డా.హెడ్గేవార్
1889 సంవత్సరం ఉగాది పర్వదినాన నాగపూర్ లో జన్మించారు. 1925 విజయదశమి
పర్వదినాన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ప్రారంభించారు. సంఘ కార్యమంటే
సామాజిక కార్యం. అంటే ఈశ్వరీయ కార్యం. ఈ పనిని సాధించటానికి శాఖను
ప్రారంభించారు. ప్రతిరోజూ ఒక గంట శాఖ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో
పాల్గొంటూ ఈ దేశం గురించి తెలుసుకొంటూ ఈ దేశం గురించి పని చేయటం ఎలాగో
నేర్చుకొంటూ, ఈ పనిలో తమ జీవితాలనే అర్పించిన అనేకమంది శ్రేష్ట పరంపర మనకు
సంఘంలో కనబడుతుంది.
డాక్టర్ జీ హిందూ సమాజానికి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేవారు -"ఇది హిందూ రాష్ట్రం". ఇది ఒక వాదాతీతమైన సత్యం. మనం అందరం హిందువులం. ఈ హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం మన లక్ష్యం. డాక్టర్ జీ వాస్తవ విశ్లేషణ, దూర దృష్టితో అలోచించి ప్రారంభించిన ఈ కార్యం పెరిగి పెద్దదై ఈ రోజున భారతదేశంలోనే కాక, ప్రపంచమంతట వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను సమైక్యపరుస్తూ వేగవంతంగా విస్తరిస్తున్నది. ఈ దేశంలోని అన్ని జీవన రంగాలలో స్వయంసేవకులు ప్రవేశించి పని చేస్తున్నారు. ఒక నిర్ణయాత్మక శక్తిగా సంఘం ఎదుగుతోంది. ఈ రోజున ఈ దేశ హితం గురించి అలోచించేవారైనా, ఎవరైనా సంఘాన్ని విస్మరించి ఈ దేశం గురించి ఆలోచించే పరిస్థితులు నేడు లేవు. రాజకీయాలకు అతీతంగా నేడు దేశంలో అనేక సంస్థలు పని చేస్తున్నాయి. సంఘంతో సంబంధం లేకుండా సమాజ హితం గురించి అనేకమంది స్వచ్ఛందంగా ఈ దేశంలో పని చేస్తున్నారు. అటువంటి వారు కూడా సంఘ సమన్వయంలో పని చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం. దీని కారణంగా దేశంలో మంచి మార్పు వస్తున్నది. ఒక భావాత్మక చైతన్యం సమాజమంతట కనిపిస్తున్నది. భారతీయ సంస్కృతీ, ఆధ్యాత్మిక విషయాలు, యోగ, ఆయుర్వేదం, సంస్కృతం ఈ రోజున ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచంలో ఒక మంచి పరివర్తన తీసుకొని వచ్చి విశ్వ కల్యాణం సాధించే విషయంలో అంతటా చర్చ జరుగుతున్నది. ఈ విధంగా హిందూ సమాజంలో ఒక చైతన్యం కనబడుతున్నది. మరోప్రక్క పెరుగుతున్న సమస్యలను ఎదుర్కొంటూ వాటిని పరిష్కరించుకోగలం అనే విశ్వాసం కూడా స్పష్టంగా కనబడుతున్నది. దీని అంతటికీ డాక్టర్ హెడ్గేవార్ యొక్క స్పష్టమైన ఆలోచన, ఆచరణే కారణం. ఇదే సమాజమంతటికి ప్రేరణ.

http://www.lokahitham.net/2012/03/blog-post_6940.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి