by sureshkadiri
ప్రాచీన భారతీయుల గణితప్రతిభ క్రింద చూడండి.
1.దశాంశపద్దతిని కనుగొన్నది భారతీయులే.(అనగా 0 నుండి 9 వరకు గల అంకెలతో లెక్కించు పద్దతి)
2.యజుర్వేదం 17వ అధ్యాయం,2వ మంత్రంలో పెర్కొనబడ్డ సంఖ్యల క్రమం
ఏక-1
దశ-10
శత-100
సహస్ర- 1000
ఆయుత-10000- పదివేలు
నీయుత- 100000-లక్ష
ప్రయుత- 1000000- పదిలక్షలు
అర్బుత- 10000000- కోటి
న్యార్బుద-100000000- పదికోట్లు
సముద్ర- 1000000000- వందకోట్లు
మధ్య- 10000000000- వేయికోట్లు
అంత- 100000000000- పదివేలకోట్లు
పరార్థ- 1000000000000- లక్షకోట్లు
క్రీ.పూ మొదటి శతాబ్దం నాటి “లలిత విస్తార”గ్రంథం లో “తల్లక్షణ” కొలమానం 10 ఘాతం 53(1 తర్వాత 53 సున్నాలు).
ప్రాచీన భారత జైనమతగ్రంథం ఐన “అనుయోగద్వార” లో 1 తర్వాత 140 సున్నాల వరకు గల సంఖ్య చెప్పబడింది.
3.ఆ కాలం నాటికి గ్రీకుల అతి పెద్ద సంఖ్య 10000(మీరియడ్) మాత్రమే.
4.రోమనులకు తెలిసిన పెద్ద సంఖ్య 1000(మిలి).
ఇక సున్న కనుగొన్నది మన భారతీయుడైన “ఆర్యభట” అని అందరికీ తెలుసు.
“భారతీయులకు మనం ఎంతో ఋణపడి ఉన్నాము.వారే సులభంగా లెక్కించే దశాంశపద్దతిని ప్రపంచానికి అందించారు.అదే గనుక లేకపోతే నేడు ఎన్నో విజ్ఞాన ఆవిష్కరణలు సాధ్యమయ్యేవి కావు”. – అల్బర్ట్ ఐన్‌స్టీన్
http://sureshkadiri.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి