విజ్ఞాన శాస్త్రంలో నాయకత్యం
విశ్వశాంతికి మన సంస్కృతినే కాదు, విశ్వాభి వృద్ధి కి మనం అందించిన శాస్త్రీయ పరిశోధనలను, కొన్ని వాస్తవాలను గమనిద్దాం.
* ప్రపంచంలో విజ్ఞానజ్యోతులు వెలిగించబడక ముందే విజ్ఞాన శాస్త్రం, గణితం, ఖగోళం, జ్యోతిష్యం, తత్వవేదాంతం అందరికి అందించాం.
* 5వ శతాబ్దంలోనే భాస్కరాచార్యుడు 365 రోజులు అంటే ఒక సంవత్సరం కాలెండర్ కు ప్రమాణాన్ని అందించాడు.
* ఆర్యభట్టు “0″ శూన్యాంకము – ‘జీరోథియరీ”ని ప్రపంచానికి అందించాడు.
* చరకుడు 2500 సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేద పితామహుడుగా ప్రఖ్యాతి గాంచాడు.
* మహర్షి శుశ్రుతుడు 2600 సంవత్సరాలకు పూర్వమే శస్త్ర చికిత్సా పితామహుడుగా ప్రఖ్యాతి గాంచాడు.
* కనాదమహర్షి అనుసిద్ధాంతా న్ని మొదటిసారిగా ప్రపంచానికందించాడు.
* ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం క్రీ.పూ. 700 సంవత్సరంలోనే తక్షశిలలో ప్రారంభించబడి ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన పదివేల అయిదు వందల మంది విద్యార్థులకు విజ్ఞానాన్ని ప్రసాదించింది.
ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ద్ ఐన్ స్టీన్ ప్రాచీన భారతీయులకు ఈ విధంగా కృతజ్ఞతలర్పించాడు.
“మనం భారతీయులకు ఎంతో రుణపడి ఉన్నాం, వారు మనకు ఎలా లెక్కించాలో నేర్పారు. అది తెలియకపోతే ఇప్పటి వరకు ప్రపంచంలో ఇంత శాస్త్రీయ పరిశోధన జరిగి ఉండేదే కాదు.” అనిఅన్నారు.
http://202.65.131.54/telugu/?p=214
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి