-నిరంకుశ నిజాం తలవంచిన తరుణం..
-గడి పునాదులు కదిలిన సందర్భం..
-ఆపరేషన్ పోలోకు 63 ఏళ్లు..
-తెలంగాణ సాయుధ పోరులోఎందరో జిల్లా బిడ్డలు..
-‘మా నిజాం రాజు.. జన్మజన్మల బూజు.. తీగలను తెంపి.. అగ్నిలోన దించినావు..
-నా తెలంగాణ కోటి రతనాల వీణ..’
-దాశరథి
-‘మన కొంపలార్చిన.. మన స్త్రీల చెరిచిన..
-మన పిల్లల చంపి.. మనల బంధించిన..
-మానవాధములను, మండలాధీశులను
మరిచిపోకుండా గుర్తుంచుకోవాలె.. కసి ఆరకుండా బుస కొట్టవలె.. కాలంబు రాగానే కాటేసి తీరాలె’
-కాళోజి
-‘బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు గట్టి
-ఏ బండ్లె పోతవ్ కొడుకో నైజామ్ సర్కరోడా..’
(టీ న్యూస్, కోల్‌బెల్ట్ ప్రతినిధి)నేడే స్వాతంత్య్రదినం..!స్వేచ్ఛ, స్వాతంవూత్యాల కోసం, తరతరాల బానిసత్వం నుంచి విముక్తి కోసం సరిగ్గా అరవై మూడేళ్ల క్రితం ఎగిసిపడ్డ అగ్ని శిఖలు ఇవ్వి.. నిజాం నిరంకుశత్వ పాలనపై, తెలంగాణయోధులు, తమ కలాలనే తుపాకుల్లా చేసుకుని ఇలా అగ్ని శిఖలను సంధిస్తే, సామాన్యులు సాయుధ పోరుతో నిప్పు కణికలు కురిపించారు. ఫలితంగా నిజాం భారతవూపభుత్వం ఎదుట తలవంచాడు.
సుదీర్ఘ కాలం తెల్లవాడి పాలనలో మగ్గిపోయిన భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న తరుణంలో నిజాం నిరంకుశ పాలన కింద ఉన్న మన హైదరాబాద్ సంస్థానం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంది. ముసలినక్క (మీరు ఉస్మాన్ అలీఖాన్) నిరంకుశత్వం, గ్రామాల్లోని గడీ పెత్తనం కింద యావత్ తెలంగాణ బానిస సంకెళ్లతో పడి ఉంది. అప్పుడే చీకట్లో వెలుగు రేఖలా ఓ విప్లవ నిప్పు కణిక రాజుకుంది.
అది తెలంగాణ సాయుధ పోరాటమనే మహా జ్వాలగా మారి, గడి పునాదులను కదలించడమే కాదు.. నిజాం నిరంకుశత్వాన్ని కాల్చి బూడిద చేసింది.. ప్రపంచ చరివూతలోనే ఓ మహోజ్వల ఘట్టంగా మిగిలిపోయింది. తరతరలా బానిసత్వం నుంచి విముక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంవూత్యాల కోసం యువకులు, రైతులు, సామాన్యులు నిజాం ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ‘ధిక్కారమ్‌న్ సైతునా’ అని గాండ్రించిన నిజాం, ఖాశీం రజ్వీ నేతృత్వంలో రజాకార్లను ఊళ్లపైకి ఉసిగొల్పాడు.
తిరుగుబాటుకు నాయకత్వం వహించిన నేతల గ్రామాలపై రజాకార్లు దాడులకు పూనుకున్నారు. 1947 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ల అకృత్యాలు, దాడులు, సామాన్యులు, రైతుల ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. చివరకు 1946 సెప్టెంబర్ 13న భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ పోలో’ పేరిట హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్యకు అనుమతించాడు. అప్పటి వరకు ‘చలో ఢిల్లీ’ నినాదంతో ‘నిజాం పాదాలను యమునమ్మ కడిగే రోజు దగ్గరలోనే ఉందని హుంకరించిన ఖాశీం రజ్వీ చిత్తుగా ఓడిపోయాడు. పోరుకు కారణమైన ప్రధాని లాయక్ అలీ పాకిస్తాన్‌కు పలాయనం చిత్తగించాడు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతావనిలో అంతర్భాగమైంది.
తెలంగాణ సాయుధ పోరాటంలో జిల్లా బిడ్డలు..
కొమురం భీమ్, రామకృష్ణ శాస్త్రి, దాజి శంకర్
భాసెట్టి గంగారాం, జే కుమార స్వామి
సదాశివ, కిషన్ రావు, వన్నెల ఎల్లన్న
గోవర్ధన్ శాస్త్రి, డాక్టర్ గుండే రావు
పోతుగంటి పోశెట్టి, సీ శంకర్ రావు
యాదనాల బానయ్య, సొల్లు చంద్రయ్య
ముదురగొండ పోషం, కష్టాల రామకిష్టు
కేవీ రమణయ్య, కే వెంకఅర్జున్‌రావు

http://www.namasthetelangaana.com/districts/Adilabad/ZoneNews.asp?category=5&subCategory=1&ContentId=28686
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి