భారతదేశంలో మైనార్టీలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వారికి ఇప్పుడు
ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి.
అంతేకాదు ఓట్లకోసం మైనార్టీలకు అధికంగా వరాలు ఇస్తున్నారన్న విమర్శలు కూడా
మనదేశంలో వస్తుంటాయి. అలా అని చెప్పి మొత్తం మైనార్టీల స్థితిగతులు
బాగుపడ్డాయని కాకపోయినా, కనీసం సమాన హక్కులు అయితే ఉన్నాయి. కాని
పాకిస్తాన్ లో మైనార్టీ వర్గం గా ఉన్న హిందువుల కష్టాలు వింటుంటే మాత్రం
వారి పరిస్థితి దారుణంగా ఉందని అర్ధం అవుతుంది.పాకిస్తాన్ లో హిందువుల
పెళ్లిళ్లకు ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థ లేకపోవడంతో వారు తీవ్ర
సమస్యలు ఎదుర్కుంటున్నారు. వివాహ రిజిస్ట్రేషన్ లేకుండా ఆ దేశ గుర్తింపు
కార్డు ఇవ్వరు.కంప్యూటరైజ్ డ్ నేషనల్ ఐడెంటిటి కార్డు పేరుతో జారీ చేసే ఈ
కార్డు లేకపోతే ఆ దేశంలో ఏ చిన్న పని జరగడం కష్టంగా ఉంటుంది.చివరికి హోటల్
లో గది బుక్ చేసుకోవాలన్నా ఇబ్బందే. ఈ కార్డు లేకుండా వెళితే వారు
చట్టబద్దమైన దంపతులా ? కాదా అన్న అనుమానంతో చూస్తారట.
భారతదేశం నుంచి పాక్ చీలినప్పుడు మహ్మద్ అలీ జిన్నా చెప్పినదానికి , ఇప్పుడు జరుగుతున్నదానికి సంబంధం లేకుండా పోయిందని అక్కడి మైనార్టీ హిందువులు బాధపడుతున్నారు. జిన్నా తన ప్రసంగంలో మీరు స్వేచ్చ గలిగిన పౌరులు. మీరు మీ దేవాయాలయాలకు వెళ్లవచ్చు. మీ రు ఏమతానికి చెందినవారైనా కావచ్చు. ఏ కులం వారైనా కావచ్చు.దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అని జిన్నా అన్నారని వారు గుర్తు చేస్తున్నారు.కాని పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని , హిందువుల పట్ల విచక్షణగా చూసే పరిస్థితిని మార్చాలని కొందరు కోరుతున్నప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. కొన్ని విషయాలలో ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు.
ఈ మధ్యనే సిక్కులకు గురుద్వారాలు ఇచ్చే వివాహ సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోవడానికి అంగీకరించారట.కాని హిందువులకు మాత్రం అలాంటి రిజిస్ట్రేషన్ ఏర్పాటు లేదని వాపోతున్నారు.కాగా హిందువులను భారతీయులకు కొనసాగింపుగానే చూస్తున్నారు తప్ప, వారిని పాక్ జాతీయులుగా చూడడం లేదని మరికొందరు విమర్శిస్తున్నారు. పైగా కొన్ని సంవత్సరాల కిందట ఇండియాలో బాబ్రి మసీదును కూల్చిన ఘటన తర్వాత పాక్ లో హిందువులకు మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయని అంటున్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20110801_35.php

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి