19, ఫిబ్రవరి 2012, ఆదివారం

తాజ్ మహల్! మనకు తెలియని కట్టడం-2

నగనగా ఒక పట్టపు రాణి. సువిశాల ప్రపంచంలో మహా సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తిగారు. ప్రాణసమానంగా ప్రేమించిన ఇల్లాలికి గుర్తుగా, ప్రపంచం మొత్తం విస్మయం చెందే విధంగా 22 సం. కష్టపడి కట్టించిన అపురూప పాలరాతి ప్రేమ సౌధం ఎంత మంది కవుల్లో స్ఫూర్తిని రగిలించిందో! వారి అమరప్రేమను తలుచుకుంటే గుండె బరువెక్కుతుంది.

కాని అసలు నిజం ఏమిటి? తాజ్ మహల్ ని షాజహన్ కట్టించలేదు.ఆ మాట కొస్తే అసలు బాబర్ కూడా ఆ ప్రసాదంలోనే మరణించాడు. 300 యేళ్ల కిందటే కట్టిన అదొక పురాతన రాజమందిరం. దీని రుజువు కోసం మనం యెక్కడికో వెళ్లనక్కరలేదు. కావలసిన రుజువులన్నీ షాజహన్ కాలంలోనే దొరుకుతాయి. అన్నిటికంటే పెద్ద చారిత్రక సాక్ష్యం షాజహన్ చక్రవర్తి తన ఘనతను లోకానికి చాటడానికి స్వీయ పర్య వేక్షణలోనే రాయించిన బాద్ షానామా లోనే దొరుకుతుంది.పాట్నా నుంచి పిలిపించుకొన్న అబ్దుల్ హమీద్ లాహోరి తో తన పరిపాలనా, కాలకృత్యాల దగ్గిరనుంచి శయనమందిరాలవరకు రాయించుకొన్న తన ఆత్మకథ 'బాద్ షానామా' లోనే మనకు కావాల్సిన ఋజువులు దొరుకుతాయి (పైన ఇచ్చిన ఫోటో భారత ప్రభుత్వానికి చెందిన పురాతన పత్ర భాండాగారం లో భద్రపరచిన 'బాద్షానామా' 403 వ పేజీ లోని 28-35 లో వున్నదానికి ప్రొ. పి. ఎన్. ఓక్ ఆంగ్లానువాదం చూడండి.

28. Covered with a majestic magnificent lush garden, to the south of that great city and
29. Amidst which(garden) the building known as the palace(Manzil) of Raja Mansingh, at present owned by Raja Jai Sing
30. Grandson(of Mansingh) was selected for the burial of the Queen whose abode is in heaven
31. Although Raja Jaisingh valued it greatly as his ancestral heritage and property, yet he would have been agreeable to part with it gratis for the Emperor Shahjahan.
32. (Still) out of sheer scrupulousness so essential in matters of bereavement and religious sanctity he(Jai Singh) was granted Sharifabad(in exchange)
… …
35. Next Year that illustrious body of the heavenly queen was laid to rest.

పూర్తి పాఠానికి క్రింద చూడండి !

28. ఆ గొప్ప నగరానికి దక్షిణాన రాచఠీవిగల, రమణీయమైన, ఏపుగా పెరిగిన తోటతో ఆవరించబడి
29. తోట మధ్యలో ఒక భవంతి ఉన్నది. దానిని రాజా మాన్ సింగ్ పాలెస్ (మంజిల్) అంటారు. ప్రస్తుతం దానికి యజమాని రాజా జయసింగ్.
30. (అతడు మాన్ సింగ్) మనవడు. (ఈ భవనాన్ని) స్వర్గస్థురాలైన రాణిని ఖననం చేయడం కోసం ఎంచుకున్నారు.31. వంశపారంపర్యంగా తనకు సంక్రమించిన ఆస్తిని గొప్ప విలువగలదిగా తలచినప్పటికీ రాజా జయసింగ్ దానిని షాజ హాన్ చక్రవర్తికి ఉచితంగా వదిలిపెట్టటానికి సుముఖంగా ఉన్నాడు.
32. (అయినా) వియోగానికి, మతపరమైన పవిత్రతకు సంబంధించిన వ్యవహారాల్లో సూక్ష్మ విషయాల్లోనూ తప్పనిసరిగా చూపాల్సినట్టి నిష్ఠ తో (ప్రతిఫలంగా జయసింగ్ కు) షరీఫాబాద్ మంజూరు చేయబడింది.
… …

35. మరుసటి సంవత్సరం స్వర్గ లోకవాసి అయిన మహారాణి పార్థివ దేహం సమాధి చేయబడింది.

పొనీ మహారాణిని సమాధి చేసింది యీ మహలులోనే అంటే అది కాదు. 14వ బిడ్డను కనే ప్రయత్నంలో పురిటిలోనే ముంతాజ్ బుర్హాన్ పూర్ లో మరణించినపుడు అమెను అ వూళ్లోనే సమాధి చేశారు. ఆగ్రాలో మాన్ సింగ్ పాలెస్ ను ఆక్రమించి సమాధి గృహంగా మార్చాలని షాజహాన్ కు దూ(దు)రాలోచన కలిగాక, ఆరు నెలల తరువాత బుర్కాన్ పూర్ లోని గోరీ తవ్వి శవాన్ని 600 మైళ్ల దూరంలోని ఆగ్రా తీసుకుపోయి సమాధి చేశారు. ఈ సంగతి ఇనాయత్ ఖాన్ రాసిన షాజహాన్ నామా చూస్తే తెలుస్తుంది. (ఇనాయత్ ఖాన్ ఎవరో కాదు. షాజ హాన్ కు సమకాలికుడు. అతడి తండ్రి జహంగీర్ కు వజీరు. షాజహన్ కొలువులో లైబ్రేరియన్ గా ఉండగా, బాద్షానామా ఉద్ర్గంథాన్ని సరళమైన భాషలో సం క్షిప్తం చేసి షాజహాన్ నామా రాశాడు.

షాజహాన్ నామ(ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటి ప్రెస్) ని ఎ.ఆర్.ఫుల్లర్ అనువదించిన ప్రతిలోనివి ఒకసారి అవలోకించండి. 1631 సం. జూన్ 17న మహారాణి మరణించింది. బుర్కాన్ పూర్ లొని జైనాబాద్ తోటలో అమెను తాత్కాలికంగా ఖననం చేశారు. 1631 డిసెంబర్ 11న స్వర్గీయ మహారాణి వారి భౌతిక దేహాన్ని బుర్హాన్ పూర్ నుంచి అక్బరాబాద్ (అగ్రా) కు తరలించారు. అ నగరానికి దక్షిణాన ఆమె సమాధికి ఎత్తుమీద ఉన్న చక్కటి స్థలాన్ని ఎంపిక చేశారు. అది పూర్వం రాజా మాన్సింగ్ ఆస్తి ప్రస్తుతం ఆయన మనవడు రాజా జయసింగుకు చెంది ఉంది. అక్బరాబాద్ కు చేరుకున్న మీదట భౌతికకాయాన్ని 1632 జనవరి 15న భూస్థాపితం చేశారు.

షాజహాన్ కాలంలోనే మనకు దొరికే ఇంకో ఋజువు చూద్దాం. బాబర్ తన జ్ఙాపకాల్లో 'గురువారం నేను ఆగ్రాలో ప్రవేశించి సుల్తాన్ ఇబ్రహీం పాలెస్ లో నివాసం ఏర్పరచుకున్నాను... ఈద్ కు కొన్ని రోజుల తరవాత అక్కడ గుమ్మటం కింద రాతి స్తంభాల శ్రేణిలో రమ్యమైన గ్రాండ్ హాల్ లో గొప్ప విందు చేసుకున్నా' నని . ‘ On Thursday I entered Agra and took up my residence at Sultan Ibrahim’s palace… A few days after the Id we had a great feast in the grand hall , which is adorned with the peristyle of stone pillars, under the dome…’ (Memoirs of Zehir-Ed-Din-Babur, Vol.IIp.192 & 251). రాతి గుమ్మటమూ, రాతి స్తంభాల శ్రేణిగల పాలెస్ ఆగ్రాలో 'తాజ్ మహల్ ' ఒక్కటే. అలాగే- ఆగ్రాలోని గార్డెన్ పాలెస్ లో బాబర్ మరణించాడని విన్సెంట్ స్మిత్ రాశాడు. తాజ్ మహల్ మినహా ఇంకో తోట పాలెస్ ఏదీ ఆగ్రాలో లేదు.


సరే , ఇలాంటి ఋజువులతో కూడా మనం సంతృప్తి చెందకపోతే షాజహాన్ కు స్వయానా కొడుకైన ఔరంగజేబే లిఖితపూర్వకంగా ధ్రువీకరించాడు. దాని ప్రతి పైన చూడండి. 1652 లో రాజకుమారుడు ఔరంగజేబ్ తండ్రికి రాసిన లేఖలో తన తల్లిని సమాధి చేసిన స్థలంలో ఉన్న ఏడంతస్తుల భవనం చాలా పురాతనమైందని, ఎక్కడికక్కడ నీరు లీక్ అవుతున్నదని, ఉత్తరం వైపు ఉన్న గుమ్మటం పగులుబారిందని పేర్కొన్నాడు. ఔరంగజేబ్ రాసిన ఈ ఉత్తరం ప్రస్తావన Aadaab-e-Alamgiri, Yadgarnama, Muruqqa-i-Akbarabadi అనే మూడు పర్షియన్ గ్రంథాల్లో కనిపిస్తుంది .తక్షణం జరగాల్సిన మరమ్మతులను సొంత ఖర్చుతో తాను చేయిస్తున్నానని, విసృత్తమైన మరమ్మతులను వీలువెంబడి చక్రవర్తి చేయించదగునని ఆ ఉత్తరంలో ఔరంగజేబ్ రాశాడు. 1632 లో మొదలుపెట్టి 22 ఏళ్ల కాలం తాజ్ నిర్మాణాలు సాగాయని అనంతరకాలపు చరిత్రకారులు చెప్పేది నిజమైతే ఔరంగజేబ్ ఆ ఉత్తరం రాసేనాటికి అసలు తాజ్ మహల్ నిర్మాణమే ఇంకా పూర్తి అయి ఉండకూడదు కదా? 1652 నాటికే ఆ భవన సముదాయం పాతబడి మరమ్మతులు అవసరమయ్యాయని యువరాజే స్వయంగా చూసి చెప్పగా సరికొత్త తాజ్ మహల్ నిర్మాణం, 1653 నాటికి పూర్తయిందని అన్నీ తెలిసిన భారతప్రభుత్వం వారు తాజ్ మహలు ముందు పెట్టిన నోటీసులో ఎలా చెప్పారు?

ఇప్పుడు చెప్పండి, ఈ ఋజువులు సరిపోతాయా?!!

ఇంకా, మన కళ్లు చూసి నమ్మేవి, శాస్త్రానికి నిలబడేవీ కావాలా?

ఈ విషయం ముందు చూద్దాం!
 
 http://theuntoldhistory.blogspot.in/2007/10/2.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి