డా. సుబ్రమణియన్ స్వామి రచించిన ఒరిజినల్ వ్యాసం డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిస్ పత్రికలో ప్రచురితమైంది. దాని స్వేచ్ఛానువాదమే ఈ వ్యాసం! ఈ అనువాదం కోసం డీయెన్యే ఇండియా వారి అనుమతి తీసుకోలేదు.
————————————————————-
ముంబైలో 2011, జూలై 13 నాడు ఉగ్రవాదులు జరిపిన పేలుళ్ళు భారతీయ హిందువులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకతను కలిగించాయి. ఈ జాతి సర్వనానమయ్యే దాకా, రోజూ రక్తమోడుతూ ఇలాంటి హలాల్ హత్యలను హిందువులు ఇక చూస్తూ ఊరుకోరు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా వారిచేత ఓ పని చేయించేందుకో, లేక చేయకుండా చేసేందుకో బలప్రయోగం చెయ్యడమే ఇక్కడ ఉగ్రవాదానికి నేనిచ్చే నిర్వచనం.
భారత జాతీయ భద్రతకు ఇస్లామిక్ ఉగ్రవాదం మొదటి ముప్పు. 2012 తరువాత ఇక ఈ విషయమై సందేహమేమీ ఉండదు. అప్పటికి, పాకిస్తాన్ను తాలిబాన్లు కైవసం చేసుకోవడం, అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ను వదలి పారిపోవడమూ జరుగుతుందని అనుకుంటున్నాను. అప్పుడు, ఇస్లాము తన “అసంపూర్ణ కార్యాన్ని పూర్తిచేసేందుకు” హైందవంతో తలపడుతుంది. ఒసామా వారసుడిగా అల్ కైదా నేతగా ఎంపికైన వ్యక్తి, ’అమెరికా కంటే భారతే తమకు అధిక ప్రాథమ్యమని’ ఈపాటికే ప్రకటించి ఉన్నాడు.
హిందూ మెజారిటీ కలిగిన భారత్ ను “ఇస్లామిక్ జైత్రయాత్రలలో అసంపూర్ణ అధ్యాయం” గా ఛాందస ముస్లిములు భావిస్తారు. ఇస్లాము ఆక్రమించిన ఇతర దేశాలన్నీ కూడా రెండు దశాబ్దాల్లోనే ఇస్లాముకు 100% మతాంతరీకరణ చెందాయి. కానీ, 800 యేళ్ళ ఇస్లామిక్ రాక్షస పాలన తరువాత కూడా 1947 నాటి అవిభక్త భారత జనాభాలో 75% హిందువులే ఉన్నారు. ఈ బాధ ఈ ఛాందసులలో సలుపుతోంది.
హిందువులను గురి చేసుకున్నందుకు ఓ రకంగా నేనీ ముస్లిము ఛాందసులను నిందించను. సనాతన ధర్మం తమకు ప్రసాదించిన వైయక్తికతను మరీ తీవ్రస్థాయికి తీసుకువెళ్ళినందుకు గాను హిందువులనే నేను నిందిస్తాను. ప్రభుత్వ సహాయమనేది ఏమీ లేకుండా, పూర్తి స్వయం శిక్షణతో లక్షలాది మంది హిందువులు కుంభమేళా జరుపుకుంటారు. కానీ వారంతా కూడా కశ్మీరు, మావ్, మెల్విషరామ్, మలప్పురంలలో హిందువులపై జరుగుతున్న దాడులను ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారిన తాము తమ స్వస్థలాలకు తిరిగి పోతారు. హిందువులను సమీకరించేందుకు తమ చిటికెనవేలును కదిలించే పాటి శ్రమ కూడా తీసుకోరు. కుల, భాష అంతరాలకు అతీతంగా సగం మంది హిందువులు కలసికట్టుగా వోటు వేసి ఉంటే, పార్లమెంటు, శాసనసభల్లో నిజాయితీ కలిగిన హిందూ పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చి ఉండేది.
భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదం యొక్క ఇటీవలి చరిత్ర నుంచి నేర్చుకోవాల్సినది, దేశంలో ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికీ నేర్చుకోవాల్సినదీ అయిన మొదటి పాఠం ఏంటంటే – హిందువే లక్ష్యంగా, హిందువులకు వ్యతిరేకంగా తలపడేలా ముస్లిములను రెచ్చగొట్టేందుకు గాను, ఒక స్లో రియాక్టివ్ ప్రాసెస్ ద్వారా ప్రోగ్రామింగు చెయ్యడం జరుగుతోంది. హిందువుల మనోభావాలను కించపరచడం, అంతర్యుద్ధ భయాన్ని కలిగించడమే ఉగ్రవాద దాడుల లక్ష్యం.
హిందువులంతా సమష్టిగా, హిందువుల్లాగా ఉగ్రవాదిని ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా ఒంటరివాళ్లమైనట్లుగా భావించకూడదు. వ్యక్తిగతంగా తనకు నష్టమేమీ కలగలేదు గదా అని పట్టించుకోకుండా ఉండటం ఆసలే కూడదు. కేవలం హిందువు కావడం చేతనే ఒక హిందువు చనిపోతే, ప్రతీ హిందువూ ఎంతో కొంత మరణించినట్లే. ఇదొక అత్యావశ్యకమైన మనస్తత్వ ధోరణి. విరాట్ హిందువుకు అత్యవసరం.
ఇస్లామిక్ ఉగ్రవాదిని ఎదిరించడంలో హిందువులమందరికీ ఒక సమష్టి మైండ్ సెట్ ఉండాలి. హిందువుల పట్ల నిజాయితీగా ఆలోచించే భారతీయ ముస్లిములు కూడా వీరితో చేరవచ్చు. అయితే, తాము ముస్లిములమైనా తమ పూర్వీకులు హిందువులేనన్న వాస్తవాన్ని గర్వంగా ఒప్పుకోలేకపోయినట్లైతే, వాళ్ళు అలా భావిస్తారని నేను నమ్మను. ఆ విధంగా తమ హిందూ వారసత్వాన్ని గుర్తించే ఏ ముస్లిమునైనా హిందుస్తాన్ అనే మహా హిందూ సమాజంలో భాగంగా హిందువులం అంగీకరించవచ్చు. దీన్ని గుర్తించని వారూ, నమోదు కావడం ద్వారా భారత పౌరులయ్యే విదేశీయులూ భారత్ లో ఉండవచ్చు, కానీ వారికి వోటు హక్కు ఉండదు (అంటే, వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాజాలరు).
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ఏ విధానమైనా, ప్రతీ ఒక్క హిందువూ ఒక విరాట్ హిందువుగా మారడంతో మొదలు కావాలి. అందుకుగాను వ్యక్తిగత శీలం, జాతీయ శీలం అనేవి ఉన్నాయని గుర్తించే హిందూ మైండ్ సెట్ ఉండాలి. ఉదాహరణకు, మన్మోహన్ సింగుకు ఉన్నతమైన వ్యక్తిగత శీలం ఉంది. కానీ సోనియా గాంధీకి రబ్బరు స్టాంపుగా మారిపోయి, జాతీయ అంశాలపై కూడా గంగిరెద్దు పాత్ర పోషిస్తూ తనకు జాతీయ శీలం లేదని నిరూపించుకున్నాడు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండో పాఠమేంటంటే, మనం ఎటువంటి వత్తిడికీ కూడా లొంగిపోకూడదు, ఏ డిమాండునూ అంగీకరించకూడదు. 1989 లో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా విడుదల కోసం ఐదుగురు ఉగ్రవాదులను విడిపించడం, 1999 లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసి-814 ను హైజాక్ చేసినపుడు ముగ్గురు ఉగ్రవాదులను విడిపించడం లాంటివి చెయ్యకూడదు.
మూడో పాఠం.. ఉగ్రవాద చర్య ఎలాంటిదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, జాతి దానికి తీవ్రాతి తీవ్రంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఉదాహరణకు, అయోధ్య దేవాలయంపై దాడి చేయాలనుకున్నపుడు, ఆ స్థలంలో రామాలయాన్ని నిర్మించడం ద్వారా మనం ప్రతిస్పందించి ఉండాల్సింది.
రక్త కన్నీరు కార్చుకుంటూ ఉండే ఉదారవాదులు.. ఉగ్రవాదులు నిరక్షరాస్యత నుంచి, పేదరికం నుంచి, అణచివేత నుంచి, వివక్ష నుంచీ పుట్టుకొస్తారని చెబుతూ ఉంటారు. వాళ్ళను నిర్మూలించే బదులు, ఈ నాలుగు అంశాల మూలకారణాలను సమాజం నుంచి తొలగించాలని వీరు వాదిస్తూంటారు. ఇదొక చెత్తవాదన – ఒసామా బిన్ లాడెన్ కోటీశ్వరుడు. టైమ్స్ స్క్వేర్ లోని విఫల ఉగ్రవాద యత్నంలో పాల్గొన్న షాజాద్ పాకిస్తాన్ లోని ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు, అమెరికా లోని ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం నుండి ఎంబియ్యే డిగ్రీ పొందినవాడు.
ఉగ్రవాదులు అడ్డగోలుగా ఆలోచిస్తారు, చావడానికి తయారుగా ఉంటారు కాబట్టి వాళ్ళను ఎదుర్కోవడం కష్టం అనేది కూడా అసంబద్ధ వాదనే. ఉగ్రవాదపు పెద్దతలకాయలకు రాజకీయ లక్ష్యాలుంటాయి. వాళ్ల పిచ్చిలోనూ ఒక పద్ధతి ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే కట్టుదిట్టమైన వ్యూహం ఒకటేంటంటే.. వాళ్ళ రాజకీయ ధ్యేయాలను ఓడించడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల ద్వారా వాటి బండారాన్ని బట్టబయలు చెయ్యడం. భారత్ లో ఇస్లామిక్ ఉగ్రవాదుల రాజకీయ ధ్యేయాలను శూన్యీకరించడానికి నేనీ కింది వ్యూహాన్ని ప్రతిపాదిస్తున్నాను.
ధ్యేయం 1: కశ్మీరు విషయంలో భారత్ పై పైచేయి సాధించడం
వ్యూహం: 370 అధికరణాన్ని తొలగించి, లోయలో విశ్రాంత సైనికులకు ఆవాసాలు కల్పించాలి. హిందూ పండిట్ సమాజం కోసం పనూన్ కశ్మీర్ ను స్థాపించాలి. పాక్ ఆక్రమిత కశ్మీరును ఆక్రమిచుకునే అవకాశం కోసం చూడాలి, లేదంటే ఆ అవకాశాన్ని కల్పించుకోవాలి. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదులకు సహాయ మందిస్తూనే ఉంటే, ఆ దేశంలోని బలూచీలకు, సింధీలకు స్వాతంత్ర్య సాధనలో సాయమందించాలి.
ధ్యేయం 2: దేవాలయాలను పేల్చి, హిందూ భక్తులను చంపడం
వ్యూహం: కాశీ విశ్వనాథుని గుడిలోని మసీదును తొలగించాలి. అలాగే 300 ఇతర దేవాలయ స్థలాల్లోని మసీదులను తొలగించాలి.
ధ్యేయం 3: భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడం
వ్యూహం: పౌరులందరికీ ’సర్వ సామాన్య పౌర స్మృతి’ని అమలు చెయ్యాలి. సంస్కృతం నేర్చుకోవడం, వందేమాతరం పాడటం ప్రతీ ఒక్కరికీ తప్పనిసరి చెయ్యాలి. భారత్ ను హిందూ దేశంగా ప్రకటించాలి. హైందవేతరులకు, తమ పూర్వీకులు హిందువులేనని అంగీకరించిన వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి. భారత్ ను హిందువుల దేశంగా, హిందూ వారసుల దేశంగా -హిందుస్థాన్ గా పేరు మార్చాలి.
ధ్యేయం 4: దొంగ వలసల ద్వారా, మత మార్పిడి ద్వారా, కుటుంబ నియంత్రణను తిరస్కరించడం ద్వారా భారత జనాభా నిష్పత్తిని మార్చివేయడం.
వ్యూహం: హిందూమతం నుంచి ఇతర మతాలకు మారడాన్ని నిషేధిస్తూ జాతీయ చట్టం చెయ్యాలి. పునర్మతాంతరీకరణను నిషేధించరాదు. కులం అనేది పుట్టుకతో కాదు, అనుసరించే ప్రవర్తనా నియమావళి ద్వారా వస్తుందని ప్రకటించాలి. హైందవేతరులను తమ కిష్టమైన కులంలోకి (సంబంధిత ప్రవర్తనా నియమావళిని అనుసరించే పక్షంలో) మారేందుకు స్వాగతించాలి. బంగ్లాదేశ్ నుండి ఎంతమంది దొంగచాటుగా భారత్ లోకి వచ్చారో అదే నిష్పత్తిలో ఆ దేశపు భూభాగాన్ని కలుపుకోవాలి. ప్రస్తుతం, సిల్హెట్ నుండి ఖుల్నా దాకా ఉన్న భూభాగంలో మూడోవంతును కలుపుకుంటే దొంగ వలసదారులకు నివాస మేర్పరచేందుకు సరిపోతుంది.
ధ్యేయం 5: నీచమైన రాతల ద్వారా, మసీదులు, మదరాసాలు, చర్చీల్లో బోధనల ద్వారా హిందూమతాన్ని కించపరచడం, తద్వారా హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, వాళ్ళు లొంగిపోయేలా చెయ్యడం.
వ్యూహం: హిందూ మైండ్ సెట్ పెంపొందించుకోవడాన్ని ప్రచారం చెయ్యాలి.
ఇలాంటి ప్రతి వ్యూహంతో భారత్ తన ఉగ్రవాద సమస్యను ఐదేళ్ళలో పరిష్కరించుకోగలదు. కానీ అందుకుగాను పైన చూపించిన నాలుగు పాఠాలను మనం నేర్చుకోవాలి. జాతిని రక్షించుకునేందుకు గాను ధైర్యంగా, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునే హిందూ మైండ్ సెట్ ను అలవరచుకోవాలి. గొర్రెల్లాగా గ్యాస్ చాంబర్లలోకి నడిచిన యూదులు కేవలం పదేళ్లలో వీర సింహాలుగా మారగా లేనిది, మరింత మెరుగైన పరిస్థితులలో ఉన్న మనం (భారత్ లో మనం 83% ఉన్నాం) ఐదేళ్ళలోనే అలా మారడం పెద్ద కష్టమేమీ కాదు.
భయమన్నదే ఎరుగని ఐదంటే ఐదుగురే వ్యక్తులు కలిసి సరైన ఆధ్యాత్మిక మార్గదర్శనంతో ఒక సమాజాన్ని ఎలా మార్చవచ్చో గురు గోబింద్ సింగ్ మనకు చూపించాడు. కేవలం సగం మంది హిందూ వోటర్లు సమష్టిగా, హిందువులుగా వోటేస్తే, హిందూ ఎజెండాకు అంకితమైన పార్టీ ఒకదానికి వోటేస్తే, మనమొక మార్పు సాధనాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ క్షణాన, ప్రజాస్వామ్య హిందూస్థాన్ లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే వ్యూహంలో నికరంగా తేలేది ఇదే.
http://mataraajakeeyaalu.wordpress.com/
exelent sir
రిప్లయితొలగించండి