20, ఫిబ్రవరి 2012, సోమవారం

క్షమించండి, మతమార్పిడి చేసాం!

“సేవ చేయాల్సింది పోయి, వాళ్ళ నెత్తికెక్కి కూర్చున్నాం. అలాంటి తప్పులను మనం పునరావృతం చెయ్యరాదు.
మన రెండు గొప్ప మత వారసత్వాల మధ్య విశ్వాసాన్ని పాదుకొల్పేందుకు గాను, హిందూ మతస్తులకు నేను సిన్సియరుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.”

సేవ చేస్తామని చెప్పి మతమార్పిడులు చేస్తూ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో హిందువుల పట్ల చేసిన అకృత్యాల పట్ల ఒక క్రైస్తవ బిషప్ జాన్ బ్రూనో అమెరికాలో చేసిన బహిరంగ క్షమాపణ ప్రకటన ఇది. బిషప్ బ్రూనో, వ్యక్తిగత కారణాల వలన రాలేకపోవడంతో ఆయన పంపిన క్షమాపణ ప్రకటనను ఆయన తరపున రైట్ రెవరెండ్ చెస్టర్ టాల్టన్ చదివారు.

హిందూ క్రైస్తవుల మధ్య జరుగుతున్న చర్చలకు మూడేళ్ళు నిండిన సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని రెవరెండ్ కరేన్ మెక్వీన్ నిర్వహించారు. మదర్ కరేన్ గా పేరొందిన ఆమె వేదాంత తాత్వికతతో ప్రభావితమయ్యారు. ప్రలోభాలను ఎరజూపి మతమార్పిడి చెయ్యడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తారు.
’మూడేళ్ళ కిందట కొందరు హిందూ నాయకులతో జరుప మొదలుపెట్టిన చర్చలలో భాగమే ఈ క్షమాపణ. ఈ చికిత్స కొనసాగుతుంది.’ అని మదర్ కరేన్ అన్నారు.

బిషప్ బ్రూనో చెప్పిన ఈ క్షమాపణ కొన్నేళ్ళ కిందట పోప్ జాన్ పాల్ 2 క్రైస్తవులు చేసిన పాపాలకు గాను చెప్పిన క్షమాపణలతో పోలిస్తే చాల చిన్నదే. సెయింట్ పీటర్ బేసిలికాలో జరిగిన ఒక కార్యక్రమంలో పోప్ ఇలా అన్నారు: ’మనం క్షమిస్తాం . క్షమను అర్థిస్తాం కూడా.’ అని అన్నారాయన. ’క్రైస్తవేతరుల పట్ల చేసిన పాపకృత్యాలకు, హింసకు, యూదులు, ఇతర మతస్తుల పట్ల చేసిన అకృత్యాలకు, స్త్రీల పట్ల చూపిన వివక్షకు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల జరిపిన గర్భస్రావం వంటి అకృత్యాలకూ’ ఇతర వాటికన్ అధికారులతో కలిసి ఆయన క్షమాపణ కోరారు.

 http://mataraajakeeyaalu.wordpress.com/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి