ఛాయాచిత్రములు, వ్యాఖ్యానములకు ఆధారము : http://www.stephen-knapp.com
ఛాయాచిత్రము - 6
మునుపు పేర్కొన్నట్టు తాజ్ మహల్ తూర్పువైపున ఉన్న ఆరుబయలులో చిత్రించిన ప్రధాన గోపురపు నకలు ఈ చిత్రములో చూడవచ్చును. ఇప్పుడు జమైత్ ఖానా (సముదాయ భవనము)గా పిలవబడుతున్న కట్టడము దగ్గర దీనిని చూడవచ్చు. ఇటువంటి చిత్రకళ సాధారణంగా హిందూ దేవస్థానములలో నేలపై చూడవచ్చు. వంగిఉన్న మామిడి ఆకులు, కొబ్బరికాయ మరియు కలశమును ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఇటువంటిదే కేదారనాథ ఆలయము వద్ద కూడా చూడవచ్చు.
ఛాయాచిత్రము - 7
ఈ చిత్రములో ప్రవేశద్వారము పైభాగములో ఎర్రటి తామర, అందులోనున్న త్రిశూలాన్ని చూడవచ్చు. తాజ్ ఒకప్పుడు హిందూ ఆలయమనడానికి ఇదొక ఋజువు. షాజహాన్ కొరాన్ వ్రాతలను ఆపై చెక్కించాడు
ఛాయచిత్రము - 8
ఈ చిత్రములో నదివైపున ఉన్న భాగలోను చూడవచ్చును. నాలుగు అంతస్థులుగా ఉన్న తాజ్ మహల్ క్రింద ఈ రెండు అంతస్థులు ఉన్నాయి. ఇవి నది స్థాయికి సమానంగా నిర్మించబడ్డాయి. మీరు తరువాత చూడబోయే 22 గదులు ఇందులోనే ఉన్నాయి. ప్రతి తోరణము పైనా ఇరువైపులా తెల్ల పాలరాయి కమలములు చెక్కబడ్డాయి. ఈ తోరణాల క్రింద ఈ అంతస్తుల పునాదులు కనబడతాయి. ఈ చిత్రములో ఆ పునాదుల మధ్య ఒక ద్వారాన్ని చూడవచ్చు (మీ ఎడమవైపున). అనగా ఈ రెండు అంతస్తులలోను అనేక గదులు ఉన్నాయని అర్థమౌతుంది. షాజహాన్ వాటిల్ని కావాలనే మూయించివేసాడు. ఎనిమిదవ అంతస్తు ఈ పునాదులకు క్రింద ఉండాలి. ఈ పునాదుల వద్ద త్రవ్వకాలు జరిపితే ఆ అంతస్తు కూడా బయటపడగలదు. ఎందుకనగా ప్రతి హిందూ దేవాలయముకూ ఒక నేలమాళిగ ఉంటుంది.
ఛాయాచిత్రము - 9
ప్రతి ఒక్కరూ ముంతాజ్ సమాధి చూడడానికి ఉత్సాహపడతారు గానీ తాజ్ మహల్ వెనుక భాగాన్ని అంతగా పట్టించుకోరు. ఈ చిత్రములో మీరు చూస్తున్నది తాజ్ యొక్క వెనుక భాగం అనగా నదివైపు భాగం. ఇక్కడినుండి చూస్తే తాజ్ యొక్క పై అంతస్తులు కనబడడాన్ని మీరు చిత్రంలో చూడవచ్చు. పరీక్షగా గమనిస్తే ఒక కిటికీని మీరు చూడవచ్చు. అనగా ఈ క్రింది రెండు అంతస్తులలో గదులున్నాయని తెలుస్తుంది. ఈ రెండు అంతస్తులు ఎర్రరాతితో కట్టబడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఐదవ అంతస్తు యొక్క చిత్రము. ఆరవ అంతస్తుకు దీనికి క్రిందకు వస్తుంది. ఆ ఆరవ అంతస్తు వాకిలి గుండా వెళితే నదిని చేరుకోవచ్చు.
ఛాయాచిత్రము - 10
ఈ చిత్రములో తాజ్ మహల్ యొక్క ప్రవేశ ద్వార ప్రాంతము చూడవచ్చు. ఇది కూడా హిందూ నిర్మాణ శైలిలోనే ఉన్నది. పురాతన హిందూ రాజ్యాల రాజధానుల్లో కూడా ఇలాంటి కట్టాడాలనే చూడవచ్చు. కుడి, ఎడమన ఉన్న అష్టకోణాకృతిలో ఉన్న గోపురాలను గమనించండి. హిందూ ఆచారంలో మాత్రమే అష్ట దిక్పాలకుల పేర్లు చెప్పబడ్డాయి. దేశంలోని అష్టకోణాకృతి కట్టడాలన్నీ హిందువులవే. చిత్రములో కనబడుతున్న వసారాలలో తాజ్ మహల్ హిందూ దేవాలయముగా ఉన్నప్పుడు పల్లకీ బోయీలు, సేవకులు, కావలిదారులు నివసించేవారు. ఆవిధంగా తాజ్ ఒక విషాద ముస్లిం కట్టడంగా మారక ముంది భవ్య మందిరమై ఉజ్వలంగా ప్రకాశించేది.
(సశేషం.....)http://aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=834
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి