పోలండులో ఇస్కాన్ (ఇంటర్నషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కానషస్‍నెస్) అనుయాయుల సంఖ్య బాగా పెరగడం గమనించిన ఒక నన్ ఇస్కాన్ పై వార్సా కోర్టులో కేసు వేసింది. ’ఇస్కాన్ అనుయాయులు 16,000 మంది గోపికలను పెళ్ళాడిన కృష్ణుడు అనే ఒక అనైతిక పాత్రను కొలుస్తున్నారు’ అనేది ఆ కేసులోని విషయం.
కేసు విచారణకువచ్చినపుడు ఇస్కాన్ లాయరు జడ్జిని, ’ఈమె నన్ గా మారే సందర్భంలో తాను చేసిన ప్రమాణాన్ని ఓ సారి చదవమని ఈ నన్ ను అడగండి’ అని అడిగాడు. జడ్జి ఆ ప్రమాణాన్ని బిగ్గరగా చదవమని ఆమెను అడిగాడు. ఆమె చదవలేదు.
ఇస్కాన్ లాయరు ’పోనీ నన్ను చదవమంటారా’ అని జడ్జిని అడగ్గా, జడ్జి సరేన్నాడు. ఆ ప్రమాణంలో తాను (ఆ నన్) ఏసుక్రీస్తును పెళ్ళి చేసుకుంటున్నట్టుగా ఉంటుంది. అది చదివాక, ఇస్కాన్ లాయరు అడిగాడు: “యువరానర్! కష్ణుడు 16,000 మందిని పెళ్ళాడాడని అంటున్నారు. కానీ, కనీసం ఒక మిలియను మంది నన్ లు తాము క్రీస్తును పెళ్ళాడామని నిర్ధారిస్తున్నారు గదా, మరి.. క్రీస్తు, కృష్ణుడు – వీళ్ళిద్దరి లోనూ నీతి బాహ్యుడెవరు ?
జడ్జి కేసును కొట్టేసాడు.
———
ఇస్కాన్ వారి సైటు నుండి.
========================
అక్రమ పద్ధతుల్లో మతమార్పిడి ద్వారా తమ మతాన్ని
వ్యాపింజేసుకునేవాళ్ళకు, తమ స్థానంలోనే ఇతర మతాలు వ్యాప్తిచెందడం కంటకంగానే
ఉంటుంది. అందుచేతే, ఇలాటి అడ్డదార్లు తొక్కుతున్నారు.
రగ్గులు, డబ్బులు, ప్రలోభాలు, స్వలాభాలు, సంకుచితత్వమే మతమనుకునే ఈ మత
వ్యాపారులకు, మతాల్లోని తాత్వికతను అర్థం చేసుకునే జ్ఞానం ఎక్కడుంటుంది!?
http://mataraajakeeyaalu.wordpress.com/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి