సోనియా గాంధీ ఆదాయపన్ను వివరాలలో ఏమైనా రహస్యం ఉందా?
కాంగ్రెస్
పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్న శ్రీమతి సోనియాగాంధీ 2000 సంవత్సరం నుండి
2010 వరకు కట్టిన ఆదాయ పన్ను వివరాలను సమాచార హక్కు చట్టం క్రింద
ఇవ్వవలసినదిగా చెన్నైకి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి కోరినారు.
అందుకుగాను శ్రీమతి సోనియాగాంధీ తన ఆదాయ పన్ను వివరాలను సమాచార హక్కు చట్టం క్రింద కోరిన వ్యక్తికి ఇవ్వటానికి నిరాకరించారు.
ప్రపంచంలో
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న
అధికార పార్టీ అధ్యక్షురాలు దేశ ప్రజలకే ఆదర్శంగా, పారదర్శకంగా ఉండవలసిన
వ్యక్తి ఆ సమాచారాన్ని వ్యక్తిగత సమాచారంగా మరియు తన రక్షణ దృష్ట్యా కూడా
ఇబ్బంది కలిగించవచ్చుననే నెపంతో తిరస్కరించారు.
కాగా
సమాచార హక్కు చట్టం సెక్షన్ 8(1)J ప్రకారం (ప్రజా కార్యకలాపాలు, ప్రజా
ప్రయోజనాలతో నిమిత్తం లేని వ్యక్తిగత సమాచారం, వ్యక్తుల వ్యక్తిగత
జీవితాలలోకి తొంగిచూసే అవాంఛనీయ అవకాశం కల్పించే సమాచారం. విశాల ప్రజా
ప్రయోజనాల దృష్ట్యా ఈ తరహా సమాచారం వెల్లడి ఉచితమేనని కేంద్ర పౌర సమాచార
అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి లేక అప్పిలేట్ అధికారి భావిస్తే ఈ
సమాచారాలను కూడా వెల్లడి చేయవచ్చు. పార్లమెంటుకు లేక రాష్ట్ర శాసనసభకు
అందించదగిన ఎలాంటి సమాచారాన్నయినా ఏ వ్యక్తికైనా అందించవచ్చు). 3వ వ్యక్తి
(3rd Party) సమాచారాన్ని కూడా (If the request is in the larger public
interest") అధిక ప్రజాబాహుళ్యానికి ప్రయోజనం చేకూర్చేదిగా ఉంటే పౌర సమాచార
అధికారి ఆ సమాచారాన్ని 3వ వ్యక్తికి తగినంత సమయం ఇచ్చి 90 రోజుల తరువాత ఆ
సమాచారాన్ని సమాచార హక్కు చట్టం క్రింద కోరిన వ్యక్తికి అందచేయవచ్చు.
సమాచార
హక్కు చట్టం ఇలా నిర్దేశిస్తూండగా ఒక అధికార పార్టీ అధ్యక్షురాలిగా
దేశంలోని రాజకీయ నాయకులు, ఉద్యోగులకు ఆదర్శంగా, పారదర్శకంగా ఉండవలసిన ఆ నేత
ప్రభుత్వానికి తాను కట్టిన ఆదాయపన్ను వివరాలను అందచేయటానికి తిరస్కరించటం
రాజకీయ viluvalaku telodakaalivvadame. ఒకవైపు kaangres పార్టీ tarapuna
ప్రధానమంత్రిగా ఉన్న డా.మన్మోహన్ సింగ్ పారదర్శకత కోసం తానూ, తన క్యాబినెట్
అనుచరులు ప్రతి సంవత్సరం ఆస్తుల వివరాలను ప్రకటించ వలసిందిగా పదే పదే
కోరుతుండగా, ఆ పార్టీ అధ్యక్షురాలు నైతిక విలువలను పక్కన పెట్టి
సమాచారాన్ని ఇవ్వటానికి తిరస్కరించినట్లయితే ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ
దేశంలోని ప్రధానమంత్రి, కేబినేట్ మంత్రులు, ఎం.పి.లు, ఎం.ఎల్.ఎ లు కూడా తమ
ఆస్తులను, ఆదాయ పన్ను వివరాలను ఇవ్వటానికి తిరస్కరించినట్లయితే పాలనలో
పారదర్శకత అన్న మాటకు అర్థం, విలువ ఏముంటుంది? ఇదీ ఈ దేశ రాజకీయనాయకుల
వ్యవహారం. ఈ పరిస్థితులలో దేశ ప్రజలు తీవ్రంగా ఆలోచించవలసి ఉంది.
- పతికి
http://www.lokahitham.net/2012/03/blog-post_07.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి