18, ఫిబ్రవరి 2012, శనివారం

కామెడీ హుస్సేన్ కోసం కన్నీళ్ళు దేనికి?



కాటికి పోవాల్సిన కామెడీ హుస్సేన్, కతర్ కు పోయాడట. మొత్తానికి ముంబాయిలో తంతే, కతర్ లో వెళ్ళి పడ్డాడు - భారతదేశ లౌకిక ప్రజా"స్వాముల" కళా సామ్రాట్ - మక్బూల్ ఫిదా హుస్సేన్. 95 సంవత్సరాల పండు వయసులో అష్టకష్టాలు పడుతూ దేశంకాని దేశంలో తలదాచుకోవాల్సి రావటం సామాన్య భారతీయులందరినీ కలచివేస్తున్నదట! అంతర్జాతీయంగా భారత్ కు అప్రదిష్ట కలిగించిన పరిణామంగా కూడా పేర్కొన్నారు సంభాషణ అనే బ్లాగు రచయిత.

"ఒకరు ఒక రచయితను, మరొకరు మరో రచయితను నిషేధించడమో, ప్రవాసంలోకో, నిర్బంధంలోకో పంపడం చేస్తూ పోతే - చివరకు సమాజంలో భావ ప్రకటనే ఉండదు" అంటారు ఈ బ్లాగరు.

మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్న వాక్స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛకు ప్రజలు (ముఖ్యంగా హిందువులు) కట్టుబడి ఉన్న కారణంగానే, నిన్న మొన్నటి వరకు ఎమ్మెఫ్ హుస్సేన్ భారత్ లో ఉండ గలిగాడు. హద్దులు మీరిన స్వాతంత్ర్యం, అడ్డగోలు స్వేచ్ఛ పుచ్చుకోవాలని ప్రయత్నించి చేతులు కాల్చుకున్నది హుస్సేనే. దేశంలోని మెజారిటీ ప్రజల భావోద్వేగాలను ఛీత్కరిస్తూ, హిందు దేవతల, దేవుళ్ళ చిత్రాలను నగ్నంగా చిత్రించటమే కాకుండా, దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన ఇటువంటి దేశద్రోహులు పరాయిదేశంలో స్థిరపడితే, హిందు దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు.

హిందువుల సహనానికి పరీక్ష పెట్టే, కుహానా లౌకికవాదులు హిందు దేవతలను నగ్నంగా చిత్రించినప్పుడు హుస్సేన్ ను అధిక్షేపించలేదే? ఆ పని చేసిన హిందువులను మాత్రం మతవాదులుగా చిత్రీకరించటంలోని ఔచిత్యం ఏమిటి? మహమ్మద్ ప్రవక్తను నగ్నంగా చిత్రించగలడా ఈ హుస్సేన్? తన భార్యల పొందులో కేరింతలు కొట్టే మహమ్మద్ ప్రవక్త కేళీ విలాసాన్ని నగ్నంగా చిత్రించగలడా ఈ హుస్సేన్? తన మతానికో రూలు, పక్క మతానికో రూలూనా? ఇకపైగా, ఇది భావ ప్రకటనా స్వేచ్ఛా! చదువుకున్నవాళ్ళే, కళ్ళు మూసుకొని కబోదులుగా నటిస్తూ, తమను తాము లౌకిక ప్రజాస్వామ్యవాదులుగా పరిగణించుకోవటం "మహా కామెడీ". అది ఈ దేశంలోనే సాధ్యం.

మన పురాణాలను, పురాణ పాత్రలను "సి" గ్రేడు స్థాయికి దిగజార్చి చేసే రచనలకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తాం. వావి వరసలు లేకుండా దేవుళ్ళను, దేవతలను నగ్నంగాను, అనౌచిత్యంగాను చిత్రించే వాడికోసం కన్నీళ్ళు కారుస్తాం. ఓ కమర్షియల్ పెయింటరుకు, దలైలామాకు పోలిక పెట్టి, మన మీద మనం ఉమ్మేసుకుంటాం. పడ్డవాడికి లౌకిక స్ఫూర్తి లేదంటాం, చెడ్డవాడిని నెత్తిన పెట్టుకుంటాం. ఒక్కసారి, అద్దంలో తమ ముఖాన్ని తాము చూసుకుంటూ, తమను తాము నిజాయితీగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఈ "లౌకిక ప్రజాస్వామ్యవాదులకు" ఉంది.

ఆ బ్లాగు రచయిత ఇంకా అంటారు "భావప్రకటనాస్వేచ్ఛ అంటే ఎవరైనా ఏదైనా రాయవచ్చునని కాదు. కానీ, రచనారంగంలో ఉన్నవారిని కట్టడి చేయడానికి మంచి మార్గంలో పెట్టడానికి రచనారంగానికి సంబంధించిన పోరాటరూపాలనే ఎంచుకోవాలి. విమర్శను విమర్శతో ఎదుర్కొనాలి. రచయితలు కూడా సందర్భాన్ని గుర్తెరిగి, సున్నితత్వాలను పరిగణనలోనికి తీసుకుని వ్యవహరించాలి. ఎవరైనా హద్దు మీరిన ట్టు భావిస్తే, దాన్ని అదే పాఠకుల మధ్య ఎంతటి తీవ్రమైన విమర్శ ద్వారానైనా పూర్వపక్షం చేయవచ్చు. ఆరోగ్యకరమైన, పరిణతి చెందిన ప్రజాస్వా మ్యం లక్షణం అది.”

అయ్యా, మీరు చెప్పిన ప్రజాస్వామ్య లక్షణాలలో భాగంగానే, హుస్సేన్ మీద కేసులు వేయటం జరిగింది. ఆ కేసులు ఇంకా నడుస్తుండగానే, దేశం విడిచి పారిపోయిన వ్యక్తిని మీరు వెనకేసుకు రావటంలో అర్ధం లేదు. (అతన్ని ఎవరూ చంపుతానని బెదిరించనూలేదు, కొడతాననలేదు మజ్లిస్ తరహాలో) నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించే వ్యక్తి అయితే, ఆ కేసులు పూర్తయ్యేదాకా ఇక్కడే ఉండేవాడు. కనీసం, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పేవాడు. ఇవేమీ చేయకుండా, దుబాయికి పారిపోయాడంటేనే తెలుస్తుంది వాడు ఎంత క్రిమినల్ అనే విషయం.

పక్కవాడి స్వేచ్ఛకు విఘాతం కలిగించనంతవరకు మాత్రమే, మన స్వేచ్ఛ ఉంటుందని గ్రహించలేని వ్యక్తి కోసం మీరు అన్నేసి కన్నీళ్ళు పారబోసుకోవాల్సిన అవసరం లేదు. విమర్శనాత్మక విచక్షణా జ్ఞానం కలిగి ఉండాలని ఆదేశ సూత్రాలలో చెప్పిన విషయాన్ని తుంగలో తొక్కే హుస్సేన్ లాంటి దుర్మార్గులకు నిజానికి దేశంలోనే ఉరిశిక్ష పడి ఉండాల్సింది. కనీసం ఈరకంగా బహిష్కరింపబడినందుకు సంతోషం.

http://amtaryaanam-1968.blogspot.in/2010_03_01_archive.html

1 కామెంట్‌: