19, ఫిబ్రవరి 2012, ఆదివారం

తాజ్ మహల్ (తేజో మహాలయము) పై ఆసక్తికరమైన విషయాలు - 1

By గోపీనాథ శర్మ


చరిత్రకు సంబంధించిన విషయాల గురించి ఇంటర్నెట్ వెదుకుతున్నప్పుడు అనుకోకుండా ఈ సైట్ (http://www.stephen-knapp.com/) కనబడింది. అన్ని ఫోటోలను ఒకేసారి ఆవకాయ.కామ్ లో ఉంచే అవకాశం లేనందువల్ల ఐదేసి చొప్పున పోస్టు చేస్తున్నాను. ఇంగ్లీషులో ఉన్న వ్యాఖ్యానాలను తెలుగులో వ్రాస్తున్నాను.

గమనిక: ఫోటోలు, అందులోని విషయాలు నా స్వంత అభిప్రాయాలు కావని, ఇతరులతో కేవలము పంచుకోవడానికి మాత్రమే ఆవకాయ.కామ్ లో ఉంచుతున్నానని గమనించగలరు.

ఛాయాచిత్రము - 1 (ఇంగ్లీషు కామెంటుకు తెలుగు అనువాదము)

ఇది తాజ్ మహల్ గా పిలవబడుతున్న ఒకప్పటి తేజో మహాలయము యొక్క విహంగవీక్షణం. గత 300 సంవత్సరాలుగా ఈ అద్భుత కట్టడము ఐదవ మొగల్ చక్రవర్తి అయిన షాజహాన్ చే తన మృత భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం నిర్మితమైనట్టుగా ప్రపంచాన్ని మభ్యపెట్టడం జరుగుతోంది. ఈ చిత్రంలో కనబడుతున్న రెండు కట్టడాలు ఒకేలాగున ఉన్నా వెనక భాగములో గల కట్టడాన్ని మసీదుగా చెబుతున్నారు.

తాజ్ మహల్ ఏడంతస్తుల కట్టడం. ఐదు అంతస్తులు భూమికి దిగువున ఉండి అరుదైన నిదర్శనాలు అందులోనే భూస్థాపితమయ్యాయి. మధ్యలో ఉన్న పాలరాయి కట్టడంకు ముందు మరియు వెనుకవైపు దాదాపు అదే రీతిలో ఉండే కట్టడాలు మరో రెండు ఉన్నాయి. ముందు భాగంలో ఉన్న కట్టడం తూర్పుముఖంగా ఉంది. వెనుక ఉన్న కట్టడం పశ్చిమముఖంగా ఉండడం చేత మసీదుగా వ్యవహరిస్తున్నారు. వెనుక కట్టడం మసీదు అయితే తాజ్ కు ముందు ఉన్న కట్టడం కూడా మసీదు ఆకారంలోనే ఉండడం ఎందుచేత? తూర్పు ముఖముగా ఉన్న కట్టడం యొక్క ఆరుబయలు ప్రాంతంలో త్రిశూలపు ఆకారంలో ఉన్న ఆకృతి ఉంది. తాజ్ గోపురపు పైభాగంలో ఉన్న కలశాఅనికి ఇది ప్రతికృతి.

చాయాచిత్రము - 2

ఈ చిత్రములో ఉన్నది ఒక దిగుడు బావి. ఇది పశ్చిమ ముఖంగా ఉన్న మసీదు పక్కలోనున్న ఒక నెలమాళిగలోనున్న అంతుస్తులలో ఉన్నది. బావిలో నీరు ఉందడానికి గుర్తుగా అడుగున తెల్లగా ప్రతిఫలిస్తున్న సూర్యుని వెలుగును చూడవచ్చు. ఇటువంటు బావులు హిందూ దేవస్థానములలో చూడవచ్చు. శత్రువులు దాడి చేసినపుడు, ఈ దిగుడు బావులను నిధులు, విగ్రహాలను దాచేందుకు వాడేవారు. మామూలు సందర్భాలలో దిగువ అంతస్తుల్లో నిధులను పేర్చిపెట్టేవారు. పై అంతస్తుల్లో ఖజానాదారులు కూర్చునేవారు. "హుండీ" అని పిలువబడే ఇప్పటి receipts ను జారీ చేసేవారు. 

తాజ్ మహల్ ఒక స్మారక చిహ్నమైతే అందులో ఈ దిగుడుబావి యొక్క అవసరము ఏమి?

ఛాయచిత్రము - 3

ఇది తాజ్ మహల్ (లేక) తేజో మహాలయము యొక్క ముందుభాగపు
దృశ్యము. ఈ కట్టడము అష్టాకృతిలో ఉన్నది. ఎందుకనగా హిందువులు పది దిక్కులను పూజిస్తారు. అది ఎలాగునన్న శిఖరము స్వర్గమును చూపును. పునాది అధోలోకములను చూపును. 


ఉపరితలమున ఉన్న ఎనిమిది మూలలు ఎనిమిది దిక్కులను చూపును. అందువలన హిందూ శిల్పశాస్త్రము మేరకు రాజరికపు కట్టడాలు, దేవస్థానాలను అష్టాకృతికి సంబంధించిన శైలినిగానీ, లేక పూర్తి కట్టడమునే అష్టాకృతిలో మలచడంగానీ జరుగుతుంది. తాజ్ మహల్ ప్రధాన గోపురమునకు చేరో వైపున కనబడుతున్న గోపురాలు కూడ అష్టాకృతిలోనే ఉండడం గమనార్హం. ఈ గోపురములు పగటిపూట కావలి గోపురములుగానూ, రాత్రిపూట దీపములను వెలిగించుటకు వాడేవారు. అంతేకాదు నేటికీ హిందూ దేవస్థానములలోనూ, పూజలలోనూ దేవునికి చెరోవైపున దీపస్థంబములను ఉంచే సాంప్రదాయముంది.

తాజ్ ప్రధాన గోపురము పైన ఉన్న కలశము కమలాకృతిలో ఉంది. ఇది కూడా హిందూ సాంప్రదాయమే. ముస్లిం గోపురములు గోళాకృతిలో సాధారణంగా ఉంటాయి. తాజ్ యొక్క ప్రధాన కట్టడము 4 అంతస్తులలో ఉన్నది. ప్రధాన కట్టడము నిజానికి రెండు గోపురాలను కలిగిఉంది. లోపలివైపునుండి ఒక గోపురము ఉంటే వెలుపలనుండి మరో గోపురము లోపలి గోపురాన్ని కప్పి ఉంచుతోంది. దీన్నే మనము ఈ చిత్రములో చూస్తున్నాము. ఈ రెండు గోపురముల మధ్య 83 అడుగుల పొడవుగల ఎత్తైన గది ఉన్నది. ముందు పేర్కొన్న 4 అంతస్తులలో ఇది ఒకటి. తరువాతి వరుసగా క్రిందకు దిగుతూ, సందర్శకులు చూడగలిగిన నెలమాళిగ (Basement)తో ఈ నాలుగు అంతస్తులూ పూర్తవుతాయి. ఈ పాలరాయి కట్టడానికి దిగువన మరో రెండు అంతస్తులున్నాయి. అవి తాజ్ వెనుకనున్న నదివైపుకు ఉన్నాయి. ఈ రెండూ కాక మరో భూగర్భ అంతస్తు కూడ ఉంది. ఇది నది అడుగుభాగాన ఉంది. ఇటువంటు నెలమాళిగలు హిందూ దేవస్థానములలో సర్వ సాధారణం. ఇలా తాజ్ మహల్ నిజానికి ఏడు అంతస్తుల కట్టడం.

ఛాయాచిత్రము - 4

తాజ్ మహల్ ప్రధాన గోపురము పైన త్రిశూలాకృతిలోనున్న కలశము ఉన్నది. ఇది తుప్పు పట్టని అష్టలోహ నిర్మితము. ఇది కూడా హిందూ సాంప్రదాయమే. ఈ లోహ కలశము lightning arrestor గా కూడ పనిచేస్తుంది.

అయితే చాలామంది దీనిని ముస్లిం గురుతైన అర్ధచంద్రుడు, నక్షత్రముగా భావిస్తున్నారు. అంతేగాక ఇది బ్రిటీషువారిచే అమర్చబడిన lightning arrestor గా ఊహిస్తున్నారు. కమలాకృతిలోనున్న గోపురము, త్రిశులాకృతిలోనున్న కలశము మొదలైన దృగ్గోచర సాక్ష్యాలను కూడా చరిత్రకారులు వక్రీకరించడం దురదృష్టకరం. మరో గమనించదగ్గ అంశమేమంటే ఈ గోపురము, కలశము యొక్క సంపూర్ణ చిత్రణమును తూర్పు వైపునున్న ఆరుబయలు ప్రదేశములో కూడా చూడవచ్చు.


ఛాయాచిత్రము - 5

ఇది కలశము యొక్క పై భాగపు దగ్గరి దృశ్యము. దగ్గరినుండి చూస్తే అర్ధచంద్రాకారము, పూర్ణకలశముగా (రాగి/వెండి చెంబులో కొబ్బరిబోండమును ఉంచినట్టుగా) కనబడే ఈ లోహాకృతి క్రిందినుండి చూస్తే త్రిశూలముగా కనబడుతుంది. హిందూ అర్ధచంద్రాకృతి ఎప్పుడూ సమాంతరంగా ఉంటుంది. ముస్లిం అర్ధచంద్రాకృతి వాలుగా ఉంటుంది. అంతేకాక ముస్లిం అర్ధచంద్రాకారము యొక్క కొసలు ఒకదానికి ఒకటి దాదాపుగా తాకుతూ, నక్షత్రానికి కొద్ది చోటును మాత్రమే మిగులుస్తాయి. 

ఈ హిందూ ఆకృతి శతాబ్దాల నుండీ ముస్లిమ్ ఆకృతిగానే ప్రచారం చేయబడింది. లేదూ బ్రిటీషువారు అమర్చిన విద్యుద్వాహకంగా పేర్కొనబడింది.

కలశంపైన షాజహాన్ "అల్లాహ్" అని వ్రాయించాడు. ఐతే ఈ వ్రాత తూర్పు ఆరుబయలులో ఉన్న చిత్రములో లేదు. కొబ్బరికాయ, చెరోవైపుకు వంగివున్న మామిడిఆకులు, కలశము హిందూ గురుతులే.

 http://aavakaaya.com/printArticle.aspx?articleId=807

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి