20, ఫిబ్రవరి 2012, సోమవారం

అక్బర్, మొఘల్ దర్బారు రహస్యాలు : కొన్ని విమర్శలకు,వ్యాఖ్యలకు,సందేహాలకు సమాధానాలు ఇక్కడ చూడండి.



 Courtesy : http://theuntoldhistory.blogspot.in/2008/01/blog-post_13.html


కొంతమంది పాఠకులు వేసిన ప్రశ్నలకు, చేసిన విమర్శలకు ఇక్కడ సమాధానం ఇస్తున్నాను. పాఠకులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా నేను ఇలా అర్థం చేసుకున్నాను .




1. బ్లాగులో రాసేదంతా వైయక్తికంగా మారుతోందని.
2. ఎప్పుడో 1500 AD లో జరిగింది ఇప్పుడు తవ్వి ఏం లాభం అని? ఈ రోజు జరిగేది రాయొచ్చు కదా! రాసినా ,
దాంట్లో చెడు మాత్రమే ఎందుకు , మంచి తీసుకోమని .
3. రానురాను ఈ బ్లాగు అంతా ముస్లిం వ్యతిరేకిలా తయారవుతోంది!
4. విన్నర్స్ రాసిందే ఎందుకు రెఫరెన్స్ గా తీసుకోవాలి?






యీ అక్బరూ, షాజహానూ రెండూ చూస్తూంటే నా వైఖరి ముస్లిం వ్యతిరేకి లాగా కనిపిస్తోందని ఒక పాఠకుడి ఆవేదన. నేను పట్టుకున్న కాగడాకి ఏ కుల,మత,వర్గ,సాంఘిక భేధాలేవీ లేవు. నా ప్రయత్నం నిజం కోసమే!అది ఎక్కడైనా, ఎవరిమీదైనా కావొచ్చు. దానికెలాంటి వైరుధ్యాలూ లేవు. సరే ఇక ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే నేను చేసే చర్చకి వ్యక్తులని మాత్రమే తీసుకుంటున్నానని (వైయక్తికంగా రాస్తున్నానని). ఇది నిజంలాగా కనబడుతుంది నా బ్లాగుల్ని చూస్తే. ఎందుకంటే నా ప్రస్తుత చర్చ వ్యక్తుల చుట్టూ తిరుగుతోంది కాబట్టి. 'ఏది నిజం ' అనే టైటిల్ ని ఖరారు చేయటానికి కారణం ఒక awareness క్రియేట్ చేయాలనుకునే నా ప్రయత్నం. నా ప్రయత్నం ఎదుటివాళ్లని Convince చేయటానికి కాదు.. 'ఏది నిజం?!' దిశగా ఆలోచింపజేయటానికి యే చిన్న ప్రేరణ మిమ్మల్ని కదిలించినా నా ప్రయత్నం నేరవేరినట్టే. ఇది నా అప్పీల్ కూడా!


ఇక నేనింతవరకు తీసుకున్న అంశాలు రెండే. తాజ్, అక్బర్. అక్బర్నే తీసుకుందాం. అతని గుణగణాల విశ్లేషణ అనవసరం అనే అభిప్రాయం విలిబుచ్చారు కొంతమంది. But can any body prove that a personality like Akbar is only an individual and not connected to any one or any kind of such things which might have influenced numerous traditions, customs of other races, religions and almost whole India? How can be he separated from, the then Society or culture? అలాగే తాజ్ మహల్ని షాజహాన్ కట్టించలేదని ఋజువుల్ని చూపించినా ఒరిగేదేముంది? అన్న వాళ్లున్నారు. షాజహాన్ ని ఒక వ్యక్తి గా తీసుకోలేం. దాదాపు ఉత్తరభారతదేశాన్నంతా ఏకఛ్ఛత్రాధిపత్యంగా ఏలిన చక్రవర్తి. అతన్నెలా వైయక్తికంగా తీసుకుంటాం? చక్రవర్తి అన్న పదవే సమాజంలో అన్ని వర్గాల వారిని ప్రభావితం చేయగలిగేంత మహా శక్తివంతమైనది. అతని Influence ని మనం వైయక్తికంగా వర్గీకరించలేం. తాజ్ మహల్ యెవరి గెస్ట్ హౌజో లేక యెవరి ప్రైవేట్ బిల్డింగో కాదు.అది మన దేశ అమూల్యమైన వారసత్వ సంపద. దాని విలువ దానిదే. ఎటోచ్చీ it is connected to the masses . సాంస్కృతికమైన ప్రజల సెంటిమెంట్లు కూడా అంతే విలువైనవి. అబద్దపు చరిత్ర పాఠాల్తో మనం ఇంకెన్నాళ్లు మభ్యపెడతాం? ఇప్పటికే ఎన్నో దేశాలు తమ చారిత్రక నేపథ్యాన్ని, విశ్వసనీయతను, నిజానిజాలని పారదర్శకంగా ప్రక్షాళన చేసి తమ చరిత్రని తిరగరాసుకుని తమ దేశ నిజమైన వారసత్వాన్ని ముందు తరాలవారికి అందించడానికి సిద్దంగా వున్నాయి. అంతవరకూ ఎందుకూ. ఈ మధ్యనే దక్షిణాఫ్రికా ప్రభుత్వం తన అధికారిక సైటునొకదాన్ని తయారు చేసి తమ దేశం పైపడి దోచుకున్న వైనాల్ని, బానిస వ్యవస్థలో మగ్గిన తమ దేశ ప్రజల జీవితాల్లోని నిజానిజాల్ని వెతికి తీసే ప్రయత్నం చేసింది( దాంట్లో మన గాంధీగారి పై కొన్ని కటువైన విమర్శనాస్త్రాలూ చేసి, ఆయన వల్ల తమ దేశానికొరిగినదేమీ లేవని తేల్చి చెప్పింది. ఇంకాస్తా ముందుకెళ్లి గాంధీ గారు తమ దేశంలో జాతి వివక్షనెలా పెంపొందిచారో ఋజువుల్తో సహా చూపింది.). మరి మనమేం చేస్తున్నాం? నెక్లెస్ రోడ్డులో పీజేఆర్ విగ్రహం పెట్టండని అడిగితే వైయెస్ మొఖం మాడ్చుకున్నాడనో, యెస్పిజీ ప్రొటెక్షన్ యివ్వలేదని మాయావతి గగ్గోలు పెట్టిందనో ఫ్రంటుపేపర్లో, టీవీల్లో కాఫీ తాగుతో హడవిడిగా స్నానం చేసి ఆఫీసుకెళ్లిపోతాం. అలా తెలవారుతుంది మనకు! (TV9,TV5,NTV, ఆTV, ఈTV,TVXX, XXTV లాంటివెన్నో వస్తాయీ పోతాయి, మనం రూపొందించగలిగే డిస్కవరీ, హిస్టరీ ఛానల్లు లాంటివి మన దేశంలో ఎందుకు రావటం లేదు?)




మనకు మాత్రం మన గురించి ఎప్పుడు పట్టింది? మనకు చరిత్ర ఎందుకు?ఎప్పుడు ఎవడు కడితే ఏంటి? ఎప్పుడు ఎవడు దోచుకుంటే ఏంటి? అని శతాబ్దాలుగా అనుకుంటున్నాం కాబట్టే ఎవడో వచ్చి దోచుకుని వెళ్లేదాకా సహనం చూపి, దోచుకుని దొరికినా , ప్రతీసారీ క్షమాభిక్ష పెట్టీ, ప్రపంచంలో యింకే దేశం దోచుకోబడనంత దీనస్థితికి( మొదట్లో ప్రపంచంలోకెల్లా సంపన్నమైన దేశామూ, ప్రపంచానికి నాగరికత భిక్ష పెట్టిన దేశమూ మనదే కాబట్టి)
దిగజారిపోయాం. క్రీ.శ. 1500 AD లోనిదే తప్పులతడక కాదు మన చరిత్ర పాఠాలు. సింధూ నాగరికత దగ్గిరనుంచీ నిన్నటి మొన్నటి మన స్వాతంత్ర్య పోరాటం వరకూ చాలావరకూ తప్పులతడకల్తో మనం చరిత్ర పాఠాలు భట్టీ పడుతో వల్లె వేశాం. అదే చరిత్ర అనీ మన పెద్దలు మనకి బుకాయిస్తే అదే అసలు నేపధ్యం అనీ మనం ఈరోజు అంతర్జాతీయ క్షితిజ రేఖ పై నుంచుని ఎలుగెత్తి చాటుతున్నాం. 1500 AD లోనిదే ఎందుకు, ఈరోజు గురించి రాయండి అని ఒక పాఠకుడు రాయడం రాశాడు కానీ నా మున్ముందు రాబోయే బ్లాగుల కాలాల్ని నేనింకా ఎక్కాడా చెప్పలేదు.


నిన్నటిదే చరిత్రా? ఈరోజు నడుస్తున్నది చరిత్ర కాదా? నేడు నిన్నగా మారదా? ఎప్పటి కాలాల చరిత్రని మనం వొదులుకుందాం? చరిత్రకు కూడా కాలపరిమితి విధించుకుందామా? అయితే ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాలెందుకు, దాంట్లొనే ఎన్నో లొసుగులు కనబడుతున్నప్పుడు? చరిత్రలోని మంచి మాత్రమే రాయాలంటే మనవాళ్లు పడ్డ కష్టాలూ, చేసిన ప్రాణత్యాగాలు, మోసాలకి గురయిన ఎందరి అభాగ్యుల జీవితాలు ఇవన్నీ వొదిలేస్తే యింక చరిత్ర ఎందుకు, యే చందమామ కథల్లోని విక్రమార్కుడి గురించో, యే అందమైన వరూధినీ ప్రవరాఖ్యుడిలాంటి కావ్యాలో చదువుకుంటే సరిపోతుంది కదా.మన గురించి గర్వంగా చెప్పుకోడానికి మనకు తగిన నిజమైన వారసత్వమే లేనంత పేద దేశమా? మనమెవరమో, మన నిజమైన చారిత్రక నేపథ్యమెటువంటిదో మన పూర్వీకులు మన కోసం యేం పాటుపడ్డారో మన వెనకటి తరాలు తమ భవిష్యత్ తరాల కోసం యే యే పోరాటాలూ, త్యాగాలు చేశారో, మన నిజమైన జాతీయ సంపద పూర్వాపరాలూ వీటిమీద యే దేశానికైతే సమగ్రమైన విశ్వసనీయతా, సమచారమూ, అధికారికతా వుంటేనే కదా దానికి అస్థిత్వమూ, భవిష్యత్ తరాలకి ఒక నిజమైన పునాది వేసుకున్నట్టుంటుంది. గతం మరచిన యే జాతికైనా/దేశనికైనా భవిష్యత్ ఎక్కడిది?


ఒక పాఠకుడన్నట్టు ఎందుకు అన్నీ విన్నర్స్ రాసిన దాంట్లోంచి మాత్రమే తీసుకుని రాస్తున్నారని ఆరోపణ. కొన్నిసార్లు అవే ప్రిఫర్ చేయాల్సివచ్చింది. మా ప్రభువులవారు అసమాన పరాక్రమవంతుడు, అపర మన్మథుడు అని రాసేవాటిల్లోనే చాలావరకు ఈ ప్రభువుల గుణగణాలు బట్టబయలవుతాయి., అదేకాక ప్రభువులు తమకు తాముగా రాయించుకున్నవాటిల్లో అతిశయోక్తులుంటాయేమో కాని అబద్దాలుండటం చాలా అరుదు. అయితే సాధారణంగా ఆయా కాలానికి కొన్నిసార్లు విదేశీయులు, కవులు రాసిపెట్టిన దాంట్లోవి కూడా ఉపయుక్తంగా వుంటాయి. మొఘల్ చక్రవర్తుల చరిత్రంతా పార్శీ భాషలో రాయించుకున్నారు. వాటిల్లో ఎన్నో మన దేశం ఎల్లలు దాటిపోయాయు. మిగిలినవి National Archives, Govt of India లో భధ్రంగా దాచి పెట్టి పర్మనెంటుగా సీలు వేశారు. ఎంప్పుడో 1820 AD లో నే కొందరు విదేశీయులు ఈ పార్శీ గ్రంథాల్ని ఇంగ్లీషు చేశారు. వాటిల్లో కొన్ని గూగిల్ లైబ్రరీ లో , ఆర్కివ్స్.ఆర్గ్ లో పెట్టారు. పార్శీ వచ్చినవాళ్లూ వెరిఫై చేసుకోవచ్చు. యిక చివరగా , నేను రాసిన అక్బరుపై చివరి బ్లాగులో ఆ టాపిక్ ని క్లోజ్ చేస్తున్నాను. కానీ నిజానికది అక్బర్ చరిత్రకు ముక్తాయుంపు కాదు. మనవాళ్లు 'మొఘల్-ఏ-ఆజం ' సినిమా తీసి చరిత్రకు ఎంత అన్యాయం చేశారో తెలీని అజ్ఙానంలో వుండి కూడా ఆ సినిమాని కలర్స్ లో మళ్లీ తీసి మన పైకి వొదిలితే మనం వాళ్లకి కోట్లు ఆర్జించి పెట్టాం. అంతేకాని చరిత్రలో అక్బరు కుమారుల్లో సలీం ఎన్నో వాడో, అసలు వున్నాడో లేదో తెలియకుండా చరిత్రని నమ్మాం. ఆయన కుమారుల్లో పరమ శాడిస్టు అయిన జహంగీరే ఈ సలీం అన్న పచ్చి నిజం ఎంత మందికి తెలుసు. ఆయనకో ప్రేమ కథని అల్లి అమరప్రేమికుణ్ని చేశాం. ఆ పచ్చి తాగునోతు దేశాన్ని పట్టించుకోకుండా తనకు ఎదురుతిరిగే వాళ్లని(తన వాళ్లయినా) తన సమక్షంలోనే కనుగ్రుడ్లను పెరికించి వేస్తూ యింకా నానారకాల వికృత చేష్టల్తో ఆనందించేవాడు. పరిపాలనని గాలికొదిలేసి విశృంఖల శృంగారంలో, మద్యపానల్లో మునిగితేలేవాడు. ఇలాంటివాడి గురించా మనం కొటేషన్లు రాసుకుంటాం సలీం-అనార్కలీ అనీ. అక్బర్ భార్యల్లో Sultana Begum ఎవరో కాదు. 13యేళ్లప్పుడు తన తండ్రి చనిపోతే రాజ్యం సంక్షోభంలోవుంటే తన తండ్రి కుడిభుజమైన Bairam Khan రాజ్యభారాన్ని భుజానికెత్తుకుని పాలబుగ్గల పసివాడైన అక్బర్ని సింహాసనంపై కూచోబెట్టి ఉప్పుతిన్న విశ్వాసాన్ని ప్రదర్శిస్తే అక్బరేం చేశాడు? చరిత్రకందని మిష్టరీ గా Bairam Khan ని ఎవరో దుండగుల చేతుల్లో హతుడైన వెంటనే మాతృసమానురాలైన తన 'బాబా ' అని పిలుచుకునే Bairam Khan భార్యని నిఖా చేసుకుని తన జనానాలో కి లాగాడు. (ఒకసారి ఛత్రపతి శివాజీ మొఘలుల కోటల్లోనొకదాన్ని వశపరచుకున్నాక అంతఃపుర కాంతనొకరిని తన భటుడొకడు శివాజీ సమక్షంలో నిలబెట్టి 'ఈ ప్రసాదం ప్రభువులవారికి ' అని అంటే శివాజీ మండిపడి ఇంకొకసారి ఇలా యే స్త్రీనైనా బందీగా పట్టుకొస్తే నరికిపారేస్తానన్నాడు.) ఇలాంటి విచక్షణని, న్యాయాన్ని యే మొఘల్ చక్రవర్తి పాటించాడో చరిత్ర పుటలు తిరగేయండి.


'గురూగారూ!ఇప్పుడేం చేద్దాం? టైం మెషీన్ లో వెనక్కి వెళ్లి అక్బర్ పై దాడి చేయలేం కదా!'’
అనేవాళ్లకు నేనేం చెప్పాలి??


నెట్ లో అనుష్క MMS Clip ల కోసం, టీవీలో మోనికా బేడీ బాత్రూం క్లిప్ లకోసం ఎగబడి చూడాలనే వారికోసం ఉద్దేశించి రాసే బ్లాగు కాదిది. చెలం చేసినట్టుగా నేను ఏ 'చక్కెర గుళికో ' కలిపి చేదు మాత్రలను మింగించలేను.


మన వారసత్వాన్ని నిజమైన బాధ్యతతో ఈ తరానికి అందించడానికి సిద్దంగా వున్నామా లేదా అని ఆలోచించమనేది నా మనవి,


ఒక్కరినైనా ఆలోచింపచేయగలిగితే నా ప్రయత్నం ఫలించినట్టే.

2 కామెంట్‌లు: