18, ఫిబ్రవరి 2012, శనివారం

దళిత క్రైస్తవం

Source : http://amtaryaanam-1968.blogspot.in/2009/09/blog-post.html

అనుకున్నట్టుగానే 'నియో దళితిస్టు ఆటిట్యూడ్'తో తమను తాము మేథావులుగా ప్రకటించుకుని, అలా ఒప్పుకోని వారితో పోరాడే ప్రవక్తలు 'క్రైస్తవ దళితులకు' ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషనుల వలన హిందూ మతానికి వచ్చిన ముప్పేమీ లేదని ప్రకటించారు.

ఈ మాటలను ఓ 'చిల్లర కామెడీ'గా త్రోసిపుచ్చి మనం నవ్వుకోవచ్చేమో కానీ, ఇవే మాటలు బయట నిజమైన దళితులతో అంటే, తాట తీసి చేతిలో పెడతారనేది వాస్తవం. ఈ విషయంలో మతపరమైన కోణం అపోహ అనేది సత్యదూరం.

ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగాను, మరో క్రైస్తవ మహిళ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అధినేతగాను ఉన్న ప్రస్తుత తరుణంలో, ఆ క్రైస్తవ మతానికి చెందిన దళితులకు రిజర్వేషనులు కల్పించబూనటం ఖచ్చితంగా మతపరమైన కోణాన్ని ఆవిష్కరిస్తుంది.

క్రైస్తవ మిషనరీలు పారేసే కాసుల కోసం కక్కుర్తిపడి మతం మార్చుకొని, ఇప్పుడు తామూ దళితులమేనని రిజర్వేషనులు కోరే కుహానా దళితుల ఈ డిమాండు వల్ల, హిందు తదితర మతాలలో రిజర్వేషనుల ద్వారా సమాజంలో సముచితస్థానానికి చేరువవుతున్న దళితులకు నష్టంలేదా! రిజర్వేషను కావాలనుకునే 'కుహానా దళితులు' అసలు మతం మారటంలోని ఔచిత్యం ఏమిటి?

దళిత క్రైస్తవులకు ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషనులు ఏరకంగా ఇచ్చినా అవి హిందు తదితర మతాలలోని దళితులకు నష్టకారణమే. వారికి ప్రత్యేకంగా ఇచ్చినా, లేదా ప్రస్తుత ఎస్సీ కేటగిరీలో ఇచ్చినా నష్టపోయేది నిజమైన దళితులే.

అసలు రాజ్యాంగ విరుద్ధంగా మతాధారంగా రిజర్వేషనులు కేటాయించ బూనటం ఘోరమైతే, ఆ ఘోరానికి హిందు తదితర మతాల దళితులను బలిపశువులు చేయబూనటం దేశద్రోహం.

ఆనాటి అంబేద్కర్ నుంచి ఈనాటి నియో దళితిస్టు మేథావుల వరకు అందరూ దళితులను హిందూ మతానికి వ్యతిరేకంగా ఉపయోగించుకునే పావులుగానే చూసారు. చివరికి దేశ స్వాతంత్ర్యాన్ని కూడా పక్కన బెట్టి, దళిత స్వాతంత్ర్యం పేరుతో తమ స్వార్ధ రాజకీయాలు నడిపారంటే అతిశయోక్తి కాదు.

దేశ ప్రజలంతా బ్రిటీషువారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుపుతుంటే, బ్రిటీషువారి పాచికలా మారి ఆయన దేశ స్వాతంత్ర్యానికి మోకాలు అడ్డటానికి ప్రయత్నించటమే కాకుండా, దళితులను ఆ ఉద్యమానికి దూరంగా ఉంచటానికి కూడా ప్రయత్నించారు. అందుకు మొదటి, రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలు చారిత్రక సాక్ష్యాలు.

ఆనాడు, జిన్నా ఆశించిన మాదిరిగానే, అంబేద్కర్ కూడా దళితులకు ప్రత్యేక ఎలక్టొరేట్ లు అడిగి భంగపడ్డాడు. స్వతంత్ర భారతంలో, ఏ అగ్రవర్ణాల హిందువులను ఆడిపోసుకున్నారో, అదే అగ్రవర్ణాల హిందువులైన బాబు రాజేంద్రప్రసాద్, పండిట్ నెహ్రూ, వల్లభ్ భాయ్ పటేల్ తదితర నేతల ప్రతిపాదనలతో రాజ్యాంగ సభ రిజర్వేషనులు ఆమోదించటం కూడా ఆయన కళ్ళు తెరిపించలేకపోయింది.

ఏదేమైనా, మన రాజ్యాంగవేత్తలు ఏ లక్ష్య సాధన కోసం నిమ్నజాతివారికి ఈ రిజర్వేషనులు ఉద్దేశించారో, వాటిని దళితులకు దూరం చేస్తున్న ప్రభుత్వ విధానాలను, కుహానా మేధావులను ఖండించి తీరాలి.

దీనికల్లా ఒకటే మార్గం. దేశాన్ని 'హిందు రాజ్యంగా' ప్రకటించి, హిందువులైన దళితులందరికీ రిజర్వేషనులు వర్తింపజేయాలి. ఇప్పటికే క్రైస్తవం పుచ్చుకున్న హిందు, తదితర మతాలకు చెందిన దళితులను హిందువులుగా మార్చి, మతాంతీకరణలు అరికట్టాలి. దీనికి అనుగుణంగా ఎస్సీ కేటగిరీ రిజర్వేషనులను పెంపుదల చేయాలి.

1 కామెంట్‌:

  1. mee post chadivanu, chala interesting gaa nu, hinduvu ga bratakadaniki dhairyanni icchindi, mana charitranu saakshyala to sahaa prachurincharu, chalaa vadanalu correct anipinchayi, but Dr. B. R. Ambedkar garu dalitulaku pratyeka electoratelu adigi bhanga paddru ani vrasaru, kaani adi tappu, aayana alochanaa vidhannani tappu ga prachurincharu. meeku edaina tappudu abhiprayam vunte dayachesi marchukodi, ambedkar alochana vidanamy eee desaniki saranyam.

    రిప్లయితొలగించండి