(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్)కాదేదీ ప్రచారానికి అనర్హం. మతం సైతం. ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సూత్రం. ఏ మార్గం నుంచయినా ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్న జగన్ అందుకు ముందు కులాన్ని, ఇప్పుడు మతాన్ని ఆయుధం గా వాడుకుని, దానిని ఓటుగా మలచుకునే కొత్త ఎత్తుగడతో వెళుతున్నారు. అందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మీద ఉన్న క్రైస్తవ ముద్రను రాష్ట్రంలో చెరిపేసి, ఆ స్థానంలో వైఎస్ ముద్ర వేసే బ్రహ్మాండమైన వ్యూహానికి జగన్ తెరలేపారు. క్రైస్తవుల ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు జగన్ మతం కార్డును ప్రయోగిస్తున్నారు. తన బావ బ్రదర్ అనిల్ కుమార్ సహాయ సహకారంతో క్రైస్తవ సువార్త కూటములను ఓటు బ్యాంకు వేదికలుగా వాడుకుంటున్న వైనం విమర్శలకు దారితీస్తోంది. వైఎస్ హయాంలోనే క్రైస్తవులకు న్యాయం జరిగిందన్న పరోక్ష పొగడ్తలు, జగన్ సీఎం అయితే తప్ప మళ్లీ వైఎస్ నాటి మంచిరోజులు రావన్న సంకేతాలతో.. అనిల్ నిర్వహించే సువార్త కూటములు హోరెత్తుతుతున్నాయి.
క్రైస్తవురాలయిన సోనియాగాంధీ కాంగ్రెస్ అధినేతగా రావడంతో దేశంలోని క్రైస్తవ సమాజం మెజారిటీ శాతం కాం గ్రెస్‌కు శాశ్వత ఓటు బ్యాంకుగా మారింది. రాష్ట్రానికి సంబంధిం చినంత వరకూ వైఎస్ కూడా క్రైస్తవుడే అయినందున ఆ భావన మరింత బలపడి, పూర్తిగా క్రైస్తవ సమాజం కాంగ్రెస్‌వైపు మళ్లింది. వైఎస్ హయాంలోనే క్రైస్తవుల పక్షాన మత మార్పిళ్లు భారీగా జరిగాయని, స్వయంగా వైఎస్ సైతం మంత్రివర్గ సహచరులతో తిరుమలకు రెండు కొండలే ఉన్నందున, ఆయన అల్లుడు పైన తిరుమల మీద ఒక వ్యాపారకేంద్రం పెట్టుకునేందుకు అనుమతి ఇస్తే ఎలా ఉంటుందని కూడా ప్రశ్నించినట్లు అప్పట్లోనే భారీగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
అక్కడ వ్యాపారానికి అనుమతి ఇచ్చి, అందులోనే చర్చిని నిర్మించాలన్న వ్యూహంతోనే వైఎస్ ఆ ఎత్తుగడ వేశారన్న ప్రచారం జరిగింది. అది జరిగిన తర్వాతే అసెంబ్లీ సమావేశాలు జరగడం, అవి ముగిసిన తర్వాత హెలికాప్టర్ దుర్ఘటనలో వైఎస్ మృతి చెందడం, ఆయన మృతి చెందిన ప్రాంతం కూడా సరిగ్గా తిరుమల ఏడుకొండల ఆనందనిలయం వైపే ఉందన్న చర్చ కూడా జరిగిన విషయం తెలిసిందే.రాష్ట్ర క్రైస్తవ సమాజంపై సోనియాగాంధీ ప్రభావం ఉన్నందున దాన్ని పూర్తి స్థాయిలో చెరిపేసేందుకు జగన్, ఆయన బావ బ్రదర్ అనిల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
సోనియాగాంధీ కంటే వైఎస్ రాజశేఖరరెడ్డి, జగనే అసలు సిసలు క్రైస్తవ ప్రతినిధులన్న సంకేతాలు, ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే సువార్త, స్వస్థత కూటములను వేదికగా మలచుకుంటున్నారు. సోనియాగాంధీ వైఎస్ కుటుంబాన్ని అవమానించిందని, మళ్లీ క్రైస్తవ రాజ్యం తీసుకురావాలన్న ప్రచారాన్ని బ్రదర్ అనిల్ చాపకింద నీరులా విస్తృతం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.జగన్ ఓదార్పు పర్యటనలో సైతం క్రైస్తవ మత నాయకుల సహకారం తీసుకుంటున్నారు. ఆయన వచ్చే ముందు గానీ, వెళ్లే ముందుగానీ క్రైస్తవుల దీవెనలు తప్పనిసరిగా తీసుకుం టున్నారు. ఆయన పర్యటన సందర్భంగా చేస్తున్న సమీకరణలోనూ క్రైస్తవులే ఎక్కువమంది కనిపిస్తున్నారన్న వ్యాఖ్యలు చాలాకాలం నుంచీ వినిపిస్తున్నవే.
ఆ మేరకు బ్రదర్ అనిల్ మొదటి నుంచీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, తనకు అనుకూలంగా క్రైస్తవ మత పెద్దల సంఖ్య పెంచుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోస్తా, తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం జగన్ వైపు ఉన్నందున, ఇక క్రైస్తవులనే పూర్తి లక్ష్యంగా పెట్టుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఆ మతం ఓటు బ్యాంకును ఖాయం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.తాజాగా అనంతపురంలోనూ, గతంలో కర్నూలు లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయని గుర్తు చేస్తున్నారు. గతంలో వైఎస్ ఆవిష్కరించిన పాటల సీడీలు, విజయమ్మ ప్రసంగాలతో క్రైస్తవులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
నగరంలోని ఒక పెద్ద సభలో అనిల్ నిర్వహించిన సువార్త కూటమికి విజయమ్మ, భార్య షర్మిల హాజరుకాగా, ఒకసారి వైఎస్ కూడా హాజరయిన విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. అయితే, మతాన్ని రాజకీయాలకు వాడుకోవడాన్ని చాలామంది చాలామంది క్రైస్తవ మత పెద్దలు విబేధిస్తున్నారు. బ్రదర్ అనిల్ తన బావ జగన్ ఉన్నతి కోసం క్రైస్తవ మతాన్ని వాడుకోవడం, గతంలో వైఎస్ విడుదల చేసిన సీడీలను మళ్లీ మళ్లీ గుర్తు చేయడం అందులో భాగమేనంటున్నారు.
కాగా, రాష్ట్రంలో ఉన్న దళిత క్రైస్తవులు, కోస్తాలోని మాలలను ఆకర్షించేందుకు అనిల్-జగన్ రాజకీయ వ్యూహం ఆ ప్రాంతంలో ఇప్పటికే చర్చనీయాంశ మయింది. మాలలు మొదటి నుంచీ కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకుగా కొనసా గుతున్నారు. వైఎస్ సీఎం అయిన తర్వాత ఆ బంధం మరింత బలపడింది. వైఎస్‌కు అన్యాయం చేశారన్న ప్రచారంతో మాలల్లో సానుభూతితో పాటు.. కోస్తాలో మతం మార్చుకున్న వారిలో ఎక్కువ మంది మాలలే ఉండటంతో బ్రదర్ అనిల్ చాపకింద నీరు ప్రచారం కూడా తోడయింది. ఫలితంగా ఇప్పుడు కోస్తాలో మాలలో 70 శాతం మంది జగన్ వైపే ఉన్నారు. ఇక మిగిలిన క్రైస్తవులపై ఉన్న సోనియా ప్రభావాన్ని పోగొట్టి వారిలో వైఎస్, ఆయన తనయుడు జగన్ ముద్ర వేసేందుకు అనిల్ చేస్తున్న మత ప్రచారం కాంగ్రెస్ ఓటు బ్యాంకు గండికొడుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
http://www.suryaa.com/News/Article.asp?Category=1&SubCategory=2&ContentId=65664#.TxTePcHyvR8.facebook
I agree with your explanation. This is 100% true
రిప్లయితొలగించండిమీ వివరణ అక్షర సత్యం.శాస్త్రసమితం కానీ ప్రచారం,దెవదూత
రిప్లయితొలగించండిఅయినా,మహర్షుల్తెన దివనలు ఉండవు.అయినా విశ్వమానవ
సమన్వయమె సనాతనం,సామరస్యమే భారతీయం.ఈ విషయాలు మీ వ్యాసం తెలియపరుస్తుంది.అందుకు దన్యవాదాలు....