భారత దేశ విద్యారంగంలో పెను మార్పులు
తీసుకురావడానికి ఆద్యుడు లార్డ్ మెకాలే. ఇప్పటికీ సాంప్రదాయవాదులు ఆయన
విద్యావిధానాన్ని దుమ్మెత్తి పోస్తూనే వుంటారు. ఈ మధ్యన ఒక ఫ్రెండ్ దగ్గర
నుండి వచ్చిన ఈ మెయిల్ చూసి నేను షాక్ కీ గురయ్యాను. అది నిజమో కాదో నాకు
తెలియదు కాని, అందులో వ్యక్తపరచబడిన భావాలు మాత్రం ఖచ్చితంగా నిజమే అని
నమ్ముతున్నాను. దాని తెలుగు అనువాదం ఇక్కడ ఇస్తున్నాను. చదవండి..
లార్డ్ మెకాలే 1835, ఫిబ్రవరి 2వ తారీఖున బ్రిటిష్ పార్లమెంటుకి రాసిన వుత్తరం.
"నేను భారత దేశం నలుమూలలా పర్యటించాను. కాని దేశం మొత్తం మీద ఎక్కడా ఒక బిచ్చగాడు కాని, ఒక దొంగ కాని కనిపించలేదు. ఇంతటి సంపన్నమయిన దేశాన్ని, ఇంతటి నీతిమంతులయిన ప్రజులున్న దేశాన్ని, ఇంతటి సమర్ధులయిన ప్రజలున్న దేశాన్ని మనమెప్పటికయినా జయించగలమని నేను అనుకోవడం లేదు. కాని ఈ దేశానికి వెన్నెముక అయిన ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, అత్యంత పురాతనమయిన విద్యావ్యవస్తని నాశనం చేయడం ద్వారా, వారి సాంప్రదాయ విద్య స్తానంలో మన ఇంగ్లీష్ విద్యని ప్రవేశపెట్టడం ద్వారా, భారతీయులకి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకుండా చేసి, వారి ఔన్నత్యాన్ని కోల్పోయేలా చేసి, కేవలం విదేశీయులు మాత్రమే గొప్పవారు, అందులోనూ అంగ్లేయులు ఇంకా గొప్పవారు అనిపించేలా చెయ్యగలిగితే మనం అనుకున్నది సాధించవచ్చు. (భారత దేశాన్ని ఆక్రమించవచ్చు)

పైన వున్న వుత్తరం నిజమయినా కాకపోయినా, ఇప్పుడున్న పరిస్తితి చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మన బ్లాగర్లలో కొంత మంది భారత దేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని పనిగట్టుకుని తిడుతూ, దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటివారందరికీ ఒక మనవి. ఎవరినయినా ద్వేషించేముందు, దూషించే ముందు ఒక్కసారి అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలి. ఎవరో చెప్పింది, ఎవరో రాసింది మాత్రమే సరయినదనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి. మనల్ని మనం అవమాన పరచుకోకూడదు. ఎవరి గొప్పదనం వాళ్ళకుంటుంది, ఎవరి లోపాలి వాళ్ళకుంటాయి. అంతే గాని ఇతరులని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుని, అదేదో పెద్ద గొప్ప విషయంలా చూపడం మానుకోవాలి.
ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా, భారత దేశ సంస్కృతి అధమ పక్షం 10,000 సంవత్సరాల నాటిది. అంత పూర్వకాలం నుండి అవిచ్చిన్నంగా కొనసాగుతున్న సంస్కృతి, నాగరికత ప్రపంచంలో మరే దేశంలోనూ లేదు. భారతీయ సంస్కృతితో పరిడవిల్లిన ఈజిప్ట్, పర్షియన్, మాయన్ వంటి నాగరికతలు చరిత్రలో కలిసిపోయాయి. అదీ ఎటువంటి ఆధారాల్లేకుండా... కేవలం వాళ్ళు వాడిన కుండ పెంకులు, సమాధులని తవ్వి తీసి చరిత్ర రాస్తున్నారు. కాని అన్ని ఆధారాలతోను, సుసంపన్నమయిన సంస్కృత భాషలో అప్పటి చరిత్ర గురించి ఆధారాలు లభిస్తుంటే, ఇది నిజం కాదు అని తిరస్కరించడం పర దేశ సంస్కృతి దాసోహమనడం వల్లనే వచ్చింది. ఇంతటి అరుదయిన సంస్కృతిని పొగడనకర్లేదు, కనీసం మిగిలిన వాళ్ళతో కలిసి తిట్టకుండా వుంటే చాలు.
http://saradaa.blogspot.in/2010/06/blog-post_15.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి