16, ఫిబ్రవరి 2012, గురువారం

భారత రాజకీయ రంగం పై సుదీర్ఘ కుట్ర : పాత బస్తీ మరో పాకిస్తాన్?

source : http://ammaodi.blogspot.in/2009/02/14.html

గూఢచార బలం తోడైతేనే సాంకేతిక పరిఙ్ఞానమైనా, కళాకారుడైన, క్రీడా కారుడైనా, రాజకీయ నాయకుడైనా శోభించ గలిగేది.

అలాంటి చోట......

అసలు సాంకేతిక పరిఙ్ఞానమే వ్యూహాత్మకంగా ప్రయోగింపబడితే……? వివరంగా చెబుతాను. కుట్రదారులు సాంకేతిక ఙ్ఞానాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకొని, తమ పట్టు బాగా పెంచుకున్నాక, ఇంకా Advanced Technology వచ్చాక, మునపటి Technology ని బయటకి వదలుతారు.

ఉదాహరణకి …….. అంతర్జాలపు పరిఙ్ఞానం ఈ మధ్య ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఇదే ప్రపంచాన్ని శాసించగలుగుతున్న గూఢచార వ్యవస్థలకి ముందే అంటే కొన్ని దశాబ్దాలకు ముందే తెలుసనుకొండి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎందరో వ్యక్తుల జీవితపు చిట్టా పద్దులన్నీ వారికి క్లిక్క్ దూరంలో ఉండడం సాధ్యమే గదా! అప్పుడు వ్యక్తి మీద వ్యవస్థ పనిచేయటం, తమకి అనుకూలంగా వాడుకోగలగటం, అనుకూలుడు గాకుండా తిరగబడే రకం అయితే [ఇంతకుముందు టపాలో చెప్పినట్లుగా శ్రీశ్రీనో, టి.కృష్ణ లో లేక ఆదుర్తి సుబ్బారావులో వగైరాల్లాగా అన్నమాట.] అణగ తొక్కగలగటం అసాధ్యమా?

అలాంటి స్థితిలో కుట్రల గురించిన అవగాహన విషయంలో ప్రజలు కాలినడక తప్ప మరో ప్రయాణ సాధనం తెలీని స్థితిలోనూ, కుట్రదారులు విమానంలో ప్రయాణించగలిగినంత అడ్వాన్స్ స్థితిలోనూ ఉన్నట్లే గదా!

ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

ఒకప్పుడు రాజులూ, పాలెగాళ్ళు కుట్రదారుల మద్దతు దారులు. [ఉదాహరణ నిజాంలూ, సింధియాలూ, విజయ నగర పూసపాటి రాజులు వగైరా. వీరి గురించి విపులంగా Coups On World లోని Coups On Politics….. లో చర్చించాను. తెలుగులోకి అనువదిస్తాను.] బ్రిటన్ లోని లాండ్ లార్డులు [భ్యూస్వాములు] కూడా మనదేశంలోని రాజులూ, పాలెగాళ్ళు వంటివారే! ఇప్పుడు ఆస్థానంలోకి కార్పోరేట్ కంపెనీలు, రాజకీయ నాయకులు వచ్చారు. అయితే ఈ రాజకీయ నాయకులలో కూడా చాలా మంది మాజీ రాజవంశీయులు ఉన్నారు. కార్పోరేట్ కంపెనీల వ్యవహారం కూడా ఇలాంటిదే. వీళ్ళంతా కూడా కుట్రకు మద్దతుదారులే. ఎందుకంటే ఇలాంటివి చేస్తేనే వ్యాపారం పేరుతో శ్రమ దోపిడీ చేయచ్చు, క్రేజ్ లు, ఒరవళ్ళు సృష్టించి జనాల్ని పరుగులు పెట్టించవచ్చు. అప్పుడు మరింత ఇబ్బడి ముబ్బడి వ్యాపారం, మరింత డబ్బు. అప్పుడైతేనే గదా వందల కోట్లతో విమానాలు, ఓడలూ కొని భార్యలకి కానుకగా ఇవ్వవచ్చు, వేల కోట్లతో విలాస భవనాలు కట్టచ్చు, ఒక్కరోజు గడిపితే లక్షల రూపాయలు ఖర్చయ్యే క్వీన్ విక్టోరియాల్లో విహరించవచ్చు. మళ్ళీ ఇలాంటి వాటిద్వార జనంలో క్రేజ్ లు సృష్టించి డబ్బు పట్ల పరుగులు పెట్టించవచ్చు. ఇది ఒక పద్మవ్యూహం. ఇక ఈ ’బావుకోవటం’ కి అంతెక్కడ?

ఇక ఈ కార్పోరేట్ కంపెనీలే ప్రభుత్వాలని, ప్రభుత్వ అధికారులని శాసిస్తున్నాయన్న సత్యం ఈరోజు అందరికీ తెలిసిందే. అందుకు NDA, UPA, డెమోక్రాట్ లేదా రిపబ్లికన్ అన్న పార్టీల తేడా లేదు, వాజ్ పేయి, అద్వానీ, సోనియా, మన్మోహన్ సింగ్, జార్జ్ బుష్ లేదా ఒబామా అన్న తేడా లేదు.

ఇదే సమయంలో శాస్త్ర పరిశోధన రంగం కూడా ఈ కార్బోరేట్ రంగం చేతిలోనే ఉంది. ప్రతీ కంపెనీ [మందుల కంపెనీలతో సహా] రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెక్షన్ ని నిర్వహిస్తాయి. తమ ఉత్పత్తుల నాణ్యతనీ, వినియోగాన్ని పెంచేందుకు, అభివృద్ధి చేసుకొనేందుకు ఈ పరిశోధనలు చేస్తాయి. అయితే పరిశోధనల ఫలితాలు ప్రజలకు ముందుగా చేరవేయబడవు. తమ అధిపతులైన కుట్రదారులకీ ముందుగా అందజేయబడతాయి. లేకపోతే ఆయా కంపెనీల షేర్లు మార్కెట్లో కుదేలైపోతాయి. మర్నాడు కంపెనీలు దివాళా తీస్తాయి. అదీ కుట్రదారుల గ్రిప్. కుట్రదారులూ, కార్పోరేట్ కంపెనీలు రెండూ కూడా పరస్పర ఆశ్రితాలు, తోడు దొంగలు. ఇంకా చెప్పాలంటే పరస్పరం సహకరించుకొనే భాగస్వాములు. ఈ విషయమైన విపులమైన చర్చ, దృష్టాంతాలతో సహా Coups On World లోని Coup On Business & Commercial field లో చేశాను. తెలుగులోకి తర్వాత అనువదిస్తాను.

కనుక మనం పరిశీలించాల్సింది ఏమిటంటే మన మీద జరుగుతున్న కుట్ర గురించి మనకి కేవలం అక్షరమాల మాత్రమే తెలుసు. కానీ మనమీద కుట్ర చేస్తున్న వారికి మాత్రం, వారికి గల సుదీర్ఘ అనుభవం రీత్యానూ, Well Established Net work రీత్యానూ, Advanced Technology ని ముందుగా అందుకోగల సావకాశం రీత్యానూ, ప్రచార సాధానాలైన మీడియా మొత్తం, పైకారణం [Over leaf Reason ] గా అంటే పైముసుగుగా వేసుకున్న రీత్యానూ, అక్షరమాలని దాటి వాక్యాలూ, మహా కావ్యాలూ తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఓనమాల దగ్గరుంటే వాళ్ళు Ph.D. దగ్గరున్నారు.

అయినా ఒకసారి దృష్టి పెడితే మనం ఓనమాలు దగ్గర నుండీ ప్రారంభించినా, కుట్రని Ph.D. దాకా అర్ధం చేసుకోగలమన్న విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనకి ’బుర్ర’ ఉంది అని నేను నమ్ముతాను.

ఎన్ని మబ్బులు పట్టినా సూర్యుడు రాగానే చీకటి పటాపంచలై పోయినట్లు, ఎంతగా కుట్రదారులు మీడియా మాయాజాలంతో మన మీద ఎన్ని ప్రచారాలు గుమ్మరించి నమ్మించినా, ఒకసారి విషయం అర్ధమైతే ఆ ఙ్ఞానం మనల్ని, ఆ చీకటి కుట్రని నిర్వీర్యం చేసేట్లు నడిపిస్తుందని నా నమ్మకం. ఖచ్చింతంగా చెప్పాలంటే ఇది నమ్మకం కాదు, నిజం!

ఏది ఏమైనా రామదాసుని చెరలో పెట్టి చిత్రహింసలు పెట్టిన తానీషాలోనే కాదు, ఆ తర్వాత గోల్కొండనేలిన నిజాం నవాబుల్లోనూ క్రౌర్యం చాలా ఎక్కువే. స్వాతంత్ర సమర రోజుల్లో, ’భారత్ లో కలిసిపోవాలనీ, స్వాతంత్రం కావాలనీ’ కోరుకున్నారన్న కక్షతో విజయదశమి పండుగ నాడు చేసే బతుకమ్మ ఆటని హిందూ స్త్రీల చేత నగ్నంగా చేయించిన ధూర్తుడు గోల్కొండ నిజాం. ఇక అతడి సైన్యాధికారి ’రజ్వీ’, అతడి అనుచరులు రజాకర్లు తెలంగాణాలో చేసిన అకృత్యాలకు అంతులేదు. స్త్రీలపై అత్యాచారాలు, బహిరంగంగా స్త్రీలను హింసించటం, బహిరంగంగా మానభంగాలు, ఆస్థులు తగలబెట్టటం బలహీనుల హత్యలూ….. ఒకటా రెండా.’

ఇలాంటి ’నిజాం’లనీ వారి పాలననీ తెరాస అధినేత కే.సీ.ఆర్. ప్రశంసించాడు. [పాకిస్తాన్ వెళ్ళి అద్వానీ ’జిన్నా’ని ప్రశంసించినట్లు!]. మరో చేదు నిజం ఏమిటంటే ఈ ఖాసీం ’రజ్వీ’కి అధికారిక వారసుడు, MIM పార్టీనేత సలాఉద్దీన్ ఒవైసీ. ఈ మధ్యే పోయాడు లెండి. ఇప్పుడాయన కొడుకులు ఏలుతున్నారు. MIM అధినేత ఒవైసీ ఖాసీం రజ్వీకి అధికారిక రాజకీయ వారసుడు [అధికారికంగా పగ్గాలు స్వీకరించాడని సాక్షాత్తు ఈనాడులోనే ఏకవాక్య వార్త గా వ్రాయగా చదివాను] అన్నవిషయం జీర్ణం అవుతుందా? ఎప్పుడూ మీడియా ఈ విషయాన్ని ప్రస్తావించదు. మీదు మిక్కిలి MIM కి పాతబస్తీలోనూ, హైదరాబాద్ లోనూ ఎంత పట్టుందో మాత్రం చిలువలూ పలవలూ చేసి వ్రాస్తుంది.

అందుకే పాతబస్తీ మరో పాకిస్తాన్ లా ఉంటుంది. అందులోకి MIM అనుమతి లేకుండా ట్రాన్స్ కో వాళ్ళు కరెంటు మీటర్ల తనిఖీకి వెళ్ళలేరు, అధవా వెళ్ళినా, మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిలా, తర్వాత అలా వెళ్ళినందుకు MIM కు క్షమాపణలు చెబుతారు. [ఈ వార్త పూర్తి వివరాలు, ఈనాడులో 10/02/08 న ప్రచురించబడ్డాయి.] ఇంతచేసి అక్కడ MIM బలం చెప్పటానికి మాత్రమే వార్తలు వ్రాయబడ్డాయి కాని, మనం పాకిస్తాన్ లో ఉన్నామా, లేక ఇండియాలో ఉన్నామా అని గాని, MIM దుశ్చర్యలు గురించి గాని, ఎవ్వరూ [ముఖ్యంగా ఈనాడు] అసలు దానిమీద ఈగ వాల నివ్వదు. మాట్లాడితే ప్రజస్వామ్యవిలువలు గురించి మాట్లాడే ఈనాడు ఇక్కడ ఎందుకు మౌనం వహిస్తుంది? అదే తనకి నచ్చని వాళ్ళ మీద పుంఖాను పుంఖాను వ్యాసాలు విరగరాస్తుంది. MIM గురించి వ్రాయటానికి పాపం ఎందుకు చేతులు రావటం లేదు? ఎక్కడ బాంబు పేలుళ్ళు జరిగిన హైదరాబాద్ లేదా ముఖ్యంగా పాతబస్తీలో మూలాలు దొరుకుతాయి. నిన్న ముంబై టెర్రరిస్టుల శవాల దగ్గర దొరికిన కాలేజీ ఫోటో ఐడెండిటీ కార్డులు హైదరాబాద్ కాలేజ్ వే అవ్వటం గమనార్హం.పాకిస్తాన్ టెర్రరిస్టులకు పాతబస్తీ కీ లింకులు ఎలా సాధ్యం? ఇక్కడ ఒకవిషయం ఏమిటంటే హైదరాబాద్ నిజాం పాకిస్తాన్ కే పారిపోయాడు. ఇక్కడ తెలియటం లేదా హైదరాబాద్ నిజాంలకు, పాకిస్తాన్ కి మధ్య లింకులు?

ఇంత నీచమైన రాజకీయాలని భరించగలుగుతున్న మన సహనానికి జేజేలు చెప్పుకోవాలి. పైగా సదరు కే.సీ.ఆర్. నాలుక భయంకరమైన డ్రైనేజ్ కంపు గొడుతుంది. ఆయనకి కనీస సంస్కారంతో గానీ, నీతి నియమాలతో గానీ నిమిత్తం లేదు. ఈతడి మాజీ భాగస్వామి టైగర్ [ఆలె] నరేంద్ర, నకిలీ పాస్ పోర్టుల కేసులో పట్టుబడ్డ నేపధ్యంలో తనని తెరాస పార్టీ నుండి సస్పెండ్ చేశాక “కేసీఆర్ విలనీని సాక్ష్యాధారాలతో సహా సరైన సమయంలో బయటపెడతానని” అప్పట్లో ఘీంకరించాడు. [పాపం, ఇప్పుడాయన పక్షపాతంతో బాధపడుతూ హాస్పటల్ లో ఉన్నాడు.] మనకి కనబడుతూ కేసీఆర్, నరేంద్ర ఇద్దరూ తోడు దొంగలే. లేకపోతే నరేంద్ర, కేసీఆర్ అవినీతినో, ’విలనీ’నో బయటపెట్టాటానికి తగిన సమయం కోసం వేచి చూడటం ఎందుకు? రాజకీయ నాయకులుగా తమకు, ఇతరులెవరైనా disputes చేస్తున్నారని తెలిసినప్పుడే వెంటనే బయట పెట్టడం తమ బాధ్యత కాదా? [అలాంటి బాధ్యత లేవీ వీళ్ళకి లేవు. ఉంటాయను కోవటం మన అమాయకత్వమే అన్నది వాస్తవం.] ఎందుకు తగిన సమయంలో బయటపెడతానంటూ [ప్రకటించి] ఎదురు చూడటం? ఏది తగిన సమయం? [అసలు అలాంటి సమయం చాలాసార్లు రాదులెండి.] బయటపెడతానన్న ప్రకటనలతో తమ మాజీ తోడు దొంగలనీ, ఇతరులనీ ఇలా బెదిరిస్తుంటారు కాబోలు! అలా తమతో బేరసారాలు నడుపుకొని వ్యవహారం ’సెటిల్’ చేసుకొమ్మని సంకేతమా అది? అల తమ వాటాలుగా డబ్బూ, కెరియర్ పొందుతూ ఉంటారా? లేకపోతే ఎంత ’సమయం’ గడిచినా ఎప్పటికీ ఆ disputes ఏవో బయట పెట్టరేం? ‘రామోజీ రావు’నీ వారం రోజుల్లో దేశద్రోహిగా నిలబెడతానని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించి ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాల పైనే అయ్యింది. ఇప్పటికీ ప్రకటించలేదు. మరి ఎందుకనో? ఇలా ఒక నరేంద్ర, కేసీఆర్ లే కాదు. అన్నిపార్టీల్లో వందలూ, వేలూ నరేంద్రలూ, కేసీఆర్ లూ ఉన్నారు. చేగొండి హరి రామజోగయ్యలూ, అమర్ సింగ్ లూ, యం.ఎస్. సత్యనారాయణలూ, ఇలా లెక్కించలేనంత మంది అన్నిపార్టీల్లోనూ ఉన్నారు.

ఏ విధంగా చూసినా ఈ రాజకీయ నాయకులంతా విడివిడిగానో, జాయింట్ గానో [వారి వాదనలూ, ఆరోపణల ప్రకారమైనా] disputes చేశారు, డబ్బులు తిన్నారు అన్నది నిర్వివాదాంశం. ఈ రాజకీయ అవినీతిని ఎన్నోమార్లు మనం చూశాం, తెహల్కా డాట్ కామ్ వగైరాల్లాగా. జయ జైట్లీ, బంగారు లక్ష్మణలు తాత్కాలికంగా ’కెరీర్’ పోగోట్టుకున్నారు, జార్జ్ ఫెర్నాండేజ్ లు కొంత ’ఇమేజ్’ పోగొట్టుకున్నారు, అంతే! అంతకంటే ఏం జరగలేదు. అయితే తెహల్కా డాట్ కామ్ లోని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మాధ్యుస్ లాంటివారు మాత్రం నానా ఇబ్బందులూ ఎదుర్కొన్నారు. పైన ’స్టింగ్ ఆపరేషన్’ న్యాయమా అన్యాయమా, చట్టబద్దమా చట్టవ్యతిరేకమా అంటూ ఎడతెరిపి లేని హైజాక్ అంశం లేవనెత్తబడింది.

అన్నిరాజకీయ పార్టీలూ, నాయకులూ, కొందరు ఉన్నతాధికారులూ, మరికొన్ని సంస్థలు గొంతెత్తి అరిచారు - ‘స్టింగ్ ఆపరేషన్స్’ మీద. అది స్టింగ్ ఆపరేషన్ గాకపోతే గాడిదగుడ్డు ఆపరేషన్, పేరేదైతే నేం? జరుగుతున్న మోసాల్ని, కుట్రల్ని వెలికి తీయడానికి చేయబడ్డ ఆపరేషన్! ఆ అపరేషన్ వెలికి తీసిన ‘మోసం, లేదా కుట్ర లేదా అవినీతి’ కన్నా ముఖ్యమైన విషయమా ఆ అపరేషన్ యొక్క legality లేదా illegality ? ఇలాంటి పారాడాక్స్, ద్వంద్వం, వివాదం లేవనెత్తడం ద్వారా రాజకీయనాయకులే కాదు, మీడియా మొత్తం ప్రజల దృష్టిని జరిగిన ‘కుట్ర లేదా మోసం లేదా Dispute’ నుండి దృష్టిమళ్ళించడం కాదా చేస్తోంది? లేనట్లయితే Disputes ముఖ్యమా, దాన్ని వెలికి తీసిన పద్దతి ముఖ్యమా అని మీడియా ప్రశ్నించి ఉండాల్సింది కదా? ఇలాంటివి కావాలని రేపడం, విషయాన్ని ప్రక్కదారి పట్టించి, ప్రజలకి నిజం తెలియకుండా చేయటంలో మీడియాదే ప్రముఖపాత్ర. అదే ఆనాడు భోఫర్స్ కుంభకోణంలో అయితే ఎడతెరిపి లేకుండా రాజీవ్ గాంధీని, అప్పటి కాంగ్రెస్ నీ ఉతికి ఆరేసారు. ఇది – కుట్రలో మరో ప్రధాన పార్శ్వం.


అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .
************ 


1 కామెంట్‌: