18, ఫిబ్రవరి 2012, శనివారం

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-7


మొఘల్ పరిపాలన (క్రీ.శ. 1526-1707)- 1

1) జహీరుద్దీన్ షా బాబర్ (1483-1530) లోడిని ఓడించి ఢెల్లీ పీఠాన్ని అధిష్టించాడు. ఖురాన్ నుండి తెగ సూక్తులు చెప్పే బాబర్, జీహాద్ చేయుటలోను, హిందువుల తలలు నరికి గుట్టలుగా పోయడంలోనూ, పిల్లలను, స్త్రీలను చెరపట్టి అనుభవించుటలోను అంతే ఆసక్తి ప్రదర్శించేవాడు (ఖాన్:282; లాల్:438-459). ఈయన ఏలుబడిలో నాయకత్వం కోసం తీవ్రమైన పోటీ ఉండేది.

http://www.livius.org/a/1/alexander/hindu_kush.jpg
ఒకప్పుడు ఆఫ్గానిస్థాన్ హిందూ రాజ్యంగా ఉండేది. దీనికి గాంధార
మరియు వాహిలి లేక వాహిలిక అనే పేర్లుండేవి. ఇక్కడ శైవులు,
బౌద్ధమతస్తులు అధికంగా ఉండేవారు. హిందూ రాజులచే యేలబడుచున్న
ఈ ప్రాంత ముఖ్య నగరాలైన కాబుల్ మరియు జబూల్ పై క్రీ.శ. 654
నుండి అరబ్బు ముష్కరుల దాడులు ప్రారంభమయ్యాయి. సుమారు
200 యేండ్లు గాంధార (ఆఫ్ఘాన్) పటాన్లు వారిని నిలువరించ
గలిగారు కాని ఎట్టకేలకు ఓడిపోయారు. ముస్లింలు హిందువులను
ఊచకోతకోసిన రీతి ఎంత భయానకమంటే అక్కడి పర్వతశ్రేణులకి
"హిందూఖుష్" అని నామకరణం చేసారు. "హిందూఖుష్" అనగా
"హిందువుల వధ" అని అర్థం. కొండకోనలలో హిందువుల రక్తం
ఏరులైపారింది. గత్యంతరంలేక అనేకులు ఇస్లాంను స్వీకరించారు.
ఆఫ్ఘాన్‌లో 1980 లో కమ్యూనిస్టు ప్రభుత్వం పడిపోయాక
మరియు డిసెంబర్ 6, 1992లో బాబ్రి మసీదు కూల్చివేయబడ్డాక,
కాబుల్, జలాలబాద్, మరియు కాందహార్ ప్రాంతాలలో ఉన్న
75,000 మంది హిందూ మైనారిటీలపై భయంకర దాడులు జరిగాయి.
ఎప్పటిలాగే అంతర్జాతీయ మీడియా ముస్లిం మనోభావాలకు
భంగం కలగొద్దని ఆ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. అనేకమంది
హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఢెల్లీ వంటి నగరాలకు
పారిపోయారు. ఉదాహరణకు ఢెల్లీ పరిసరప్రాంతాల్లో ఎక్కువగావుండే
"సెహగల్"లు ఆఫ్ఘాన్ హిందువులే!
2) అక్బర్ ద గ్రేట్ (1556-1605; బాబర్ మనుమడు) : పల్లెలు, పట్టణాలపై దాడిచేసి దోచుకోవడం, స్త్రీలను చెరపట్టడం సర్వసాదారణమైపోయింది. అయితే అక్బర్ ఈ దురాగతాల్ని కొంతవరకు నిరోధించుటకు ప్రయత్నించాడు కాని సఫలీకృతుడు కాలేదు. ముస్లిం సైన్యానికి, అధికారులకి మింగుడుపడదేమొనని చివరకు చూసి చూడనట్లు వదిలేసాడు. భారతభూభాగం చాలా వరకు అక్బర్ ఆధీనంలోకి వచ్చింది. నిరక్షరాసుడైన అక్బర్ కొంత సహనశీలి కాబట్టి ఇతన్ని ఇస్లాం వ్యతిరేకిగా ముల్లాలు, అధికారులు తలంచారు. అక్బర్ తన దర్బారులో ఇతర మతస్తులకి కూడా ఉన్నత కొలువులిచ్చాడు. ఇతను దిన్-ఎ-ఇలాహి (స్వచ్ఛమైన విశ్వాసం) అనే అందరినీ కలుపుకొనిపోయే కొత్త మతాన్ని ప్రకటించాడు (ఖాన్:152). ఇతడు హిందూ మరియు జొరాస్ట్రియన్ పండుగలను అధికారికంగా ఆమోదించాడు (ట్రిఫ్‌కోవిక్:112). ఇతడు "జిజ్యా" పన్నును రద్దు చేసాడు. అయినా ఇంకా అనేక పన్నులు హిందువులపై అదనంగా ఉండేవి. అయితే ఇతడు తన ఇస్లామిక్ మతాన్ని, విశ్వాసాల్ని పూర్తిగా వదల్లేదు. కాలిఫ్ అధికారాన్ని ఇతడు తృణీకరించినప్పటికీ మక్కా, మదీనా మరియు ఇతర ముస్లిం ప్రాధాన్య ప్రాంతాలకు విలువైన బహుమతులు పంపేవాడు.  అక్బర్‌కు అనేకమంది బానిసలు, "హారెం" లో ఉపపత్నులు, స్త్రీలు బానిసలుగా నుండిరి. అతడు విగ్రహారాధనను ద్వేషించేవాడు (మొఘల్ స్మృతులుగా పేర్కొనే "బాబర్‌నామా"లో వ్రాయబడినది). హిందువులలో అత్యదికులు విగ్రహారాధికులేనని పేర్కొన్నాడు. శిస్తులు కట్టలేక సుమారు 30 వేలమంది చిత్తూరు రైతులు 6,000 మంది రాజ్‌పుట్‌లతో కలిసి ఆయుధాలు చేపట్టగా, అక్బర్ వారిని భయంకరంగా సంహరించాడు. కొందరిని చెరపట్టి చిత్రహింసలు (ఏనుగులతో తొక్కించడం, ముళ్ళ కొరడాలతో కొట్టించడం, కాళ్ళకు తాళ్ళు కట్టి గుఱ్ఱాలతో లాగించి అడ్డంగా చీల్చివేయించడం వంటి శిక్షలు విధించాడు) చేసి బ్రతికిన వారిని బానిసలుగా చేసుకొన్నాడు (ఖాన్:88, 113; ట్రిఫ్‌కోవిక్:112).
"తిరగబడిన వారిని అతికిరాతంగా చంపారు. ఒక్కపూటలోనే సుమారు 2,000 మంది తలలు నరికారు. ప్రాణాలతో బయటపడ్డా వారిని, వారి భార్యలను దాసదాసిగా చేసుకొన్నారు. వారి ఆస్తులను, యౌవ్వన స్త్రీలను ముసల్మాన్లు పంచుకొన్నారు. ఇదంతా అక్బర్ చక్రవర్తి మూడు రోజులు అక్కడేవుండి జరిపించారు" (సుఖ్‌డీయో: 252).
"అక్బర్ కామవాంఛలు తీర్చుకోడానికి తన హారేంలో 5,000 మంది అందమైన యువతులు మరియు పిల్లలని కలిగి యుండెను" (ఖాన్:102).

అక్బర్ సామూహిక బానిసత్వానికి స్వస్తి పలకాలని భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. అతని సైన్యాధిపతులు, అధికారులు అనేకమంది బానిసల్ని కలిగియుండిరని చరిత్రకారుల గణాంకాలు సూచిస్తున్నాయి. ఎంత ఎక్కువమంది బానిసలుంటే అంత గొప్ప అనే భావం ముస్లిం అధికారుల్లో, ప్రథానుల్లో ఉండేది కాబట్టి ఏ కారణం లేకుండానే వారు అప్పుడప్పుడూ హిందువులపై విరుచుకుపడేవారు (ఖాన్:282). ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో నపుంసకుల వ్యాపారం బాగా జరిగేది కాబట్టి మగపిల్లలను, పురుషులను చెరపట్టి వారిని కొజ్జాలుగా మార్చి వ్యాపారం చేసేవారు. అబ్దుల్లా ఖాన్ ఉజ్బేగ్ అనే అక్బర్ యొక్క ఒక సైన్యాధికారి, ఇలా ప్రగల్భాలు పలికాడు;
"నేను 5,00,000 మంది స్త్రీలను, పురుషులను, పిల్లలను చెరపట్టి బానిసలుగా అమ్మేసాను. వారు మహమ్మదీయులుగా మారి వారు ఇక్కడ అల్లా "తీర్పు దినం" నాటికి కొన్ని కోట్ల జనాంగంగా తయారవుతారు" (ఖాన్: 103). 

అక్బర్ పాలనలో ప్రతీ ముస్లిం దెగ్గర అనేకమంది సేవకులు, బానిసలు ఉండిరి. అసలు ముస్లింలు కష్టపడే అవసరం లేకుండా పోయింది. (ఖాన్:283).

అక్బర్ కుమారుడైన జహంగీర్ మరియు మనుమడైన షాజహాన్ అక్బర్‌వలె కాక పూర్తిగా ఇస్లాంను పాటించారు.  



http://carpenters-son.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి