15, మార్చి 2012, గురువారం

ప్రభుత్వ పాఠశాలల్లో శ్రీమద్భగవద్గీత బోధించవచ్చు : మధ్యప్రదేశ్ హైకోర్ట్


మధ్యప్రదేశ్ హైకోర్ట్

"ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు గీతాసారం బోధించడంలో తప్పు ఏమీ లేదు, మన లౌకిక విధానానికి ఏమీ విఘాతం కలగదు" అని మధ్యప్రదేశ్ హైకోర్ట్
స్పష్టం చేసింది. క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ కి చెందిన ఫాదర్ ఆనందం పాఠశాలల్లో గీతాసారం బోధించడంపై విభేదిస్తూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశాడు. విచారణ చేపట్టిన జస్టిస్ అజిత్ సింగ్, జస్టిస్ సంజయ్ యాదవ్ లు ఫాదర్ ఆనందం లాయర్ కి భగవద్గీత పూర్తిగా చదివి అప్పుడు కేసు వాదించమని ఆదేశించారు. గీత చదవటానికి రెండు మాసాల సమయం కూడా ఇచ్చారు. వాది అయిన ఫాదర్ ఆనందం ప్రభుత్వ పథకాల పేర్లను కూడా వ్యతిరేకించాడు. లాడ్లీ లక్ష్మీ, బలరాం తాల్, కపిల్ ధారా వంటి వాటిని వ్యతిరేకిస్తూ, భూమి పూజను కూడా దుయ్యబట్టాడు. అయితే హైకోర్ట్ మాత్రం పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించింది -"శ్రీమద్భగవద్గీత భారతీయ జ్ఞానం, వేదాంతాన్ని ప్రతిబింబిస్తుంది, లక్ష్మి, బలరాం, కపిల్ అనేవి భారతీయ సంస్కృతికి ప్రాతినిథ్యం వహించే పేర్లు" అని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పింది.
 
- ధర్మపాలుడు

http://www.lokahitham.net/2012/03/blog-post_06.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి