18, ఫిబ్రవరి 2012, శనివారం

పాశ్చాత్య దేశాలలో సంచార జాతిగా హింసింపబడ్డ జిప్సీలు భారతీయ సంతతివారా?

యూరపులో, అమెరికాలో సంచారజాతులుగా పేరుపొంది, పాశ్చాత్యులచే తీవ్రంగా హింసింపబడి బాధల గాధలకు లోనయిన జిప్సీలు (స్త్రyజూరఱవర) ఒకప్పుడు భారతదేశం నుండి అక్కడకు వెళ్లిన వారేనన్న భావానికి రోజు రోజుకీ మరింత బలం చేకూరుతోంది. చాలాకాలం అసలు జిప్సీలు ఎక్కడ నుండి వచ్చారన్న దానిపై భిన్నాభి ప్రాయాలు వుండేవి. దేశదిమ్మరులు, సంచారజాతి అయిన జిప్సీలు భిన్నంగా వుండటమే కాదు. వీరి ఆచార వ్యవహారాలు, భాష పాశ్చాత్యులకు భిన్నం. వీరు క్రైస్తవులు కాకపోవడంతో క్రైస్తవమతం వీరిని గూఢచారులుగా అనుమానించి హింసించింది. ''జిప్సీ'' అనే పదం ఈజిప్షియన్‌ భాష నుండి వచ్చింది. హిట్లర్‌ జర్మనీలో అధికారంలోకి వచ్చాక 5లక్షలమంది జిప్సీలను గ్యాస్‌ ఛాంబర్స్‌లో పెట్టి హత్యచేశారు. యూదులలాగానే (jవషర) జిప్సీలను కూడా హిట్లర్‌ దారుణంగా హింసించి చంపేశారు.
గత శతాబ్ధంలోనే జిప్సీల పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశోధన ప్రారంభం అయింది.ుూaఅస శీట ూaఱఅ: ఖీఱఙవ జవఅ్‌బతీఱవర శీట +yజూరy ూశ్రీaఙవతీyు అన్న పుస్తకం +yజూరy ూశ్రీaఙవతీy aఅస జూవతీరవషబ్‌ఱశీఅ అని అమెరికాలో వెలువడింది. కాన్‌రాడ్‌ 1928లో ్‌ష్ట్రవ ర్‌శీతీy శీట +yజూరఱవర అని వెలువరించాడు. గత శతాబ్ధం ఉత్తరార్థంలోనే జిప్సీిలపై పరిశోధన మరింత జరిగి పుస్తకాలు వెలువడ్డాయి.

జిప్సీలు భారతదేశం నుండి అలెగ్జాండరు దండయాత్ర తరువాత యూరప్‌కు తరలిపోయారని , వారే సంచార జాతులని కొందరి అభిప్రాయం. ఈ విధంగా ఈజిప్టు, ఆఫ్రికాలకు కొందరు. మరి కొందరు గ్రీకుకు వెళ్ళారని, వారే నిలవనీడలేక యూరపు అంతా సంచార జాతులుగా విస్తరించారని భావన. ఎక్కడికి వెళ్లినా వీరిపై ఆయా దేశాల వారికి అనుమానమే. 11వ శతాబ్ధంలో విదేశాల మహమ్మదీయులు మనదేశంపై దండెత్తినపుడు వారిని తట్టుకోలేక పంజాబు ప్రాంతములోని మన దేశస్తులు మధ్యప్రాచ్యానికి, ఆఫ్రికాకి, యూరపుకు తరలిపోయారని, కాని వారి రంగు, భాష, వ్యాపార నైపుణ్యం వేరు కావడంతో యూరప్‌లో క్రైస్తవులు, మధ్యప్రాచ్యంలో మహమ్మదీయులు వారిని దేశ దేశాలకూ తరిమివేశారని మరో సిద్ధాంతం.
వీరి మతాచారాలు భిన్నం కావడంతో క్రైస్తవ మతాధికారులు వీరి మీద కత్తికట్టి దేశద్రోహులని, గూఢాచారులని, క్రైస్తవ శత్రువులని ప్రచారం చేశారు. 1479లోనే జర్మనీలో ఎవరైనా జిప్సీని చంపితే అది నేరంకాదన్నారు. చాలాచోట్ల వేటాడి కాల్చి చంపాెేరు. వీరిపై మంత్రతంత్రాలు చేస్తారని, పిల్లల్ని ఎత్తుకుపోతారని, శవాలని తింటారని దుష్ప్రచారం చేశారు. నిలవనీడలేక దేశవిదేశాలలో అల్లాడిన జిప్సీలకు పోలెండులో 18వ శతాబ్దంలో కొంత ఆశ్రయం లభించింది.16వ శతాబ్దంలో జిప్సీలు రష్యాలుఫిన్లండులో ప్రవేశించారు. వారిని బలవంతంగా క్రైస్తవులుగా మార్చారు. భారత సంస్కృతికి సన్నిహితమైన జిప్సీభాష రోమా అంటే మనిషి.

యూరపులో జిప్సీల జనాభా 60 లక్షల రష్యాలో 2లక్షలు, స్కాట్‌లాండ్‌లో లక్ష, బల్గేరియాలో 1లక్ష, ప్రాన్స్‌లో 50వేల మంది జిప్సీలు వుండేవారు. ఇంగ్లండులో 30వేలమంది వున్నారు. సంగీతంలో జిప్సీలు నిష్ణాతులు. 1625లో బిహారీ అనే జిప్సీ ఆస్ట్రియా చక్రవర్తి ముందు తన సంగీత విద్య ప్రదర్శించి సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. కళాకారులుగా. యూరప్‌లో. అమెరికాలో పేరుపొందారు. జిప్సీలు వివిధ వాయిద్యాలలో చేయి తిరిగినవారు. రష్యాలో 1930 నుండి నిఉ చీవఙఱసతీశీఎ(కొత్తమార్గం) అనే జిప్సీ పత్రిక వెలువడేది. మాస్కోలో జిప్సీ కళాకారుల థియేటర్‌ వుండేది. జిప్సీల భాషలో ఎన్నో పదాలు హిందీలో లాగానే వుంటాయి. ఏక్‌, దో, పాంచ్‌, నౌ, దస్‌ హిందీ అంకెలే సోమవారాన్ని ''ప్రధమ్‌ దివస్‌'' మంగళవారాన్ని ద్వితీయ దివస్‌, బుధవారాన్ని తృతీయ దివస్‌ అంటారు. జిప్సీల రోమనీ భాషలో 3వేల పదాలున్నాయి. సంస్కృతమే కాక హిందీ, పంజాబీ, సింధీ, గుజరాతీ పదవేల కూడా కోమనీ లో వున్నాయి. జాతి సారూప్యంలో కూడా వారు మనల్ని పోలివుంటారు. సూరత్‌లో మాట్లాడే గుజరాతీకి, రోమనీకి సాన్నిహిత్యం వుందంటారు.

యూరప్‌లో 2000 సంవత్సరాలుగా వున్నా వారు మన దేశాన్ని వారి స్వదేశంగా భావిస్తారు. జాట్స్‌, సిందీస్‌(సింథీస్‌)జారాబీ (సౌరాష్ట్ర) యిలా జిప్సీ గ్రూపుల పేర్లు. ఈనాటికీ జిప్సీలు యుగోస్లోవియా, బల్గేరియా, ఇంగ్లండు, హంగేరీ, చెకోస్లోవేకియా, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, రష్యా, అమెరిలలో అధికంగా వున్నారు. జిప్సీల కుటుంబ వ్యవస్థ మనదేశాన్ని పోలివుంటుంది. వారిలో దాదాపు విడాకులు లేవు. పంచాయతీల ద్వారా సమస్యలు పరిష్కరించుకొంటారు. జనన మరణాలు, పెళ్లిళ్ళు ,వారి ఆచారాలు మనదేశంలో లాగానే వుంటాయి.

మనదేశానికి స్వాతంత్య్రం వచ్చాక పార్లమెంటు సభ్యులు దివాన్‌ చమన్‌లాల్‌ జిప్సీల గురించి మనదేశంలో వారి సంబంధ బాంధవ్యాల పరిశోధన విస్తృతంగా యూరప్‌, అమెరికా పర్యటించి పరిశోధన చేసి పుస్తకం కూడా వ్రాశారు. ''జిప్సీ'' అని పిలిస్తే వారు బాధపడతారు. తాము ''రోమనీ' అంటే 'మనుష్యులు' అనుకొంటారు. యూరప్‌, ఆమెరికాలో 60లక్షలమందిలో 30లక్షలమంది స్థిరపడి భవనాలలో వుంటున్నారు. తక్కిన సగంమందీ యింకా కారవాన్స్‌ (బళ్ళు)పై తిరుగుతూ, ఎక్కడా స్థిరంగా వుండరు. మనం వారిని భారతీయులుగా అంగీకరించలేకపోయినా, ఏకపక్షంగా తాము భారతీయులమని గర్వంగా చెప్పుకుంటారు. జిప్సీలు తీవ్రమైన బాధల గాధలకు, వివక్షతకు గురిఅయి, ఎంతోమందిని ఆ దేశాలలో హాతమార్చారు. 15వ శతాబ్దం నుండీ జర్మనీ, స్పెయిన్‌, పోర్చుగల్‌, ఇంగ్లండు, డెన్మార్క్‌, ఫ్రాన్సు, స్కాట్‌లాండ్‌,బొహహహ హేమియా, పోలెండ్‌, స్వీడన్‌ వంటి దేశాలలో జిప్సీల రాకకు వ్యతిరేకంగా తీవ్రమైన చట్టాలు వుండేవి. క్రైస్తవమతం, మహమ్మదీయులు, ప్రభుత్వాలు వారికి వ్యతిరేకం అయి హింసించినా, జిప్సీలు బ్రతికి బట్టకట్టి, సజీవంగా వుండడం వారి పట్టుదల, దీక్షకు చిహ్నం. మతాలు సృష్టించిన మారణహోమానికి అ సంఖ్యాకంగా బలి అయిపోయారు. జిప్సీలు స్వేచ్ఛజీవులు. స్వేచ్ఛా విహారమే యిష్టం.
సమాజానికి కొత్త వారు అంటే అనే భయం పరదేశస్తులు అంటే మరీ భయం. జాత్యహంకారం. మతమౌఢ్యం దానికి మరింత దోహదకారి అయింది. సంఘదృష్టిలో మత దురహంకారాన్ని వదిలివేసి భిన్నత్వంలో ఏకత్వాన్ని పాశ్చాత్యులు గుర్తిస్తేనే జిప్సీల సమస్యకు పరిష్కారం సులభసాధ్యం అవుతుంది. అందరు మానవులు సమానం. ప్రేమ,కరుణ, దయ అని మతాలు బోధించినంత మాత్రాన చాలదు. వాటిని ఆచరణలో పెడితేనేే, సమ్మిశ్రిత సంస్కృతిని హర్షిస్తేనే జాత్యహంకారం అంతమొందితేనే శతాబ్దాల వివక్షతకు, దారుణ మారణ హోమానికి గురి అయిన జిప్సీలు సజీవంగా సగౌరవంగా సమానంగా దేశ దేశాలలో మనగలుగుతారు. మతాల అడ్డుగోడలు, సంకుచితత్వాలు కూలిపోతేనే మానవత్వం పరిఢవిల్లుతుంది. వసుధైక కుటుంబం సాక్షాత్కారం అవుతుంది. క్రైస్తవమతం వారిని తీవ్రంగా హింసించింది. నిలవనీడలేకుండా చేసింది. వారు జ్యోతిష్యం చెబుతారని, భూతప్రేతాలను కొలుస్తారని అభాండం వేసింది. వారు అనాగరికులని, దుర్మార్గులని, టార్జానులలాగా నల్లగా ఉంటారని, వారు శవాలను తింటారని ప్రచారం చేసింది.వారికి తంత్ర విద్యలు వచ్చని, బ్లాక్‌ మేజిక్‌ చేస్తారని క్రైస్తవ మతం ప్రజలను హడలుకొట్టింది. జిప్సీలకు దానం చేయడం. వారితో సంబంధ బాంధవ్యాలు పాపమని మతం శాసించింది. యూరప్‌లో వారిని బానిసలుగా చేశారు. అడవులలోకి తరిమి వేశారు. వారి పిల్లలను బలవంతంగా విడదీసి వారి కుటుంబ వ్యవస్థను భగం చేశారు.

జిప్సీలు చేసే వృత్తులు కమ్మరం, కుమ్మరం, నగలు, తయారు చేయడం, చేతి వృత్తులు, నగిషీ, బట్టలు తయారు చేయడం. పాత్రలకు కళాయి పెట్టడం కావడంతో జిప్సీలకు నైపుణ్యం ఎక్కువ వుండటంతో కొన్ని చోట్ల వారు ప్రజలకు సన్నిహితం అయ్యారు. దానితో స్థానిక ట్రేడ్‌ గిల్ట్స్‌లో పనిచేసే పాశ్చాత్యులు వృత్తిలో తమకు పోటీ వస్తున్నారని జిప్సీలను హింసించి తరిమివేశారు. జిప్సీలు లోహాలతో పనిచేయడానికి వీలులేదని, కమ్మరంతో పనిచేయడానికి వీలులేదని నిషేధాలు పెట్టడమే కాక, వారిపై విపరీతంగా పన్నులు వేసేవారు. జిప్సీలకు వచ్చిన చేతి వృత్తులు చేయడానికి వీలులేకపోవడంతో తిండి గడవని కొందరు దొంగలుగా మారారు. జిప్సీలు అందరూ దొంగలేనని క్రైస్తవ మతం ప్రచారం చేసింది. ఎవరైనా జిప్సీలకు తిండిపెడితే వారిని మతం సంఘ బహిష్కరణ చేసింది. ఈ విధంగా పాశ్చాత్యులు జిప్సీలపట్ల అత్యంత అమానుషంగా, అనాగరికంగా ప్రవర్తించారు. యూరప్‌లో, అమెరికాలో ఎన్నో విధి నిషేధాలు విధించారు. జిప్సీలను చంపడం నేరం కాదన్నారు. అది పాశ్చాత్యుల జాత్యహంకారానికి పరాకాష్ట .జిప్సీలు ఇంగ్లండులో 40రోజుల కంటే ఉండడానికి వీలులేదు. జర్మనీలో జిప్సీలకు కాల్చి వాతపెట్టేవారు. ఆ విధంగా గుర్తించవచ్చునని మతం భావించింది.

జిప్సీలను పెళ్ళి చేసుకోవడం, రక్షణ కల్పించడం దారుణమైన నేరంగా పాశ్చాత్య ప్రభుత్వాలు పేర్కొన్నాయి. హిట్లర్‌ హయాంలో జిప్సీలను హింసించిన తీరు అత్యంత హేయమైనది. వారికి పిల్లలు కలగకుండా బలవంతంగా, మోటుగా స్టెరిలైజ్‌ చేశారు. నాజీలు వారిని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నించారు. జిప్సీలకు యూరప్‌లో ఓటు హక్కులేదు. వారికి ఆందోళన చేయడానికి అధికారం లేదు. పత్రికలు, మీడియా జిప్సీలకు వ్యతిరేకం. విజ్ఞానం లభించకపోవడంతో జిప్సీలు నిరక్షరకుక్షులుగా ఉండిపోయారు. క్రైస్తవులుగా మారడానికి వారు ఇష్టపడలేదు. తమ సంస్కృతి, వారసత్వంపట్ల జిప్సీలకు అపార గౌరవం. తమ భాషను, సంస్కృతిని, వేషభాషలను వారు విస్మరించలేదు. యూదులపట్ల వివక్షత చూపితే వారికున్న అర్థబలం. అంగబలంతో గగ్గోలు చేశారు. జిప్సీలు సాత్వికులు, నిరక్షరులు, నిస్సహాయులు అందుకే ప్రపంచానికి వారిపై జరిగిన దారుణ మారణహోమం గురించి తెలియదు. ఇటీవల కాలంలోనే అమెరికాలో చదువుకున్న కొందరు జిప్సీలు తమకు జరిగిన అన్యాయాన్ని, వివరిస్తూ రచనలు చేయడమేకాక యునైటెడ్‌నేషన్స్‌కు వెళ్లి, న్యాయం చేయాలని నివేదించారు. ఇంత జరిగినా, వారి స్వదేశమైన మనదేశంలో అక్కడ జిప్సీలకు జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమం గురించి వెలుగులోకి తెచ్చే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కరువయ్యాయి. వారు మన దాయాదులే అని ప్రజలకు ఇంకా తెలియదు. మీడియా వారి సంగీత నృత్యాలను ప్రసారం చేస్తుంది గాని, వారి బాధల గాథలను మనదేశంలో వివరించదు. ఈ నూతన సహస్రాబ్దిలోనైనా జిప్సీలకు పాశ్చాత్య దేశాలలో స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం లభిస్తాయని ఆశిద్దాం.
- డాక్టర్‌ విజయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి