26, జులై 2012, గురువారం

అస్సాం హింసాకాండ



బోడోలాండ్ హింసాకాండలో నలభై మందికి పైగా మరణించడం, లక్షలాది మంది నిరాక్షిశయులు కావడం విషాదకరం. ఆందులో అత్యధికులు భూమిపుత్రులయిన బోడోలు కావటం, మరియు ఈ మారణకాండ కొనసాగిస్తున్నవారు గొడవలకు అసలు కారకులు మొదలుపెట్టిన వారు బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన ముస్లింలు కావటం గమనార్హం మరియు గర్హనీయం. ఈ హింసాకాండను అదుపు చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవలసిందే. అయితే ఇంత భారీ స్థాయిలో భూమి పుత్రులైన బోడోలకు, స్థానికేతర బెంగాలీ ముస్లింలకు మధ్య విద్వేషాలు పెరగడానికి కారణమేమిటనేది చర్చించుకోక తప్పదు.

బోడోలాండ్ సమస్య సలసల మరుగుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకాలం సమస్యను కప్పి పెట్టడానికి ప్రయత్నించాయి. ఎప్పటికప్పుడు దాటవేయాలనే యత్నమే తప్ప శాశ్వత పరిష్కారానికి పూనుకోలేదు. బోడోల పోరాటం దశాబ్దాలుగా సాగుతున్నా వారి ఆకాంక్షలు నెరవేర్చకపోవడం పాలకులు చేసిన పెద్ద తప్పిదం. పైగా బోడో ఉద్యమాన్ని తప్పుదారి పట్టించేందుకు అతి తెలివితో విభజించి పాలించే విధానాలను అవలంబించారు. పాలకుల ఈ కుత్సితం వల్ల సమస్య రగిలి రగిలి ఈ రీతిలో భగ్గుమన్నది. అయితే ఇంత భారీ ఘర్షణలకు దారి తీసిన తక్షణ కారణం ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొదట ఇద్దరు బెంగాలీల హత్య జరిగింది. ఆ తరువాత మరో ఇద్దరు హతమయ్యారు. ఎవరు ఎందుకు ఈ హత్యలు చేశారో తెలువదు. ఆ తరువాత నలుగురు మాజీ బోడో మిలిటెంట్ల హత్య జరిగింది. ఈ హత్యలు కూడా ఎవరు చేశారనేది తెలువదు.

కానీ తమ గడ్డపైనే తమవారు హతులు కావడాన్ని బోడోలు జీర్ణించుకోలేక పోయారు. ప్రతీకార దాడులతో పరిస్థితి ఇంత తీవ్రంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బోడోల ఆకాంక్షలు నెరవేర్చక పోవడం వల్ల, భిన్నవర్గాల మధ్య విభేదాలు పెంచి పోషించడం వల్ల ఉద్రిక్తత నెలకొని ఉన్న మాట నిజమే. అయితే ఘర్షణలు హటాత్తుగా చెలరేగడం వెనుక మాత్రం ఆధిపత్యవర్గాల కుట్ర దాగి ఉన్నట్టు కనిపిస్తున్నది. బోడో రాష్ట్ర సాధన కోసం మళ్ళీ పోరాటం ఉధృతమవుతున్న దశలో, ఉద్యమం ఆప్రతిష్టపాలయ్యే విధంగా ఘర్షణలు చెలరేగుతున్నాయంటే, అందుకు అస్సాంలోని ఆధిపత్య వర్గా లు బాధ్యత వహించాల్సిందే. 


బోడోలతో గొడవ పడుతున్నది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బెంగాలీ ముస్లింలు అయినందు వల్ల ఈ ఘర్షణలకు మతం రంగు పులమడానికి కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ భూమి పుత్రులకు, స్థానికేతరులకు మధ్యగల వైరుధ్యమే ఇక్కడ ప్రధానమైనది.

పైగా బోడోల అసంతృప్తికి కారణం బెంగాలీ ముస్లింల వలసలు మాత్రమే కాదు. అస్సామీయుల ఆధిపత్యం నుంచి విముక్తి కోసం వారు పోరాడుతున్నారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే తప్ప తమ ఆకాంక్షలు తీరవని వారు భావిస్తున్నారు. అస్సాంలో భాగంగా ఉంటూనే తమ ఆకాంక్షలు తీర్చుకోవడం కోసం గతంలో ఒప్పందాలను నమ్మి రాజీ పడినా వారికి నిరాశే మిగిలింది. బోడోల పోరాటానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నది. స్థానికేతరులు తమ భూములను ఆక్రమించుకుంటున్నారని గమనించిన బోడోలు, ఇతర గిరిజనులు 1960 దశకంలోనే అస్సాం మైదాన గిరిజన మండలిగా ఏర్పడి ఆదివాసీ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని కోరారు. అస్సాంలోని విద్యా సంస్థలలో తమకు చోటు లభించక పోవడం, ఉద్యోగాలలో వివక్ష చూపించడం, తమ భాషా సంస్కృతులు నిర్లక్ష్యానికి గురికావడం వంటి అనేక కారణాల వల్ల బోడోలు స్వరాష్ట్రం కోసం ఉద్యమం ప్రారంభించారు.

1987 మార్చి రెండవ తేదీన ఉపేంవూదనాథ్ బ్రహ్మ నేతృత్వంలో ఆల్ బోడో స్టుడెంట్స్ యూనియన్ ఆవిర్భావం బోడోల స్వరాష్ట్ర ఉద్యమ చరివూతలో మైలురాయి. బోడో రాష్ట్రం ఇవ్వడానికి బదులుగా బోడో పరిపాలక మండలి ఏర్పాటుకు కేంద్ర రాష్ట్రాలు బోడోలను ఒప్పించాయి. ఈ మండలి వల్ల ప్రయోజనం లేదని తెలిసిపోవడంతో బోడోలు మళ్ళీ ఉద్యమించారు. మళ్ళీ మరిన్ని అధికారాలతో బోడో ప్రాదేశిక మండలి ఏర్పాటు జరిగింది. 

బంగ్లాదేశ్ నుంచి వచ్చే బెంగాలీల
ముస్లింల సమస్య బోడో ప్రాంతానికి పరిమితమైన సమస్య కాదు. అస్సాం ఉద్యమం కూడా ఈ స్థానికేతరులకు వ్యతిరేకంగా భారీ ఎత్తునే సాగింది. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బిహార్ మొదలుకొని, అస్సాం తదితర ఈశాన్య ప్రాంతాలలో బెంగాలీముస్లింల పెత్తనం సాగుతున్నది. భూములు వీరి చేతుల్లోనే ఉన్నాయి. వ్యాపారాలలోనూ వీరిదే ప్రాబల్యం. త్రిపురలోనైతే స్థానికులు మైనారిటీలుగా మారిపోయారు. కేంద్ర ప్రభుత్వంలో పట్టు మూలంగా బెంగాలీ లాబీ ఆధిపత్యాన్ని ఈశాన్యంలోని ఇతర జాతులు, తెగలు ఎదుర్కోలేక పోతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ముస్లింల వలసల సమస్యను దౌత్యపరంగా, మానవతా దృక్పథంతో పరిష్కరించడం అసాధ్యమేమీ కాదు. కానీ ఈ వలస లు కాంగ్రెస్, సీపీఎం కనుసన్నలలోనే సాగడం వెనుక కుట్రపూరిత రాజకీయం ఉన్నది. అదే ఇప్పుడు సమస్యగా మారింది. 1970 దశకంలో ఈ వలస వచ్చినబెంగాలీ ముస్లింలందరికి ఓటు హక్కు ఇవ్వడం వివాదాస్పమైంది.

అస్సాంలో ఉద్యమం చెలరేగింది. అయినా కేంద్రం ఈశాన్యం ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికీ పరిష్కరించడానికి పూనుకోవడం లేదు. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలూ చుట్టూ ఉన్నాయనే తొంపుతో ఈశాన్యంలోని ఉద్యమాలను కేంద్రం సైన్యాన్ని పెట్టి అణచివేస్తున్నది. కీలకమైన ప్రాంతమనే సోయి మొదటి నుంచి ఉంటే, అక్కడి భిన్న జాతులు, తెగల సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడాలె. వారికి పాలనలో భాగస్వామ్యం కలిగించాలె. భూమి పుత్రులు తమ ప్రాంతంలో తాము అల్పసంఖ్యాకులుగా మారిపోతున్నామనే భయాందోళనలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలె. ఈశాన్యంలోని తెగల మధ్య వచ్చే వైరుధ్యాలను సామరస్యంగా పరిష్కరించాలె. అంతే తప్ప సైన్యాన్ని దింపి మానవ హక్కులను హరించడం, విభజించి పాలించే కుటిల నీతిని అనుసరించడం వల్ల సంక్షోభాలు ముదిరిపోతాయి. ఈ అనిశ్చితి ఈశాన్యానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వ్యాపించవచ్చు. అందువల్ల ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు గుర్తెరిగి వ్యవహరించడం శ్రేయస్కరం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి