18, ఫిబ్రవరి 2012, శనివారం

అణచివేయబడ్డ చరిత్ర : భారతీయ బానిస వ్యాపారం-8

  
మొఘల్ పరిపాలన (క్రీ.శ. 1526-1707)-2



3) జహంగీర్ (1605-1627, అక్బర్ కుమారుడు) తన చరిత్ర గ్రంథంలో, తన తండ్రియైన అక్బర్ మరియు తన స్వంత పాలనలో కలిపి సుమారు ఐదారు లక్షలమందిని హతమార్చినట్లు వ్రాసాడు (ఖాన్:200). జహంగీర్, కేవలం ఒకే (1619-29) సంవత్సరంలో సుమారు 2 లక్షల హిందువులను బానిసలుగా విక్రయించడానికి ఇరాన్‌కు తరలించాడు. ముస్లింలు పిల్లలను నపుంసకులనుగా చేసి కప్పందార్లకి బానిసలుగా ఇచ్చేవారు (ఖాన్:285).

4)షాజహాన్ (1628-1658, అక్బర్ యొక్క మనుమడు): ఈయనపాలనలో హిందూ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతుల పిల్లలను, స్త్రీలను శిస్తు కింద లెక్కించి బానిసలుగా చేసుకొనేవారు. చివరకు రైతులు కూడా తిండికి గతిలేక వారినివారు బానిసలుగా అప్పగించుకొని, చిత్రహింసలు తగ్గించుకోడానికి ఇస్లాంను స్వీకరించేవారు. ఇటువంటి షాజహాన్ పాలనను గురించి మన చరిత్ర గ్రంథాల్లో "మొఘల్ స్వర్ణయుగం"గా వర్ణిస్తారు. నిజానికి ముసల్మాన్లు హిందుస్థాన్‌ను ఆక్రమించుకొన్నప్పటినుండి వారికి స్వర్ణయుగమే, కాని హిందువులకు అది ప్రత్యక్ష నరకం. షాజహాన్ హిందూ మరియు క్రైస్తవ ఆలయాలను నాశనం చేయడంలో క్షణమైనా ఆలస్యం చేసేవాడుకాదు. ఇంకా ఇతడు ఆగ్రాలో 4,000 మందిని ఇస్లాంలోకి మారడమో లేక చావడమో తేల్చుకోమని హెచ్చరిస్తూ వారి కన్యకలని, స్త్రీలని తన హారేంనకు తరలించాడు. హూగు ప్రాంతంలో 10,000 మందిని సంహరించాడు. తన స్వంత కుమార్తెలతో జుగుప్సాకరంగా సంభోగించినట్లు రుజువులతో సహా ట్రిఫ్కోవిక్ తన పుస్తకంలో వివరించాడు (112వ పుట; K-విభాగం). షాజహాన్ తన మూడవ భార్యయైన ముంతాజ్‌తో పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితంలో పధ్నాల్గవ కాన్పు సమయంలో మరణించింది. ఆమేతో ప్రేమగా ఉండేవాడని మచ్చుకు ఒక్క అధారం కూడా లేదు. ఇక తాజ్‌మహాల్ ఆయన కట్టించాడు అనేది చాలా వివాదాస్పద అంశమని ఎందరో ఆర్కియాలజిస్ట్‌లు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. 


మొఘల్ చక్రవర్తుల పాలనలో సుదూర దేశాలనుండి అనేక బానిసల్ని హిందుస్థాన్‌కు తీసుకొచ్చేవారు. ఉదాహరణకు, ఔరంగజేబ్ తన హారేం కాపలాకు ఉజ్బెక్ మరియు తాతర్ ప్రాంత స్త్రీలను నియమించాడు. ఇంకా అనేకమంది ఐరోపా స్త్రీలని కామబానిసలుగా కలిగి యుండెను (ఖాన్:317).

5)ఔరంగజేబ్ (1658-1707, అక్బర్ మునిమనుమడు), యావత్ భారతదేశాన్ని ఆక్రమించుకొని, ప్రజలందరిని బానిసలుగా చేసుకొని, సంపూర్ణ ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఆకాంక్షించాడు (ఖాన్:104). కొంచెం నిస్తేజమైన ఇస్లాంని ఇతడు పునరుత్తేజపరచాడు. అంటే ఆలయాల్ని, హైందవ వేద పాఠశాలల్ని ధ్వంసం చేసి అనేకమంది పండితులని, హిందువులని విచక్షణారహితంగా చంపాడు. కక్షసాధింపుగా షరియా చెట్టాల్ని, దిమ్మీ చెట్టాల్ని ప్రయోగించేవాడు (ఖాన్:98). హిందువులు భరించలేక ఎదురుతిరిగారు. నాయకత్వం వహిస్తున్న రాజ్‌పుట్ సైన్యాన్ని సమర్థంగా ఎదురుకోలేక వారిని మానసికంగా కృంగదీయడానికి ఇష్టమొచ్చినట్లు విధ్వంసాలు చేయడం, పండ్ల చెట్లను నరకడం, హిందూ స్త్రీలను, పిల్లలను చెరపట్టడం వంటి దుశ్చర్యలు చేసారు (సుక్డీయో: 265) (ముస్లిం హడిత్‌లో నియమింపబడినట్లు అన్యులైన బాటసారులకి, ప్రయాణికులకి తీవ్ర ఇబ్బంది కలుగునట్లు పండ్ల చెట్లను నరికి, తలదాచుకోకుండా దారినున్న నివాసాల్ని ధ్వంసంచేసి వారిని దోచుకొని పిల్లలను, స్త్రీలను చెరపట్టవలెను- 09.13 మరియు 09.15 హడిత్ ఆజ్ఞలు). భారతదేశాంలోనున్న ఒక ఫ్రెంచి వైద్యుడు, చిన్నపిల్లలను శిస్తు క్రింద లెక్కగట్టి ముసల్మాన్ సుంకరులు బలవంతంగా లాక్కుపోయేవారు అని తన డైరీలో వ్రాసుకొన్నాడు (ఖాన్:284).

భారతదేశంలోకి ప్రవేశిస్తున్న బ్రిటీష్‌వారు బానిసత్వాన్ని నిరోధించినప్పటికి ముస్లింలు భారత్ లోపలా వెలుపలా విరివిగా బానిసల వ్యాపారం చేసేవారు.


 http://carpenters-son.blogspot.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి