8, జులై 2012, ఆదివారం

కావ్యం, కథ, తత్త్వం అన్ని కలగలిసి పోయిన రూపం హిందుత్వం



 
బంకించంద్రుడు మహా కవి. భగవద్గీతపై, హిందుత్వంపై ఎన్నో వ్యాఖ్యానాలు వ్రాశారు. హిందుత్వం గురించి బంకిం చంద్ర ఇలా అన్నారు.

"మతం అనేది లౌకికంగాను, ధార్మికంగాను ఉండి సంపూర్ణ జీవనానికి అన్వయింప బడి ఉండాలి. వేర్వేరు సంస్కృతులతో, ప్రాంతీయాచారాలతో చిక్కుముడి లాగ తయారయిన "హిందుత్వం" ను జాగ్రత్తగా ముడులు విప్పి చూసుకొంటే తప్ప అసలు మూల సిద్ధాంతాలు బయటపడవు. తాంత్రిక ప్రభావం హిందుత్వంపై ఉన్నా అదే హిందూ మతం కాదు. హిందూ మత సారం కాబోదు. హిందుత్వం - తంత్రం రెండూ వెలుగు చీకట్ల లాగ భిన్నమైనవి. అద్వైత, ద్వైత, బహు దైవత్వ, ప్రకృతి దైవత్వ, నాస్తిక, యాజ్ఞిక, అయాజ్ఞిక, శైవ, వైష్ణవ, శాక్తేయ, కబీర, చైతన్యాది వైవిధ్య భరితమైన సంప్రదాయాలు ఉన్నాయి. సాలగ్రామాలను, లింగాలను, తులసిని పంచ భూతాలను ఇంకా ఎన్నిటికో పూజలు చేస్తాము. ఆంజనేయుడిని వాయుపుత్రుడనీ, దేవుడనే పూజిస్తాం. కాని, కోతి అని అనుకోం. బహు దేవతారాధానం ఒక్క హిందువులకే లేదు, గ్రీకులకు కూడా ఉండేది. మనదే తప్పని ఎలా అంటారు? క్రైస్తవులు తప్పన్నంత మాత్రాన మనం కూడా తప్పనుకోవాలా? కించపడాలా?

హిందూమతం క్రైస్తవ, ఇస్లాంల వలె ఏకవ్యక్తి స్థాపితం కాదు. భిన్న భిన్న కాలాల్లో ప్రవేశించిన భిన్న భిన్న తాత్విక సిద్ధాంతాల సమాహారం. కావ్యం, కథ, తత్త్వం అన్ని కలగలిసిపోయిన రూపం".

 http://www.lokahitham.net/2012/01/blog-post_8243.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి