రాజమండ్రి(తూర్పుగోదావరి) మత హింస నిరోధక బిల్లు-2011 చట్టంగా రూపొందితే.. హిందూ సమాజానికి పెను ప్రమాదం తప్పదని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయరుస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి శ్రీరంగధామం ఆవరణలో నిర్మిం చిన ప్రత్యేక వేదికలో తీర్థగోష్టి సందర్భంగా ఆయన శుక్రవారం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
తమ మనోభావాలను మెజారిటీ మతానికి చెందినవారు గాయపరచారని మైనారిటీ మతస్తులెవరైనా ఫిర్యాదు చేస్తే.. తక్ష ణం అరెస్టు చేయాలని ఈ బిల్లు చెబుతోందన్నారు. ఈ బిల్లు చట్టమైతే.. హిందువుల ముందు మూడే మార్గాలున్నాయన్నారు. మొదటిది.. మైనార్టీ మతాల్లోకి మారిపోవడం, రెండోది దేశం వదిలిపోవడం, మూడోది శిక్షను అనుభవించడమని ఆయన వ్యాఖ్యానించారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి