ఏడుగురు గుడ్డి వాళ్ళ కధ మీకు తెలిసే వుంటుంది. తెలియక పోతే మీకు అమ్మమ్మలు, బామ్మలు మీ ఇంట్లో వుంటే అడగండి.. వాళ్ళు లేక పోతే మీ ఖర్మ.. అలాగే భగవద్గీత కూడా మన మనస్సుని బట్టే, మనం అర్థం చేసుకున్నంత వరకే అర్థం అవుతుంది..
ఒక్కరికి ఒక్కక్క అర్థం స్పురించ వచ్చు..పారే నదిలోంచి ఒకరు దోసిట్లో నీళ్ళు తీసుకోవచ్చు, వేరొకరు చెంబు తో మరొకరు చేద తో, ఇంకొకరు పెద్ద డ్రమ్మునిండా నీళ్ళు నింపు కోవచ్చు..ఎవరి శక్తి వాళ్ళది.. చదవగానే గీతా సారాశం అంతా ఎవరికీ అర్థం కాదు.. ఒకసారి కాదు అనేక సార్లు
చదివినా రోజురోజుకి కొత్త అర్థాలతో గోచరిస్తూ వుంటుంది.
అలాగే కీ.శే.ఘంటసాల గానం చేసిన భగవద్గీత కూడా వింటున్న కొద్ది మరింత సుందరంగా, మనసారా విని లీనం అయ్యే వారికి మధురంగా, అనేక కొత్త అర్థాలతో, రోజు విన్నా సరే ఇవాళే వింటున్నంత కొత్తగా వుంటుంది.. ఆయన మన తెలుగు వారు అవటం, మనకి ఆయన భగవద్గీతను అందించడం తెలుగు వాళ్ళగా మనం గర్వించ తగ్గ విషయం.. నిరాశ, నిస్పృహ కలిగి ఏం చెయ్యాలో తేలిక అయోమయ స్థితిలో వున్నవాళ్లకి మనో ధైర్యాన్ని, జీవితాన్ని అస్తవ్యస్తంగా గడిపే వాళ్లకి, ఎలా నడచుకోవాలో తెలిపే కర్తవ్య బోదని, మనసు, శరీరం నియంత్రణలో ఎలా ఉంచుకోవాలో తెలిపే మనస్తత్వ శాస్త్రం, మనసుని ఏకాగ్రతతో నిలిపి, ఇష్ట దైవం పై ఆరాధన ఎలా పెంచుకోవాలో తెలిపే ధర్మ సాధన, చివరగా మోక్ష సాధన ఇవన్ని గీతా శాస్త్రం లో వున్నాయి..
వాటిని చాలా లోతుగా పరిశిలించాలి.. పరిశోదించాలి, కొన్ని రోజుల పాటు పారాయణం చెయ్యాలి అప్పటికి గాని పాక్షికం గా నైనా అర్థం అవదు..
నాలుగు వేదాలు చదవడానికి అవకాశం లేని మన లాంటి సామాన్యులకు సూక్ష్మంగా భగవంతునికి, భక్తునికి, దైవానికి, మానవుకిని గల సంబంధాన్ని తెలియచేస్తూ, ఉత్తమ మైన మనిషి జన్మ ని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దు కోడానికి ఉపయోగ పడుతుంది.. అది అనేక మేనేజ్ మెంట్ కోర్సుల్లో కూడా వుండి, ఇవాళ అనేక కంపెనీలు ప్రగతి పధం లో పయనించడానికి సాధనం..అనేక నాయకులకి స్పూర్తి.. ఎవరో ఏదో అన్నారని, మన పూర్వికులు మనకి ఇచ్చిన సంస్కారాన్ని, సంస్కృతిని మనం వదిలేయగలమా..ప్రతి మతం లోను మంచి చెడ్డలు వుంటాయి, అది మతం తప్పు కాదు.. ఆచరించే వాళ్ళది.. ఏ మతం కూడా పరాయి మతస్తులని చంపమని, వారి మనోభావాల్ని కించ పరచమని చెప్పలేదు.. అయినా మతం పేరుతో జరుగుతున్నయుద్ధాలు అప్పుడు, ఇప్పుడు. ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి, అది మన దురదృష్టం..
బాన్ చెయ్యండి సార్.. ఒక్క గీత నే కాదు, మంచి చెప్పే శాస్త్రాలన్నీ బాన్ చేద్దాం.. చెడు అలవాట్లని, చెడు పనులని, హింసని ప్రేరే పించే సినిమాలు, సాహిత్యం, చిన్న పిల్లల్ని కూడా విలన్లు గా చూపే సీరియల్ని ప్రోత్స హిద్దాం, చట్టాల కళ్ళు కప్పి నల్ల డబ్బుని కొల్ల గొట్టడం ఎలాగో తెలిసిన పాలకుల్నే ఆదర్శంగా తీసుకుందాం,
http://shankaratnam.blogspot.in/2011_12_01_archive.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి