18, ఫిబ్రవరి 2012, శనివారం

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-3


బానిసత్వం:ఇప్పటి పాకిస్తాన్ (సింధ్), బంగ్లాదేశ్, మరియు కాష్మీర్లలో కొన్ని ప్రాంతాలు పూర్వం ఇండియాలో అంతర్భాగంగా ఉండేవి. ఇస్లాం దండెత్తకమునుపు (7వ శతాబ్దానికి మునుపు) ఆఫ్గనిస్తాన్లో బౌద్ధమతం మరియు హిందుత్వం ఉండేవి. 16వ శతాబ్దంలో ఆఫ్గనిస్తాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ సామ్రాజ్యం మరియు పర్షియా యొక్క సఫావిద్ సామ్రాజ్యం పంచుకొన్నారు.

మతఛాందసవాదులు కానటువంటి ఉమయద్ రాజులు హిందువులకు "దిమ్మీ" హోదా కలిపించారు. "దిమ్మీ" హోదా మాములుగా యూదలకి మరియు క్రైస్తవులకై కలిపించాలని ఖురాన్ సూచిస్తుంది. "దిమ్మీ" హోదా అనగా, ముస్లిం ఏలుబడిలో ఉన్న అన్య మతస్తులు (ఖురాన్ ప్రకారం కేవలం యూదులు, క్రైస్తవులు) వారి వారి మతాలలోనే కొనసాగొచ్చు కాని షరియా చట్టంలో ద్వితియశ్రేణి పౌరులుగా ఉంటారు. అంటే తోటి ముస్లింలకంటే అధిక శిస్తులు చెల్లించాలి, ఇంకా అనేక కట్టుబాట్లు ఉంటాయి. దిమ్మీలను సమాజంలో అధములుగా ఉంచుతారు. అయితే విగ్రహారాధికులైన హిందువులను ఖురాన్లో సూచించిన ప్రకారం హతమార్చాలి లేక ఇస్లాం స్వీకరించేటట్లు చేయాలి. అంటే ముస్లింల పాలనలో హిందువుల స్థితి యూదులు, క్రైస్తవలుకంటే ఇంకా దయనీయమైనది- వారికి రెండే మార్గాలు: చావాలి లేక ఇస్లాంలోకి మారాలి. ఉమయద్ లు ఖురాన్ కు వ్యతిరేకంగా హిందువులకు "దిమ్మీ" హోదా ఇవ్వడంలో వారి స్వార్థం ఎంతో ఉంది- ఒకటి, హిందువుల సంఖ్య చాలా విస్తారంగా ఉంది కాబట్టి షరియా ప్రకారం వీరికి దిమ్మి హోదా ఇస్తే అధిక శిస్తులు వసులుచేసి ఎంతో ధనం సమకూర్చుకోవచ్చు. రెండు, మతమార్పిడులు, సంహారాలు చేయకపోవడం వలన హిందువుల దృష్టిలో ఇతర ముస్లిం పాలకులకంటె మంచివారిగా పేరు సంపాదించుకోవచ్చు. అయితే కొందరు ముస్లిం పెద్దలు, హిందువులను ఎందుకు సంహరించడం లేక మతం మార్చుకొనేట్లు చేయడంలేదని హుమయూన్ రాజును (సం. 1236) అడుగగా, అతడిట్లన్నాడు:
"హిందువులకు దిమ్మీ హోదా ఎందుకిచ్చామంటే ప్రస్తుతం ఈ దేశంలో ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ఇంకొన్నేండ్లలలో పట్టాణాల్లో, పల్లెల్లో ముస్లిం జనాభా బాగా పెరిగిన తరువాత హిందువులను చావు లేక ఇస్లాంలోకి మారడం మధ్య ఎదోఒకటి ఎన్నుకోమని శాసించవచ్చు" అని నచ్చజెప్పాడు (లాల్: 538వ పుట).   


పేరుకి దిమ్మీ హోదా పొందినప్పటికీ హిందువుల మీద దాడులు, హత్యాకాండలు, మతమార్పిడులు, బానిస  వ్యాపారం వంటివి చురుగ్గా సాగుతూనే ఉందేవి. తిరగబడ్డవారిని నిర్దాక్షిణ్యంగా చంపడం, అందమైన బాలురలను నపుంసకులనుగా చేసి బానిసలుగా చేసుకోవడం మరియు కామవాంఛలు తీర్చుకోవడానికి వారిని వాడుకోవడం సర్వసాదారణమైపోయింది. ఈ విథంగా హింసింపబడ్డవారు మరియు చంపబడ్డవారు ఎంతమందో వాస్తవ సంఖ్య తెలియనప్పటికి ఊహింపలేనటువంటి స్థాయిలో అత్యదికులు ముస్లిముల బారిన పడ్డారని వారి చరిత్రకారుల రాతలనుబట్టి తెలుసుకోవచ్చు. హిందువుల ఆత్మగౌరవానికి, మానప్రాణాలకు కలిగే ముప్పుగాక వారి ఆస్తిపాస్తులు, నగనట్ర అన్నీ ముస్లింలు దోచుకొనేవారు. 

ముస్లిం పాలకులు స్థానికులు కాదు, మధ్యప్రాచ్యం నుండి దండెత్తివచ్చినవారు, కాబట్టి 13వ శతాబ్దంవరకు వారు బానిసల్ని భారతదేశంనుండి మధ్యప్రాచ్యానికి తరలిస్తూ ఉండేవారు. అయితే 1206 సం. లో ఢిల్లీ సుల్తానైట్ (సుల్తానుల పాలనకేద్రం-ఢిల్లీ. పరిపాలన ఢిల్లీ నుండి సాగేది కాబట్టి పరిపాలనాయంత్రాగం, వారి పరివారాలు ఇక్కడే నివసించుటకు వచ్చారు) స్థాపించాక భారతీయ బానిసల ఎగుమతి కొంచెం తగ్గింది. ఎందుకంటే ఢిల్లిలో వారి సేవలు అవసమైయ్యాయి. అయినప్పటికీ అవసరాలనుబట్టి బానిసల్ని వివిధప్రాంతాలకి తరలించేవారు. అంతేగాక ఇతరప్రాంతాల (యూరోప్, ఆఫ్రికా) బానిసల గుంపుల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఈ విధంగా ముస్లిం సైనిక బలగాలు ముస్లిములుగా మార్చబడ్డ వివిధజాతుల ప్రజలతో, హిందువులతో, మతమార్పిడిచెందిన భారతీయ ముస్లింలతో వైవిధ్యంగా ఉండేది. ఖురాన్ ప్రకారం బానిసలు అల్లాచే వాగ్దానంచేయబడిన దోపిడిసొమ్ము, కాబట్టి ఎక్కువ బానిసలను సంపాదించుకోవడం అనేది జీహాద్ జరిగించుటకు ఒక ప్రథాన కారణమయ్యేది.


"బానిసలు ఎంత అధికమైపోయారంటే నామమాత్రపు సొమ్ముతో వారిని కొనుగోలు చేయొచ్చు. ఇదంతా అల్లా దయనే. ఆయనను నమ్ముకొన్న ఇస్లామీయులను ఆయన ఇలా బానిసలనిచ్చి హెచ్చిస్తాడు, అవిశ్వాలు, విగ్రహారాధికులను నలుగగొట్టి దిగజారుస్తాడు (క్రీ.శ. 942-997 వరకు గజినీలు చేసిన దండయాత్రలలో చెరపట్టబడి బానిసలుగా చేసుకోబడినవారిని గూర్చి వ్రాయుచు సుల్తాన్ సుబుక్తిగిన్ జరిపిన ఒక దండయాత్రను గూర్చి వివరించుచూ ముస్లిం చరిత్రకారుడైన ఉత్బీ వ్రాసిన వాక్యాలు).  

ముస్లిం పాలకులచే మొట్టమొదట కైవసం చేసుకొబడిన సింధ్ ప్రాంతంలో అత్యదికులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడిన బానిసలు మరియు వారి యజమానులైన కొందరు అరబ్బు ప్రభువులుండేవారు (ఖాన్:299). మొదట్లో బానిసల్ని భారత భూభాగంనుండి బలవంతంగా వెలుపలకు తరలించేవారు. ఉదాహరణకు, మొదటి వాలీద్ కాలీఫ్ సంస్థానపు ప్రభువైన హజ్జజ్ బిన్ యూసుఫ్ చే పంపబడిన ఖాసీం అనే సైన్యాధిపతి క్రీ.శ.712 నుండి 715 వరకు మూడేండ్లలో జరిపిన దండయాత్రల్లో 3,00,000 మందిని బంధించి బానిసలుగా తరలించుకుపోయాడు (ఖాన్ 299వపుట; ట్రిఫ్కోవిక్ పీ 109వ పుట). ఈ జీహాద్ లో వివిధ ప్రాంతలనుండి వచ్చిన అనేక ముస్లిం యోధులు పాల్గొనేవారు. ఒకసారి అనుకోకుండా ఖాసీం ను వెనక్కు పిలిపించి బహుశా జంతుచర్మాలలో కుట్టించబడి చచ్చునట్లుగా మరణశిక్ష విధింపబడెను, ఎందుకంటే కాలిఫ్ (ప్రభువు) యొక్క ఉపపత్నులశాలకు తరలింపబడుటకు సిద్ధపరచబడిన ఇద్దరు సింధీ యువరాణులతో కాసీం సంభోగించినట్లు అభియోగం మోపబడెను(లాల్: 439వ పుట). 

వివిధ కాలీఫ్ ల హయాంలో 8వ మరియు 9వ శతాబ్దాల్లో బానిసలకొరకు అనేక దండయాత్రలు జరిగేవి.     
  
 http://carpenters-son.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి