రాష్ట్ర సేవికా సమితి పశ్చిమ ఆంధ్ర ప్రాంత "ప్రవేశ్ శిక్షావర్గ" మే నెల 5 వ తేది నుండి 20 వ తేదీ వరకు హన్మకొండలోని 'భారత విద్యా భవన్' పాఠశాలలో జరిగింది. 5 వ తేది సాయంకాలం 6 గంటలకు 'ఉద్ఘాటన' కార్యక్రమంతో ఈ శిక్షావర్గ ప్రారంభమైంది. ఈ వర్గలో ప్రాంతంలోని 54 స్థలాల నుండి వచ్చిన 125 మంది శిక్షార్ధులు శిక్షణ పొందారు.
ఈ వర్గలో శిక్షార్దుల శారీరక, మానసిక, బౌద్ధిక వికాసానికి ప్రశిక్షణ
ఇవ్వబడింది. రాష్ట్ర సేవికా సమితి అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్ మా.మాధురీ,
దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారిక మా.సీతక్క, దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహిక
మా.సావిత్రి శిక్షార్ధులకు
వివిధ అంశాలలో మార్గదర్శనం చేశారు. మే 18 వ తేదీ సాయంత్రం 6 గంటలకు
హన్మకొండ నగర వీధులలో శిక్షార్దులచే ఘోష్ సహిత 'పథ సంచలన్' జరిగింది. 20 వ
తేదీ సాయంత్రం సార్వజనికోత్సవంలో డా.టి.సంధ్యారాణి అధ్యక్షత వహించగా ముఖ్య
అతిథిగా డా.వి.సువర్ణ ఉపస్థితులైనారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న రాష్ట్ర సేవికా సమితి ప్రముఖ
సంచాలిక వందనీయ ప్రమీలాతాయి మేడే గారు మాట్లాడుతూ "రాజకన్య అయినా సావిత్రి
తన భర్త సత్యవంతుని ప్రాణం కోసం యమధర్మరాజును ఎదిరించిన భూమి ఇది. అచేతన
స్థితిలో ఉన్న సమాజాన్ని తిరిగి చైతన్యవంతం చేయగలిగిన సంకల్ప శక్తి
స్త్రీకి మాత్రమే ఉంది. ఈ ఆధునిక కాలంలో అనేక ఆకర్షణలు, వ్యామోహాలు మహిళలను
తమ ధ్యేయమార్గం నుండి ప్రక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అత్యంత
జాగరూకత కలిగి ఉన్న మహిళలు మాత్రమే ఇటువంటి పరిస్థితులలో తమతో పాటు
సమాజాన్ని కూడా సచేతనంగా ఉంచగలుగుతారు.
ధ్యేయనిష్ఠ
కలిగిన భర్త కోసం అరణ్యాలకు వెళ్ళడానికి సిద్ధపడిన సీతాదేవిని
ఆదర్శంగా తీసుకోవాలని ముంబయి హైకోర్టు ఒక విడాకుల కేసు విషయంలో ఈ మధ్య
తీర్పు ఇచ్చింది. ఎందుకంటే నేడు అనేక ప్రలోభాలు మన కుటుంబ వ్యవస్థ
ధృఢత్వాన్ని దెబ్బ తీస్తున్నాయి. మనం అత్యంత జాగరూకులమై, సంఘటితమై మన
వ్యక్తిగత, నైతిక, సామాజిక విలువల పట్ల నిష్ఠ కలిగి ఉంటేనే ఈ సవాళ్ళను
ఎదుర్కొన గలుగుతాము. స్వదేశీ నిష్ఠ మన కుటుంబంలోని సభ్యులందరికీ కలిగించ
వలసిన బాధ్యత నేటి మహిళ పైన ఉన్నది. మన జీవనకార్యమైన 'సర్వే భవంతు సుఖినః'
అని ధ్యేయనిష్ఠతో మనం సాధన చేయవలసి ఉంది" అని అంటూ ప్రసంగాన్ని ముగించారు
ప్రమీలా తాయి మేడే జీ.
http://www.lokahitham.net/2012/01/blog-post_9367.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి