దిగ్విజయ్ కి నిజ నిర్దారణ పరీక్షలు చేస్తే…!!!
చెయ్యనివ్వండి. నిజాలు తెలుస్తాయి అంటారా?
తెలియనిస్తారా….ఎమో మరి ?
గుడ్ ఐడియా అన్నారు అందరూ… కానీ ఎం లాభం అలా చేస్తే అసలు నిజం తెలిసి పోతుంది, కేసు వీగిపోతుంది.
ఇది కాంగ్రెస్ పాలసికే విరుద్ధం. ఏ విషయన్నైనా తెగే వరకు లాగటం, పనికొస్తుంది-ఓట్లొస్తాయంటేనే నిజ నిర్దారణ చెయ్యడం ఇదే దాని కుహనా పాలసి. అది పాక్/భారత్ విభజన అయినా, తెలంగణా అయినా, రామ మందిరమైనా, భోపాల్, భొఫోర్స్ ఎదైనా….
కాబట్టీ మనం ఈ ఐడియా అమలుని అస్సలు ఆశించలేం.
ఈ కుహానా లౌకికవాదులు ఎదైనా మాట్లడతారు, తిమ్మిని బమ్మిని చేస్తారు.మొన్నటికి మొన్న వికీ లీక్స్ లీక్ చేసిన విషయాలు చూస్తే…ఈ కాంగేయులు ఏం-ఎందుకు మాట్లాడుతున్నరో చాల బాగా అర్ధం అయ్యుంటుంది.
మన తరువాతి ప్రధాన మంత్రి అని చెప్పుకొని ఊరేగుతున్న యువకిశోరం, మన దేశానికి పాక్ ప్రేరేపిత ఇస్లాం ఉగ్రవాదం కన్నా… హిందుత్వ అతివాదం పెద్ద ముప్పు అని తనకున్న మిడి మిడి జ్ఞానంతో ముస్లీం వోట్లకు గాలం వేస్తున్నారు.ఇదే బాటలొ మిగతా కాంగేయులు తందానా అంటున్నారు. నిజానికి తీవ్రవాదం ఏ రూపంలో అది దేశనికి ముప్పు అని ఈ ఫ్యూచర్ పి.ఎం కి తెలియకపోవడం ఒక వింత. ఏ రకమైన తీవ్రవాదంతో తన తండ్రి,నానమ్మ చనిపోయారో చూసుకొని, ఇస్లాం తీవ్రవాదం గాంధీ కుటుంబాన్ని ఎం చెయ్యదు/చెయ్యలేదు అనుకుంటే అంతకన్నా తింగరతనం ఉండదు.
ఇప్పుడు ఈ దిగ్విజయ్ గారు…పొలిటికల్ ఘజినిగా రూపంతరం చెందారు.
నెల క్రితం మొదట ఈయనే తేనె తుట్టను స్రుష్టించి, దాన్ని ఒక వర్గానికి ఫేవర్గా కదపడం ప్రారంభించారు.మొదట కర్కరే తనకు ఫోన్ చేసారన్నారు. ఇప్పుడు తనే ఫోన్ చేసనని అంటున్నాడు.
ఒక్కసారి తరచి చూస్తే…
ఈ పెద్ద మనిషికి కర్కారేతో మట్లాడసిన పని ఏమిటి? (మలేగావ్ పెలుళ్ళలో హిందూ తీవ్రవాదం గురించి తెలుసుకొనెందుకు చేశారంట – ఒక మాజీ ముఖ్యమంత్రి హోదా, పేద్ద పార్టికి ప్రధాన కార్యదర్శి అయిన ఈయన తన ‘మొబైల్’ నుంచి కాల్ చేసారంట)
ఏలా చేస్తిరి ?? ….ఇంటర్నెట్లో వెతికి ATS వెబ్సైట్లో ఉన్న నంబరుకి ఫోన్ చేసిరంట.. (ఈ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి ఇంత గూగ్లింగ్ చేసే పరిజ్ఞానం నిజంగా ఉంటే చాలా సంతోషం)
వెతికితిరి పో …ఆ వెబ్సైట్లో అంత పక్కా అప్ డేటెడ్ నంబరు ఉన్నదట.
ఉన్నది పో …..అది ఆ టైంలో సరిగ్గా పనిచేసినది ….
చేసినది పో…. మన నేషనల్ హీరో కర్కరే అక్కడే ఉండీ…అదే ఫోన్ ఎత్తారట..
ఎత్తితిరి పో…. ఆయన హిందూ అతివాదులవల్ల ప్రాణభయం ఉందని ఈ కాంగేయిడికి ఎందుకు చెప్పాలి? చెప్పితిరి పో….దిగ్విజయ్ గారు ఇన్ని రోజులు ఆ విషయన్ని ఎందుకు దాయాలి?
దాచితిరి పో…..ఇప్పుడు ఆ విషయం ఎందుకు ఇంత ఇదిగా తవ్వాలి?
తవ్వితిరి పో….. ఆధారలున్నాయ్ అన్నారు….ఉంటే వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏలుతున్న కాంగ్రెసుకి ఇచ్చి నిజాన్ని నిరూపించచ్చు కదా..
చేయలేదు పో …. జనాల్ని వెధవల్ని చేస్తూ కేంద్ర హోం మంత్రి కొన్ని నెలల క్రితం విచారన కమిటి వెయ్యటం ఏమిటో (తన సహచరుని దగ్గర ఆధారాలు ఉంచుకొని కూడా)
ఇన్ని చేసిన ఈ వీరుల్ని మళ్ళీ పార్లమంటుకి పంపితే…నువ్వు నేను తట్ట బుట్ట సర్దుకొని పోవాల్సిందే.
కసబ్ కాల్పుల వలనే కర్కారే చనిపోయాడని జగమంతా తెలిసినా, వాడికి మంచిగా మటన్ బిర్యానీలు పెట్టి…ఏ.సి రూముల్లో పడుకొపెట్టి, లాయర్నెట్టించి మరీ మేపుతున్నారు.
తన సొంత రాష్ట్రం మధ్య ప్రదేశ్-భోపాల్ లో జరిగిన యునియన్ కార్బైడ్ దుర్గటన తీర్పు వచ్చిన రోజు ఈ మహనుభావుడు పత్తా లేడు. ఇప్పుడు వచ్చి అవాకులు చెవాకులు…
కొసమెరుపు ఏమంటే “ఫోన్ టాపింగ్” అసలు తమ ప్రభుత్వంలో జరగవని చెప్పుకున్న చిదంబరం…ఈ రికార్డెడ్ సాక్షం ఎలా వచ్చిందో సెలవిస్తే బాగుంటుంది. లేకపొతే కనీసం 2 సం.ల క్రితం జరిగిన ఈ సంభాషనని ఇప్పటి వరకు BSNL ఎందుకు ‘ప్రిజర్వ్’ చేసి ఉంచిందో చెప్పాల్సి ఉంటుంది.
ఇంకో కొసమెరుపు ఎంటంటే హేమంత్ భార్య కవిత కర్కరే దిగ్విజయ్ వాఖ్యల్ని తీవ్రంగా ఖండించడం.
రేపు పాక్ తీవ్రవాదాన్నిమనం ఎలా ఎండగట్టగలం?
‘ముందు మీ ఇంటిని చక్కదిద్దుకోండి ‘ అంటే…?? ఈ కాంగేయులు ఏం సమాధానం చెప్తారో మరి..?
ఆందోళనకరం, సున్నితమైన ఈ అంశంపై ఇలాగానే మాట్లాడేది? భారత్ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు పరోక్షంగా పాక్‌కు సంతోషాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు.
http://yuvagodavari.wordpress.com/2011/01/05/

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి