19, ఫిబ్రవరి 2012, ఆదివారం

తాజ్ మహల్(తేజో మహాలయము) పై ఆసక్తికరమైన విషయాలు - 3

By గోపీనాథ శర్మ
ఛాయాచిత్రములు, వ్యాఖ్యానములకు ఆధారము : http://www.stephen-knapp.com

ఛాయాచిత్రము - 11

ఈ చిత్రములో మీరు చూస్తున్నది "నక్కర్ ఖానా" అని పిలవబడే సంగీతశాల. దీనికి పక్కనే మసీదు ఉంది. ఒకవేళ తాజ్ మహల్ ఒక ముస్లిము సమాధి ఐతే అక్కడ సంగీతశాల ఉండడమనేది హాస్యాస్పదమే. మేళతాళాలతో మసీదుల మీదుగా సాగే హిందూ ఊరేగింపులపై రాళ్ళు వేయడమనేది జరిగేది. అంతేగాక స్మారక స్థలంలో కావలసినది నిశ్శబ్దం. మృతవ్యక్తి చిరనిద్రను భంగం చేయడమన్నది అభిలషణీయం కాదు. ఐతే మృతి చెందిన ముంతాజ్ కొరకు ఎవ్వరు ఈ సంగీతశాలను నిర్మించారు?

మరో పక్క, హిందూ దేవాలయాలు, భవంతులలో సంగీతశాలలు ఉంటాయి. ఉదయాస్తమానాలలో వినసొంపైన భక్తి సంగీతాన్ని భక్త బృందాలు ఆలపించేవి.


ఛాయా చిత్రము - 12

ఈ చిత్రములో కనబడుతున్నటువంటి గదులు కొన్ని తాజ్ మహల్ మొదటి అంతస్తులో ఉన్నాయి. ఈ అంతస్తుకు దారితీసే రెండు మెట్ల మార్గాలను షాజహాన్ కాలం నుండి మూసివేసారు. ఈ గదులలో కూడ పాలరాతి తాపడం ఉండినది. షాజహాన్ వీటిని తొలగించి పై భవంతి కోసం వాడుకొన్నాడు. వాటిపై కొరాన్ సూక్తుల్ని వ్రాయించాడు. ఎందుకంటే ఇంతటి ఉత్కృష్టమైన పాలరాయి ఎక్కడినుండి తీసుకురాబడినదో షాజహాన్ కు తెలియదు.





ఛాయాచిత్రము - 13

ఈ గదులు క్రింది అంతసులోనివి. మధ్యలో కనబడుతున్న కిటికీ గుండా గర్భగుడిలోని శివలింగాన్ని భక్తులు వీక్షించేవారు. పెద్ద శివలింగాలు రెండంతస్తులుగా ఉండేవి. తాజ్ లో కూడా అలానే ఉండేది. అందువల్లనే షాజహాన్ కింది భాగాన, పైభాగాన ఉండేట్టురెండు సమాధుల్ని నిర్మించాల్సి వచ్చింది.

(ఇంకా ఉంది)

 aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=913

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి