ఒక గూగుల్ గుంపులో ఇటీవల జఱిగిన చర్చ
ఒక సభ్యుడు :
మిషనరీలు ఇండియాలో రోజూ హిందూ దేవుళ్ళను/ దేవతలను/ పవిత్ర గ్రంథాలను బహిరంగంగా దూషిస్తుంటారు. హిందువులనుండి రియాక్షన్ ఎందుకు రావడం లేదు? చిన్న పామునైనా, పెద్ద కఱ్ఱతో కొట్టటం అబ్రహామిక్ కల్ట్స్ యొక్క విధానం. దీనితో ఎవఱినైనా ఎలా భయభ్రాంతులకు గుఱిచేయాలో వారికి తెలుసు. అబ్రహామిక్ కల్ట్స్ కి చెందిన ఉగ్రవాదులు వెయ్యిమంది హిందువులను చంపినా, కుల హిందువులలో ఎలాంటి రియాక్షనూ రాదు. హిందువులు మనగల్గాలంటే కొన్ని ఉపాయాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఇప్పుడు కిరస్తానీ దళితులు (హిందూ దళితులు కాదు) కూడా ఇలాంటి ఆయుధాలను హిందువుల పై ప్రయోగిస్తున్నారు. ఒక కంటికి పది లేక వంద కళ్ళు అనే విధానంతో అబ్రహామిక్ కల్ట్స్ ఇతరులను (ఉదాహరణకు హిందువులను) బెదిఱిస్తూంటాయి. ఒక పాతకాలం నాటి మసీదును కూలకొడితే, దానికి రియాక్షన్ గా 10,000 - 20,000 గుడులను పగలగొట్టారు పాకిస్తాన్‌లో, బంగ్లాదేశ్ లో, మలేషియాలో, ఇండొనేషియాలో, ఇతర మహ్మదీయ దేశాలలో ! ఇవే కుతంత్రాలను కమ్యునిష్టులు కూడా వాడుతుంటారు.
రెండో సభ్యుడు :
మన గుళ్ళవద్ద కిరస్తానీ మిషనరీలు కరపత్రాలను పంచుతుంటే ఒక్కఱూ కిమ్మనరు. ఇక దూషిస్తే మటుకు ఏం చేస్తారూ? మనం చర్చిలవద్దకు వెళ్ళి అలాంటి కరపత్రాలిస్తే శవం కూడా దొఱకదు. అదీ మన ఐక్యత. అదీ మన సమాజపు "బలం".
మొదటి సభ్యుడు :
మాస్టారూ, (౧) హిందువులు ఐక్యంగా లేకపోవడానికి కారణాలను వెతకవలసి ఉంది. What is preventing Hindus unification ?
(౨) హిందువులలో ఐక్యత రావడానికి కావలసిన అవకాశాలను (మార్గాలను) వెతకవలసి ఉంది. How can we achieve Hindu unity ?
గమనిక (౧) : హిందువులు అందరు కులాల కతీతం ఏకంగా కావాలి, తమ ఆర్థిక, సామాజిక, మత, సాంస్కృతిక, భాషా ప్రయోజనాలను సాధించడానికి ! ఇది సాధ్యం కాని పక్షంలో గమనిక (౩), మఱియు గమనిక (౨) చూడండి.
౩) కుల హిందువుల మధ్య ఐక్యత సాధ్యం కాని పక్షంలో (లేక ఎక్కువ కాలం పట్టుతుంది అనిపించినప్పుడు), *హీన పక్షంగా* (minimum) ఏ కులానికి ఆ కులంలో ఐక్యత తీసుకు రావడానికి కావలసిన అవకాశాలను వెతకవలసి ఉంది. ముందు ఏ కులానికి ఆ కులంలో ఐక్యత వస్తే, ఆ తరువాత ఇతర హిందూ కులాలతో కలసి పరస్పర సహకారం (హిందూ విషయాలమీద) ఎలా చేసుకోవాలో చూడవలసి వుంది.
గమనిక (౨) : ఏ కులానికి ఆ కులం, "మొత్తము హిందువులకు హానికరమైన పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయము" అని ఒట్టు పెట్టుకోవాలి. ఏ కులానికి ఆ కులం తమ *ఆర్దికప్రయోజనాలను* కాపాడుకోవడంలో తప్పులేదు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం హిందువులకు హానికరమైన పనులు చేయరాదు. నీవు (నీ కులం) మైనారిటీల పార్టీ అయిన కాంగ్రేస్ తో జట్టు కట్టు, లేక కమ్యునిష్టులతో జట్టు కట్టు, కాని కాంగ్రేస్ గాని, కమ్యూనిష్టులు గాని హిందువుల ప్రయోజనాలకు హాని చేస్తుంటే వారికి మద్దతివ్వకు. వారిచేత హిందువులకు అవసరమైన పనులు చేయించు. ఒక ఎడారిమతస్థులు తాము మైనారిటీలుగా ఉన్న దేశాలలో ఈ విధానాన్ని పాటిస్తుంటారు. తాము మెజారిటీలుగా ఉన్న దగ్గఱ, ఆ దేశాన్ని తమ మతదేశంగా ఆధికారికంగా ప్రకటించి, ఇతరులను దోచుకుంటూ ఉంటారు. అందుకే ఆ దేశాలలో 95 - 99.99% ఆ మతస్థులే ఉంటారు. ఆ దేశాల్లో నివసించే ఇతరులు షరియా వ్యవస్థలో నీళ్ళ బైట ఉన్న చేపల్లాగా గిలగిలా కొట్టుకుంటారు.
గమనిక (౩) : ఇండియాలో ఇప్పుడు ప్రచారంలో ఉన్న "సామాజిక న్యాయం" అనేదాన్ని, కులకోణంలోంచి నిర్వచించి హిందువులను ఇంకో పార్శ్వం నుంచి విడగొడుతున్నారు. భవిష్యత్తులో దీని బదులు "సామాజిక న్యాయం" అనేదాన్ని మతస్థాయిలో నిర్వచించాలి. అంటే హిందూ సామాజిక న్యాయం, మహ్మదీయ సామాజిక న్యాయం, కిరస్తానీ సామాజిక న్యాయం మొదలైనవి. అప్పుడు కులాల మధ్య ఉన్న ఈ వీథిపోరాటాలు తగ్గి, వాటి మధ్య ఐక్యత వస్తుంది.
గమనిక (౪) ఈ రోజున సైంటిఫిక్ గా ఆలోచించగల హిందూ తత్త్వవేత్తలు (community leaders) ఎవఱూ లేకుండా పోయారు. ఈ శూన్యాన్ని (vaccum) హిందువులు త్వరగా భర్తీ చేసుకోవాలి.
మూడో సభ్యుడు :
నేనిక్కడ చెబుతున్నది పైకి చిన్నవిషయంలా కనిపిస్తుంది. కానీ ఇది చాలా పెద్ద విషయం. అబ్రహామిక మతాలవారు ఐక్యంగా ఉండడాని క్కారణాలు కొన్ని ఉన్నాయి.
౧. ఏ జాతికైనా తన గుఱించి తనకు కొంత సామూహిక స్మృతి (collective memory) ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రాహామిక మతాలు నిజానికి మతాలు కావు. అవి వాళ్ళ కమ్యూనిటీల యొక్క చరిత్రపుస్తకాలు. వాటిల్లో మతం/ ఉపాసన ఎలిమెంట్ చాలా తక్కువ. వాటినుంచి వారు స్ఫూర్తి పొందుతారు. చరిత్రని మర్చిపోని/ మఱియు దాన్నుంచి గుణపాఠాలు నేర్చుకునే జాతిని ఎవడూ ఓడించలేడు. హిందువుల పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ హిందువుల స్మృతిపథంలో తమందఱి యొక్క సామూహిక చరిత్ర లేకపోవడమే కాక తప్పుడుచరిత్ర ఒకటి, తమది కాని చరిత్ర ఒకటి వాళ్ళల్లో విద్యావిధానం ద్వారా చొప్పించబడుతున్నది.
౨. అబ్రహామిక మతాలు గత 1500 సంవత్సరాల్లో ఇతర సంస్కృతులపై ఆధిపత్యం కోసం ప్రపంచవ్యాప్తమైన యుద్ధాలు చేశాయి భౌతికంగానూ, సాంస్కృతికంగానూ ! ఈ యుద్ధవ్యూహాలన్నీ వాళ్ళకి కొట్టిన పిండి. ఎలా ఆర్గనైజ్ అవ్వాలో వాళ్ళు నేర్చుకున్నారు. దాన్నొక సైన్సుగా రూపొందించారు. అందుచేత (మతపరంగా) లోకజ్ఞానం లేని పసిబిడ్డల్లాంటి హిందువుల్ని చుట్టబెట్టడం వాళ్ళకో లెక్కలోది కాదు. ఇక్కడ కూడా వాళ్ళ సామూహికస్మృతి, ఉమ్మడి అనుభవం వారికి అక్కఱకొస్తోంది. ఈ విషయంలో మన హిందువులు వాళ్ళతో పోలిస్తే నిన్నమొన్న కళ్ళు తెఱిచిన పసిబిడ్డల్లాంటివాళ్ళు. యుద్ధం చేయాల్సివస్తే కంగారుపడిపోవడమే తప్ప మనకి గుఱి చూసి ఎక్కడ బాణం సంధించాలో తెలీదు. ఉదాహరణకి - ఈ మధ్య భగవద్గీత గుఱించి ఒక రష్యన్ కోర్టులో చెలరేగిన రభస. ఒకవేళ నిజంగానే రష్యాలో భగవద్గీతని నిషేధిస్తే మనం కూడా పోటీగా ఎదురుచర్యలకి దిగుతామని హెచ్చఱించే పాటి వృషణాలు లేని జాతి ఇది. ఊరికే ఉచ్చపోసుకుంటూంటారు ప్రతీవాణ్ణీ చూసి !
అయితే ఇంత మొనగాళ్ళయిన అబ్రహామిక మతాలు కూడా హిందూమతం దగ్గఱికొచ్చేసరికి ఘోరపరాభవాన్ని ఎదుర్కుంటున్న మాట వాస్తవం. వేఱే దేశాల్లో సాధించినంత సులభంగా వాళ్ళిక్కడ హిందూమతాన్ని సాధించలేకపోతున్నారు. ఈ అవమానభారం మూలాన్నే యావత్తు క్రైస్తవలోకమూ, మహ్మదీయలోకమూ మనల్ని ద్వేషిస్తుంది. నిజానికి వాళ్ళ దేశాల్లో హిందువులు ఆట్టే లేరు.వాళ్ళ చరిత్రల్లో వాళ్ళకి మనం చేసిన అపకారమూ ఏమీ లేదు. అయినా ఊరికే ద్వేషిస్తారు, వాళ్ళ మతాల్లో ఇండియా చేఱలేదనే అక్కసుతో ! మన మతం ప్రపంచం కంటే వేఱైనది కావడం వల్లనే మనకి నమ్మదగ్గ మిత్రులు గానీ సానుభూతిపరులు గానీ లేరు ప్రపంచ దేశాల మధ్య. మహా అయితే మన సైజు చూసి కాస్త భయపడతారంతే ! సింగపూరు, శ్రీలంకలాంటి చిన్నచిన్న దేశాలక్కూడా ఇండియా అంటే ద్వేషమే.
౩. హిందువులకి మతం కంటే కులమే పెద్దవిషయం. ఇప్పటికీ హిందువుల్లో ఉన్న ఇంప్రెషన్ ఏంటంటే మతం తమకి సంబంధం లేదనీ, అది బ్రాహ్మలకి సంబంధించిన టాపిక్ అనీ, దాని బాగోగులు బ్రాహ్మలే చూసుకోవాలనీ ! దానికి తోడు ఈ మతం గుఱించి ఎక్కువగా పట్టించుకునేదీ, ఆందోళన చెందేదీ కూడా బ్రాహ్మణులే కావడం ఈ దురభిప్రాయానికి మఱింత ఆజ్యం పోసింది.
ఇండియాలో నాన్-హిందూవర్గాలు తమంతట తాము సహజంగా ఆర్గనైజ్ అయిలేవు. వాటిని మొదట్నుంచీ ప్రభుత్వమే మెజారిటీకి వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేస్తూ వచ్చింది. ఈ పని మొదట బ్రిటీషువారు, తరువాత నెహ్రూ, ఆ తరువాత ఇందిరాగాంధీ etc etc. చేస్తూ వచ్చారు. హిందూ వోట్ ని చీల్చి అందులో తమ కనుకూలమైన వోట్లకి మైనారిటీ వోట్లని కలుపుకుని అధికారంలోకి రావడం కోసం ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తూ వచ్చారు. వీళ్ళ స్కీములో హిందువుల్ని కులాల వారీగా (రిజర్వేషన్ల ద్వారా ) విడగొట్టాలి. కులాభిమానాల్ని పెంపొందించాలి. ఈ రకంగా వ్యవస్థాగతమైన ఏర్పాట్లన్నీ మతపరంగా కాక కులపరంగా ఉండడంతో హిందువులు కూడా మతపరంగా కాక కులపరంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నారు. ముందేమో ఇలా ఎస్సీ ఎస్టీల విషయంలో ప్రయోగించారు. ఇహ ఇప్పుడా అవసరం తీఱిపోయింది. కనుక ఆ తరువాత - అంటే ఇప్పుడు బీసీల్నీ, ఓబీసీల్ని రెచ్చగొడుతున్నారు.
దీనికి పరిష్కారమేంటంటే హిందూ-అనుకూల పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చినప్పుడు, నేనిదివఱకు మనవి చేసినట్లుగా హిందువులందఱినీ ఒకే ధర్మపీఠం కిందికి తీసుకొచ్చి ఆ పీఠానికి ఆధికారిక, ప్రభుత్వ గుర్తింపునివ్వడం, అలా ఒక హిందూ వోట్‍బ్యాంకుని కృత్రిమంగా సృష్టించడం. కాంగ్రెస్ ఇలాంటిదాన్ని ఇమామ్ బుఖారీ, దేవబంద్ ముస్లిమ్ సెమినరీల ద్వారా ముస్లిముల కోసం చేస్తోంది.
మొదటి సభ్యుడు :
దీనిని బట్టి మనకు ఏమి తెలుస్తుంది. Abrahamic "ideology driven cults" లో *మనుషుల జీవితాలకు విలువ లేదు* అని. వారికి - మనుషులు పనిముట్టులు (సాధనాలు) మాత్రమే. అబ్రహామిక్ cults లో (కిరస్తానీలు, ఎడారిమతస్థులు, కమ్యునిష్ట్ లు) ఎవఱు ఎక్కువ హింస (యుద్దాలు) చేయగలిగితే వారు విజేతలు. అందుకే వారు హింసను ఒక ఆయుధంగా వాడతారు. ఇండియాలో 1000 సంవత్సరాల ఎడారిమతపు రక్తమయ హింసాచరిత్రను మసిపూసి మన (హిందువుల) పిల్లలచేత చదివిస్తున్నారు. అసలు చరిత్రను రాస్తే/ చదివితే, కుల హిందువులు సిగ్గుతో చచ్చిపోతారు. మన సమాజము గత 1000 సంవత్సరాలుగా ఇంత దయనీయంగా ఉన్నా కూడా, కుల హిందువులు దాన్నుంచి ఏమి పాఠాలేమీ నేర్చుకోవడం లేదు, మనలాంటి చాలా కొద్ది మంది తప్ప ! ఈనాడు మన కళ్ళ ముందు జఱుగుతున్న ఇలాంటి సంఘటనలు చూసిన తరువాత కూడా వారి యొక్క అసలుఉద్దేశాల నగ్నస్వరూపాన్నికుల హిందువులు గ్రహించలేకపోతున్నారు.
ఉదాహరణకు (ఇది ఒక ఊహ మాత్రమే, నిజంగా జఱుగుతుందని కాదు ), ఎవఱైనా ఒక హైందవేతరుడు ఒక భగవద్గీత గ్రంధాన్ని బహిరంగంగా
తగలబెడితే, హిందువుల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమీ ఉండదు. ఎప్పటిలానే కుల హిందువులు తమ జీవితాలను వెళ్ళదీస్తారు. అదే ఇండియాలో ఒక అబ్రహామిక్ cult యొక్క పుస్తకాన్ని తగలబెడితే, ఇండియా మొత్తం అల్లకల్లోలం అవుతుంది. దీని బట్టి అర్దమయ్యేది ఏమంటే, "హింస" మీద కూడా వారికి (అబ్రహామిక్ కల్ట్ లకు) గుత్తాధిపత్యం (monopoly) ఉంది. అది (హింస) వారు మాత్రమే చేయాలి.
వాస్తవం ఇలా ఉన్నప్పటికీ, నా అభిప్రాయంలో We, the Hindus must always follow the Gandhian method of Ahimsa. We should reach wider audiences and educate other people. ఎంత మంది హిందువులు ఎంత త్వరగా చైతన్యవంతులయితే, అంత త్వరగా హిందువుల ఐక్యత సాధ్యమవుతుంది. చిన్న చిన్న అవరోధాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి.
http://dharmasthalam.blogspot.in/2012/03/blog-post.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి