18, ఫిబ్రవరి 2012, శనివారం

మైనారిటీ ముసుగులో అట్రాసిటీలు


ముస్లీం పర్సనల్ లా ముసుగులో, మైనారిటీ తీరకుండానే ఆడపిల్లకు వివాహం చేయబోయే సమయంలో జోక్యం చేసుకొని ఆ బాలికను విడిపించిన ముంబాయిలోని ఘట్కోపర్ పోలీసులు అభినందనీయులు. జకియా బేగం, మైనారిటీ తీరని తన బాలికకు డిసెంబరులో వివాహం చేయబోగా, స్థానిక పోలీసులు అడ్డుపడి ఆ బాలికను సంక్షేమ గృహానికి చేర్చారు (ముంబాయి మిర్రర్ 23-మార్చి-2010).

బాల్య వివాహ నిషేధ చట్టం పరిధిలో తమ పని తాము చేసామని పోలీసులు చెబుతుండగా, అది "ముస్లీం పర్సనల్ లా" వ్యవహారంలో మితిమీరిన జోక్యంగా ముస్లీం పర్సనల్ లా బోర్డు భావించి, ఆ బాలిక తల్లి ద్వారా హైకోర్టును ఆశ్రయించింది. బాలిక తల్లి వాదనలోని చట్టబద్ధతపై వివరణ ఇవ్వాల్సిందిగా, హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చూస్తుంటే, షాబానో తరహా కేసు పునరావృతమౌతున్న సూచనలు కనబడుతున్నాయి.

ఆడుతూ, పాడుతూ, చదువుకోవాల్సిన వయసులో ఆలిని చేసి, ఆనక తీరిగ్గా తలాకులిచ్చే సంస్కృతికి బలయ్యే బాలికలపై ఇప్పుడైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ముస్లీం బాలికలపై ఇటువంటి అత్యాచారాలను అందరూ ముక్త కంఠంతో ఖండించాలి.

పోలీసుల చర్యను, మైనారిటీ బాలికల హక్కులను కాలరాచే చర్యగా మన కామెడీ కేతిగాళ్ళు భావిస్తారేమో కానీ, ప్రస్తుతం దేశానికి యూనిఫాం సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర చట్టం) ఆవశ్యకతను ఈ ఉదంతం మరోసారి గుర్తు చేస్తుంది.

కర్ణాటకలో, గో వధ నిషేధ స్ఫూర్తితో, భా.జ.పా. పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం రాష్ట్ర స్థాయిల్లో, ఇటువంటి చట్టాలను రూపొందించగల అవకాశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ప్రత్యేక చట్టాలు కష్టతరమని భావిస్తే, హిందు చట్టాలే అందరికీ అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలి.
 
 http://amtaryaanam-1968.blogspot.in/2010_03_01_archive.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి