15, మార్చి 2012, గురువారం

ప్రభుత్వ కార్యాలయాల్లో, కర్మాగారాల్లో ఆయుధ పూజ చేసుకోవచ్చు : మద్రాసు హై కోర్టు


మద్రాసు హైకోర్ట్

"ప్రభుత్వ కార్యాలయాలలో, కర్మాగారాలలో ఉద్యోగులు, కార్మికులూ నిరభ్యంతరంగా ఆయుధ పూజ చేసుకోవచ్చును, సరస్వతి పూజ కూడా చేసుకోవచ్చును" అని చెన్నయ్ హైకోర్ట్ (మద్రాసు హైకోర్ట్) తీర్పు చెప్పింది. ముత్తురామన్ అనే వ్యక్తి ఆయుధ, సరస్వతీ పూజలను వ్యతిరేకిస్తూ పెట్టిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై తీర్పు వెలువరిస్తూ జస్టిస్ సుధాకరం, జస్టిస్ జగదీశం పైవిధంగా తీర్పునిచ్చారు. తీర్పులో వారు ఇంకా ఇలా అన్నారు -"కార్య స్థలానికి, పని ముట్లకి గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఆయుధ పూజ చేయడం చాలా మంచిది. ఇది సెక్యులరిజానికి వ్యతిరేకం కాజాలదు. పత్రాలూ, ఫైళ్లనూ గౌరవిస్తూ ఉద్యోగులు చేసే పూజ కూడా ఏ మతం వారికి కూడా అభ్యంతరకరం కాజాలదు. చర్మకారులు, నేత పనివారు, కర్షకులు, కమ్మరులు, వ్యాపారస్తులు చేసే పూజను ఎవరైనా ఆటంకపరచరాదు.  

- ధర్మపాలుడు

 http://www.lokahitham.net/2012/01/blog-post_06.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి