరించాయి. చివరికి పోపుకూడా అందుకు అంగీకరించాడు. కానీ అదేంటో భారతదేశంలో మాత్రం ఆ చిత్రాన్ని విడుదల చేయనివ్వలేదు. ఆ చిత్రం చూసినందువల్ల నష్టమేమీలేదని స్వయంగా పోపుగారు అంగీకరించారు. కానీ మన కోర్టులు అందుకు అంగీకరించలేదు. అదే మన సంస్కృతిని కాపాడుదామని ప్రయత్నిస్తే మాత్రం అది అన్ని విధాలా స్వేఛ్ఛకు ఆటంకం అయ్యింది. ఆ చిత్రాన్ని విడుదల చేయాల్సినప్పుడు ఏమైంది ఆ వ్యక్తిగత స్వేఛ్ఛ? ఏమైంది ఆ సెక్యూలరిజం అన్న పదం? పోలీసులు అసభ్యంగా ఉన్నదని కేసు పెట్టారు, మరి అప్పుడు కావలసిన వ్యక్తిగత స్వేఛ్ఛ చిత్రాన్ని (నిర్మాత విడుదల) చేయాల్సినప్పుడు ఏమైంది? ఇది చూసి కూడా మీరు భారతదేశంలో ఇంకా సెక్యూలరిజం ఉన్నది అనుకుంటే పొరబడినట్లే.

 http://vaidikadharmam.blogspot.in/2009/02/blog-post_17.html

మన మతాన్ని కాపాడుదాం : కుల వ్యవస్థ: చికిత్స


కులాల గురించి మాట్లాడేవారు ఒక్క విషయం మరిచిపోతున్నారు. గత వందసంవత్సరాలనుంచీ ఉద్యోగం ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు? చదువులమీద ఆధారపడి ఇస్తున్నారు. ఒక్కసారి కాలంలో వెనకకు వెళదాం. వెయ్యి సంవత్సరాల క్రితం ఏ ప్రాతిపదికన ఇచ్చేవారు? ప్రతీ ఒక్కళ్ళకీ కులవృత్తులు ఉన్నాయి. వారి తల్లిదండ్రులనుంచి వారసత్వంగా సంక్రమించిన వృత్తి, మరియు చిన్నతనం నుండి తండ్రితో బాటు చేస్తున్న పనిగురించి తండ్రి నేర్పే అనేక వృత్తికిటుకులు ప్రతీ ఒక్కరినీ వారి వారి పనులలో నిష్ణాతులను చేసేది. అందువల్ల చదువుతో సంబంధం లేకుండా ప్రతీఒక్కరికీ పని ఉండేది. మరి ఎందుకు చదువుకొనేవారు? సంస్కారం కోసం చదువుకునేవారు. ఒక శాస్త్రంలో ప్రావీణ్యతకోసం చదువుకునేవారు(Like today’s PhD in a specific field). జీవితంలో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడానికి చదువుకొనేవారు. అందువల్లనే మనదేశంలో ఒక ఆర్యభట్టు, ఒక భాస్కరాచార్యుడు, ఒక సుష్రుతుడు పుట్టారు. అప్పటికాలం ప్రకారం చదువు కేవలం మనిషిని సంస్కరించడానికి లేక ఒక శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించడానికి మత్రమే ఉపయోగపడేది. ఇప్పటివలె చదువువల్ల ఉద్యోగం వచ్చే రోజులు కావవి. అందువల్ల కేవలం అవసరం ఉన్నవారు మాత్రమే చదువుకొని మిగతావారు పట్టించుకొనేవారు కాదు. ఒకళ్ళు చదువుకోకపోవడం వలన ఆ రోజులలో తిండికి ఇబ్బందిపడటం వంటివి జరుగలేదు. ఇవి వెయ్యిసంవత్సరాల నాటి పరిస్థితులు. బ్రిటీషర్లు వచ్చాక పరిస్థితి మారింది. వాళ్ళు పద్దతి మార్చి కేవలం చదువుకున్నవారికి మాత్రమే ఉద్యోగం ఇచ్చేవారు. అందువల్ల సాంప్రదాయకంగా చదువుకోని కుటుంబాలు అలా ఉద్యోగాలలో వెనుకబడ్డారు. ఇవికాక బ్రిటీషర్లు ఇచ్చే విద్య ఖర్చుకో కూడుకున్నది కావడంతో కేవలం ధనవంతులు(పొరపాటున ఎక్కువమంది ధనవంతులు ఒకే కులం వారు అయ్యారు. ఎక్కువమంది మాత్రమే, అందరూ కాదు) మాత్రమే చదువుకొనేవారు. దీనిని మరో ఉదాహరణతో వివరిస్తాను. ఇప్పుడు మనం డబ్బును కాగితాల రూపంలో వాడుతున్నాం. హఠాత్తుగా Government of India అవన్నీ వాట్టి కాగితాలే, వాటికి విలువలేదు, ఇకనుంచి కరెన్సీ మొత్తం గవ్వలరూపంలో జరగాలి అని అంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? ఇప్పుడు బాగా Black Money ఉన్నవారందరూ వట్టి వెధవలయిపోతార్. అప్పుడు ఎవరివద్దనయితే ఎక్కువగా గవ్వలు ఉంటాయో వాడే ధనవంతుడు. మనకు సరిగ్గా అదే జరిగింది. తరతరాలనుంచీ చదువుకొనేవారు ముందుకుసాగిపోయారు, అది అలవాటులేని వాళ్ళు అందుకోలేక పోయారు. ఉద్యోగం వచ్చే పరిస్థితి మారింది. అదే విధంగా మారిని పరిస్థితులగురించి బాగా ప్రచారం చేసి అందరినీ ఇందుకు తగ్గట్లుగా ఉద్యక్తులను చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, కాని అప్పటి ప్రభుత్వం బ్రిటీషువారిది, వారికి అంత తీరిక ఎక్కడిదీ, దేశాన్ని దోచుకోవడానికే సమయం సరిపోలేదు వారికి.

ఇంతవరకూ నేను భారతదేశంలో వర్ణవ్యవస్థ నుంచి కులవ్యవస్థగా ఎలా పతనమయ్యిందో వివరించాను. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మనం ఏమి చేస్తే ఈ కులవ్యవస్థను పారద్రోలగలమో వివరిస్తాను. ఇంతకన్నా ముందు నేను ఒక విషయాన్ని గుర్తుచేయదలిచాను. సమాజం ఎప్పుడైనా బాగా చదువుకున్న అతి తక్కువ జనభాను అనుసరిస్తారు. అలా అంబేద్కర్ గారు మొదలుపెట్టినది అలా కొనసాగలేదు, ఇప్పటికి కులవ్యవస్థ్ తగ్గకపోగా ఇంకా వికృతంగా తయరయ్యింది. దీనికి కారణం ఏమిటి? ఒకసారి TV9లో ఒక ఫ్యాక్సనిస్టు తాను ఇరవైసంవత్సరాలుగా గొడవలలో మునిగిఉన్నానని, తనకు తన శత్రువుకు కూడా ఆ జీవితం ఎంతమాత్రం నచ్చకపోయినా తాము అలా జీవించాల్సివస్తుందని వాపోయారు. దీనికి కారణం ఎవరు? సమాధానం మన రాజకీయనాయకులు.

అవును మనం మన మధ్య, మనలో ఇది మన కులం అని చెప్పే ప్రతీ వస్తువునూ, ప్రతీ గోడను పడగొట్టగలిగితే ఈ కులవ్యవస్థను మనం పారదోలవచ్చు. దీనికి మనం మొదటా చేయాల్సినది చాలా చిన్నపని. అది ఏమిటంటే చరిత్రను మార్చి రాయడం. నేను ఇంతవరకూ రాసిన చరిత్ర కాకుండా, అసలు కులవ్యవస్థ చాలా అద్భుతమైనదిగా చిత్రీకరించాలి. అసలు కులవ్యవస్థ జరుగలేదనిపించేలా మన సామాన్య చరిత్ర పుస్తకాలు తయారుచేయాలి. ఎవరికైనా అనుమానం రావచ్చు, ఇది మన భావి తరాల వాళ్ళకి అబద్దం చెప్పడంతో సమానం కదా అని, పరవాలేదు మొదట అలా చేస్తే మన భావితరం తాము తక్కువవరమనే భావనలో (Inferiority Complex) నుంచి బయటపడతారు. అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే మన గొప్పతనమంతా మన వారసత్వసంపదలోనే ఉంది. బ్రిటీషువాళ్ళు అందుకే మన వారసత్వసంపదను మనది కాకుండా చేసారు ఆర్య దండయాత్ర సిద్దాంతం (Aryan Invasion Theory) ద్వారా. నాకు ఇప్పటి తరంలో చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనబడుతోంది. దానికి ఉదాహరణ, ఇంతవరకు హిందూమతం మరియు భారతదేశం ఇంత అభివృద్ది చెందడానికి కారణమయిన వర్ణవ్యవస్థ ఇవ్వాళ అందరిచేత నిందింపబడుతోంది తన తప్పులేకుండా. ఇవ్వాళ అన్నికాలాల్లోనూ వర్ణవ్యవస్థకు ఎంతమంది స్థిరంగా మద్దతివ్వగలరు? అగ్రకులాలవారు తాము నిమ్నకులాలవారిపై చాలా అరాచకాలు చేసామని బాధపడుతున్నారు (కనీసం అలా నటిస్తున్నారు మరియు పిల్లలకు అలా నేర్పిస్తున్నారు. దీనిలో సినిమాల పాత్రకూడా ఎక్కువే). ఒక బ్రాహ్మణుడు నేను బ్రాహ్మణుడిని అని గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి మనది ఎందుకంటే అతను ఒక కులపిశాచని అందరూ తిడతారని భయం. ఇది మారాలి. అందరూ ఒకటేననే భావం కలగాలి. ఈ ఇన్పీరియారిటీ కాంప్లెక్స్ పోవడానికి నేను చరిత్రను మార్చి చెప్పమన్నాను. అది కేవలం సామాన్య చరిత్ర అంటే పదవతరగతి వరకూ చెప్పే చరిత్ర. చరిత్రను చదివేవారికి నిజమయిన చరిత్రను పరిచయం చేయాలి. ఇది నేను రాసిన చరిత్రే, కాదని ఎవరినైనా వివరించమనండి చూద్దాం. కానీ ఆ చరిత్ర నిష్పక్షపాతంగా ఉండాలి, హిందూ వ్యతిరేఖిగా ఉండకూడదు. ఎందుకంటే హిందూ మతాన్ని ప్రేమించలేనివాడు భారతదేశాన్ని ప్రేమించలేడని నా ఉద్దేశం. ఇక్కడ హిందువంటే నా దృష్టిలో భారతదేశంలో పుట్టిన ఏ మతాన్నయినా పాటించేవ్యక్తి. చరిత్రను ఇలా మార్చిరాయడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని అనుమానం అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మనకు చెప్పిన చరిత్రలో తొంభై అయిదు శాతం అబద్దాలే. దీని వలన మనకు మన నిజమైన చరిత్ర తెలియదు, అలాగే మనం ఈ కులవ్యవస్థను చరిత్రలోంచి (చరిత్ర పాఠాలలొనుంచి) తొలగిస్తే మనం ఈ వ్యవస్థను మన నుంచి సగం పారద్రోలగలిగినట్లే.

మనకు మన కులాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తున్న మరో దుర్వవస్థ రిజర్వేషనులు. కులాల ప్రాతిపదికన కాకుండా ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషనులను ఇస్తే నిజమైన పేదలకు చాలా ఉపయోగం. ఈ విషయం గురించి నేను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. ఈ వ్యవస్థ మన సమాజాన్ని ఎంత దారుణంగా దెబ్బతీస్తోందో మనకు తెలుసుకాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పదలచుకోలేదు.

ఇవికాక మన కులాన్ని మనకు అనుక్షణం గుర్తుచేసేవి కులసంఘాలు. వీటివల్ల జరుగుతున్న కీడు అంతా ఇంతా కాదు. నేను కులసంఘాలు ఇచ్చే స్కాలర్షిప్పులు గురించి మాట్లాడుతున్నాను. నిజమే. వాళ్ళు ఇలా ఇవ్వడం వలన కనీసం కొంతమందైనా (నిజమైన) పేదలకు కొంత సహాయం జరుగుతోన్న మాట నిజమే. కొంతమందైనా పేదవిద్యార్థులు చదువుకోగలుతున్నారు. కానీ దీనివల్ల ఆ పేద విద్యార్థి ఏమి అనుకుంటాడు? నాకు ప్రభుత్వం ఏమీ సహాయం చేయనప్పుడు నాకులపు వాళ్ళు ఎంతో మేలు చేశారని అనుకుంటాడు. దీనివల్ల అతనికి ప్రభుత్వం మీద వ్యతిరేఖత, తన కులం మీద విపరీతమైన ఆసక్తి కలుగుతుంది. అతనిలో లేని కులకాంక్ష ప్రజ్వల్లితుంది. ఇలా కులం పేరు మీద ఇచ్చే స్కాలర్షిప్పులు మరియు కులం పేరు మీద ఇచ్చే రిజర్వేషనులకు తేడా లేదు. అంతిమంగా దేశం నష్టపోతోంది.

నాకు నేను ఇలా వ్రయడం వల్ల నన్ను ఒక హిందూ అతివాదిగా అనేక మంది అనుకుంటారు, దానివల్ల నా మాట ఎవ్వరూ వినరని కూడా నాకు తెలుసు. కాని నేను చెప్పేది ఒక్కటే. ఇలా ఎన్నాళ్ళు? నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పరవాలేదు, కానీ ఒక్కసారైనా నిజం చెప్పాలి. ఇలా నాలా చెప్పేవాళ్ళనందరినీ పట్టించుకోకుండా ఉండి మీడియా మనకు చెబుతున్న అబద్దాలనే నమ్మితే ఏదో ఒక రోజు మనబ్రతుకులే అబద్దంగా మారిపోతాయి. 


 http://vaidikadharmam.blogspot.in/2009/02/blog-post_16.html

మన మతాన్ని కాపాడుదాం : కుల వ్యవస్థ: నాలుగవ భాగం


క్రితం టపాలో నేను కొన్ని ప్రశ్నలు అడిగాను. వాటిలో నేను కొన్నింటికి జవాబులు చెబుతాను. మెగస్తనీసు కాలం తరువాత భారతదేశం గురించి వివరంగా రాసిన మరో వ్యక్తి చైనీసు యాత్రికుడు హుయాన్ సాంగ్. అతని రాతలలో కులవ్యవస్థ గురించి ఏమీ రాయలేదు, కానీ అప్పటికి భారతదేశంలో బౌద్దమతం పూర్తిగా అంతమయ్యింది. ఇక్కడి నుంచి కులవ్యవస్థ పతనమవ్వడం మొదలయ్యింది. అది భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యింది. ఎందుకంటే ఉత్తరభారతదేశంలో 1198లో మూల్ రాజ్ ఆనంద్ అనే బాలుడి తల్లి (ఆమే ఆ రాజ్యానికి సైన్యాధిపతి కూడా) ముస్లిము సైన్యాన్ని యుద్దంలో ఓఢించి ముస్లిము సైనికులను హైందవ సమాజంలో కలుపుగోలిగింది. అప్పటికి ఇంకా బానిసవ్యవస్థ భారతదేశంలో లేదు కాబట్టి వారిని బానిసలుగా అమ్మలేదని మనం నిర్ధారణకు రావచ్చు. దీనిని బట్టి పదవ శతాబ్దానికి, క్రీస్తుకు మూడు శతాబ్దాల ముందు దానికి సమాజంలో పెద్దగా మార్పులు లేవని మనం రూఢి చేసుకోవచ్చు. పదవశతాబ్దం వరకూ దాదాపు హిందువులే (హిందువులంటే నా ఉద్దేశంలో బౌద్దులు, జైనులు, శైవులు, వైష్ణవులు, శక్తిని పూజించేవారు, ద్వైతులు, అద్వైతులు, చార్వకులు etc. ఇలా భారతదేశంలో పుట్టిన ఏ మతాన్ని ఆచరించినా నా దృష్టిలో వారు హిందువులే. దీని గురించి మరో టపాలో వివరిస్తాను.) భారతదేశాన్ని పాలించారు. పాలించేవారు, పాలించే పద్దతులలో పెద్దగా మార్పులు లేవు కాబట్టి సమాజంలో కూడా పెద్దగా మార్పులు లేవు. కానీ పదవశతాబ్దం నుంచి ఇరవైశతబ్దానికి వచ్చేసరికి ఏడుకులాలనుంచి లెక్కలేనన్ని కులాలు వచ్చిపడ్డాయి సమాజంలో. ఎలా జరిగింది ఇది అంతా? ముందు కాలానికి ఇప్పటికి తేడా ఏమిటి? గమనిస్తే బయటినుంచి దాడులు విపరీతంగా పెరిగాయి. అంతర్గతంగా జరిగే యుద్దాలకు బయటినుంచి వచ్చిన ఇతర మతస్థులతో జరిగే యుద్దాలకు చాలా తేడా ఉంది. ఉదాహరణకు ఒకటి. ఇక్కడి యుద్దాలలో ఎవరు గెలిచినా సామాన్య ప్రజలపై పెద్దగా ప్రభావం ఉండేది కాదు, కానీ ముస్లిముల్ వచ్చాక పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. వారు గెలిస్తే ఇక్కడి ప్రజలను బానిసలుగా అమ్మేవారు. అందుకే సమాజంలో చాలా మార్పులు అనివార్యమయ్యాయి.
 

కొంతమంది హిందూ మతం గురించి చెప్పే మరో విషయం ఏమిటంటే హిందూమతం మార్పును స్వీకరించదని. వారికి నేను చెప్పబోయేది చెంపపెట్టు లాంటిది. కొన్ని చోట్ల కులవ్యవస్థ చాలా దారుణంగా పతనమయ్యింది. దీనికి వ్యతిరేఖంగా కులవ్యవస్థలో మార్పును కోరుతూ సమాజంలో కొందరు సమాజాన్ని బాగుచేయడానిక్ ప్రయత్నించారు. ఇలా ప్రయత్నించడం రెండు రకాలు. ఒకటి హింసాత్మకం, రెండు అహింసాత్మకం. హింసాత్మకంగా జరిగిన పోరాటం మన పలనాటియుద్దం. మార్పును వ్యతిరేఖించే నాగమ్మ వర్గానికి మార్పును కోరుకుంటున్న బ్రహ్మనాయుడి వర్గానికి మధ్య జరిగిన యుద్దం అది. మనకు సినిమాలో చూపించినట్లు కాకుండా నిజమైన యుద్దంలో బ్రహ్మనాయుడి వర్గం పరాజయాన్ని పొందారు. మలిదేవనాయుడు, నగమ్మ కులాల్లో మార్పును వ్యతిరేఖించారు, నలగామనాయుడు మరియు బ్రహ్మనాయుడు కులాల్లో మార్పును కోరారు. ఈ యుద్దం వల్ల జరిగినది ఏమిటంటే ఇరువర్గాల్లో సైనుకులు మొత్తం చనిపోయారు. ఈ యుద్దం వల్ల చాలుక్యుల వంశం త్వరగా అంతమయింది. ఈ కథను మనకు హరికథలుగా మాదిగలు మాత్రమే వినిపిస్తారు, కానీ అన్నిరకాల హరికథలు వినిపించే బ్రాహ్మణులు ఈ కథను మనకు వినిపించరు. శ్రీనాథుడు బ్రాహ్మణుడు అయినా ఈ చరిత్ర గ్రంథస్తం చేసాడు. చూసారుగా తేడాలు, బ్రాహ్మణులలో. ఒకరు మనకు ఈ కథను చెప్పరు, మరొకరు గ్రంథస్థం చేసారు. మార్పును వ్యతిరేఖించే వారు ఎప్పుడయినా ఉంటారు, అదే జరిగింది అప్పటి సమాజంలో.
 

ఇప్పుడు మనం అహింసాత్మకంగా మార్పును కోరిన ఉద్యమాన్ని చూద్దాం. హింస మన కోస్తాంధ్రలో జరిగితే, అహింసాయుత విధానం మన పక్కనే ఉన్న కర్ణాటకలో జరిగింది. అది పన్నెండవ శతాబ్దం. కులవ్యవస్థ ఉన్న పరిస్థితి నచ్చక బసవన్న అనే ఒక బ్రాహ్మణుడు వీరశైవమనే కొత్త మతాన్ని ప్రారంభించాడు. తన మతంలో అందరూ సమానమేనని చెప్పాడు. చనిపోయిన వాళ్ళను హిందువులలా దహనసంస్కారాలతో కాకుండా పూడ్చిపెట్టమని చెప్పాడు. కొన్నాళ్ళు బాగానే సాగింది. కానీ తరువాత వీరశైవులు ఒక కులంగా మారిపోయారు. అంతే కాకుండా వారిలో ఉపకులాలు కూడా వచ్చాయి. మరి ఈ రెండు పద్దతులవల్ల మనసమాజానికి మేలు జరిగిందా లేక కీడు జరిగిందా? రెంటిలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా పనిచేయాలి, కానీ మనకు ఇరవై శతాబ్దంలో సమాజాన్ని చూస్తే పెద్దగా ఉపయోగం ఉన్నట్లు కనబడదు. ఎందుకు ఇలా జరిగింది? మధ్యలో కొన్నాళ్ళు ముస్లిములు పాలించారు, తరువాత విజయనగర సామ్రాజ్యంతో ఉన్నత స్థాయిని అందుకున్నాము, మళ్ళీ ముస్లిముల చేతిలోకి పాలన వెళ్ళాక పరిస్థితి మామూలు అయ్యింది. విజయనగర సామ్రాజ్యం ఆంధ్రను పాలించినప్పుడు మనం సాంస్కృతికంగా ఎంత బాగా అభివృద్ది చెందామో మనకు తెలుసు. శ్రీకృష్ణదేవరాయలవారి కాలంలో వజ్రాలను రాశులుగా పోసి అమ్మేవారని మనకు చరిత్ర చెబుతున్న సత్యం. దీనిని బట్టి పలనాటి యుద్దం తరువాత సమాజంలో చెడు బాగా తగ్గిందని మనం అర్థం చేసుకోవచ్చు.

ముస్లిముల పాలన గురించి ఇతరులు ఏమి చెప్పారో చూద్దాం. మనకు 712 ADలో మహమ్మద బిన్ ఖాసీం నుంచి ముస్లిముల దండయాత్ర మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే ముస్లిము దండయాత్రలు 638 AD లో మొదలయ్యాయి, కానీ వారికి చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం 712 తరువాతే వచ్చాయి. కొన్నాళ్ళు బాగానే సాగినా తరువాత ఆ దండయాత్రలు ఆగిపోయాయి. (ముస్లిము దండయాత్రల గురించి తరువాతి టపాలలో వివరిస్తాను) తరువాత 990 AD లో మళ్ళీ దండయాత్రలు మొదలయ్యాయి, అవి మహమ్మద్ గజినీ కొడుకు మరణంతో ఆ దండయాత్రలు ముగిసాయి. తరువాత చెప్పుకోదగ్గ దండయాత్రలు 1191లో మహమ్మద ఘోరీతో మొదలయ్యాయి. ఇక ఆ దండయాత్రలు ఆగలేదు. అవి భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించేంతవరకూ విశ్రమించలేదు. భారతదేశాన్ని సైనికంగా ఎనిమిది వందల సంవత్సరాలకుపైగా అక్రమించుకోగలిగినా హిందువులను పూర్తిగా ముస్లిములుగా మార్చలేకపోయారు. ఇది వారి దయవలన ఎంతమాత్రం కాదు, ఎందుకంటే వారికి దయ అనేది తెలియదు కాబట్టి. ఇస్లాము ప్రవేశించిన ఇతర దేశాలను గమనిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది.

ఫెర్నాంన్డ్ బ్రౌడెల్ తన పుస్తకంలో(1) “భారతదేశంలో ముస్లిముల పాలన చాలా హింసాత్మకమయినది, ముస్లిములు ప్రజలను విపరీతమయిన భయాందోళనలకు గురిచేస్తూ తప్ప దేశాన్ని పాలించలేకపోయారు. కౄరత్వం అనేది రోజూవారీ కార్యక్రమం అయిపోయింది. తగులబెట్టడం, సామూహికంగా ప్రజలను ఉరితియ్యడం, ప్రజలను శిలవేయడం, చర్మాన్ని తొలిచివేయడం, కొత్త కొత్త రకాలుగా ప్రజలను చంపడం వంటివి దైనందిక వ్యవహారమయిపోయాయి. హిందువుల గుడులు నిర్మూలించి మసీదులు కట్టారు. అప్పుడప్పుడూ హిందువులను ముస్లిములుగా మార్చేవారు. ఎక్కడైనా ప్రజలు తిరగబడితే అక్కడి ప్రజలను దారుణంగా హింసించి చంపేవారు, ఊళ్ళకు ఊళ్ళు తగులబెట్టేవారు, పల్లెటూర్లను ఎప్పుడు ఎండబెట్టేవారు, మగాళ్ళను చంపేవారు, ఆడవాళ్ళను బానిసలుగా అమ్మేవాళ్ళు”, అని రాసాడు. విల్ డ్యూరాంట్ తన పుస్తకంలో(2) “భారతదేశంలో ముస్లిముల దండయాత్ర బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తపాతమయినది. అది ఒక నిరాశాజనకమైన కథ, ఎందుకంటే ఇక్కడి నాగరికత చాలా నాజూకైనది, ఇక్కడి స్వేఛ్ఛాస్వాతంత్రాయాలు ఎప్పుడైనా బయటినుంచీ లోపలినుంచీ విపరీతంగా పెరిగిపోతున్న అనాగరికుల చేత ఎప్పుడయినా నిర్మూలించబడతాయి”, అని రాసాడు. వీళ్ళిద్దరూ క్రైస్తవులు మరియు పాశ్చాత్యులు. వీరి మాటలలో అప్పటి హిందూసమాజం ఎలాంటి పరిస్థితులలో ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పటి కులవ్యవస్థకు కారణం ఖచ్చితంగా ఆ దండయాత్రలు, మరియు అప్పటి హిందూ సమాజం అనుభవించిన యాతనలు. వర్ణవ్యవస్థ పతనమవ్వడం అలా మొదలై బ్రిటీషర్లు వచ్చాక బాగా ఊపందుకుంది.

జయచాంద్ విద్యాలంకార్ తన “ఇతిహాస్ ప్రవేశ్”లో ఇలా వ్రాసాడు, “కులవ్యవస్థ మొదలైనప్పుడు కాస్త Flexibility ఉండేది, కానీ అది కాలం ముందుకు సాగడంతో పోయింది. 1000 AD నుంచి కులవ్యవస్థలో Flexibility తగ్గి పూర్తిగా జడపదార్థంలా తయారయింది. దీనికి కారణం ముస్లిములు సాగించిన హింసాకాండ. వారు జరిపిన హత్యలు, మానభంగాలు, దేశాన్ని దోచుకోవడం ద్వారా ప్రజలను బాగా భయపెట్టి తమ మతంలోకి మార్చుకున్నారు.” ముస్లిముల దండయాత్రలు ఎంత ఎక్కువగా ఉండేవంటే గుజరాత్ లోని గవల్గరాజ్యంలో “తురుష్కదంద” అనే ప్రత్యేక పన్ను విధించారు. అది కేవలం ముస్లిములను ఎదుర్కోవడానికి మాత్రమే వాడేవారు. ఇది కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. పన్నెండవ శతాబ్దాంతానికి ఢిల్లిలో ముస్లిములు పాగావేయగలిగారు. వాళ్ళు అందరిమీదా విపరీతమైన పన్నులు వేసేవారు. జిజియా పన్ను అలాంటివాటిల్లో ఒకటి. ఆ పన్ను ఎలాంటిదంటే శాంతి సమయాల్లో 80% గానూ యుద్దసమయాల్లో 150% గానూ ఉండేది. ప్రజలను ముస్లిములుగా మారేందుకు ప్రోత్సహించడానికి గానూ ముస్లిములు ఈ పన్నుల నుంచి బౌద్దులకు మరియు బ్రాహ్మణులకు మినహాయింపు ఇచ్చారు. పాలకులకు పాలితులకు మధ్య బాగా దూరం పెరిగింది. ఒకప్పుడు సమాజానికి కావలసిన అన్ని రకాల అవసరాలను తీర్చగలిగిన వర్ణవ్యవస్థ Flexibilityను కోల్పోయి భయంకరమైన వ్యవస్థగా దిగజారిపోవడం మొదలయ్యింది.

బ్రిటీషర్లు వచ్చిన తరువాత హిందూ మతం ఇంకా ఎలా పతనమయ్యిందో వివరిస్తాను. బ్రిటీషర్లు ఊరిలో బాగా ధనవంతుడైన వ్యక్తిని పన్నులు వసూలుచేయడానికి ఉపయోగించుకొనేవారు. అలాంటి వ్యక్తిని “చౌదరి” అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పేరు మీద ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన కులం ఉంది. మనం గమనిస్తే చౌదరి అని పేరులో ఒక భాగం కలిగిఉండేవాళ్ళు మనకు ఉత్తరభారతంలోనూ, బంగ్లాదేశ్ లోనూ, చివరికి పాకిస్తానులో కూడా కనిపిస్తారు. భాషాభేదాల వల్ల కూడా కొన్ని కొత్త కులాలు ఆవిర్భవించాయి. ఉదాహరణకు ఉపాధ్యాయులను అప్పటి సమాజంలో అయ్య వారు, అయ్యగారు అని పిలిచేవారు. అది తమిళనాడులో అయ్యంగార్ గా మారింది. ఇప్పుడు వారు తమిళనాడులో బ్రాహ్మణులలో ఒక ఉపకులంగా ఉంటున్నారు. రెడ్డి అనేది అప్పట్లో ఊరిలో బాగా ధనవంతమైన వ్యక్తిని పెద్దిరెడ్డి అని పిలిచేవారు. ఆ పిలువు ఒక పదవిగా భావించేవారు. కానీ కాలక్రమంలో రెడ్డి అనేది ఒక కులంగా రూపాంతరం చెందింది.

కులం అనేది హిందువులకు మాత్రమే పరిమితమని మనందరి దురభిప్రాయం. జైనులలో కూడా కులాలు ఉన్నాయి. హిందూ మతం నుంచి ఇతర మతాలలోకి మారినవారు ఇంకా కులాలను ఆచరిస్తున్నారు. అందుకు ప్రబల ఉదాహరణ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ Y.S. రాజశేఖరరెడ్డిగారు. ఆయన క్రైస్తవుడు, కానీ ఇంకా పేరులో రెడ్డిని ఉంచుకున్నారు. అటు రెడ్డిలను ఇటు క్రైస్తవులను ఆకర్షించగలనని ఆయన భావించి ఉండవచ్చు. మళ్ళీ భారతదేశం దాటి ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడినవారు కులాలను పట్టించుకోరు. దానికి అమెరికా, బ్రిటన్ లలో ఎన్నో సంవత్సరాలనుంచి ఉంటున్న ప్రవాస భారతీయులు ఉదాహరణ. దక్షిణాఫ్రికాలో భారతసంతతి జనాభా విపరీతంగా ఉంటారని మనకు తెలుసు. అది గాంధీ సమయం నుంచి ఉందని మనకు తెలుసు. కానీ అక్కడ ఎవరూ ఇలా కులాలను పట్ట్ంచుకోరే. హిందూమతంలో, భారతదేశంలో కాకుండా ప్రపంచంలో మరో చోటకూడా ఇలా కులాలను పాటించేవారు. అది అర్థాశిర్ అనే రాజు పర్షియాను ఏకం చేసిన కాలం. పర్షియా చరిత్రలో చెప్పుకోదగ్గ వంశాలు రెండు. అర్థాశిర్ స్థాపించినది రెండవది, మరియు అధికకాలం మనగలిగినది కూడా. ఇస్లాము పర్షియాలో అడుగుపెట్టేవరకూ ఆ వ్యవస్థ కొనసాగింది. ఆ వ్యవస్థ ఇలా సాగుతుంది. The four segments of society are Soldiers, Scribes, Priests and Commoners. దాదాపుగా వర్ణవ్యవస్థను పోలిఉంది ఆ వ్యవస్థ. ఇవి అన్నీ చెప్పడంలో నా ఉద్దేశం ఒకటే, కులవ్యవస్థ అనేది కేవలం హిందూ మతానికి మాత్రమే కాపీరైటు అయిన వ్యవస్థకాదు. సామాజికంగా జరిగే మార్పులకు ఒక మతాన్ని బలిపెట్టడం ఎంతవరకూ సమంజసం? ఎంత గొప్పగా ప్రారంభమయిన వ్యవస్థ అయినా కుళ్ళిపోవలసిందే, కానీ అప్పుడప్పుడూ గొప్ప గొప్ప యోగులు వచ్చి సమాజాన్ని బాగుచేస్తారు. బుద్దుడు, (వీరశైవమతాన్ని ప్రారంభించిన)బసవన్న, బ్రహ్మనాయుడు, శంకరాచార్య వంటి వారు ప్రతీ సమాజానికి అవసరం. కులవ్యవస్థ బ్రాహ్మణుల వల్ల వచ్చింది అనడం కేవలం చరిత్ర అస్సలు తెలియని (పిచ్చిపట్టిన కమ్యూనిస్టు) మేథావులు మాత్రమే అనగలరు. కత్తి మహేష్ కుమార్ గారూ, మీకు నా టపాలలో ఎక్కడయినా తప్పు కనబడితే చెప్పగలరు. మీరు కులవ్యవస్థకు వ్యతిరేఖి అని తెలుసు. మీరు నా టపాలకు ఏమి సమాధానం చెబుతారో చూస్తాను. మీరు ఒకసారి మీ టపాలో అన్ని కులాలవారు స్వతంత్రులని, అన్ని కులాల మధ్య కొన్ని similar rituals ఉన్నాయనీ చెప్పారు. నేను అదే వక్యాన్ని ఇలా చెబుతాను, అన్ని కులాలూ ఒకే rituals పాటిస్తారు కొన్ని తప్ప. అవి కులానికి కులానికి మధ్య మార్పులు. ఒక చిన్న ఉదాహరణ. మొదట వ్యవసాయానికి యంత్రాలు చేసేవారు ఒక కులస్థులు. వారు చెక్క మరియు ఇనుముతో యంత్రాలు చేసేవారు. తరువత వారిలో రెండు కులాలు వచ్చాయి, ఒకరు చెక్క యంత్రాలు, మరొకరు ఇనుముతో యంత్రాలు తయారుచేసేవారు. ఇనుముతో చేసేవారు ఇంకొన్ని రకాలు, ఒకరు వ్యవసాయానికి పనిముట్లు చేసేవారు, మరొకరు ఆయుధాలు తయారుచేసేవారు. అలాగే చెక్కపని చేసేవారు కూడా. ఒకరు వ్యవసాయానికి పనిముట్లు చేసేవారు మరొకరు పడవలు, ఓడలు తయారుచేసేవారు. అలా కులాలు విడిపోయాయి. మొదట సాయానికి యంత్రాలు చేసేవారు అందరూ ఒకేరకమయిన పద్దతులు పాటించేవారు. పనులలో తేడాలవల్ల ఆచరణ పద్దతులలో మార్పులు వచ్చాయి. అలా కులాల్లో పద్దతులలో పైపై మార్పులు ఉన్నా లోలోపల అన్నీ ఒకే చోటినుండి మొదలయ్యాయి. అన్ని కులాల్లోనూ పెళ్ళి జరిగేటప్పుడు తాళి ఖచ్చితంగా కడతారు, కానీ తమిళుల తాళి ఒకరకంగా, తెలుగువారి తాళి మరో రకంగా ఉంటుంది. అది భాష మరియు సాంస్కృతికంగా వచ్చిన మార్పే కానీ రెండు రాష్ట్రాలూ రెండు వేరే దేశాలనుంచి వచ్చినందువల్ల కాదు. ఇలాంటివి మనం అల్లోచిస్తే ఎన్నో గమనించవచ్చు. ఇవి అన్ని ఒకే సంస్కృతి నుంచి మారిన పద్దతులు కానీ వివిధ పద్దతులు ఒక తాటిపైకి వచ్చినవి కావు.

(ఇంకా ఒక టపా నేను బాకీ ఉన్నాను.)

వనరులు
1. Fernand Baurdel, A History of Civilizations (Penguin 1988/1963, p.232-236)
2. Will Durant, Story of Civilization, vol.1, Our Oriental Heritage, New York 1972, p.459


 http://vaidikadharmam.blogspot.in/2009/02/blog-post_13.html

మన మతాన్ని కాపాడుదాం : కుల వ్యవస్థ: మూడవ భాగం


మరొక్కసారి వేదాలను సరిచూసుకుని మనం కాలంలో కాస్త ముందుకు జరుగుదాము. వైదికకాలంలో ఇంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యుడు మొదలగు దేవతలను పూజించేవారు. వేదకాలం నుంచి ఇప్పటివరకు పూజలందుకుంటున్న దేవుడు ఒక్క సూర్యుడు మాత్రమే. ఒక్కసారి అప్పటిదేవతలు వర్ణ వ్యవస్థలో ఎలాంటి పాత్రలు వేసారో. అశ్వినీ దేవతలు బ్రాహ్మణులయినా వారు Yagnaలలో పాల్గొనలేరు. విశ్వామిత్ర మహర్షి పుట్టుకతో క్షత్రియుడు, కానీ తపస్సు చేసి బ్రాహ్మణుడిగా మారాడు. పరశురాముడు రథాలను తయారుచేసే సూద్రుడు, గొడ్డలి పట్టినప్పుడు క్షత్రియుడు, తపస్సు చేసినప్పుడు బ్రాహ్మణుడు అయ్యాడు. దీనిని బట్టి మనకు అర్థం కావడంలేదా వర్ణ వ్యవస్థ ఒకప్పుడు ఎలా ఉండేదో.

ఇప్పుడు నేను హిందూ మతాన్ని స్వంత ఇంటిలోనే చావుదెబ్బ కొట్టిన వ్యక్తి గురించి మాట్లాడుతాను. అతను హింసతో హిందూమతాన్ని భయపెట్టలేదు, అహింసతో మార్పు కావాలన్నాడు. అతనే బుద్దుడు. ఒక్కసారి మనం చరిత్రను చూస్తే ద్వారక మునిగిపోయిన తరువాత భారతదేశానికి పెద్దగా బయటినుంచి గానీ అంతర్గతంగాగానీ సవాళ్ళు ఎదురుకాలేదు. అందువల్ల హిందూమతంలో మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. ప్రజలు వేదాలను అనుసరిస్తున్నారు కానీ అందులో చెప్పిన పద్దతులు ఎందుకు పాటించాలో మరిచిపోయారు. ఇలా హిందూ సమాజం అంతర్గతంగా కుళ్ళిపోయి అంతర్గతంగా యుద్దాలు ఎక్కువ జరుగుతున్న సమయంలో బుద్దుడు ఆవిర్భవించాడు. బుద్దుడు వేదాల అధికారాన్ని, వర్ణవ్యవస్థను తిరస్కరించాడు. అహింసను, కర్మ సిద్దాంతాన్ని (ఇది అప్పటికే హిందూ మతంలో ఉన్నది) ప్రబోధించాడు. ప్రజలందరూ బుద్దుడిని, బుద్దమార్గాన్ని అనుసరించారు. బౌద్దమతం మధ్యఆసియా నుంచి జపాను వరకు విస్తరించింది. అంతమందికి దారిచూపిన దమ్మపాదంలో ఒక్కసారి ఏమి చెప్పారో కొంచెం చూద్దాం.

దమ్మపాదంలో బ్రాహ్మణుల గురించి, వారు పాటించాల్సిన పద్దతులగురించి చెప్పారు, కానీ వారు చేయకూడని పనుల (అంటే ఇతరులను తక్కువగా చూడడం, అంటరానితనాన్ని ప్రోత్సహించడం వంటివి) గురించి చెప్పలేదు. బ్రాహ్మణులు ఎలా జీవించాలి, ఎంత పొదుపుగా జీవించాలి అన్నదానిని దమ్మపాదంలో మనం గమనించవచ్చు. బ్రాహ్మణులు బాగా ధనం మరియు అహంతో విర్రవీగుతున్నారు కాబట్టి వాటిని ఎక్కువగా విడవాలని బుద్దభగవానుడు మనకు చెప్పాడు. కులవ్యవస్థ గురించి ఒక్కమాట కూడా చెప్పని బుద్దుడు, మరియు బౌద్దమతాన్ని కులవ్యవస్థకు వ్యతిరేఖ ప్రచారానికి వాడుకోవడం చాలా దారుణం. మనలో ఎంతమంది దమ్మపాదం చదివినవాళ్ళు ఉన్నారు? మీరందరూ ఒక్కసారి చదివి, అప్పుడు ఆ కాలంలో కులవ్యవస్థ ఉందని చెప్పండి చూద్దాం. దమ్మపాదంలో బ్రాహ్మణుడు ఎలా ఉండాలో తెలిపారు. మనం గమనిస్తే బ్రాహ్మణుడు అనే పదాన్ని ఇప్పటి సన్యాసి అనే పదానికి ప్రత్యామ్నాయంగా వాడినట్లు ఉందే కాని బ్రాహ్మణుడు అనే పదం ఒక ప్రత్యేకమయిన కులానికి గుర్తుగా లేదని మనం గమనించవచ్చు. ఒక్కసారి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మనలో ఎవరైనా సినిమాలలో చిన్నపిల్లలను అతిగా హింసిస్తున్నారని, సినిమాలలో చిన్నపిల్లలను చూపడం నేరమని దాని గురించి మన బ్లాగులోకంలో ఎవరైనా ఒక ఇరవై టపాలు రాస్తే మనం ఎమని అనుకుంటాం? ఇతనికి పిచ్చి కానీ లేదుకదా అనుకుంటాం. This doesn’t make any sense. ఎందుకంటే ప్రస్తుతసినిమాలలో చిన్నపిల్లలను పెద్దగా చూపించడం లేదు కాబట్టి, మరియు అలా గోలచేస్తే అది జరగని హింసకు చేస్తున్న గోల. అందుకే మనం అలాంటివాటిని పెద్దగా పట్టించుకోము. అదే సినిమాలలో స్త్రీలను చాలా చవకబారుగా చూపిస్తున్నారని ఎవరైనా రాస్తే మనం ఆలోచిస్తాం, ఎందుకంటే అందులో పూర్తిగా నిజం ఉన్నది కాబట్టి. అదే విధంగా మనం బౌద్దమతం ఏ దురాచారాలకు వ్యతిరేఖంగా పోరాడిందో అవి అప్పటి సమాజంలో బాగా పాతుకుపోయినట్లు లెక్క. బౌద్దమతం హింసను విడనాడమని, బ్రాహ్మణులు సర్వం త్యజించి జీవించాలనీ, కర్మసిద్దాంతాన్నీ ప్రబోధించింది. దీనిని బట్టి అప్పటి సమాజంలో ఎలాంటి దురాచారాలు ఉన్నాయో మీరు గమనించగలరు. బౌద్దమతం తరువాత భారతదేశ పరిస్థితులను స్పష్టంగా వ్రాసిన మరో పుస్తకాన్ని మనం ఇప్పుడు చూద్దాం.

ఇప్పుడు నేను మనమందరం నమ్మదగ్గ వ్యక్తి రాసిన పుస్తకంలో నుంచి చెబుతాను. కనీసం అప్పుడు కొందరయినా కళ్ళు తెరిస్తే బాగుంటుంది. అది అప్పుడే అలెగ్జాండరు తన దండయాత్ర ముగించి వెళ్ళిన రోజులు. గ్రీకులు అప్పుడు భారతదేశం గురించి, ఇక్కడ బంగారాన్ని తవ్వే చీమలగురించి అధ్యయనం చేయడానికి ఒక వ్యక్తిని భారతదేశం పంపారు. అతని పేరు మెగస్తనీస్. అవును, ఇప్పుడు మనం మెగస్తనీస వ్రాసిన “ఇండికా” (1) అనే పుస్తకంలో నుంచి చూద్దాం భారతదేశంలో ఉన్న కులాలగురించి ఏమి రాసాడో. మెగస్తనీస్ ప్రకారం భారతదేశంలో ఏడు రకాల కులాల వాళ్ళు ఉన్నారు. Philosophers (which formed small part), Husbandmen who are majority of population and have to cultivate their land, Herdsmen and Hunters who are allowed to keep cattle and hunt animals, labor people who are hired by the king to vend wares, build ships and amours. The fifth being fighting class whose job is only to fight and nothing else. The sixth class are overseers to whom is assigned the duty of watching all that is going on. The seventh class consists of counselors and assessors of king. Philosophers అంటే బ్రాహ్మణులని మనం అర్థం చేసుకోవచ్చు. గృహస్థులు (Husbandsmen) అంటే సూద్రులు మరియు వైశ్యులు. వీరు జనాభాలో అధికశాతం వారని ప్రత్యేకంగా చెప్పాడు. Herdsmen, Hunters, Labor people లను రాజు అవసరం ఉన్నాప్పుడు ప్రత్యేకంగా నియమిస్తాడని చెప్పాడు. విదేశీ వ్యవహారాలు చూసేవారు, గూఢచారులు, సైనికులు, సలహాదారులు, మంత్రిలు మరియు రాజుకు దర్బారులో సహాయం చేసే ఇతరులందరినీ మనం క్షత్రియులుగా భావించవచ్చు. ఇవి కాకుండా కులాలమార్పు గురించి మరో మాట కూడా చెప్పాడు. ఒక వ్యక్తి ఒక కులం నుంచి ఇతర ఏ కులానికి మారడానికి వీలులేదు ఒక్క బ్రాహ్మణుడిగా తప్ప ఎందుకంటే అదే చాలా కష్టమయిన కులం కాబట్టి. ఏ కులం వ్యక్తి అయినా బ్రాహ్మణుడిగా మాత్రమే మారవచ్చు, ఇతర కులాలలోకి మారడం నిషిద్ధం. బ్రాహ్మణుడు అయిన వ్యక్తి ఏదైనా ఒక గొప్ప ఆవిష్కరణ చేస్తే అతను జీవితాంతాం పన్ను కట్టనవసరం లేదు, అదే విధంగా ఏవరైనా చెప్పినది తప్పు అని నిరూపితమయితే అతనినితో జీవితాంతాం ఎవరూ మాట్లాడకూడదని నిషేధం విధించేవారు. రాజు అలా చేయకపోయినా, ఆ వ్యక్తి జీవితంలో ఎవరితో మాట్లాడేవాడు కాదు ఎందుకంటే అప్పటి ప్రజలు నీతి నిజాయితీలకు ప్రాణాలు ఇచ్చేవారు కాబట్టి. వీరందరిలో ఎవరు అగ్రకులస్థులు, ఎవరు తక్కువ కులస్థులు? ఎవరు ఎవరిని హింసిస్తున్నారని మనం అనుకోవాలి?

ఇప్పుడు ఆ కాలంలో ఏనుగులను ఎలా పట్టేవారో వివరిస్తాను. కులవ్యవస్థకు దీనికి సంబంధం ఏమిటా అని ఆశ్చర్యపడకండి. కాస్త చదవండి మీకే అర్థమవుతుంది. ఏనుగులను పట్టడం కాస్త వింతగానూ కాస్త ఆశ్చర్యం కలిగించేదిగానూ ఉంటుంది. ఏనుగులను సంవత్సరం మొత్తం కాకుండా కేవలం ఏనుగులు శృంగారం నెరిపే కాలంలో మాత్రమే ఏనుగులను పట్టేవారు. ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో ఆడఏనుగును ఉంచేవారు. ఆడఏనుగును గమనించి ఆ దరిదాపులకు వచ్చే ఏనుగులు ఆ గొయ్యిలో పడిపోయేవి. వాటిని ఇతర ఏనుగుల ద్వారా పైకిలాగేవారు. కానీ స్వతంత్రాన్ని కోల్పోయిన ఏనుగులు చాలా దిగాలుగా ఉండేవి. వాటికి మంచి ఆహారాన్ని అందించేవారు. కొన్ని ఏనుగులు ఆహారానికి అలవాటుపడి పని చేసేవి, కానీ కొన్ని ఏనుగులు మాత్రం స్వేఛ్ఛను కోల్పోయిన కారణంగా దిగాలుగానే ఉండేవి. అలాంటి ఏనుగులకు సంగీతాన్ని వినిపించేవారు. అప్పుడు ఆ ఏనుగులు కూడా పనిచేసేవి. ఏనుగులను పట్టడానికి మన పూర్వీకులు వాడే సాధనాలు ఏమిటంటే శృంగారం, ఆహారం, సంగీతం. జంతువులను కూడా ఇంత ప్రేమగా చూసుకోగలిగిన మన పూర్వీకులు సాటి మనుషులను కులం పేరు మీద దారుణంగా ఎందుకు, ఎలా హింసిస్తారు?

కౌటిల్యుడు బ్రాహ్మణుడు, చంద్రగుప్తుడు క్షత్రియుడు (కత్తి పట్టుకున్నాడు కాబట్టి అలా అంటున్నాను). కౌటిల్యుడి తెలివితేటల వల్లనే చంద్రగుప్తుడు మౌర్యవంశాన్ని స్థాపించగలిగాడు. అలాంటి కౌటిల్యుడు తాను ఎందుకు సింహాసనాన్ని అధిరోహించలేదు? ఎందుకంటే తాను బాగా సలహాలు ఇవ్వగలడు, మరియు చంద్రగుప్తుడు బాగా యుద్దం చేయగలడు కాబట్టి. అది నిజమైన వర్ణ వ్యవస్థ అర్థం.

ఇంకా భారతదేశంలో అనాది నుంచీ కులవ్యవస్థ ఉందని నమ్మేవాళ్ళు నా ఈ అయిదు ప్రశ్నలకు సమాధానం చెప్పండి చూద్దాం.

1. కులవ్యవస్థకు వ్యతిరేఖంగా ఎవ్వరూ ఎందుకు పోరాడలేదు పూర్వకాలంలో (before 5th centuary AD)? పోనీ అగ్రకులస్థులు అందుకు అంగీకరించలేదనీ ఒకవేళ అలాంటివి జరిగినా వాటిని తొక్కేసారని మీ సమాధానం అయితే కాస్త ఈ చిన్ని ఉదాహరణలు గమనించండి. చరకసంహితలో చరకుడు సమాజంలో ఎన్నో అపోహలున్నాయనీ ప్రజలకు నాణ్యమయిన వైద్యం అందడానికి ముందు ఈ అపోహలన్నీ తొలగిపోవాలని చెప్పాడు. సమాజానికి వ్యతిరేఖంగా చరకుడు వ్రాసినదానిని మనం ఇంతవరకు చూడగలుగుతున్నాం, కానీ సామాజిక విషయాలలో ఇలా ఎందుకు వ్రాసిన గ్రంథాలలో మనం చూడలేకపోతున్నాం? వాత్సాయనుడి కామసూత్రలో మనం ఇలాంటిదే మరో సంఘటనను గమనించవచ్చు. వాత్సాయనుడి కాలాన్ని నిర్ధారించేటప్పుడు శాతకర్ణి శాతవాహనుడు తన భార్య అయిన మలయావతిని రతీసమయంలో కర్టారీ అనే వస్తువుతో కొట్టాడనీ అది కాస్త ఎక్కువై ఆమే చనిపోయిందనీ దానిని బట్టి వాత్సాయనుడి కాలాన్ని మనం అంచనా వేయగలిగాము. కామసూత్రలో శృంగారంలో అప్పట్లో ఉన్న ఇలాంటి అపోహలు తొలగిపోవాలని వాత్సాయనుడు నొక్కి చెప్పాడు. కులవ్యవస్థ గురించి మనకు అలాంటి రాతలు ఎందుకు కనబడవు? మన కలగూరగంప బ్లాగరు గారు చరిత్రలో జరిగిన ఒక చిన్న సంఘటనను వెలుగులోకి తీసుకురాగలిగారు. అది రాచవేమారెడ్డి హత్య వలన రెడ్డిరాజుల శకం అంతమైనది అనే విషయాన్ని. ఆ రాజు గారు ప్రజలమీద అధిక పన్నులు వేసి హింసిస్తున్నాడని ప్రజలే తిరగబడి చంపారని తాడేపల్లి సుభ్రహ్మణ్యం గారు “తొంగి చూసే చరిత్ర”లో చెప్పారు. అలా ప్రజలు తమకు అన్యాయం జరిగిందని అనుకున్నప్పుడు తిరగబడ్డారు కదా మరి అలాంటి సంఘటనలు చరిత్రలో మనకు కులవ్యవస్థకు వ్యతిరేఖంగా జరిగినట్లు ఎందుకు కనబడడం లేదు?

2. హిందూమతం నిజంగా అంత నికృష్టమైనదే అయితే ఇంతకాలం ఎలా నిలబడగలిగింది? మామూలు సమయాలలో బతకగలగడం గొప్ప కాదు, కానీ అంతర్గతంగా, బాహ్యంగా ఎన్నో ఆటుపోట్లను సమర్థంగా ఎలా ఎదుర్కోగలిగింది? బౌద్దం, జైనం, చార్వకం (ఈ మతం ఎప్పుడో అంతరించింది. ఈ మతం గురించి మనకు తెలిసిన వివరాలన్నీ పురాతన జైన గ్రంథాలలో మాత్రమే దొరికాయి. అప్పటి జైనఋషులకు చార్వకులకు మధ్య జరిగిన వాదాలను జైనులు గ్రంథస్తం చేసారు. అలా గ్రంథాలలో మాత్రమే చార్వకుల సంగతి మనకు తెలిసింది). అంతర్గతంగానూ క్రైస్తవం, ఇస్లాము బాహ్యంగానూ దాడులు చేసాయి, కానీ హిందూ మతం ఇంకా నిలబడగలిగింది ఎలా? ఇస్లాము మరియు క్రైస్తవం ఒకదాని తరువాత ఒకటి దాడి చేసాయి, అది కూడా ఆ మతాలు ఉఛ్ఛస్థితిలో ఉన్నప్పుడు. ఆ రెండు మతాలవారు కలిసి గత వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఏలారు కానీ ప్రజలను హిందూమతానికి వ్యతిరేఖంగా మార్చలేకపోయారు ఎందుకు? ఆ మతాలవారు శాంతి కాముకులని, ఇక్కడివారిపై వారు మతాన్ని రుద్దలేదని చెప్పకండి. జిజియా పన్ను గురించి రాయవలసిన అవసరం లేదనుకుంటాను. ఆ మతాలు ఆక్రమించిన మిగతా దేశాల పరిస్థితి, మరియు ఈ దేశం పరిస్థితి చూడండి. మిగతా దేశాలన్నీ కేవలం యాభై సంవత్సరాలలో క్రైస్తవానికి మారిపోయారు. కానీ భారతదేశంలో మాత్రం పరిస్థితి వారికి అనుకూలంగా లేదు. ఇది వారి పరాజయం అనుకోవాలో లేక హిందూ మతం విజయం అనుకోవాలో నేను పాఠకుడి నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఏది అనుకున్నా పరవాలేదు కానీ అది వారి దయవలన అని మాత్రం అనుకోకండి. పరీక్షలో నెగ్గితే ఎవరైనా గొప్ప వ్యక్తి అవుతాడు, అలాంటిది హిందూమతం అగ్ని పరీక్షలను వేలసంవత్సరాలనుంచి ఎదుర్కుని నిలబడగలిగింది. అధిక శాతం జనాభాను హింసించగలిగే ఏ మతం కూడా ఇంత కాలం నిలబడలేదని మనకు చరిత్ర చెబుతున్న సత్యం.

3. బానిసవ్యవస్థ మనకు సత్యహరిశ్చంద్రుడి కాలంలో తప్ప భారతీయ చరిత్రలోకానీ జీవనవిధానంలో కానీ ఎక్కడా కనబడదు (ముస్లిము దండయాత్రలవల్ల మళ్ళీ బానిస వ్యవస్థ మొదలయ్యింది). మహాభారతంలో కూడా మనకు బానిసవ్యవస్థ కనబడదు. మెగస్తనీసు కూడా బానిసవ్యవస్థ భారతదేశంలో లేదు కాబట్టి ఇక్కడి ప్రజలు అధికసంఖ్యలో పిల్లలను కనేవారని తన పుస్తకంలో చెప్పాడు. బానిసవ్యవస్థను మిగతా దేశాలు నిలబడడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే నిర్మూలించిన భారత సంప్రదాయం సాటి భారతీయులను బానిసలకు సరిజోడు అనదగ్గ అంటరానివారిగా ఎందుకు చూస్తుంది?

4. ప్రకృతి శక్తులనే (ఇంద్రుడు, వాయువు, అగ్ని, వరుణుడు, భూమి, సూర్యుడు, అష్టదిక్పాలకు etc.) కాక మానవునికంటే అల్పప్రాణులలో (పాములు, ఆవు, కుక్క, ఎద్దు etc.) కూడా దైవాన్ని చూడగలిగిన హిందూ మతం సాటి మానవులను జంతువుల కంటే నీచంగా చూస్తుందా?

5. పందొమ్మిదవ శతాబ్దపు చివరి వరకూ భారతదేశం ప్రపంచంలోనే ధనిక దేశం. ఒక దేశంలో అధికశాతమ్ జనాభా హింసను అనుభవిస్తుండగా, ఆ దేశం ధనిక దేశంగా ఎలా ఛలామణీ అవ్వగలదు? రష్యా (మాజీ USSR) లో ఎప్పుడైతే అధికశాతం ప్రజలు తిండికి, నీటికి కూడా ఇబ్బంది పడ్డారో, ఆ దేశం ముక్కలయింది. ఒక్కసారి అగ్రరాజ్యం అన్న హోదా నుంచి మామూలు దేశం అన్న హోదాకు పడిపోయింది. అలాంటిది భారతదేశం అన్ని శతాబ్దాలపాటు (శత్రువులైన ముస్లిముల చేతిలో ఆరువందలకు పైగా సంవత్సరాలు ఉన్నప్పటికీ) ఎలా ధనిక దేశంగా ఉండగలిగింది?
ఎవరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?

Sources
1. Ancient India as described by Megasthenes and Arrian, by J. W. McCrindle


 http://vaidikadharmam.blogspot.in/

మన మతాన్ని కాపాడుదాం : కుల వ్యవస్థ: వైదిక కాలం : రెండవ భాగం


కులవ్యవస్థ మీద ఇది  రెండవ టపా. ఈ టపాలో నేను వైదిక కాలం నుంచి జరిగిన చరిత్రను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఒక్కసారి మళ్ళీ మొదటినుంచి వద్దాం. హిందూమతానికి మూలం వేదాలు. వేదాల తరువాత ఉపనిషత్తులు, పురాణాలు. వీటితో పాటు రామాయణమహాభారతాలు.

వేదాల ప్రకారం మానవ జీవితం నాలుగు భాగాలు – బ్రహ్మచారి, సంసారి, వానప్రస్థం, సన్యాసం. వీటిని ఖచ్చితంగా పాటించాలని లేదు. అదే విధంగా సమాజం నాలుగు భాగాలు (చాతుర్వర్ణవ్యవస్థ) – బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. బ్రాహ్మణులు గురువులు, పుజారులు. క్షత్రియులు పాలించేవారు, సైనికులు. వైశ్యులు వ్యవసాయం మరియు వ్యాపారం చేసేవారు. శూద్రులు వ్యవసాయం మరియు మిగతా పనులు చేసేవారు. చాతుర్వర్ణవ్యవస్థ కేవలం చర్యలవల్లనే తప్ప జన్మ అధారంగా కాదని వేదాలు చెబుతున్నాయి. ఒక్కసారి ఉదాహరణ ఉపయోగిస్తే అర్థం అవుతుంది. ఒకప్పుడు సమాజంలో అధికసంఖ్యాక ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. వారికి రక్షణగా కొంతమంది ఉండేవారు. వారే క్షత్రియులు. కొంతమంది నేర్పించేవారు. వారే బ్రాహ్మణులు. అప్పుడు సూద్రులు లేరు. కొంతమందికి ఇది కష్టంగానూ నమ్మశక్యంగానూ ఉండవచ్చు, కానీ ఈ మాట స్వయంగా మన రాజ్యాంగనిర్మాత అయిన అంబేద్కర్ చెప్పడు కేవలం మూడు కులాలు మాత్రమే ఉన్న సమాజం ఉండేదని. పచ్చిగా చెప్పాలంటే ప్రతీ ఒక్కరికీ ఏదోరకమయిన టాలెంటు ఉంటుంది. దాన్ని సమాజం యొక్క శ్రేయస్సు కొరకు ఉపయోగించడమే వర్ణవ్యవస్థ యొక్క లక్ష్యం. మరొక ఉదాహరణ ఋగ్వేదంలో “సూద్రుడు” అనే పదం పురుషసూక్తిలో తప్ప ఎక్కడా కనబడలేదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు పేర్లు చాలాసార్లు ఉన్నాయి. బ్రాహ్మణులను ఎదిరించడం వలన క్షత్రియులే సూద్రులుగా మారారని మనకు అంబేద్కర్ గారు సోదాహరణంగా వివరించారు.
ఋగ్వేదంలో మొట్టమొదటిసారి కులాలవారు ఎలా వచ్చారో పురుషసూక్తిలో చెప్పారు.tasmAt virAd ajAyata virAjo adhipUrusha : sa jAto atyaricyata pashcAd bhUmimatho pura: 5
purusha sukta - 5
 

ఆ సూక్తి యొక్క భావం “బ్రాహ్మణులు తలనుంచి, క్షత్రియులు భుజాలనుంచి, వైశ్యులు ఊరువులనుంచి, శూద్రులు పాదాలనుంచీ వచ్చారు.” దానినే నేను మరోవిధంగా చెబుతాను. ఇక్కడ పురుషుడు అంటే సమాజం అని అర్ధం. బ్రాహ్మణుల తల (అంటే మేధాశక్తి), క్షత్రియుల చేతులు (శౌర్యం, యుద్దవిద్యలు – యుద్దం ఎక్కువగా చేతులను ఉపయోగించి చేస్తారు), వైశ్యుల ఊరువులు (వైశ్యులు ఇతర దేశాలు తిరిగి ఎక్కువ ధనం సంపాదించాలని అర్థం), శూద్రులు పాదాలద్వారా (శూద్రుల యొక్క కష్టపడే శక్తి) సమాజం అభివృద్ది చెందుతుందని అర్థం.
 

ప్రజలకు వేదాల అర్థాన్ని సులభతరం చేయడానికి ఉపనిషత్తులను వ్రాశారు. వేదాలలో ఉన్న అన్ని విషయాలగురించి సమగ్రంగా విపులంగా మనకు ఉపనిషత్తులలో వివరించారు కానీ వర్ణవ్యవస్థగురించి మాత్రం ఏ ఉపనిషత్తులోనూ వివరించలేదు. దీనిని బట్టి ఒకటి ముందు ఉపనిషత్తులయినా రచించి ఉండాలి లేదా వేదాలలో కొన్నింటిని తరువాత అదనంగా చేర్చి ఉండాలి. పురుషసూక్తి కూడా అలా వచ్చిందేనని స్వయంగా అంబేద్కర్ గారు సెలవిచ్చారు. వారు చెప్పిన కొన్ని విచారించదగ్గ అంశాలు. ఋగ్వేదంలోని మిగతా సూక్తులకు పురుషసూక్తి ఒక ప్రధాన భేదం ఉంది. అన్ని సూక్తులు ఒక గురువు తన శిష్యుడికి వివరిస్తున్నట్లు ఉంటాయి, కానీ పురుషసూక్తి మాత్రం అలా ఉండదు. It doesn’t follow the pattern of other slokas. ఋగ్వేదంలోని మిగతా సూక్తులకు పురుషసూక్తికి భాషలో కూడా చాలా తేడా ఉంది. పురుషసూక్తిలో భాష చాలా సరళంగా అర్థమవుతుంది కానీ మిగతా సూక్తులలో భాష చాలా కఠినంగా ఉంది. సంస్కృతంలో ఆరితేరిన ఉద్దండులు తప్ప కాస్తొ కూస్తో సంస్కృతం మీద పట్టుతో ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం (1). పురుషసూక్తి ఋగ్వేదంలోకి తరువాతి కాలంలో చేర్చారని దీనిని బట్టి స్పష్టమవుతోంది.
పురాణాలు ఉపనిషత్తులు కాకుండా ఇతర గ్రంథాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం. రాక్షసగురువు శుక్రాచార్యుడు వర్ణవ్యవస్థ గురించి ఇలా చెప్పాడు-
 

నజాత్య బ్రాహ్మణశ్చాత్ర క్షత్రియో వైశ్య ఏవ న
న శుద్రో న చ వై మ్లేఛ్ఛిచో భేదితా గుణకర్మాభి:
 

(ఈ ప్రపంచంలో ఎవ్వరు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సుద్రులుగా జన్మ వలన నిర్నయింపబడరు, కేవలం తమ పనులవలన నిర్నయింపబడుతారు.)
 

శుక్రాచార్యుడు రాక్షసగురువయినా బ్రాహ్మణులు మాంసాహారం ముట్టరాదని చెప్పినవాడు. ఆహారం గురించి శుక్రుడు చెప్పిన నీతిని ఆచరిస్తున్న బ్రాహ్మణులు ఇతరత్రా విషయాలలో ఎలా అతని మాటను జవదాటగలరు?
కులవ్యవస్థను వ్యతిరేఖించేవారు చెప్పే మరొక ఉదాహరణ మనుసంహిత. మనుసంహిత కూడా ఇతర అన్ని గ్రంథాలవలె తరువాతి కాలంలో మార్పులకు గురయ్యిందని నేను అంటాను. దానికి కొన్ని ఉదాహరణలు. 

మనుసంహితలో అనేక రకాలుగా సూద్రులను తక్కువవారనీ వారికి ధనం అందకుండా చేయాలనీ చెప్పే సూక్తులు ఉన్నాయి. నేను వీటికి వ్యతిరేఖంగా ఉండే కొన్ని సూక్తులు. మనుసంహితలోని సూక్తులు 2:223, 10:128, 2:240, 2:238 కొన్ని ఉదాహరణలు. కొన్ని సూక్తులలో బ్రాహ్మణకుటుంబీకుడు ముందుగా తన వద్ద ఉన్న (ఉంటేనే) సూద్రులకు (పనివాళ్ళు) భోజనం పెట్టాలని ఉన్నది. బ్రిటీషువాళ్ళు భారతదేశంలో శిక్షాస్మృతి తయారుచేస్తున్నప్పుడు మనుసంహితను ఆధారంగా చేసుకుని రూపొందించారు. అలాంటిది మనవాళ్ళకు మనుసంహితలో ఎక్కువ తప్పులు కనబడుతున్నాయి కానీ ఆ సంహితలోని గొప్ప విషయాలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు.
 

మనం ఒక ఉదాహరణను చూద్దాం. ఒక వ్యక్తి (Mr.H) హత్య చేసాడని అనుకుందాం. Mr.H చట్టంలోని చిన్న లొసుగును పట్టుకొని మంచి లాయరును పట్టుకుని బాగా ఖర్చు పెట్టి శిక్ష పడకుండా తప్పించుకున్నాడు. దీనికి యధావిధిగా పోలీసులు, రాజకీయనాయకులు, పత్రికలు Mr.Hకు సహాయం చేసి తాము కొంత డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు జరిగిన హత్యకి న్యాయం జరుగలేదు. అందుకు మన మొత్తం న్యాయవ్యవస్థ విఫలం అయ్యిందని దాని రద్దు చేద్దామా? లేక న్యాయం జరుగలేదని భారతదేశంలో ఎమర్జెన్సీ విధిద్దామా? కేవలం ఒక చిన్న లొసుగువల్ల, కొందరు దుర్మార్గులు లంచం తీసుకోవడం వల్ల ఎలాగైతే మన వ్యవస్థ మొత్తం విఫలమైనట్లు కాదో అలాగే అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు ఉండడం వల్ల వర్ణవ్యవస్థ మరియు ఏకంగా హిందూ మతం కేవలం ఉన్నత వర్గాలవారికోసమని అనుకోవడం మూర్ఖత్వం. తప్పుగా ఉన్న స్లోకాలను మనం సరిదిద్దుదాం. మన సంస్కృతిని కాపాడుదాం.
(ఇంకా ఉంది)


1. అంబేద్కర్ వ్రాసిన పుస్తకంలో నుంచి సంగ్రహించబడింది.


 http://vaidikadharmam.blogspot.in/2009/02/blog-post.html

మన మతాన్ని కాపాడుదాం : కులవ్యవస్థ: ఒకటవ భాగం


కులవ్యవస్థగురించి మాట్లాడాలంటే చాలా గుండె ధైర్యం కావాలి మరియు సమాజం (పత్రికలు) ఎన్ని రకాలుగా నిరాశపరిచినా తట్టుకోగలగాలి. ఈ వ్యాసం టైటిలు చూసి చాలామంది నేను ఒక కులపిశాచినని తిడతారు. నేను అన్నింటికీ సిద్దపడే వచ్చాను. కులవ్యవస్థగురించి పూర్తిగా చెప్పాలంటే ఒక టపా సరిపోదు కాబట్టి కాస్త పెద్దగానూ ఒకటి కంటే ఎక్కువగానూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా చెప్పాలంటే దయచేసి టపాలో నేను చెప్పినదాని గురించి చెప్తే నేను చెప్పగలుగుతాను.

మొదట కులవ్యవస్థ వర్ణవ్యవస్థ రూపంలో ఉందని మనకు అనేకులు చెబుతారు. కాని మనపురాణకాలంలో లేదని చెప్పలంటే దానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. అన్నింటికన్నా ముందు ఈ కులవ్యవస్థ ఆర్యులు తెచ్చారని చెబుతున్నారు. ఆర్యసిద్దాంతం (Aryan Invasion Theory) ప్రకారం రామాయణ మహాభారతాలు అస్సలు జరుగలేదు, పూర్తిగా కల్పితాలు. అంబేద్కర్ గారు కూడా ఆర్యసిద్దాంతాన్ని అంగీకరించలేదు. కులవ్యవస్థగురించి మాట్లాడాలనుకునేవారు ఆర్యసిద్దాంతాన్ని నమ్మితే దాని ప్రకారం ఆర్యులు తమతో పాటు తీసుకువచ్చిన ఈ వ్యవస్థను మనమీద రుద్దారు. ఆర్యసిద్దాంతాన్ని గురించి తరువాతి టపాలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేను చెప్పలనుకున్నదాని ప్రకారం ఆర్యసిద్దాంతం అంతా అబద్దం అని రామాయణ మహాభారతాలు మన చరిత్ర అని నేను నమ్ముతున్నాను, దాని ప్రకారం నేను చెబుతాను (2002లో ద్వారకలో బయల్పడిన నిజాల ద్వారా అర్యసిద్దాంతం అబద్దం అని వేరే చెప్పనవసరంలేదనుకుంటున్నాను).
 

మనకు సమాజాన్ని విభజించమని చేప్పే సూక్తి మొట్టమొదట ఋగ్వేదంలోని పురుషసూక్తిలో దర్శనమిస్తుంది. ఆ సూక్తి గురించి తరువాతి టపాలో చెబుతాను. ఈ టపాలో రామాయణ మహాభారతాలగురించి చెప్పదలచుకున్నాను. మొదట రామాయణం గురించి మాట్లాడుకుందాం. “Why I am not a hindu” పుస్తక రచయిత కంచ ఐలయ్యగారు తన పుస్తకంలో రాముడు ఆర్యుడని పేర్కొన్నారు. ఆర్యసిద్దాంతం ప్రకరం ఆర్యులు అందరూ తెలుపు శరీర వర్ణంగా కలవారు. కాని రాముడు నీలిమేఘశ్యాముడని, తెల్లగాఉండడనీ పాపం ఆయన మరిచారు. రామాయణం ఆర్యద్రావిడుల యుద్దమని చెప్పేవారు అనేకులు ఉన్నారు. వారందరికీ ఒకేఒక్క ప్రశ్న- రావణాసురుడు తెల్లగా ఉంటాడు కాని రాముడు నల్లగా ఉంటాడు. రావణాసురుడు ద్రావిడుడు అయితే ఇది ఎలా సాధ్యం? అంతేగాక రావణుడు బ్రాహ్మణుడని మనకు రామాయణం చెబుతోంది. కాని మనకు మేధావులమని చెప్పుకునే వారందరూ ఈ విషయాన్ని చెప్పరు.
 

రాముడి వ్యక్తిత్వం గురించి మనకు తెలిసే మరో చేదు విషయం రాముడు ఒక శూద్రుడిని చంపడం. ఇది ఉత్తరకాండలోనిది. ఉత్తరకాండ రామాయణంలో లేదనీ తరువాత ఎవరో ఉద్దేశపూర్వకంగా రామాయణంలో దీనిని కలిపారని మనకు అనేక మంది చరిత్రకారులు చెప్పారు. ఇది కాకపోయినా మరొక సంఘటనను గమనిస్తే ఉత్తరకాండ అబద్దమని తేలిపోతుంది. ఇది రాముడు సీతను వెదుకుతూ వెళుతున్న సమయం. అప్పుడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నాడని మనకందిరికీ తెలుసు. శబరి అంటే శబర జాతికి చెందినది అని అర్థం. శబరజాతి వాళ్ళు శూద్రులకు బ్రాహ్మణులకు పుట్టిన మిశ్రమజాతి. ఒక మిశ్రమజాతి స్త్రీ ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్న రాముడు ఒక శూద్రుడిని చంపాడంటే ఎలా నమ్మాలో అర్థం కావట్లేదు. దీనికి ఉత్తరకాండ తరువాత చేర్చినది అని మరోసారి నేను చెప్పనవసరం లేదనుకుంటాను.
 

ఇప్పుడు మహాభారతంలోకి వద్దాం. కులవ్యవస్థ గురించి మాట్లాడేవారు చెప్పే మరొక ఉదాహరణ ద్రోణాచార్యుడు. ఏకలవ్యునిపట్ల ద్రోణాచార్యుని ప్రవర్తన ఏ విధంగానూ సమంజసం సమర్థనీయం కాదు. కానీ ఒక్కసారి నేను అడగదలచుకున్న ప్రశ్న అప్పటి కాలం గురించి మనం చర్చించుకునేటప్పుడు ద్రోణాచార్యుని ప్రవర్తన ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు అనేది. ఒక్కసారి ద్రోణాచార్యుని జీవితం మనం పరిశీలిద్దాం. (మహాభారతం మీద వ్రాస్తున్నాప్పుడు ద్రోణాచార్యుని గురించి వ్రాయాలి అనుకున్నాను, కానీ ఇంతకంటే మంచి సమయం లేదని నేను ఇప్పుడు ద్రోణాచార్యుని గురించి వ్రాస్తున్నాను). ద్రోణుడు భరద్వాజ మహర్షికి కుండలో పుట్టాడు. ద్రోణుడి బాల్యమిత్రులలో ఒకడు ద్రుపదుడు. ద్రుపదుడు ఆటలాడుకునే సమయంలో ఒకసారి మిత్రునికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానని ప్రమాణం చేసాడు. చదువు ముగిసిన తరువాత ద్రోణుడు కృపని(కృపాచార్యుని సహోదరి) వివాహం చేసుకున్నాడు. వారికి కలిగిన ఏకైక సంతానం అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టుకతోనే తలమీద ఒక మణితో పుట్టాడు. దానివల్ల ఎటువంటి శత్రువునైనా, ఆయుధాన్నయినా అవలీలగా భయం లేకుండా ఎదుర్కొనగలడు. అశ్వత్థామ చిన్నతనంలో ద్రోణుడు చాలా పేదరికంలో ఉండేవాడు. అది ఎంతటి పేదరికం అంటే అశ్వత్థామకు పాలకీ గంజికీ తేడా తెలియనంత. ఇది చూసి తట్టుకోలేక తన బాల్యమిత్రుడైనటువంటి ద్రుపదుడిని ధనసహాయం అడగడానికి వెళ్ళాడు. ద్రోణుడు కూడా చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద కోరికలేమీ అడగలేదు, కేవలం ఒక ఇల్లు, ఒక పాడిఆవును మాత్రం సహాయంగా తన బాల్యమిత్రుడిని అర్థించాడు. హస్తినాపురాన్ని ఎదుర్కోగలరాజయినప్పటికీ తన పాతస్నేహితుని ఇంతచిన్న కోరికలను కూడా ద్రుపదుడు మన్నించకపోగా గేలి చేస్తాడు. ఆ అవమానం భరింపలేక ద్రోణుడు పరశురాముడు తనదగ్గర ఉన్నవన్నీ దానం చేస్తున్నాడని తెలిసి అతని దగ్గరకు వెళతాడు. కానీ ద్రోణుడు వెళ్ళేటప్పటికి ఎంతో ఆలస్యం అవడంవలన మరియు పరశురాముడు అప్పటికే తన వద్ద ఉన్న ధనం మొత్తం దానం చేయడం వలన తన అస్త్రాలను ద్రోణునికి దానం ఇస్తాడు.
 

ధనం ఏమీలేక బాధతో హస్తిన(తన భార్య వద్దకు)కు తిరిగివస్తున్న ద్రోణుడు అప్పుడు కురుపాండవులకు మంచి గురువుకోసం వెదుకుతున్న భీష్ముడి కంటపడతాడు. అప్పుడు భీష్ముని అభీష్టం మేరకు కురుపాండవులకు అస్త్రవిద్యనందించడానికి అంగీకరిస్తాడు. అప్పుడు మొదట పెట్టిన ముందు పరీక్షలలో(Preliminary tests) అర్జునుడు మంచి విలుకాడు అవుతాడని గ్రహించి అతనిని సాటిలేని మేటి విలుకాడిగా తయారుచేస్తానని అర్జునునికి ప్రమాణం చేస్తాడు. కేవలం అర్జునునికి ఇచ్చినమాటకోసమే భీష్ముడు ఏకలవ్యునికి విద్యను నిరాకరించాడు మరియు తన ప్రమేయం లేకుండా తన ప్రతిమను గురువుగా భావించి నేర్చుకున్నందుకు బొటనవ్రేలిని గురుదక్షిణగా అడిగాడు. ఇది కాకుండా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం మరోకటుంది. అర్జునునికిచ్చిన మాటను పక్కనపెడితే ఏకలవ్యుడు నిషధరాజకుమారుడు. నిషధులు జరాసంధునికి మిత్రరాజులు, జరాసంధుడు హస్తినకు శత్రువు అవడంవలన అప్పటి ప్రకారం హస్తినకు శత్రువులు (భానుమతీ స్వయంవరంలో కర్ణుడిచేతిలో ఓడినప్పటినుంచీ జరాసంధుడు హస్తినకు మిత్రుడు). నాకు తెలిసీ తనకు ఆశ్రయం ఇచ్చినవారి శత్రువులకు ఎవరూ యుధ్ధవిద్యలు నేర్పించరని నేను భావిస్తున్నాను.
 

మరొక్కసారి ద్రోణుని మనం పరిశీలిద్దాం. బ్రాహ్మణులు ఎవ్వరూ శత్రుత్వానికి తమ మనస్సులలో చోటు ఇవ్వరాదని మన వేదాలు చెబుతున్నాయి. కానీ ద్రోణుడు ఇక్కడ తప్పాడు. ద్రోణుడు అర్జునుని సంపూర్ణ విలుకానిగా, అస్త్రవిద్యలలో సాటిలేని మేటిగా చేస్తానని ప్రమాణం చేసాడు (దాని అర్థం తనకు తెలిసిన సకలఅస్త్రాలను నేర్పుతాను అని), కానీ నారాయణాస్త్రాన్ని తన కుమారుడైన అశ్వత్థామకు నేర్పించాడు కానీ అర్జునునికి నేర్పించలేదు. అదే విధంగా బ్రహ్మశిరాస్త్రాన్ని(http://sacred-texts.com/hin/m10/m10015.htm) అశ్వత్థామకు అర్జునునికీ నేర్పించినప్పటికీ అర్జునునికి మాత్రమే ఉపసంహరించుకోవడం నేర్పాడు. (ఉపసంహరణ వలన ఒక అస్త్రాన్ని అనేక పర్యాయాలు ప్రయోగించవచ్చు.) ఈ విధంగా చూస్తే ద్రోణుడు తన మాట నిలబెట్టుకోలేదని చెప్పవచ్చు. అటు కన్నప్రేమకు న్యాయం చేయలేదు, ఇటు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు, మరో పక్క బ్రాహ్మణునిగా విఫలం అయిన ఒక వ్యక్తిని చూపించా అప్పటి కాలంలో కులవ్యవస్థ ఉందని మనం చెబుతోంది? తన ప్రతినకోసం కర్ణునికి కూడా ద్రోణుడు ఈ అస్త్రాలను నేర్పించలేదు. కానీ దానిగురించి ఎవరూ మాట్లాడలేదు (అంబేద్కర్ తో సహా). పుట్టుకతో క్షత్రియుడయినంతమాత్రాన జీవితాంతం సూతుడిగానే గడిపిన కర్ణుని గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. కర్ణుడు రాజుగా ఉన్నప్పుడు ఎవ్వరూ (మిగతా రాజులు) అభ్యంతరపెట్టలేదు. ఏకలవ్యుడు యువరాజుగా, రాజుగా ఉన్నప్పుడు ఎవ్వరూ అభ్యంతరపెట్టలేదు, కానీ అదేంటో ఒక్క బ్రాహ్మణుడు తన ప్రతినకోసం, తనకు ఆశ్రయం ఇచ్చినవారి మేలుకోసం, తనకు కష్టకాలంలో అన్నం పెట్టి ఆదుకున్న రాజ్యం కోసం శత్రురాజ్యపురాజకుమారుడికి విద్య నిరాకరించడం కులవ్యవస్థయొక్క వేళ్ళూనుకుపోయినతత్వాన్ని ఎలా చూపిస్తుంది? అబ్బే, ఎవ్వరూ దీని గురించి మాట్లాడరు. ద్రోణుడు సాధారణ సైనికుల మీదకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన ఒక మతిలేని వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఒక కులం గురించి ఎలా మనకు పూర్తి అవగాహన కల్పిస్తుంది? అదే ద్రోణుడు ధుర్యోధనుడు పాండవపక్షపాతి అని పదే పదే తిట్టేసరికి సొంత యోధులకు సైతం అర్ధంకాని పద్మవ్యూహాన్ని రచించాడు. కాని తన కుమారుడు చనిపోయాడని తెలిసేసరికి ఆయుధాలు అన్నీ వదిలేసి తపస్సుకు సిద్దమయ్యాడు తీవ్రంగా పోరాడుతున్న యుద్దభూమిలో అదీ తను పోరాడుతున్న సైన్యాలకు న్యాయకత్వం వహించాలని మరచిపోయి. ఇంతటి మానసికస్థైర్యం లేని వ్యక్తి చేసిన పనులను చూపించా మనం మన పురాణకాలంలో కులవ్యవస్థ ఉందని మన పూర్వీకులను తిట్టుకుంటున్నది? ఈనాడు కులవ్యవస్థ గురించి మాట్లాడేవారు నాకు కనీసం ఒక్క విషయానికయినా సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను. మహాభారతం తవ్వే కొద్దీ ఊరే జలం వంటిది. కనీసం ఒక్క వ్యక్తి గురించయినా పూర్తిగా తెలుసుకోకుండా మనవాళ్ళు ఇలా అభాండాలు వేయడం తగదు. నాకు తెలిసీ ద్రోణుడు ఒక విఫలమయిన వ్యక్తి. తండ్రిగా, గురువుగా, బ్రాహ్మణుడిగా, మనిషిగా, సైన్యాధ్యక్షుడిగా, మిత్రునిగా (తన మిత్రుడు తప్పు చేసినప్పుడు క్షమించగలిగే ఉదారహృదయం ఉండాలి) విఫలమయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని చూసా మనం మన పూర్వీకులను అంచనా వేస్తున్నది? ఒక కాలంలో ఒక కులంకానీ ఒక దేశం కానీ ఎలా ప్రవర్తిస్తున్నదో తెలుసుకోవాలంటే ఆ సమాజంలో అధికసంఖ్యాకులు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి మనం అంచనా వేయాలి. కేవలం ఒక్క వ్యక్తి మీద ఆధారపడి మనం నిర్ణయం తీసుకోకూడదు.
 

అప్పటికాలంలో ఉన్న మరో ప్రముఖ బ్రాహ్మణుడు కృపాచార్యుడు, అటువంటిది ఏమీ చేయలేదే. కానీ అతని గురించి ఎందుకు మాట్లాడరు? వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు, ఇంకా చెప్పలంటే మిశ్రమజాతి సంతానం కానీ అతను మహాభారతాన్ని రచించాడు. ఆ మహాభారతాన్ని తరతరాలుగా బ్రహ్మణులు ఇప్పటివరకు చెప్పుకుంటూవచ్చారు. వ్యాసునికి పుట్టిన కుమారులను రాజకుమారులుగా (క్షత్రియులుగా) అంగీకరించారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి పూర్వాశ్రమంలో ఒక దొంగ, కానీ రామాయణాన్ని అందరూ చదువుతారు కదా. ముఖ్యంగా బ్రాహ్మణులు తరతరాలుగా తమ వారసులకు నేర్పించలేదా? హస్తినకు శత్రువులగురించి నేను మాట్లాడినదాని వల్ల ఎవరైనా ద్రోణుడు ద్రుష్టద్యుమ్నునికి నేర్పించినదానిగురించి చెప్పవచ్చు. ద్రోణుడు ద్రుష్టద్యుమ్నునికి నేర్పించేనాటికి ద్రుష్టద్యుమ్నుడు అర్జునుని బావమరిది. ఒక్కసారి అప్పటికాలంలో రకరకాల వ్యక్తులు వర్ణవ్యవస్థకు ఎలా స్పందించారో చూద్దాం. కర్ణున్ని రాజుగా అందరూ అంగీకరించారు. కృష్ణుడు యాదవుడని రాజుగా అంగీకరించని జరాసంధుడు కర్ణున్ని మాత్రం అంగీకరించి, తన మిత్రునిగా అంగీకరించాడు. నిషధుడని ద్రోణుడు విద్య నిరాకరించిన ఏకలవ్యున్ని జరాసంధుడు మిత్రునిగా అంగీకరించాడు. అప్పటి ప్రముఖ రాజులయిన భాగదత్తుడు, జయద్రదుడు, కృతవర్మ ఎవ్వరికీ కర్ణుడు రాజుగా ఉండటానికి అభ్యంతరం చెప్పలేదు. శల్యుడు యుద్దంలో కర్ణున్ని నీరసపరచడానికి అన్ని రకాలుగా మాట్లాడాడుకాని కులం గురించి మాత్రం మాట్లాడలేదు. కులం మీద ఇతర బ్రాహ్మణులయిన అశ్వత్థామ, కృపాచార్యుడు ఏమీ మాట్లాడలేదు. అప్పటికాలం నాటి రాజకీయ సాంఘీక పరిస్థితులు ఏమీ అవగాహన చేసుకోకుండానే డవిలాగులు వదలడం మనవారికే చెల్లింది.

 http://vaidikadharmam.blogspot.in/2009/01/blog-post_31.html

ఎంతకాలం ఈ ఆత్మ ద్రోహం ?


ముందు మొదట భారతదేశ సమీకరణాన్ని చూద్దాం, చరిత్ర చూద్దాం...ఎందుకు, ఏమిటి, ఎలా అనే మూడు చదువుదాం.

(CIA Fact Book, July 2007 లెక్కల ప్రకారం)

భారత దేశ ప్రస్తుత జనాభా : 1,129,866,154

మతాల పరంగా చూస్తే

హిందువులు : 80.5%
ముస్లిములు : 13.4%
క్రిష్టియన్లు : 2.3%
సిక్కులు : 1.9%
మిగిలిన వారు : 1.8%

అయితే భారతదేశం రాజ్యాంగపరంగా ఈ శాతాలను వేటినీ పరిపాలనా సిద్ధాంతాలకు ప్రాతిపదికగా తీసుకోజాలదు. మనది ప్రజాస్వామ్య లౌకిక సార్వభౌమ దేశం కాబట్టి. పాకిస్తాన్, బంగ్లాదేశాలలో ఈ శాతాలు మొత్తం ప్రభుత్వాలనే మత ప్రాతిపదికగా ఏర్పరిచాయి. ఆ దేశాలలో మైనారిటీల గోల వేరు. బాధలు వేరు. వారిని ఎవరూ పట్టించుకోరు. ఒక పట్టించుకుని ఎవరన్నా చిన్న పుస్తకం రాస్తే దేవుడి పేర తల తీసెయ్యమని ఒక ఫత్వా ప్రపంచవ్యాప్తంగా జారీ అయుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎవడో ఒకడు దానిని అమలు చేసెస్తాడు.

ఇక మన దేశంలో....మైనారిటి చట్టాలు ఎలా వుంటాయంటే, వారిని భారతదేశ పౌరులమేనా మనం అనే రకంగా భావించుకునేటట్లుగా నిర్ణయింపబడ్డాయి. వారి చట్టాలు వేరు, నిధులు వేరు, ఎండోమెంటు పనులు వేరు, స్త్రీల చట్టాలు వేరు, స్కూళ్ళు వేరు, ఆఖరికి కాలేజీలు కూడా వేరే. మన దేశంలో ఇంకా ఫత్వా అనేదానికి అర్ధం వుంది. అది ఒక ఇమామ్ జారీ చేసాడు కూడా. అదే ఫత్వాలో సగం తీవ్రతతో ఒక వాఖ్య ఏదైనా ఎవడైనా ఒంకొకడు చేస్తే పార్లమెంటు దుమ్మెత్తిపోతుంది. పార్టీలు పోటీలు పడి మైనారిటీ ప్రేమను చూపిస్తాయి. ఆ అన్నవాడికి మతతత్వాన్ని అంటగట్టేస్తాయి. ఈ డ్రామా చాలా రోజులనుంచి ఇలానే జరుగుతుంది. 

అలా అని ఈ దేశంలో హిందువులేమి తక్కువ కాదు. వారిలోనూ అతివాదులున్నారు. వెధవ పనులూ చేసారు, ప్రాణాలూ తీసారు. కానీ దేశంలో ఎంత మంది వారికి చేయూతనిస్తున్నారు? వారి  నెట్వర్క్ ఏమిటి? మహా అయితే ఒకటి రెండు రాజకీయ పార్టీలు. అవి కూడా దేశ రాజ్యాంగానికి లోబడినవి. వీరి నుంచి అన్య మతాలకు కొద్దిగా ఇరకాటాలుంటాయి, కానీ దేశానికి చిచ్చు మాత్రం పెట్టరు. అంటే పార్లమెంటు మీద దాడి చెయ్యటం లాంటివన్న మాట.

ఇక మిగిలిన శాతం చూద్దాం. 13.4% శాతంలో మహా అయితే 1.0 % శాతం మాత్రమే అతివాదులుంటారు. కానీ ఈ ఒక్క శాతం ఎంత ప్రమాదకరంగా మారుతుందో అందరికి తెలిసిందే. దానిని ఎవడూ ఒప్పుకోడు. ఒప్పుకుంటే వోట్లు రాలవన్న భయం. అసలు నాకర్ధం కానిది, "అఫ్జల్" గాడిని వురి తీస్తే మన దేశంలో ముస్లింలు ఎందుకు ఓట్లు వెయ్యరు? అలా అని రాజకీయపార్టీలు ఎందుకనుకుంటున్నాయి? ఆ లెక్కన మన దేశంలో ముస్లింలు దేశభక్తి ఏమన్నా లేని వారా? అద్భుత కళాకారులు, రాజ్యాంగ నిపుణులు, వైద్యులు అన్ని రంగాలలో స్రష్టలు వున్నారు కదా? మరి ఎక్కడుందీ సమస్య? ఎవరు ఈ ఇమేజ్ ను మన దేశపు ముస్లిములకు అంటగడుతున్నారు? ఎందుకు ఇస్లామిక్ తీవ్రవాదానికి మన దేశంలో చేయూత లభిస్తుంది?

బహుశా ఇవి కొన్ని కారణాలు కావచ్చు...

౦౧. ప్రభుత్వాలు, మదరస్సాలు వారిలో అవిద్యను పెంచి పోషించటం
 

౦౨. ప్రభుత్వపు సవతి తల్లి ప్రేమ
 

౦౩. అధిక స్థాయిలో పేదరికం
 

౦౪. పాత తరపు చాందస వాద ఇస్లామిక్ పార్టీల పట్టు

పైన పేర్కొన్న నాలుగు కారణాలు ఇస్లామిస్ తీవ్ర వాదులకు మన దేశం, ముఖ్యంగా హైదరాబాదు లాంటి నగరాలు పెట్టని కోటగా మారుస్తున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికి పాత నగరం కానీ, ఇతర ప్రాంతాలలో చిన్న రోడ్డు ప్రమాదం జరిగితే, ఆ చేసిన వాడు పారిపోవాలి, లేక పోతే వాడిని నడి రోడ్డులో చంపేసినా చంపేస్తారు. వాహనాలు తగలబెడతారు. ఈ కార్యక్రమంలో సాక్షాత్తు ఆ ప్రాంతపు ఎమ్మెల్యేనో, ఎంపీనో పాల్గొంటారు. భాగ్యనగరంలో అయితే పాత తరపు రజాకర్ల పార్టీలు ఇంకా ఆ ప్రాంతాలను ఏలుతున్నాయి. ఒక అభివృద్ది వుండదు. అసెంబ్లీలో వారినుంచి ఒక్క ప్రశ్న వుండదు. ఎవరూ ఏ తనిఖీకి పాతనగరం వెళ్ళలేరు. వెళ్తే వస్తారో రారో చెప్పలేం. ఇలా వుంది పరిస్థితి. దీనిని సరి చెయ్యటానికి ఏ పెద్ద పార్టీ కూడా ప్రయత్నించదు. ఎందుకంటే మైనారిటీలు రాజకీయపరంగా చైతన్యం పొందితే వారికి చాలా ప్రమాదం. ప్రస్తుతానికి వారికి కావలిసింది మాస్ వోటింగు సరళి. అంటే ఏదో ఒక తెగ నాయకుడిని మంచి చేసుకుంతే, ఆ తెగ అందరూ ఆ పెద్ద చెప్పినట్లు వోట్ వెయ్యటం లాంటిదన్నమాట. ఆ రకంగానే మైనారిటీ వోట్లు ఈ రాజకీయ పార్టీలకు కావాలి. అంతే కానీ వారి అభివృద్ధి గానీ, విద్య గానీ అస్సలు పట్టదు.

పైన చెప్పిన జాడ్యాలన్ని తీవ్రవాద పార్టీలకు అచ్చంగా మన ప్రభుత్వం ఇచ్చిన వరాలు. ప్రస్తుతం పరిస్థితి ఎలా వుందంటే ఒక తీవ్రవాది దొరికితే వాడికి శిక్ష కూడా వోట్ల రాజకీయాల బట్టి అమలు చేస్తున్నారు.

ఈ మతం మత్తునుంచి దేశం ఎప్పుడు బయట పడుతుంది? తీవ్రవాది, దేశ ద్రోహి అన్నాక ఏ మతమైనా ఒకటే. మతాన్ని దానికి జోడించి ప్రకటనలు ఎందుకు చేస్తారో అర్ధం కాదు. ఇది ఇలానే జరిగుతూ పోతే మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు దేశ భావ స్రవంతి నుంచి క్రమంగా దూరమైపోతారు. తమ దేశంలోనే పరాయిగా బతుకుతారు.

ఎంతకాలం ఇలా మనం స్వీయమోసం చేసుకుంటాం? ఒక జాతి, ఒక జాతి అని లక్ష సార్లు అరిచేకంటే, ఒక్క జాతిగా బతికి చూపితే మంచిదేమో? 

 http://sodhana.blogspot.in/2007/08/blog-post_31.html

తెలుగు విజ్ఞానం అనంతం

(ఆచార్య ఆర్వీయస్ సుందరం)

తెలుగువారి ప్రాచీనభాష హోదా అందరాని మ్రానిపండుగానే మిగిలిపోయింది. అది వచ్చినా తెలుగువారికేమైనా మంచి జరుగుతుందని, ఉపయోగకరమైన పరిశోధనలు జరుగుతాయనే ఆశలు కూడా అడుగంటిపోయాయి. ఎందుకంటే తెలుగువారిలో తమ జాతిని గురించి, సంస్కృతిని గురించి, సాహిత్యాన్ని గురించి స్పృహ అంతంత మాత్రమే. ప్రాచీన భాషా హోదా రాక ముందే దాని గురించి నిజంగా కృషిచేసిన వారిని వదలి నాటకాలాడేవారికి కొన్ని పురస్కారాలందజేసి చేతులు దులుపుకున్నప్పుడే మనవారికి ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది.

కర్నాటక రాష్ట్రం వైపు ఒక్కసారి దృష్టి సారించండి. కేంద్ర ప్రభుత్వం హోదాలో ఇచ్చినా ఇవ్వకున్నా కన్నడం విశిష్టభాష అని నిరూపించుకోవడానికి విస్తృత పరిశోధనలకు కర్నాటక ప్రభుత్వం కోట్ల రూపాయల ధన సహాయం చేస్తోంది. కర్నాటక రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో ఉన్న ఒక్కొక్క కన్నడ శాఖకూ రెండు కోట్ల రూపాయలిచ్చి పరిశోధన ప్రణాళికలు చేయవలసిందిగా పురమాయించింది. మన ప్రభుత్వానికి ఇలాంటి విషయాలపై ఇసుమంతయినా ఆసక్తి లేదని మళ్ళీ మళ్ళీ చెప్పనక్కరలేదు.

తెలుగు సాహిత్యంలో తెలుసుకోవలసిన విజ్ఞానాంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. నన్నయకు ముందు కాలం నుండి ఈనాటి వరకు తెలుగు సాహిత్యం ద్వారా జ్ఞానప్రసారం ఎలా జరిగిందో తెలుసుకోవటానికి వంద రకాల పరిశోధనలు జరగాలి. వీటిని మనం తెలుసుకుంటే చాలదు, ప్రపంచానికి తెలియజెప్పాలి.

తెలుగు సాహిత్యమంటే కేవలం నన్నయ, తిక్కన, శ్రీనాథుడు మాత్రమే అనుకొంటే పొరబాటే. మన సాహిత్య చరిత్రలన్నీ కొంతమంది కవులకు, శాస్త్రకారులకు, గణితశాస్త్రజ్ఞులకు, కావ్య మీమాంసకారులకు అన్యాయం చేశాయి. తెలుగు సాహిత్య పరిధిని, శాస్త్ర పరిజ్ఞానాన్ని విస్తృతపరచిన విజ్ఞులకు గౌరవం ఇవ్వటం మనం నేర్చుకోవాలి. అప్పుడే రేచన, కేతన, పాల్కురికి సోమనాధుడు, భాస్కరుడు మొదలైనవారు తెలుగువారి విజ్ఞాన ప్రసారానికి ఎలా దోహదం చేశారో తెలుస్తుంది.


 కేతన తిక్కన కాలంనాటి విశిష్టకవి. తిక్కన చేతనే 'అభినవ దండి' అని ప్రశంసలందుకున్న కవి. దండి మహాకవి రాసిన 'దశకుమార చరిత్ర' అనే గద్యకావ్యాన్ని కేతన చంపూకావ్యంగా రాసి తెలుగులో కథాకావ్యాలనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. తెలుగువారి కోసం తెలుగులో మొదటి వ్యాకరణాన్ని 'ఆంధ్ర భాషాభూషణం' అనే పేరుతో కేతన రాశాడు. అంతేకాదు 'విజ్ఞానేశ్వరం' అనే పేరుతో తెలుగువారికి మొదటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని కూడా కేతనే రాసి ఇచ్చాడు. ఇంత ప్రతిభావంతుడి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలదు.

భారతీయులకు న్యాయపద్ధతుల్ని పాశ్చాత్యులే నేర్పారని, బ్రిటీషువారు రూపొందించిన చట్టాన్నే భారతీయులు నేటికీ అనుసరిస్తున్నారని కొంతమంది చెప్తూ ఉంటారు. అంతకంటే దారుణం ఏమిటంటే న్యాయపద్ధతి అన్నదే భారతీయులకు తెలియదని పాశ్చాత్యుల నుంచే దాన్ని నేర్చుకున్నారని కొందరు భావిస్తుంటారు. కాని భారతీయ న్యాయపద్ధతులకు రెండువేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. హిందూ న్యాయ చట్టాలు చాలావరకు భారతీయ స్మృతుల మీదనే ఆధారపడి ఉన్నాయి. భారతీయులు నేటికీ అనుసరించే పద్ధతులు యాజ్ఞవల్క్య స్మృతి లాంటి సాంప్రదాయిక జ్ఞానానికి సంబంధించినవే.

యాజ్ఞవల్క్యుని పేరుతో అనేకులున్నారు. క్రీస్తుపూర్వం సుమారు వెయ్యి సంవత్సరాలనాడే శుక్ల యజుర్వేదాన్ని ప్రత్యక్షించుకున్న యాజ్ఞవల్క్యడున్నాడని శతపథ బ్రాహ్మణం చెప్తోంది. యాజ్ఞవల్క్య స్మృతిని రచించిన ఋషి క్రీస్తు శతాబ్ది ఆరంభ కాలానికి చెందినవాడని పండితుల అభిప్రాయం. యాజ్ఞవల్క్య స్మృతికి చాలా వ్యాఖ్యానాలున్నాయి. విజ్ఞానేశ్వరుడు రాసిన 'మితాక్షర' చాలా ప్రసిద్ధమైంది. హిందూ న్యాయశాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలకు ఆధారం 'మితాక్షర' వ్యాఖ్యానంతో కూడిన యాజ్ఞవల్క్య స్మృతి.

'మితాక్షర' రాసిన విజ్ఞానేశ్వరుడు కర్నాటకలోని గుల్బర్గా జిల్లాకు చెందినవాడు. ఇటీవలి కాలంలో కర్నాటక ప్రభుత్వం విజ్ఞానేశ్వరుని రచనని కన్నడానికి అనువదించాలని నిర్ణయించుకుంది. గుల్బర్గా జిల్లాకు చెందిన శాసనసభ్యులు, మంత్రులు కలిసి విజ్ఞానేశ్వరుని గురించి లోకానికి తెలియజెప్పే ప్రణాళికను రూపొందించారు. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. విజ్ఞానేశ్వరుడి పుస్తకం విలువని ఈనాడు కన్నడిగులు గుర్తిస్తే తెలుగుకవి కేతన 13వ శతాబ్దిలోనే గుర్తించాడు. కేతన కాలానికి హిందువుల మీద, హిందూమతం మీద ఇస్లాం తాకిడి ప్రారంభమయింది. హిందూ ధర్మశాస్త్రాల సహాయంతో దాన్ని ఎదుర్కొనే బృహత్కార్యాన్ని ఎంతోమంది చేపట్టారు. కేతన ఇలాంటి ఆదర్శంతోనే 'విజ్ఞానేశ్వరం' రచించాడు. ఇది యాజ్ఞవల్క్య స్మృతికి, 'మితాక్షర'కు కేవలం అనువాదం కాదు. ఆనాటి తెలుగు సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కేతన ఈ గ్రంథాన్ని రచించారు. అందువల్ల తెలుగువారి సాంఘిక మత పరిస్థితులు, ఆచార సంప్రదాయాలు, న్యాయ, శిక్షా, నేరాలకు సంబంధించిన పలు విషయాలను తెలుసుకోవాలంటే సుమారు ఏడు శతాబ్దాల క్రితమే తెలుగువాడు రచించిన విజ్ఞానేశ్వరాన్ని పరిశీలించాలి.


 ఇలా చెప్పినంత మాత్రాన కేతన రాసిన పుస్తకంలో ఉన్న ప్రతి విషయాన్ని అనుసరించాలని అర్థం కాదు. ప్రాచీన కాలం నుండి వస్తున్న పద్ధతులన్నీ అనుసరణ యోగ్యాలు కావు. తరతరాల నుండి వస్తున్న మూఢాచారాలను, వ్యర్థ విశ్వాసాలను కూడా అవి ప్రతిబింబిస్తాయి. అయితే న్యాయవ్యవస్థను సక్రమంగా రూపొందించుకోవటానికి కొన్నివేల సంవత్సరాలుగా భారతీయులు అనుసరిస్తూ వస్తున్న పద్ధతుల్ని పరిశీలించి ప్రస్తుత కాలానికి వాటిని అన్వయించుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. ఈ విధంగా తన కాలానికి సంబంధించిన జ్ఞానాన్ని ఈ శాస్త్రగ్రంథం ద్వారా వెలుగులోకి తెచ్చిన కేతన అభినందనార్హుడు.

కేతన తన గ్రంథంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఎన్నో తెలుగు పదాలను వాడాడు. నిత్య వ్యవహారంలో ఉన్న పదాలను పారిభాషిక పదాలుగా తీర్చిదిద్దాడు. సరైన తెలుగు పదం లేదనుకున్నప్పుడు మాత్రమే సంస్కృత పదాలను వాడాడు. శాస్త్ర గ్రంథాలను ఈ విధంగా రాయడం తేలికయిన పనికాదు. 'విజ్ఞానేశ్వరా'న్ని విలువైన పీఠికతో ప్రచురించి (1977) తెలుగువారికి మహోపకారం చేసిన డాక్టర్ సి.వి.రామచంద్రరావు 'సంస్కృత ధర్మశాస్త్రంలోని సాంకేతిక పదాలకు తెలుగులో పారిభాషిక పదకోశంగా విజ్ఞానేశ్వరాన్ని చెప్పుకోవచ్చు. తేట తెనుగు మాటలు వాడడంలో కేతనకు కేతనే సాటి. ఈ విషయంలో అతడు తిక్కనను అనుసరించి, అతనితో పోటీపడతాడు' అన్నారు. (విజ్ఞానేశ్వర పీఠిక)

'వాని తల్లి, తోబుట్టు, వానియాలు' ఇలా బూతు మాటలు మాట్లాడేవారికి ఇరవై అయిదు పణములు జుల్మానా విధించాలని కేతన న్యాయం చెప్తోంది. దేశభాషలను కులాలను పేర్కొని తిట్టేవారికి నూరు పణములు జుల్మానా వెయ్యాలనటం ఈనాటికీ అనుసరించదగిన న్యాయమే : 'మురికినాటివారు, మొరుకులు, పెనుపరులరవవారు ద్విజులకాస పెద్దయనుచు దేశభాషలను కులంబు దిట్టునతడు దండువచ్చు శతపణములు'. కాయగూరలతో సహా దేన్నయినా దొంగతనం చేసేవారికి వెయ్యవలసిన జుల్మానా విషయం కూడా అచ్చ తెలుగులో కేతన చెప్పాడు.

'కాయగూర కట్టె కసవు మంచము పీట
యినుమునుప్పు గడవలియు మొదలు
చవిలెలోని వెలల సరకు మ్రుచ్చితినవా
డారుపు పణము దండు వరువవలయు'

కేతన 'విజ్ఞానేశ్వరం'లో ఆచారకాండ, ప్రాయశ్చిత్తకాండ, వ్యవహారకాండ అనే మూడు భాగాలున్నాయి. భారతీయ శిక్షాస్మృతి, సాంప్రదాయిక న్యాయపద్ధతులు, తెలుగువారి సాంఘిక జీవనం, వారి ఆచార వ్యవహారాలు, శాస్త్ర పరిభాష మొదలైన ఎన్నో విషయాలను తెలుసుకోవటానికి, మనకూ ఇలాంటి గ్రంథాలు కొన్ని శతాబ్దాల ముందు నుంచే ఉన్నాయని తెలియజెప్పటానికి కేతన గ్రంథం పనికివస్తుంది.


 http://www.telugupeople.com/content/content.asp?contentID=1011406&uid=20120624144706&Page=1

మన ప్రాచీన భారతీయుల ఘన చరిత్ర

కోపర్నికస్ కంటె 1000 సంవత్సరాల ముందే సూర్యమండలాన్ని కనుగొన్న ఆర్యభట్టు!

భూమి లంబగోలాకారంగా వుందని, అది సూర్యుని చుట్టూ తిరుగుతుందని పాశ్ఛాత్య శాస్త్రజ్ఞుడు కోపర్నికస్ కంటే వెయ్యి సంవత్సరాల ముందే మన పూర్వీకుడైన ప్రాఛీన భారతీయుడు ఆర్యభట్టు కనుగొన్నడు.

గణిత శాస్త్రంలోని "పై" (22/7) మరియు "సున్న" (0) వీటిని (విలువలను) కూడా ఆర్యభట్టే కనుగొన్నారు, వారేగాని సున్నాను కనుక్కోకపోతే నేడు బీజగణితం, కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానము ఆవిర్భవించి వుండేదే కాదు. ఉత్తమ గనిత శాస్త్ర నిపుణులైన ఆర్యభట్టులవారు ప్రాచీన జ్యోతిష్య గ్రంధ పరిశోధన మరియు తమ అనుభవాల ఆథారంతో "ఆర్యభటీయ" గ్రంధమును రచించారు.

భారతీయులారా, పాశ్చాత్య శాస్త్రవేత్తలను తలపై ఎత్తుకోకండి, ఆ శాస్త్రవేత్తలు సిగ్గుపడే విధంగా పరిశోధనలు చేసిన మన పూర్వీకులను గౌరవించండి.

మన నిజమైన చరిత్రను మనం తెలుసుకుందాము. వలస పాలకులు మనపై రుద్దిన కల్పిత చరిత్రను సరిదిద్దుదాము.

జై హింద్

 http://www.boddunan.com/education/24-arts-a-science/1819-2009-08-20-08-25-06.html