18, ఫిబ్రవరి 2012, శనివారం

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-6


ఢెల్లీ సుల్తాన్ పీఠాన్ని కూల్చివేసిన తిమూర్ (తామర్లిన్) (1398/99)

సూఫి ఇస్లామిక్ భక్తిపరుడైన (మధ్యాసియాకి చెందిన తుర్క/మొఘల్) అమీర్ తిమూర్ 1398/99 లో ఢెల్లీపై దండెత్తి 1,00,000 బానిసల్ని ఊచకోత కోసి సుమారు 2,00,000-2,50,000 మంది బానిసలను మరియు నేర్పుగల పనివారిని (skilled workers and craftsmen) మధ్యాసీలోని సామర్ఖండ్‌నకు చెరపట్టుకొనిపోయాడు (ఖాన్:282; లాల్:544). తిమూర్, తన "స్మృతుల గ్రంథం"లో ఢెల్లీ దండయాత్రను గూర్చి ఇలా వ్రాయించాడు:
"దండెత్తి వెళ్లిన 15,000 మంది తుర్క సైనికులొక్కొక్కరికి 50-100 బంధీల చొప్పున చిక్కిరి. ఇది కేవలం 17వ రోజు జరిగిన దాడిలో చిక్కిన బానిసల సంఖ్య. స్త్రీలు మరియు ఇతర దోపిడీ సొమ్ముల లెక్కకు అంతేలేదు. ముసల్మాన్‌ల ఆధీనంలోనున్న ప్రదేశాలపై మేము దాడిచేయలేదు కాని వారిని సూఫి ఇస్లాంను స్వీకరించమని హెచ్చరించాము. తిరిగి సామర్ఖండ్‌కు వెళ్లే దారిపొడవునా దోచుకొంటూ, అందమైన స్త్రీలను, పిల్లలను చెరపడుతూ వెళ్లాము."("తిమూర్ యొక్క స్మృతులు"- బోస్టం: 648).  

ఢెల్లీ సుల్తాన్ పీఠాన్ని తిరిగి స్థాపించిన సయ్యద్ మరియు లోడి వంశస్తులు (1400-1525)

తిమూర్ ఢెల్లీలో టర్కిష్ పాలనను విచ్చిన్నం చేసాక తనకు కప్పం కట్టేవారికి 1506 వరకు అధికారమిచ్చాడు.
ఈ సయ్యద్ సుల్తాన్లు కతెహార్ (1422), మాల్వా (1423) మరియు అల్వార్ (1425) ప్రాంతాలపై దండెత్తి ఎందరినో నరికి, బానిసల్ని దోపుడు సొమ్ముని కొల్లగొట్టారు. వీరి తరువాత లోడి సుల్తాన్లు ఢెల్లీ గద్దెనెక్కారు (1451-1526). ఎందరు మారినా హిందువుల స్థితి మాత్రం మారలేదు. అది అంతకంతకు దిగజారింది. సుల్తాన్ బహ్‌లూల్ చేసిన ఆకృత్యాలకు నిస్సార్ అనే ప్రదేశం నిర్మానుష్యమైంది. సికిందర్ లోడి రేవా మరియు గ్వాలియర్ పట్టణాల్లో ఇంతకంటే ఎక్కువ ఆకృత్యాలు చేస్తూ చెలరేగిపోయాడు (ఖాన్:282). 

సూఫీలైనా, సున్నీలైనా, షియాలైనా, ఇస్లాంలో ఏ తెగైనా సరే పర్యావసానం మాత్రం ఒక్కటే! అది అన్యమతస్తులు, విగ్రహారాధికుల ఊచకోత, వారి స్త్రీలను, పిల్లలను చెరచడం, వారి కష్టార్జితాన్ని దోచుకోవడం. హిందుస్థాన్ యొక్క రక్తసిక్త చరిత్రను కొందరు స్వార్థ రాజకీయనాయకులు వారి సొంతప్రయోజనాలకోసం అణచివేసారు. 

("మొఘల్ పాలన"- తరువాతి టపాలో) 
http://carpenters-son.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి