18, ఫిబ్రవరి 2012, శనివారం

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-5


ఘోరిల దండయాత్ర: వాయువ్య భారతదేశాన్ని, గంగానది దిగువ ప్రాంతాల్ని జయించిన డెల్లీ పీఠ తుర్కలు (1206-1526).

1) ఘోరి పాలకులు, అనగా మొహమద్ ఘోరి మరియు ఆయన సైన్యాధిపతియైన కుతుబూద్దీన్ ఐబక్ (1206-1210) అద్వర్యంలో ఢెల్లీ సుల్తాన్ పీఠం స్థాపింపబడినది. అయితే వీరి పాలనలోకూడా సామూహిక శిరచ్ఛేదనాలు, బానిసలుగా మార్చుకోవడం, బలవంతపు మతమార్పిడులు, దోపిడీలు, అత్యాచారాలు, హిందూ ప్రార్థనా స్థలాల విధ్వంసాలు మాత్రం తగ్గలేదు. ఒక్కొక్క ముస్లింకి లెక్కకుమించి బానిసలుండిరి. ఉదాహరణకు 1195లో రాజా భీం నుండి ఐబక్ 20,000మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు మరియు కళింగర్ దగ్గర 50,000 మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు(1202) (లాల్:536).

"చివరికి పేద ముస్లిం దెగ్గర కూడా అనేకమంది బానిస సేవకులుండిరి (ఖాన్:103; లాల్:537)."


డెల్లీ సుల్తాన్‌పీఠావిర్భావం తరువాత ఢెల్లీ కేంద్రంగా దాడులు, బానిసల్ని చెరపట్టడం పెచ్చురిల్లాయి. హిందూస్థాన్ అంతట సామాన్య ముస్లింలకు కూడా లభ్యమయ్యేలా బానిసవిక్రయ కేంద్రాలు వెలిసాయి. ఈ బానిసలు వారికి ఒక వస్తువుతో సమానం. వీరిని ఎటుబడితే అటు తీసుకువెళ్లెవారు. కాలిఫ్(ముస్లిం మత ప్రథాన ఏలిక)కు ఐదవవంతు దోపిడిసొమ్ము మరియు బానిసలను పంపే సాంప్రదాయం ఆగిపోయింది. అయితే అప్పుడప్పుడు గౌరవసూచకంగా లేక బహుమానాలగా బానిసల్ని కాలిఫ్‌లకు, ధనిక ముస్లింలకు, ఇంకా చైనాకు కూడా పంపేవారు.


ముస్లిం సైన్యాలు విధ్వంసంచేసిన హోసలేశ్వర
దేవాలయంలో చేతులు తెగిపోయిన ఒక విగ్రహం

2) సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్ (క్రీ.శ.1236) ఇతడు కూడా భారతీయుల్ని బానిసలుగా చేసుకోవడం వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం చేసేవాడు. బానిసలపై ప్రభువుగా నియమింపబడిన ఉలగ్ ఖాన్ బల్బాన్ (1250లు-60లలో) లెక్కింపలేనంతమందిని బంధించాడు అని ఒక చరిత్రకారుడు వ్రాసాడు:
"ఆ అంధవిశ్వాసుల (హిందువుల) భార్యలు, పిల్లలు, ఆస్తులు వారిని జయించిన ముస్లిం సైనికుల     వశమయ్యాయి (లాల్:538)."

కతెహార్ అనే ప్రాంతంలో, 8 సంవత్సరాల వయసును మించిన మగవారినందరిని చంపేసి స్త్రీలను, పిల్లలను చెరపట్టమని బల్బాన్ తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు (లాల్:539).

హిందుస్థాన్లోని అనేక పల్లెలు, పట్టణాలపై సుల్తాన్ సైన్యం దాడులు జరిపి మందలు మందలుగా బానిసల్ని చెరపట్టుకుపోయారు. తప్పించుకొన్న హిందువులు కాలి బూడిదైన వారి గ్రామాలకు తిరిగి వచ్చేవారు. సుల్తాన్ సై
న్యం బంధించినవారు మాత్రం ఎన్నటికీ తిరిగిరాలేదు (లాల్:539).

3) ఖిల్జిల (1290-1320) మరియు తుగ్లగ్‌ల (1320-1413) పాలన

13, 14వ శతాబ్దాల ఖిల్జీలు మరియు తుగ్లగ్‌ల పాలనలో బానిసత్వం పెరిగింది, అలాగే ఇస్లాం కూడా వ్యాప్తిచెందింది. ప్రతిరోజు వేలమంది బానిసల్ని ఎంతో చౌకగా అమ్ముతుండేవారు (ఖాన్:258). అల్లావుద్దిన్ ఖిల్జి (1296-1316) విస్తారమైన బానిసల్ని చెరపట్టి, వారిని గొలుసులతో బంధించి, చిత్రహింసలు పెడుతూ ఘోరంగా అవమానించేవాడు. కేవలం ఒక్క సోమ్నాథ్‌పై దాడిలోనే, "20,000 మంది అందమైన స్త్రీలను, లెక్కింపలేనంతమంది పిల్లలను మహ్మదీయ సైన్యం చెరపట్టించి. వారి నివాసాల్ని, పట్టణాలని నేలమట్టంచేసి వారికి కలిగినదంతయు దోచుకొన్నారు. (బోస్టం: 641; లాల్:540)."

కొన్నివేలమంది వధింపబడ్డారు. అల్లవుద్దిన్ ఖిల్జి తన స్వంత సేవకే 50,000 మంది స్త్రీలను, పిల్లలను, అందమైన పురుషులను వినియోగించుకొనేవాడు. తన మందిరాల్లో మొత్తం 70,000 మంది బానిసలు నిత్యం పనిచేసేవారు. (లాల్:541).

ఆడవారు "జౌహార్" లేక "సతి" గావించేవారు. అంటే  ముస్లింలనుండి బానిసత్వం మరియు మానభంగాల్ని తప్పించుకోడానికి  నిప్పంటిచుకొని లేక మరోవిధంగా ఆత్మహత్య చేసుకొనేవారు. (తరువాత కాలంలో కొందరు స్వార్థ హిందూ ఛాందసవాదుల మూలంగా ఈ "సతి" భర్త చనిపోయిన స్త్రీలకు జరిగించుట ఆచారమైంది).

"తుర్కలు వారికి కావల్సినప్పుడెల్ల హిందువులను బంధించి, వారిష్టమొచ్చినట్లు చేసి, బానిసలుగా అమ్మేవారు" అని సూఫియుడైన అమీర్ ఖుస్రూ వ్రాసారు.   

13, 14వ శతాబ్దాలను గురించి ఒక హిందు చరిత్రకారుడు ఇలా వ్రాసాడు: " ఎక్కడచూసిన బానిసవిక్రయ కేంద్రాలు ఉండేవి. అవెప్పుడూ హిందూబానిసలతో నింది ఉండేవి. ముస్లిం సైన్యాలు జరిపిన అనేక దాడుల్లో లక్షలమంది హిందువులు మృతిచెందారు. ఘోరి మాలిక్ అనే ముస్లిం ఆక్రమనదారునికి హిందువుల్ని నిర్దాక్షిణ్యంగా హతమార్చి, బ్రాహ్మణులను వారి గోవులను సమ్హరించి వారిని భయభ్రాంతులకు గురిచేయమని సందేశం పంపబడినది. దానిని నెరవేరుస్తూ ఈ తుర్కలు విధ్వంసం చేస్తూ, విచ్చలవిడిగా దోచుకొంటు, స్త్రీలను పిల్లలను చెరుస్తూ హత్యాకాండ గావించారు (లాల్: 634)."   

మొహమ్మద్ తుగ్లగ్ (1325-1351) అల్లావుద్దీన్ ఖిల్జీని తలదన్నేలా అనేకమంది హిందువులని బానిసలుగా చెరపట్టాడు.
"సుల్తాన్ విగ్రహారాధికులైన హిందువులను సంహరించుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఈయన హయాంలో, ఎందరో హిందువులు బానిసలుగా చెరపట్టబడటం వలన బానిసల్ని అత్యంత చౌకగా కొనుగోలు చేసేవారు" అని ఒక చరిత్రకారుడు వివరించారు.   

సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లగ్ (1351-1388) ఈయన దెగ్గర 1,80,000 మంది అందమైన దృడమైన యువకులు బానిసలుగా ఉండిరి. 40,000ని అంగరక్షకులుగా కలిగి యుండెను. సుల్తాన్, తన సామంతుల్ని, అధికారుల్ని- యుద్ధాలు చేసినప్పుదెల్లా శ్రేష్ఠమైన బానిసల్ని తనకు పంపమని" ఆదేశించాడు (సూక్ధెయో: 165-167; లాల్:542).

ఈయన హయాంలో భారతదేశం వెలుపల కూడా అనేక బానిసవిక్రయ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. కాందహార్, గజిని, ఖురాసన్, సామర్ఖండ్ మొదలగు పట్టణాలకి సుదూరప్రాంతాలనుండి వర్తకులు, వ్యాపారులు భారతీయ బానిసలని కొనుగోలు చేయడానికి వచ్చేవారు. హిందువుల మధ్య నివసించే భారతీయ ముస్లింలు హిందువులను నొప్పించకుండా ఇతర (ఐరోపా, ఆఫ్రికా మొదలగు) జాతుల బానిసల్ని కొని తెచ్చుకొనేవారు. ఎందుకంటే చెట్టాలు ముస్లింలకు అనుకూలంగా ఉండటం వలన హిందు ఇరుగుపొరుగువారితో వ్యాపారలాలాదేవీలు ముస్లింలకు లాభదాయకంగా ఉండేవి కాబట్టి హిందు బానిసలను కలిగి ఉంటే వ్యాపారం సరిగా సాగదని వారు ఇతరజాతులను బానిసలుగా కలిగి ఉండేవారు(ఖాన్:318).   


 http://carpenters-son.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి